ఆర్థిక మంత్రిత్వ శాఖ

రూ.18,600 కోట్లతో 148 కి.మీ దూరంతో బెంగళూరు మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం ప్రతిపాదన

త్వరలో జాతీయ లాజిస్టిక్ పాలసీ

2024 లోపు ఆరు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల పర్యవేక్షణ

రైల్వేట్రాక్‌ల వెంబడి భారీ సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు

ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 రైళ్లు

మౌలిక సదుపాయాల కేంద్రీకృత నైపుణ్య అభివృద్ధి అవకాశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ

Posted On: 01 FEB 2020 2:24PM by PIB Hyderabad

రానున్న 5 సంవత్సరాలలో  మౌళిక రంగం లో రూ. 100 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా  ప్రధానమంత్రి చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ రూ . 103 లక్షల కోట్ల తో జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ను ప్రాంభించినట్లు   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  పార్లమెంటులో అన్నారు.

మౌలిక సదుపాయాల కేంద్రీకృత నైపుణ్య అభివృద్ధి అవకాశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు , తద్వారా మౌలిక సదుపాయాల రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని  కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు .



ఆధునిక రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు

రవాణా రంగ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా.. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, లాజిస్టిక్ సెంటర్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా.. ఢిల్లీ-ముంబై, చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే లను పూర్తి చేస్తామని అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని 2023 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. అదే క్రమంలో.. చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే మార్గం నిర్మాణాన్ని ఇంకా చేపట్టాల్సి ఉందని తెలిపారు.9 వేల కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని అన్నారు.  రెండు వేల కిలోమీటర్ల మేర స్ట్రాటజిక్ హైవేలు నిర్మిస్తామని అన్నారు. పోర్ట్ లను కలుపుతూ రెండు వేల కిలోమీటర్ల తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.

దేశంలో 6000 కిలోమీటర్ల జాతీయ రహదారులను అనుక్షణం పర్యవేక్షించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలో జాతీయ లాజిస్టిక్స్ విధానం తీసుకొస్తామని  అన్నారు.


రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను భాగస్వామ్యులను చేయడానికి ఉద్దేశించిన తేజస్ రైళ్ల సంఖ్యను పెంచాలని కూడా నిర్ణయించామని, 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తేజస్ రైళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని అన్నారు. దేశంలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ నగరాల మధ్య తేజస్ రైళ్లను నడిపిస్తామని, చెప్పారు.ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 రైళ్లు,   దీనితోపాటు నిరుపయోగంగా ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, పట్టాల వెంట సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతామని  కేంద్ర మంత్రి అన్నారు.

ముంబయి - అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు

కేంద్రం 20 శాతం, అదనపు నిధుల ద్వారా 60 శాతం సమీకరణ ద్వారా రూ.18,600 కోట్లతో 148 కి.మీ దూరంతో బెంగళూరు మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం ప్రతిపాదన. 

 

--


(Release ID: 1601624) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi , Malayalam