ఆర్థిక మంత్రిత్వ శాఖ
పది అంశాల తో కూడిన భారతదేశపు ‘దశాబ్ధ దార్శనికత’ 2019- 20 బడ్జెటు లో ఆవిష్కారం
ఈ సంవత్సరం లో 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గా మారనున్న భారత దేశం; 2024-25 కల్లా 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ స్థాయికి..
ప్రతి ఏటా సగటు న రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు భారత్ కు అవసరం అవుతాయి
విధాన పరమైన జడత్వం, ఇంకా లైసెన్స్- కోటా- నియంత్రణ హయాము లకు రోజు లు చెల్లిపోయాయి: ఆర్థిక మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 JUL 2019 1:52PM by PIB Hyderabad
‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ గా రూపొందనుంది. అదే విధం గా, 2024-25 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థ గా రూపుదాల్చాలన్న ప్రధాన మంత్రి దార్శనికత ను ఆచరణ లోకి తీసుకు వచ్చే మార్గం లో భారత్ పయనిస్తోంది’’ అని కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న 2019-20 కేంద్ర బడ్జెటు ను పార్లమెంటు లో ప్రవేశపెట్టిన సందర్భం గా అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ స్థాయి కి చేరుకోవడానికి 55 సంవత్సరాలకు పైగా పట్టింది. గడచిన 5 సంవత్సరాల లో దాదాపు 2.7 ట్రిలియన్ డాలర్ స్థాయి ని అందుకొనేందుకు ప్రభుత్వం ఒక ట్రిలియన్ డాలర్ ను జోడించింది. 5 సంవత్సరాల క్రితం ప్రపంచం లో పదకొండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆరో స్థానం లో నిలచిందని ఆమె తెలిపారు.
ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల లో ఒక ప్రకాశవంతమైన మరియు సుస్థిరమైన ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం కోసం దేశ పౌరుల లో అభిలాష తో పాటు ఆశ తొణికిసలాడటాన్ని గమనించగలిగామని చెప్తూ మంత్రి తన ఉపన్యాసాన్ని ఆరంభించారు. ఒక పని చేసేటటువంటి ప్రభుత్వానికి, వరుస లోని ఆఖరు వ్యక్తి కి సైతం ఫలితాల ను అందించిన ప్రభుత్వ శైలి కి ఈ ఎన్నికలు ఒక రుజువు గా నిలచాయని ఆమె అన్నారు.
2014-19 మధ్య కాలం లో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ కు అచంచల నిబద్ధత ను వ్యక్తం చేయడం, జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటు, సహకారాత్మక సమాఖ్యవాదం లతో పాటు కేంద్రానికి, రాష్ట్రాలకు నడుమ హుషారైన సంబంధాల ను నెలకొల్పడమే కాక నీతి ఆయోగ్ సహాయం తో ఒక ‘న్యూ ఇండియా’ ఆవిష్కారాని కి పునరుత్తేజాన్ని ప్రసాదించిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గడచిన 5 సంవత్సరాల లో ప్రభుత్వం అనేక పెద్ద సంస్కరణల కు- మరీ ముఖ్యం గా పరోక్ష పన్నులు, దివాలా, స్థిరాస్తి, ఇంకా సామాజిక రంగాల లో- నాంది పలికిందని, తద్వారా సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచిందన్నారు. వివిధ ప్రయోజనాల ను వరుస లోని ఆఖరు వ్యక్తి కి కూడా అందేటట్టు చూడటం జరిగిందని, మరి మన దేశం లో మారుమూల ప్రాంతాల లో నివసించే అపరిచిత పౌరుడు కూడా దీని కి ఒక నిదర్శనం గా నిలచిందని ఆమె చెప్పారు. ప్రభుత్వం తన చేత ల ద్వారా ‘సంస్కరించు, పనిచేయి, పరివర్తన ను తీసుకురా’ అనే సిద్ధాంతం సఫలం కాగలదని చాటిందన్నారు.
