ఆర్థిక మంత్రిత్వ శాఖ
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం
ప్రతి ఖాతాదారుకూ రూ.5 లక్షలదాకా డిపాజిట్లకు బీమా రక్షణ పెంపు
భారత పెన్షన్ నిధి నియంత్రణ-అభివృద్ధి సంస్థ (PFRDAI)నిబంధనలకు సవరణలు: ప్రభుత్వ ఉద్యోగుల కోసం విడిగా జాతీయ పెన్షన్ పథకం ట్రస్టు ఏర్పాటు
భారత జీవిత బీమా సంస్థలో ప్రభుత్వ వాటానుంచి కొంతమేర పబ్లిక్
ఆఫర్ ద్వారా విక్రయించే ప్రతిపాదన: చిల్లర మదుపుదారులకు అవకాశం
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలపై దృష్టి: విక్రయ బిల్లులపై
ఆర్థిక సహాయం, అప్రాధాన్య రుణం, ఎగుమతి మద్దతు పథకాల ప్రకటన
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు రుణ పునర్నవీకరణ గవాక్షం గడువును 2021 మార్చి 31దాకా పొడిగించాలని రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వ సూచన
జాతీయ మౌలిక వసతుల ప్రణాళికకు రూ.103 లక్షల కోట్లు: మౌలిక వసతుల ఆర్థిక సహాయ సంస్థలకు ఈక్విటీ మద్దతుద్వారా రూ.22వేల కోట్ల సేకరణ
గిఫ్ట్-ఐఎఫ్ఎస్సీ (GIFT-IFSC)లో అంతర్జాతీయ స్వర్ణ ఎక్స్ఛేంజి ఏర్పాటు
ప్రతిపాదన: బంగారం ధర మెరుగుతోపాటు ఉద్యోగాల సృష్టికి ఊతం
కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‘పీఐకి మిగులు నిల్వల్లో
పరిమితి 9% నుంచి 15 శాతానికి పెంపు
ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రధానంగా కొత్త డెట్-ఈటీఎఫ్ ప్రతిపాదన
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2020 2:24PM by PIB Hyderabad
దేశ ఆర్థిక రంగంలోకి పెట్టుబడుల ప్రవాహ మార్గం చూపడం లక్ష్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సహాయ, మౌలిక వసతుల ఆర్థిక సహాయ విపణులకు సంబంధించిన అనేక సంస్కరణలను కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రకటించారు. ‘‘ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందే క్రమంలో ఆర్థిక స్వరూపం నిత్య పరిణామశీలమై నానాటికీ బలపడాలని పార్లమెంటు బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఆమె ప్రకటించారు. ‘‘స్వచ్ఛమైన, విశ్వసనీయ, ఉత్తేజపూర్వక ఆర్థిక రంగం మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం’’ అని వివరించారు. ఈ కృషిలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐడీబీఐ బ్యాంకులో ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ వాటాను ప్రైవేటు రంగానికి విక్రయించే ప్రతిపాదన చేశారు. ప్రతి బ్యాంకు ఖాతాదారుకూ ఇప్పటిదాకా రూ.లక్ష వరకూ మాత్రమే డిపాజిట్లకు బీమా రక్షణ ఉందని, దీన్ని రూ.5 లక్షలదాకా పెంచడం కోసం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‘కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. సహకార బ్యాంకుల సామర్థ్యం పెంపు నిమిత్తం సంబంధిత నియమనిబంధనల సవరణకు ప్రతిపాదించామన్నారు. భారత పెన్షన్ నియంత్రణ-అభివృద్ధి సంస్థ (PFRDAI) బలోపేతం దిశగా అవసరమైన సవరణలు చేపడతామని ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వోద్యోగుల కోసం విడిగా జాతీయ పెన్షన్ నిధి ట్రస్టు ఏర్పాటుకు వీలు కలుగుతుందని చెప్పారు.
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు (MSME)
ఆవిష్కర్తలు, ఉపాధి సృష్టికర్తలు, సవాళ్లను ఎదుర్కొనగల సాహసంగల MSME రంగం ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని ఆర్థిక మంత్రి చెప్పారు. అందుకే ఈ రంగం ప్రగతి, సుస్థిరత కోసం అనేక చర్యలను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు విక్రయ బిల్లులపై ఆర్థిక సహాయం, అప్రాధాన్య రుణం, ఎగుమతి మద్దతు పథకాలను ప్రకటించామన్నారు. అలాగే రుణ పునర్నవీకరణ గవాక్షం గడువును 2021 మార్చి 31దాకా పొడిగించాలని రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వం సూచించినట్లు చెప్పారు. ఎగుమతి విపణులలో పూర్తిస్థాయి చేయూతనిచ్చేందుకు రూ.1,000 కోట్లతో ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు.
పెట్టుబడుల ఉపసంహరణ
భారత జీవితబీమా సంస్థలో ప్రభుత్వానికిగల వాటాలో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలని ప్రతిపాదించామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్థిక విపణులకు మరింత ద్రవ్య లభ్యత, విపణి క్రమశిక్షణను అలవరచడంతోపాటు వాస్తవ విలువను సొంతం చేసుకునే లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు.
మౌలిక వసతుల్లో పెట్టుబడులు
జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక ద్వారా ఈ రంగంలో రూ.103 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.22వేల కోట్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (GIFT- IFSC)లో స్వర్ణ ఎక్స్ఛేంజి ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. ప్రగతికాముక వృద్ధిరేటు సాధన దిశగా ఆర్థిక వ్యవస్థలోకి మూలధన ప్రవాహానికి ఉత్తేజమిస్తామని చెప్పారు.
(రిలీజ్ ఐడి: 1601622)
సందర్శకుల సూచీ సంఖ్య : : 218