కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వృత్తి సంబంధిత వ్యాధులు, పున‌రావాసం మ‌రియు వృత్తి పరమైన శిక్ష‌ణ ల కోసం భార‌త‌దేశాని కి మరియు జ‌ర్మ‌న్ ఏజెన్సీ కి మ‌ధ్య ఎంఒయు పై జరిగిన సంత‌కాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 06 NOV 2019 8:43PM by PIB Hyderabad

వృత్తి సంబంధిత వ్యాధులు, పున‌రావాసం మ‌రియు వృత్తి పరమైన శిక్ష‌ణ ల కోసం భార‌త‌దేశాని కి మరియు జ‌ర్మ‌న్ ఏజెన్సీ కి మ‌ధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం పై జరిగిన సంతకాల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

లాభాలు:

జ‌ర్మ‌నీ లో వృత్తి సంబంధిత సురక్ష, స్వస్థత  మరియు సామాజిక సంర‌క్ష‌ణ రంగంలో విశిష్టమైనటువంటి కృషి చేస్తున్న ప్ర‌త్యేక ఏజెన్సీ డిజియువి తో కలసి ఒక ఎంఒయు ను కుదుర్చుకోవడం తో ఈ క్రింద ప్రస్తావించిన విధం గా స‌హాయాలు అందుబాటు లోకి రానున్నాయి:

i.  చికిత్స పరమైన, వృత్తి పరమైన వ్యవహారాల కు సంబంధించిన పున‌రావాసాన్ని క‌ల్పించే రంగం లోను మరియు బీమా స‌దుపాయాన్ని కలిగివున్న దివ్యాంగుల కు సామాజిక పునరావాసం కోసం సూచనల ఆదానం ప్రదానం; ఇంకా అటువంటి కార్య‌క‌లాపాల ను ప్రోత్స‌హించ‌డం; 

ii.  వృత్తి సంబంధిత వ్యాధుల నివారణ, గుర్తింపు మరియు ఉపచారాలు.
 
ప్ర‌ముఖ ప్ర‌భావం:

సూచనల ను ఒక ప‌క్షాని కి మ‌రొక ప‌క్షం ఇచ్చి పుచ్చుకోవడం వల్ల మ‌రియు స‌హ‌కరించుకోవడం వ‌ల్ల వృత్తి సంబంధిత వ్యాధుల గుర్తింపు, చికిత్స‌, ఇంకా ఉపచారాలకు తోడు బీమా స‌దుపాయాన్ని కలిగివున్న దివ్యాంగుల లో సామర్థ్యాన్ని పెంపొందించడం, వారి కి సామాజిక పున‌రావాసం సాధ్యమవుతుంది.

*** 



(Release ID: 1590932) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi , Tamil