సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కాపీరైట్ ఉల్లంఘనలు, ఫిల్మ్ పైరసీ ని ఎదుర్కొనేందుకు చర్యలు
అనధికారికం గా సినిమాల ను కామ్‌కార్డర్ పై రికార్డు చేయడం, కాపీ లు తీయడం వంటి చర్యల కు పాల్పడే వారి కి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా లేదా ఈ రెండింటి ని విధించేందుకు సినిమాటోగ్రఫీ చట్టం, 1952 లో సవరణ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
06 FEB 2019 9:41PM by PIB Hyderabad
సినిమాటోగ్రఫీ చట్టం, 1952ను సవరించేందుకు సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2019ని తీసుకురావాలని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫిల్మ్ పైరసీ సమస్య ను అరికట్టడంతో పాటు అనధికారికం గా సినిమాల ను కామ్‌కార్డ్ ద్వారా కాపీ చేసే వారి ని చట్టప్రకారం శిక్షించేందుకు ఈ బిల్లు ను ఉద్దేశించారు.
వివరాలు:
ఫిల్మ్ పైరసీ ని అరికట్టేందుకు, ఈ సవరణల లో కొత్త గా సెక్షన్ 6ఎఎ ని చేర్చారు. ఇది అనధికారిక రికార్డింగ్ ను నిషేధిస్తున్నది.
సినిమాటోగ్రఫీ చట్టం, 1952లో సెక్షన్ 6 ఎ తరువాత ఈ సెక్షన్ ను చేరుస్తారు.
6 ఎఎ : రచయిత లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎవరు కూడా ఏ సినిమా ను గాని, అందులో కొంత భాగాన్ని గాని కాపీ చేయడం, లేదా ఏ ఆడియో విజువల్ రికార్డింగ్ పరికరాన్ని ఉపయోగించి అయినా ఉద్దేశ‌్యపూర్వకం గా తయారు చేయడం , లేదా ప్రసారం చేయడం లేదా ప్రసారం చేయడానికి ప్రయత్నించడాన్ని అనుమతించరు. ఇందులో రచయిత అన్న దానికి అర్ధం కాపీరైట్ చట్టం, 1957 సెక్షన్ 2, క్లాజు డి లో పేర్కొన్న అర్థాన్నే అన్వయింపచేస్తారు.
సెక్షన్ 6 ఎఎ లోని నిబంధనల ను ఉల్లంఘించే వారి ని శిక్షించేందుకు పీనల్ ప్రొవిజన్ లకు సంబంధించి సెక్షన్ 7లో సవరణలను ప్రతిపాదించారు.
ప్రధాన చట్టం లోని సెక్షన్ 7లో సబ్‌సెక్షన్ 1 తరువాత ఈ కింది సబ్ సెక్షన్ 1ఎ ని చేర్చనున్నారు.
సెక్షన్ 6 ఎఎ నిబంధనల కు విరుద్ధం గా ఎవరైనా వ్యవహరించినట్లయితే వారి కి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 10 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెండింటి ని విధిస్తారు.
ఈ ప్రతిపాదిత సవరణలు పరిశ్రమ రాబడి ని అధికం చేయడం తో పాటు , ఉపాధి అవకాశాల ను మరింత గా పెంచుతాయి. అలాగే భారతదేశ జాతీయ ఐపి పాలసీ లక్ష్యాల ను నెరవేర్చడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. అలాగే పైరసీ, ఆన్‌లైన్ కంటెంట్ ఉల్లంఘనల కు వ్యతిరేకం గా ఊరట కలిగిస్తుంది.
పూర్వరంగం:
చలనచిత్ర మాధ్యమం, దాని తో ముడిపడిన ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, దాని ప్రేక్షకుల విషయం లో గత కొన్నిసంవత్సరాలు గా అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. అలాగే ప్రసార మాధ్యమాలు, వినోద రంగం లో టెలివిజన్ చానల్స్, కేబుల్ నెట్‌వర్క్ లు దేశవ్యాప్తం గా విపరీతం గా రావడంతో కూడా పలు మార్పులు చోటుచేసుకొన్నాయి. మరో వైపు కొత్త డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, పైరసీ, ఇంటర్ నెట్ లో పైరసీ అయిన సినిమాల విడుదల, ఇవన్నీచిత్ర పరిశ్రమ కు పెద్ద ఎత్తున నష్టాలు తెచ్చిపెట్టడం తో పాటు ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టాన్ని వాటిల్లజేస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి ప్రభుత్వం తగిన సవరణల ను తీసుకురావాలని కామ్‌కార్డింగ్, పైరసీ ని అరికట్టాలని చలనచిత్ర పరిశ్రమ వర్గాలు ఎంతో కాలం గా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కామ్‌కార్డింగ్, పైరసీ ల బెడద ను ఎదుర్కొనే విషయమై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ న భారతీయ చలనచిత్ర రంగాని కి సంబంధించి ముంబయి లో జాతీయ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భం గా ఒక ప్రకటన చేశారు. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి తగిన సవరణల ను కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి సమర్పించింది.
**
(Release ID: 1563333)
Visitor Counter : 120