రాబోయే 10 సంవత్సరాల కాలం లో భారతదేశం కోసం ఉద్దేశించిన దార్శనికత క్రమాన్ని గురించి ఆర్థిక మంత్రి వివరిస్తూ, గత 5 సంవత్సరాల కాలం లో ఆరంభించి, అమలు కు నోచుకొన్న భారీ కార్యక్రమాలు, సేవలు, మరింత వేగాన్ని పుంజుకోగలవని వెల్లడించారు. ప్రభుత్వం ప్రక్రియల ను సరళతరం చేయాలని, పని తీరు కు ప్రోత్సాహకాలను అందజేయాలని, జాప్యాన్ని తగ్గించాలని, మరి అలాగే ఆశించిన లక్ష్యాల ను సాధించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉత్తమమైన పద్ధతిలో వినియోగించుకోవాలని యోచిస్తోందన్నారు. ‘‘విధానపరమైన జడత్వానికి మరియు లైసెన్స్- కోటా -కంట్రోల్ హయాము లకు కాలం చెల్లింది. ఇండియా ఇంక్ (India Inc.) ప్రస్తుతం భారతదేశపు ఉద్యోగాల సృష్టికర్తలు గా ఉన్నాయి. అవి జాతి కి సంపద ప్రదాతలు గా నిలచాయని’’ మంత్రి అన్నారు. వృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ లో భారతదేశ ప్రైవేటు పరిశ్రమ గణనీయమైన భూమిక ను నిర్వహిస్తున్న అంశాన్ని ఆమె నొక్కి వక్కాణించారు.
2019-20 సంవత్సర తాత్కాలిక బడ్జెటు లో ప్రభుత్వం యొక్క ‘దశాబ్దపు దార్శనికత తాలూకు మూలాలు’ ఉన్న సంగతి ని ఆర్థిక మంత్రి ఉదాహరిస్తూ, 10 అంశాల ను గురించి విశదీకరించారు. వాటిలో..
• భౌతికమైన మరియు సామాజికమైన మౌలిక సదుపాయాల ను నిర్మించడం;
• ఆర్థిక వ్యవస్థ లోని ప్రతి రంగాని కి డిజిటల్ ఇండియా దన్నుగా నిలవడం;
• ధరణి మాత హరిత హారాన్ని ధరించి ఉండటం; అలాగే నీలి గగనం తో కూడినటువంటి కాలుష్య రహిత భారతదేశం ఆవిష్కరణ;
• ఎంఎస్ఎంఇ లు, స్టార్ట్-అప్ లు, రక్షణ సంబంధిత తయారీ, ఆటోమొబైల్స్, ఇలెక్ట్రానిక్స్ ఫ్యాబ్స్ ఎండ్ బ్యాటరీస్ మరియు వైద్య ఉపకరణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మేక్ ఇన్ ఇండియా ను ముందుకు తీసుకుపోవడం;
• జలం, జల నిర్వహణ, నిర్మలమైన నదులు;
• నీలి ఆర్థిక వ్యవస్థ;
• అంతరిక్ష కార్యక్రమాలు.. గగన్యాన్, చంద్రయాన్ లతో పాటు ఉపగ్రహ సంబంధిత కార్యక్రమాలు;
• స్వయం సమృద్ధి మరియు ఆహార ధాన్యాల, పప్పు ధాన్యాల, నూనె గింజలు, ఫలాలు కూరగాయల ఎగుమతి
• ఆరోగ్యకరమైన సమాజం- ఆయుష్మాన్ భారత్, చక్కని పోషకాహారాన్ని అందుకొనే మహిళలు, బాలలు, పౌరుల కు భద్రత.
• ప్రజల భాగస్వామ్యం తో కూడిన టీమ్ ఇండియా. కనిష్ఠ స్థాయి ప్రభుత్వం, గరిష్ఠ స్థాయి పాలన.
పైన ప్రస్తావించిన అంశాలను గురించి ఆర్థిక మంత్రి విశదం చేస్తూ, 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలి అంటే పెట్టుబడుల అండదండల తో వృద్ధి నమూనా ను గురించి వివరించారు. తక్కువ ఖర్చు తో మూలధనం అందుబాటు లోకి వచ్చినప్పుడే పెట్టుబడి ప్రధానమైన వృద్ధి ఆవిష్కారం అవుతుందని ప్రభుత్వం గుర్తిస్తోందని ఆమె అన్నారు. భారతదేశాని కి ప్రతి సంవత్సరం సగటున రూ. 20 లక్షల కోట్లు (ఏడాది కి 300 బిలియన్ యుఎస్ డాలర్లు) అవసరం అవుతాయని అంచనా వేయడం జరిగింది.
దీనికి తోడు, 2018-2030 మధ్య కాలం లో రైల్వే మౌలిక సదుపాయాలకు రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి ఆవశ్యకం అవుతుందని ఊహించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. వేగవంతమైన అభివృద్ధి సాధన కు, ప్రాజెక్టుల ను పూర్తి చేయడానికి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యాన్ని వినియోగించుకొంటామని, మరి అలాగే నేశనల్ హైవే గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్స్, ఐ-వేస్, ఇంకా ప్రాంతీయ విమానాశ్రయాల ను అభివృద్ధి చేయడం కోసం ఒక నమూనా ను ఈ సంవత్సరం లో అందుబాటు లోకి తీసుకు వస్తామని ఆమె ప్రతిపాదించారు.
