మంత్రిమండలి
అంతర్ రాష్ట్ర జల వివాదాల ను సమర్ధం గాను మరియు శీఘ్ర గతిన పరిష్కరించడం
అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు, 2019 కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JUL 2019 6:06PM by PIB Hyderabad
అంతర్ రాష్ట్ర నదీ జలాలు మరియు నదీ లోయల కు సంబంధించిన వివాదాల లో న్యాయ నిర్ణయం కోసం ఉద్దేశించినటువంటి అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల సవరణ బిల్లు 2019 కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఇది అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల కు సంబంధించిన న్యాయ నిర్ణయ ప్రక్రియ ను మరింత సరళం చేయగలుగుతుంది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల సంబంధిత న్యాయ నిర్ణయ ప్రక్రియ ను మరింత సరళతరం చేసే ఉద్దేశ్యం తోను, ప్రస్తుత సంస్థాగత నిర్మాణాన్ని దృఢతరం చేసే ఉద్దేశ్యం తోను అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956ను ఈ బిల్లు సవరించ గోరుతోంది.
ప్రభావం:
న్యాయ నిర్ణయం చేసేందుకు పక్కా కాల అవధుల ను ఖరారు చేయడం తో పాటు వివిధ ధర్మ పీఠాల తో కూడిన ఏక విచారణ సంఘాన్ని నియమించడం అంతర్ రాష్ట్ర నదుల కు సంబంధించిన వివాదాల ను సత్వర రీతి న పరిష్కరించడాని కి దారితీస్తుంది. బిల్లు లోని సవరణలు న్యాయ నిర్ణయం కోసం నివేదించినటువంటి జల వివాదాల ఫైసలా ప్రక్రియ ను వేగవంతం చేస్తాయి.
అంతర్ రాష్ట్ర నదుల కు సంబంధించిన ఏదైనా జల వివాదం విషయం లో ఏ రాష్ట్ర ప్రభుత్వం నుండి అయినా ఈ చట్టం పరిధి లో ఎటువంటి అభ్యర్ధన అయినా అందినప్పుడు, ఆ జల వివాదాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించడం కుదరని పని అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడినప్పుడు, సదరు జల వివాదం తాలూకు న్యాయ నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక జల వివాదాల విచారణ సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది.
**
(Release ID: 1578408)
Visitor Counter : 331