మంత్రిమండలి

భార‌త‌దేశం లో పెట్టుబ‌డి సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కు ఒక యంత్రాంగం స్థాప‌న అనే అంశం లో భార‌త‌దేశాని కి మ‌రియు సౌదీ అరేబియా కు మ‌ధ్య ఎంఒయు పై సంత‌కాల కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 13 FEB 2019 9:13PM by PIB Hyderabad

భార‌త‌దేశం లో పెట్టుబ‌డి సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కు ఒక యంత్రాంగాన్ని నెలకొల్పే అంశం లో  మ‌ధ్య ఓ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద పత్రం (ఎంఒయు)పై భార‌త‌దేశం, సౌదీ అరేబియా లు చేసిన సంతకాల  కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. 

ఈ ఎంఒయు కుదరడం తో దేశం లో మౌలిక స‌దుపాయాల రంగం లోకి తరలిరాగల పెట్టుబ‌డి ని ఆక‌ర్షించ‌డం కోసం సౌదీ అరేబియా కు చెందిన సంస్థ ల‌తో క‌ల‌సి ప‌ని చేయ‌డం లో ఒక అడుగు ముందుకు వేసిన‌ట్లు అవుతుంది.  ఇది దేశం లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి ఊతాన్ని ఇవ్వ‌డం తో పాటు మ‌రిన్ని ఉద్యోగాల క‌ల్ప‌న కు, అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌/అనుబంధ రంగాల వృద్ధి కి దారి తీస్తుంది.  ఇది జిడిపి లో వృద్ధి కి మరియు మొత్తం మీద ఆర్థిక స‌మృద్ధి కి కూడా బాట ను ప‌రుస్తుంది.


**



(Release ID: 1564543) Visitor Counter : 80