గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఢిల్లీ మెట్రో కు చెందిన నాలుగ‌వ ద‌శ లోని మూడు ప్రాధాన్య‌తా కారిడార్ల‌ కు సంబంధించి నిధుల తీరు విష‌యం లో మార్పుల‌ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 11 DEC 2019 6:23PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశం, ఢిల్లీ మెట్రో 4 వ ద‌శ‌ కింద ఆమోదించిన మూడు ప్రాధాన్య‌తా కారిడార్లయిన 1)ఎయిరో సిటీ నుంచి తుగ్ల‌కాబాద్‌, 2) ఆర్‌.కె. ఆశ్ర‌మ్ నుంచి జ‌న‌క్‌పురి (వెస్ట్‌) 3) ముకుంద్‌ పుర్ నుంచి మౌజ్‌ పుర్ మార్గాల‌ కు నిధులు స‌మ‌కూర్చే తీరు లో మార్పున‌ కు త‌న ఆమోదం తెలిపింది.  ఇందుకు సంబంధించి భూమి విలువ‌ ను గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా (జి.ఒ.ఐ), గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ నేష‌న‌ల్ కాపిట‌ల్ టెరిట‌రీ ఆఫ్ ఢిల్లీ (జి.ఎన్‌.సి.టి.డి) ల మ‌ధ్య 50: 50 నిష్ప‌త్తి లో భ‌రించే ప్ర‌తిపాద‌న‌ల‌ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  మెట్రో రైలు పాల‌సీ 2017 కు చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ కు అనుగుణం గా ఇది ఉంది. ఇది సుప్రీం కోర్టు జారీ చేసిన 06.09.2019 నాటి ఆదేశాల‌ కు అనుగుణం గా ఢిల్లీ కి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

ప్రాజెక్టు మొత్తం వ్య‌యం 24,948.65 కోట్ల రూపాయ‌ల విష‌యం లో ఎలాంటి మార్పూ లేదు. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూష‌న్ ప్ర‌స్తుతం ఉన్న 4,154.20 కోట్ల రూపాయ‌ల నుంచి 4.643.638 కోట్ల రూపాయ‌ల‌కు పెరుగుతుంది. అంటే నిక‌రంగా 498.438 కోట్ల రూపాయ‌ల పెరుగుద‌ల‌.  ద్వైపాక్షిక‌, బ‌హుళ ప‌క్ష ఏజెన్సీ ల నుంచి తీసుకునే విదేశీ రుణాల మొత్తాని కి సంబంధించి డిఎంఆర్‌సి చెల్లింపులు ప్ర‌స్తుత 11,462.60 కోట్ల రూపాయ‌ల నుంచి 12.930.914 కోట్ల రూపాయ‌ల‌ కు పెరుగుతాయి.  దీనితో ఈ నిక‌ర పెరుగుద‌ల 1468.314 కోట్లు అవుతుంది.

నేప‌థ్యం:

ఢిల్లీ మెట్రో 4వ ద‌శ‌కు సంబంధించిన మూడు ప్రాధాన్య‌తా ప్రాజెక్టుల‌ ను భార‌త ప్ర‌భుత్వం 2019 మార్చి లో ఆమోదించింది.  వీటిని పూర్తి చేయ‌డానికి నిర్దేశించిన ఖ‌ర్చు 24,948.65 కోట్ల రూపాయ‌లు. ఇందుకు సంబంధించి నిధులు స‌మ‌కూర్చే తీరు ను మెట్రో రైలు విధానం 2017 ప్ర‌కారం నిర్ణ‌యించారు.  మినిస్ట్రీ ఆఫ్ హెచ్ యు ఎ ఆమోదిత కారిడార్ల‌ లో ప‌నుల‌ కు సంబంధించి తాము ఆమోదించిన విధం గా ఖ‌ర్చు భ‌రించే విధానం లో మార్పులు చేస్తే త‌ప్ప   ప‌నులు ప్రారంబించ‌రాద‌ని డిఎంఆర్‌సిని, జిఎన్‌సిటిడి 2019 ఏప్రిల్‌లో కోరింది. 

ఈ విష‌యం లో సుప్రీం కోర్టు జోక్యం తో  2019 జులైన ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. సుప్రీంకోర్టు 06.09.2019న ఆదేశాలు జారీ చేస్తూ, మెట్రో రైలు పాల‌సీ 2017 లో గ‌ల ఆప‌రేశన‌ల్ న‌ష్టాలు, విదేశీ రుణ చెల్లింపులు, క‌రెన్సీ రేట్ల హెచ్చు త‌గ్గుల ఖ‌ర్చులు చెల్లించ‌డంలో స్పెష‌ల్ ప‌ర్ప‌స్‌ వెహిక‌ల్ ( ఈ కేసు లో డిఎంఆర్‌సి) విఫ‌ల‌మైతే ప్ర‌భుత్వం భ‌రించాల‌న్న‌    ప్రొవిజ‌న్ల‌ను స‌మ‌ర్ధించింది.  ఇది ఢిల్లీకి మాత్ర‌మే వ‌ర్తించే విధంగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  అలాగే, భూమి విలువ‌ ను గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా, జిఎన్‌సిటిడిలు చెరి 50 శాతం భ‌రించాల‌ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి మెట్రోరైలు పాల‌సీ 2017 లోని సంబంధిత‌పేరాలను అందుకు త‌గిన‌ట్టు స‌వ‌రించ‌డం జ‌రిగింది.

***


(రిలీజ్ ఐడి: 1596080) సందర్శకుల సూచీ సంఖ్య : : 142
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada