ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేబినేట్ సెక్రెటరీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
Posted On:
10 MAR 2020 8:37PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ -19 వ్యాధి కేసుల పరిస్థితి, చర్యలు, సంసిద్ధత మరియు
యాజమాన్యంపై సమీక్ష జరిపేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు / శకల కార్యదర్శులతో కేబెనేట్ సెక్రెటరీ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశాలనుంచి తిరిగి భారత్ వస్తున్న అంతర్జాతీయ ప్రయాణీకులు తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించుకోవాలని మరియు సిఫార్సుచేసిన “విదినిషేధాలను” పాటించాలని తెలుపుతూ సూచన జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో కోవిడ్ -19 వ్యాధి కేసులు నమోదైనందువల్ల ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లి వచ్చిన వారు ఆయా దేశాలలో ఉన్నప్పుడు , రవాణా సందర్భంగావిమానాశ్రయంలో ఎవరైనా కోవిడ్ -19 వ్యాధి సోకిన వారిని
కలిసే అవకాశం ఉన్నందున ఈ సూచన జారీచేశారు.
అంతేకాక చైనా, హాంగ్కాంగ్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, థాయిలాండ్, సింగపూర్, ఇరాన్, మలేషియా, ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన వారు, తాము ఇండియాకు తిరిగి వచ్చిన రోజునుంచి 14 రోజుల పాటు ఇతరులతో కలవకుండా వేరుగా ఉండాలని, ఉద్యోగులు తమ యజమానుల అడిగి వర్క్ ఫ్రం హోం చేయాలని కూడా సూచించారు.
మార్చి 11వ తేదీకి ముందు ఫ్రాన్సు, జర్మనీ మరియు స్పెయిన్ జాతీయులకు జారీచేసిన వీసాలను సస్పెండ్ చేశారు. అదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ తరువాత పై దేశాలలో పర్యటించిన వారు ఇండియాకు రావడానికి వీసా మంజూరై ఇంకా ఇండియాలో ప్రవేశించకపోతే వారి వీసాలు కూడా సస్పెండ్ చేశారు. ఇదివరకే భారత వీసాలు పొంది ఇండియాలో ఉన్న విదేశీయులు తమ వీసాలను పొడిగించుకునేందుకు/మార్చుకునేందుకు దౌత్య కార్యాలయ సంబంధ ఇతర సేవల కోసం ఎలెక్ట్రానిక్ పద్ధతిలో విదేశీ సంబంధాల అధికారిని సంప్రదించాలి. ఇందుకు సంబంధించి వలసల బ్యూరో నోటిఫికేషన్ జారీచేస్తుంది.
భారత పౌరులు ఫ్రాన్సు, స్పెయిన్ మరియు జర్మనీ దేశాలకు వెళ్లరాదని విదేశాంగ శాఖ సూచించింది.
దేశంలో ఇప్పటి వరకు 50 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారంతా విదేశాలలో పర్యటించి వచ్చినవారు. తాజాగా నమోదైన మూడు కేసుల్లో అమెరికా నుంచి దుబాయ్ మీదుగా వచ్చిన వారు, ఒకరు అమెరికా నుంచి లండన్ హీత్రూ విమానాశ్రయం మీదుగా బెంగళూరు వచ్చిన వారు ఉన్నారు. మరొకరు దుబాయ్ నుంచి పూనా వచ్చారు. కేరళకు చెందిన ముగ్గురిని డిశ్చార్జి చేశారు. 50 కోవిడ్ -19 పాజిటివ్ కేసులలో 34 మంది భారతీయులు 16 మంది ఇటలీకి చెందినవారు.
కోవిడ్ -19 వ్యాధి నిర్ధారణ అయిన రోగులతో సంబంధం ఉన్న 1400 మంది ఆరోగ్య పరిస్థితిని కనిపెట్టుకొని చూస్తున్నారు.
కాగా ఇరాన్ నుంచి తరలించిన 58 మందితో మొదటి విమానం ఈ రోజు ఉదయం ఇండియాకు చేరింది. ఈ బృందంలో 31 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వారి పరిస్తితి నిలకడగా ఉంది.
(Release ID: 1607032)
Visitor Counter : 221