మంత్రిమండలి
1.4.2020 నుండి అమలులోకి వచ్చే విధం గా ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)ల భారీ ఏకీకరణాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
పది పిఎస్‌బి లను నాలుగు పిఎస్‌బి లు గా ఏకీకరణం చేయడం ద్వారా 1.4.2020 నుండి అమలు లోకి వచ్చేటట్లు గా పిఎస్‌బి ముఖ చిత్రం లో పరివర్తన కు నడుం కట్టిన ప్రభుత్వం
Posted On:
04 MAR 2020 4:09PM by PIB Hyderabad
విలీనీకరణాలు ప్రపంచ శ్రేణి భారీ వ్యాపార సమన్విత చర్యల తో కూడినటువంటి మరియు డిజిటల్ మాధ్యమం లో నిర్వహించబడేటటువంటి ఏకీకృత బ్యాంకు ల ఏర్పాటు కు వీలు ను కల్పించనున్నాయి
పది ప్రభుత్వ రంగ బ్యాంకుల ను నాలుగు పిఎస్‌బి లుగా ఏకీకరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో-
(ఎ) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ను పంజాబ్ నేశనల్ బ్యాంకు లో విలీనం చేయడం
(బి) సిండికేట్ బ్యాంకు ను కెనరా బ్యాంకు లో విలీనం చేయడం
(సి) కార్పొరేశన్ బ్యాంకు ను మరియు ఆంధ్రా బ్యాంకు ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేయడం
(డి) అలహాబాద్ బ్యాంకు ను ఇండియన్ బ్యాంకు లో విలీనం చేయడం-
భాగం గా ఉండబోతున్నాయి.
ఈ విలీనీకరణం 1.4.2020 నుండి అమలు లోకి రానుంది. ఇది ఒక్కొక్క విలీనీకరణ సంస్థ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కు మించిన వ్యాపారం తో కూడినటువంటి మరియు జాతీయ వ్యాప్తి కలిగినటువంటి ఏడు పెద్ద పిఎస్‌బి ల ఏర్పాటు కు దారితీస్తుంది. ఈ భారీ ఏకీకరణం ప్రపంచ బ్యాంకు ల తో సాటి రాగల బ్యాంకుల ను ఆవిష్కరించడం లో మరియు భారతదేశం లోను, ప్రపంచ స్థాయి లోను ప్రభావశీల స్థాయి లో పోటీ పడగలిగే బ్యాంకుల ను ఏర్పాటు చేయడం లో దోహద పడనుంది. ఏకీకరణం ద్వారా ఒనగూరే ప్రయోజనాలు మరియు పెద్ద ఎత్తు న జరిగే కార్యకలాపాలు వ్యయం పరం గా లాభాల కు దోహదం చేయనున్నాయి. తత్ఫలితం గా పిఎస్‌బి లు వాటి స్పర్ధాత్మకత ను పెంచుకొని, భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ పైన ఒక సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రసరించగలుగుతాయి.
దీనికి అదనం గా, ఏకీకరణం అనేది భారీ పరపతి ని సమకూర్చడం లో విలీనీకరణం జరిగిన సంస్థ లకు ఉండే శక్తి ని పెంపు చేయడం తో పాటు పోటీ తో కూడిన కార్యకలాపాల ను నిర్వహించడం లో కూడాను ఊతాన్ని అందిచగలుగుతుంది. విలీనీకరణాని కి లోనైన సంస్థ ల మధ్య ఉత్తమమైన అభ్యాసాల ను అనుసరించడం అనేది బ్యాంకుల వ్యయ సంబంధ దక్షత ను, అలాగే, వాటి రిస్క్ మేనేజ్‌మెంట్ ను మెరుగుపరచనుంది. విస్తృతమైనటువంటి వ్యాప్తి ద్వారా ఆర్థిక సేవల ను అన్ని వర్గాల కు చేరువ గా తీసుకు పోవాలనే లక్ష్యాని కి సైతం దన్ను లభించనుంది.
అంతేకాక, విలీనీకరణానికి లోనైన బ్యాంకు ల మధ్య సాంకేతికత ల స్వీకరణ, ప్రతిభావంతుల మహా కూటమి యొక్క అందుబాటు మరియు ఒక సువిశాలమైనటువంటి సమాచారనిధి లభ్యత లతో పిఎస్‌బి లు శరవేగం గా డిజిటల్ పరమైనటువంటి మార్పుల కు లోనవుతున్న బ్యాంకింగ్ సేవల స్వరూపాన్ని ఎనలిటిక్స్ శక్తి ని వినియోగించుకొంటూ స్పర్ధాత్మక ప్రయోజనాన్ని అంది పుచ్చుకొనే స్థితి కి చేరుకోగలుగుతాయి.
**
(Release ID: 1605244)
Visitor Counter : 251