ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయం పై పన్ను కు సంబంధించి ఎగవేత ను అరికట్టేందుకు, ద్వంద్వ పన్నుల నివారణ కు సంబంధించి బ్రెజిల్ కు మరియు భారతదేశాని కి మధ్య ఒప్పంద సవరణ నియమావళి కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
06 NOV 2019 8:35PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య ద్వంద్వ పన్ను ల నివారణ కు, ఆదాయం పై పన్ను కు సంబంధించి ఎగవేత ను అరికట్టేందుకు ఉద్దేశించిన ఒప్పంద సవరణ నియమావళి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
అమలు వ్యూహం, లక్ష్యాలు:
మంత్రివర్గం ఆమోదం తరువాత ఈ నియమావళి ని అమలు లోకి తెచ్చే ప్రక్రియ కు సంబంధించిన విధి విధానాల ను పూర్తి చేయడం జరుగుతుంది. దీని అమలు ను మంత్రిత్వ శాఖ పర్యవేక్షించి, తెలియజేస్తుంది.
ప్రధాన ప్రభావం:
ద్వంద్వ పన్ను ల నివారణ తీర్మానాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయి కి పెంచడం ద్వారా భారతదేశం, బ్రెజిల్ ల మధ్య ఒప్పంద నియమావళి సవరణ ద్వంద్వ పన్ను లు లేకుండా చూస్తుంది.
డిటిఎస్ ద్వారా కాంట్రాక్టు ను కుదుర్చుకొనే దేశాల మధ్య పన్ను హక్కుల ను స్పష్టం గా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇరు దేశాల పెట్టుబడిదారులకు, వ్యాపారాల కు పన్ను స్పష్టత ను ఇస్తుంది.
ఈ సవరణ నియమావళి ఆయా దేశాల లో వడ్డీ పైన రాయల్టీ లు, టెక్నికల్ సర్వీసు ఫీజుల పై పన్ను రేటుల ను తగ్గించడం వల్ల పెట్టుబడులు తరలి రావడానికి అవకాశం కలుగుతుంది. సవరణ నియమావళి కనీస ప్రమాణాల ను అమలు చేస్తుంది. అలాగే జి-20 ఒఇసిడి బేస్ ఇరోజన్ ఫిట్ షిఫ్టింగ్ ( బిఇపిఎస్) ప్రాజెక్టు సిఫారసుల ను అమలు చేస్తుంది. బిఇపిఎస్ ప్రాజెక్టు కింద సులభతర ప్రయోజనాల పరిమితి క్లాజు, డిటిఎస్ కి సంబంధించిన సాధారణ దుర్వినియోగ వ్యతిరేక క్లాజు, ప్రియాంబుల్ టె క్స్ ట్ లను చేర్చడం జరిగింది. దీని వల్ల పన్నుప్రణాళిక వ్యూహాల ను నియంత్రిస్తుంది. పన్ను నిబంధనల లో పొంతన లేని నిబంధనల ను తొలగిస్తుంది.
అంశాల వారీ గా వివరాలు :
ఎ. ప్రస్తుతం భారతదేశం, బ్రెజిల్ ల మధ్య గల డిటిఎసి పై 1988వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ న సంతకాలు జరిగాయి. తదనంతరం 2013వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ న ఒక ప్రొటోకాల్ సంతకం చేయడం ద్వారా దాని ని సవరించారు. ఇది సమాచార మార్పిడి కి సంబంధించింది. ప్రస్తుత ప్రొటోకాల్ ద్వారా డిటిఎసి ని పలు ఇతర అంశాల విషయం లో సవరించడమైంది.
బి. సవరించిన డిటిఎస్ , జి-20 ఒఇసిడి బేస్ ఇరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ (బిఇపిఎస్) ప్రాజెక్టు ఇతర సిఫారసు లు, కనీస ప్రమాణాల ను అమలు చేస్తుంది.
పూర్వ రంగం:
ప్రస్తుతం భారతదేశం, బ్రెజిల్ ల మధ్య ఉన్న ద్వంద్వ పన్ను ల నివారక ఒప్పందం (డిటిఎసి) చాలా పాత ది. దీని ని ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల కు అనుగుణం గా మార్పు చేయవలసిన అవసరం ఏర్పడింది. అలాగే జి.20, ఒఇసిడి బేస్ ఇరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ ప్రాజెక్ట్ (బిఇపిఎస్)ల లో గల సిఫారసుల ను అమలు చేయడానికి ఈ సవరణ లు అవసరం అయ్యాయి.
**
(Release ID: 1590942)
Visitor Counter : 65