ప్రభుత్వ రంగ సంస్థ ల వాస్తవ సామర్ధ్యాన్ని వెలికి తీయడం పై శ్రద్ధ వహిస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ఎంపిక చేసిన సిపిఎస్ఇ లలో పెట్టుబడులను వ్యూహాత్మకం గా ఉపసంహరించడం ఈ ప్రభుత్వ ప్రాథమ్యాల లో ఒకటిగా ఉంటుందని, దీనితో పాటు ఆర్థికేతర రంగం లోని పిఎస్‌యు లను సమన్వయపరచడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా ఒక సంస్థ ను ప్రభుత్వ నియంత్రణ లోనే కొనసాగించుకోవలసి వచ్చినప్పుడు ఆయా సంస్థల వారీ గా ప్రభుత్వ వాటా ను 51 శాతం కన్నా తక్కువ స్థాయి నుండి సముచితమైన స్థాయి కి చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరం కోసం రూ. 1,05,000 కోట్ల మేరకు పెట్టుబడుల ఉపసంహరణ సంబంధిత ఆదాయ సాధన లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకొంటోందని ఆమె వెల్లడించారు.
భారతదేశ యువతీ యువకులు విదేశాల లో సైతం కొలువులను చేజిక్కించుకొనేందుకు గాను వారిని సన్నద్ధులను చేసేందుకు ప్రభుత్వం భాష పరమైన శిక్షణ సహా విదేశాలలో పని చేయడానికి కావలసిన నైపుణ్యాల పైన మరింత శ్రద్ధ ను వహిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3డి ముద్రణ, వర్చువల్ రియాలిటీ, ఇంకా రొబొటిక్స్ ల వంటి కొత్త తరం ప్రావీణ్యాల పైన దృష్టి ని సారించడం జరుగుతుందని ఆమె అన్నారు. దేశ విదేశాల లో ఈ ప్రావీణ్యాల కు ఎంతో విలువ ఉందని, ఇవి చాలా ఎక్కువ పారితోషికాన్ని ఇవ్వజూపుతున్నాయని కూడా ఆమె పేర్కొన్నారు.
దూర్ దర్శన్ పరిధి లో ఉన్నటువంటి చానల్స్ లో ప్రత్యేకంగా స్టార్ట్-అప్ లకు ఉద్దేశించినటువంటి ఒక టెలివిజన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా ఆర్థిక మంత్రి తన బడ్జెటు ఉపన్యాసం లో ప్రతిపాదించారు. ఈ కార్యక్రమం స్టార్ట్-అప్ ల వృద్ధిని ప్రభావితం చేసే అంశాలను చర్చించడం, వెంచర్ కేపిటలిస్ట్ లతో సమన్వయాన్ని నెలకొల్పడం తో పాటు, నిధుల సమీకరణ, ఇంకా పన్నులు ప్రణాళిక రచన వంటి వాటికి ఆస్కారం కల్పిస్తుంది అని ఆమె వివరించారు.
పారిశ్రామిక రంగాన్ని గురించి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఎంఎస్ఎంఇ లకు వడ్డీ లో ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకం లో భాగం గా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 350 కోట్ల ను కేటాయించడమైందన్నారు. ఇది జిఎస్‌టి లో నమోదు అయిన అన్ని ఎంఎస్ఎంఇ లకు అవి తీసుకొనే తాజా రుణాలు లేదా అదనపు రుణాల తాలూకు వడ్డీలో 2 శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయానికి గాను ఉద్దేశించినదపి ఆమె వివరించారు. ఎంఎస్ఎంఇ లు బిల్లుల ను మరియు చెల్లింపుల ను చేసేందుకు ఒక చెల్లింపుల వేదిక ను ప్రభుత్వం సిద్ధం చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా, బహుళ సంఖ్య లో ఉన్నటువంటి కార్మిక చట్టాల ను నాలుగు కార్మిక స్మృతుల లో ఇముడ్చేందుకు కూడా ఒక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని, ఇది జరిగితే వివాదాలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ దార్శనికత ను ఒకే మాట లో శ్రీమతి సీతారమణ్ వివరిస్తూ, ‘‘మనం స్వాతంత్య్రం సాధించుకొని 75 సంవత్సరాలు అవుతున్న వేళ, ‘హక్కుల కు’ భంగం కలిగించకుండా భారతదేశం పట్ల మన ‘కర్తవ్యం’ పట్ల శ్రద్ధ వహించవలసి ఉంది’’ అన్నారు.
**
(రిలీజ్ ఐడి: 1577583)
సందర్శకుల సూచీ సంఖ్య : : 340