హోం మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ (కార్య సంచాలన) నియమాలు, 1961 కి చెందిన నియమం- 12 లో భాగం గా అనుమోదం పొందినటువంటి ప్రతిపాదన కు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి
ఈ ప్రతిపాదన జమ్ము & కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని సెక్షన్ 3 యొక్క నిబంధనల ను అమలు పరచడం లో తలెత్తిన ఇబ్బంది ని సమాప్తం చేయడంతో సంబంధం కలిగినటువంటిది
నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2019 10:44PM by PIB Hyderabad
పార్లమెంటు సిఫారసు చేసిన మీదట రాష్ట్రపతి భారత రాజ్యాంగం లోని 370వ అధికరణం ఆధారం గా ఒక ప్రకటన ను జారీ చేసి, జమ్ము & కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 కి సమ్మతి ని తెలిపారు. తదనుగుణం గా ఇదివరకటి జమ్ము & కశ్మీర్ రాష్ట్రాన్ని క్రొత్త గా జమ్ము మరియు కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, ఇంకా నూతన లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాల రూపం లో 2019వ సంవత్సరం అక్టోబరు 31వ తేదీ నాడు పునర్ వ్యవస్థీకరించడం జరిగింది.
నూతనం గా ఏర్పాటు చేసిన లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం లో రెండు జిల్లా లు.. కర్‌గిల్ జిల్లా మరియు లెహ్ జిల్లా.. అనేవి ఉన్నాయి. మునుపటి జమ్ము & కశ్మీర్ రాష్ట్రం లో మిగిలిన ప్రాంతం క్రొత్త జమ్ము మరియు కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లోకి వస్తుంది.
1947వ సంవత్సరం లో ఇదివరకటి జమ్ము & కశ్మీర్ రాష్ట్రం లో ఈ క్రింద పేర్కొన్న 14 జిల్లా లు ఉండేవి. అవి:
కఠువా, జమ్ము, ఉధంపుర్, రియాసీ, అనంత్ నాగ్, బారామూలా, పూంఛ్, మిర్ పుర్, ముజ్జఫరాబాద్, లెహ్ మరియు లద్దాఖ్, గిల్ గిట్, గిల్ గిట్ వజారత్, చిల్హాస్ , ఇంకా ఆదివాసీ ప్రదేశం.
జమ్ము & కశ్మీర్ కు చెందిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 14 జిల్లా ల తాలూకు ప్రాంతాల ను 2019వ సంవత్సరం కల్లా 28 జిల్లాలు గా పునర్ నిర్మించాయి. ఆ కొత్త జిల్లాల పేర్లు ఏవేవి అంటే.. కుప్ వాడా, బాందీపుర్, గందర్ బల్, శ్రీనగర్, బడ్ గామ్, పుల్ వామా, శోపియాఁ, కుల్ గామ్, రాజౌరీ, రామ్ బన్, డోడా, కిశ్త్ వాడ్, సాంబా మరియు కర్‌గిల్ జిల్లా..లు.
వీటి లో కర్‌గిల్ జిల్లా ను అప్పటి లెహ్ మరియు లద్దాఖ్ జిల్లా కు చెందిన ప్రాంతం నుండి తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణం గా, నూతనం గా ఏర్పడ్డ లద్దాఖ్ కేంద్ర ప్రాంతం లోని లెహ్ జిల్లా ను- భారత రాష్ట్రపతి ద్వారా జారీ అయిన జమ్ము, కశ్మీర్ రీ ఆర్గనైజేశన్ (రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్) సెకండ్ ఆర్డర్, 2019లో- నిర్వచించడం జరిగింది. 1947వ సంవత్సరం నాటి గిల్‌గిట్, గిల్‌గిట్ వజారత్, చిల్హాస్ మరియు ఆదివాసీ ప్రదేశం, వీటి కి అదనం గా 1947వ సంవత్సరం నాటి లెహ్ మరియు లద్దాఖ్ జిల్లా లలో నుండి- కర్‌గిల్ జిల్లా యొక్క నిర్మాణం అనంతరం- మిగిలిన శేష ప్రాంతాలు దీని లో చేరుతాయి అన్నదే దీని అన్వయం.
***
(రిలీజ్ ఐడి: 1592940)
సందర్శకుల సూచీ సంఖ్య : : 183