రైల్వే మంత్రిత్వ శాఖ
ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సర్వీసు కు వ్యవస్థీకృత గ్రూపు ‘ఎ’ స్థాయి ని మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JUL 2019 5:49PM by PIB Hyderabad
ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సర్వీసు కు వ్యవస్థీకృత గ్రూపు ‘ఎ’ స్థాయి ని ఇచ్చేందుకు మరియు తత్పర్యవసానం గా నాన్ ఫంక్షనల్ ఫినాన్శియల్ అప్‌గ్రెడేషన్ (ఎన్ఎఫ్ఎఫ్‌యు) సంబంధిత ప్రయోజనాలు 2006వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి, అలాగే సీనియర్ డ్యూటీ పోస్ట్ (ఎస్‌డిపి) యొక్క 30 శాతం మేరకు నాన్ ఫంక్షనల్ సెలక్షన్ గ్రేడ్ (ఎన్ఎఫ్ఎస్‌జి) సంబంధిత ప్రయోజనాలు 2000వ సంవత్సరం జూన్ 6వ తేదీ నుండి వర్తించే విధం గా చూసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సిబ్బంది మరియు శిక్షణ విభాగం క్రమానుగతం గా 2000వ సంవత్సరం జూన్ 6వ తేదీ నాడు మరియు 2009 వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ నాడు వెలువరించిన మార్గదర్శక సూత్రాల తో పాటు, తదనంతరం దీని కి సంబంధించి ఇచ్చిన ఆదేశాల కు అనుగుణం గా ఈ చర్య ను తీసుకోవడమైంది.
ప్రధాన ప్రభావం:
ఆర్‌పిఎఫ్ కు వ్యవస్థీకృత గ్రూపు ‘ఎ’ సర్వీస్ స్థాయి ని మంజూరు చేయడం అధికారుల కు సంబంధించినంత వరకు నిశ్చలత్వాన్ని నివారించి, వారు వారి యొక్క వృత్తి జీవనం లో ముందంజ వేసేందుకు అవకాశాల ను మెరుగు పరచగలుగుతుంది. అంతేకాకుండా, వారి యొక్క ప్రేరణ స్థాయి ని ఉన్నతీకరిస్తుంది కూడాను. తద్వారా ఆర్‌పిఎఫ్ లోని అర్హులైన అధికారులు లబ్ధి ని పొందగలుగుతారు.
పూర్వరంగం
ఆర్‌పిఎఫ్ కు గ్రూపు ‘ఎ’ సర్వీసు స్థాయి ని మంజూరు చేయాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం 2012వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ నాటి తన యొక్క ఉత్తర్వు లో రైల్వేల ను ఆదేశించింది. దీని ని గౌరవనీయ భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 2019వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన స్థిరపరచింది. తదనుగుణం గా ఆర్‌పిఎఫ్ కు వ్యవస్థీకృత గ్రూపు ‘ఎ’ సర్వీసు ను మంజూరు చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది.
**
(Release ID: 1578405)
Visitor Counter : 215