మంత్రిమండలి

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ మ‌రియు పరిపాలన సంబంధిత స‌హ‌కారం అంశం పై భార‌త ఎన్నికల సంఘాని కి మ‌రియు మాల్దీవ్స్ యొక్క ఎన్నిక‌ల సంఘాని కి మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 04 DEC 2019 1:31PM by PIB Hyderabad

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కు ఏర్పాట్లు మ‌రియు ఎన్నిక‌ల కు సంబంధించిన పరిపాలన స‌హ‌కారం అంశాల పై భార‌త ఎన్నికల సంఘాని కి మ‌రియు మాల్దీవ్స్ యొక్క ఎన్నిక‌ల సంఘాని కి మ‌ధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎంఒయు) కుదుర్చుకోవాల‌న్న ప్ర‌తిపాదన కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.   ఎన్నిక‌ల ప్ర‌క్రియ తాలూకు వ్య‌వ‌స్థీకృత‌మైన‌టువంటి మ‌రియు సాంకేతిక ప‌ర‌మైన‌టువంటి వికాసానికి సంబంధించిన జ్ఞానాన్ని మ‌రియు అనుభ‌వాన్ని ఒక ప‌క్షాని కి మ‌రొక ప‌క్షం ఇచ్చి పుచ్చుకోవ‌డం, సంస్థాగత పటిష్టీకరణ, ఇంకా సామర్థ్య నిర్మాణం, సిబ్బంది కి శిక్ష‌ణ ను ఇవ్వ‌డం మరియు సంప్ర‌దింపులు జరపడాన్ని క్ర‌మం త‌ప్ప‌క కొన‌సాగించ‌డం వంటివి దీని లో భాగం గా ఉంటాయి.

ప్ర‌తిపాదిత ఎంఒయు ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హిస్తుంది.  అంతేకాకుండా, మాల్దీవ్స్ యొక్క ఎన్నిక‌ల సంఘాని కి సాంకేతిక స‌హకారాన్ని మరియు సామర్ధ్య నిర్మాణం లో సహాయాన్ని అందించడం, ఎన్నికల ఏర్పాట్లు మరియు ఎన్నికల సంబంధిత పాలన వ్యవహారాల లో సమన్వయం పై శ్రద్ధ తీసుకోవడం కూడా ఈ ఎంఒయు యొక్క లక్ష్యాల లో భాగం గా ఉన్నాయి.  
 

**



(Release ID: 1594992) Visitor Counter : 81