వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స్టార్ట్-అప్ స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశం మరియు రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 27 MAR 2019 1:52PM by PIB Hyderabad

స్టార్ట్-అప్ స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశం మరియు రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద పత్రాని కి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ ఎంఒయు పై 2019వ సంవ‌త్సరం ఫిబ్ర‌వ‌రి లో సంత‌కాల‌య్యాయి. 

ఈ ఎంఒయు రెండు దేశాల లోనూ స్టార్ట్-అప్ ల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాని కి మార్గాన్ని సుగ‌మం చేయ‌డ‌మే కాకుండా అటువంటి స‌హ‌కారాన్ని ప్రోత్స‌హిస్తుంది కూడాను.  ఈ క్రమం లో, ఆయా దేశాల జాతీయ చ‌ట్టాలు, నియ‌మ నిబంధ‌న‌ల తో పాటు ఉభ‌య దేశాలు ఒక ప‌క్షం గా ఉన్న ఏ అంత‌ర్జాతీయ ఒడంబ‌డిక‌లను, సంధులను మరియు ఒప్పందాలను కూడా ప‌రిగ‌ణ‌న లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంది.


** 



(Release ID: 1569659) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Tamil