సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కేంద్ర జాబితా లోని ఇతర వెనుకబడిన తరగతుల జాబితా ఉప వర్గీకరణ కు ఏర్పాటైన కమిటీ గడువు ను రెండు నెలలు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
కమిశన్ పదవీకాలం ఇక మీదట 2019 జూలై 31 వరకు పొడిగింపు
प्रविष्टि तिथि:
12 JUN 2019 7:59PM by PIB Hyderabad
దేశంలో భిన్న వర్గాల ప్రజల సర్వతోముఖ అభివృద్ధి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లోని ఎన్ డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రయోజనాలు ఒబిసి కులాల కు/ జాతుల కు చెందిన వారందరికీ సమానం గా అందేలా చూడడం కోసం రాజ్యాంగం లోని 340 అధికరణం పరిధి లో ప్రభుత్వం ఒక కమిశన్ ను నియమించింది. కేంద్ర జాబితా లోని ఒబిసిల లో ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించడం ఈ కమిటీ బాధ్యత గా ఉంది.
ఇతర వెనుకబడిన వర్గాల ఉప వర్గీకరణ కు ఏర్పాటైన కమిశన్ గడువు ను మరో రెండు నెలల పాటు- 2019 జూలై 31 వరకు- పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ కమిటీ ప్రస్తుత గడువు 2019 మే 31తో ముగిసిపోయింది. కమిశన్ కు పొడిగింపు ను మంజూరు చేయడం ఇప్పటి కి ఇది ఆరో సారి.
ప్రభావం:
కేంద్ర జాబితా లోని ఇతర వెనుకబడిన వర్గాల ఉపవర్గీకరణ కమిశన్ గడువు పొడిగించడం వల్ల ఆ కమిశన్ వివిధ వర్గాల తో సంప్రదింపులు జరిపేందుకు మరింత గా అవకాశం చిక్కుతుంది. దాని వల్ల కమిశన్ ప్రభుత్వాని కి సమగ్రమైన నివేదిక ను సమర్పించ గలుగుతుంది.
పూర్వరంగం:
రాజ్యాంగం లోని 340వ అధికరణం కింద 2017 అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ కమిశన్ ను ఏర్పాటు చేయడమైంది. జస్టిస్ (రిటైర్డ్) జి. రోహిణి సారథ్యం లోని ఈ కమిశన్ 2017 అక్టోబర్ నెల లో పని ని ప్రారంభించి, ఒబిసిల లో ఉప వర్గీకరణ విషయం లో రాష్ట్రాల తో, కేంద్ర పాలిత ప్రాంతాల తో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన వర్గాల కమిశన్ లతో సంప్రదింపులు జరిపింది. గతం లో కమిశన్ జారీ చేసిన సంప్రదింపుల పత్రం పై ఆయా వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను గురించి మరింత విస్తృతంగా చర్చించవలసిన అవసరం ఉందని కమిశన్ భావించింది. పూర్తి స్థాయి లో అర్హత గల ఏ వర్గాని కి కొత్త జాబితా లో స్థానం లేకుండా పోవడాన్ని నివారించాలంటే మరింత కూలంకష చర్చలు అవసరం అని నివేదించింది. ఇందుకు మరో రెండు నెలల కాలం పట్టవచ్చు.
ఈ అంశం ఆధారం గా 2019 జూలై 31 వరకు తమకు మరో రెండు నెలల గడువు ను ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కమిశన్ కోరింది.
**
(रिलीज़ आईडी: 1574478)
आगंतुक पटल : 104