మంత్రిమండలి
ఆరోగ్య మౌలిక సదుపాయాల రంగానికి మరింత ఊతం
జమ్ములోని సాం బా, విజయనగర్, 2.కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద గల అవంతిపూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద 3 కొత్త ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి
प्रविष्टि तिथि:
10 JAN 2019 8:38PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కొత్త గా మూడు ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిని 1)జమ్ములోని సాంబా వద్ద విజయ్‌నగర్‌లో 1661 కోట్ల రూపాయలతో, 2)కాశ్మీర్‌లోని పుల్వామా, అవంతిపురా వద్ద 1828 కోట్ల రూపాయలతో, 3) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌వద్ద 1195 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్షా యోజన కింద వీటిని ఏర్పాటు చేస్తారు.
బి) పైన తెలిపిన మూడు ఎఐఐఎంఎస్‌లకు ఒక్కొక్క దానికి ఒక డైరక్టర్ వంతున మూల వేతనం రూ 2,25,000(ఫిక్స్‌డ్) దీనికి అదనంగా ఎన్.పి.ఎ (అయితే వేతనం+ ఎన్.పి.ఎ 2,37,500రూపాయలకు మించరాదు)
కాల వ్యవధి :
|
సీరియల్ నెం
|
కొత్త ఎఐఐఎంఎస్
|
నిర్మాణానికి కాల వ్యవధి , ఇతర వివరాలు
|
-
|
- విజయ్‌నగర్,సాంబా,జమ్ము
|
48 నెలలు.
స్థూలంగా నిర్మాణ ముందు దశకు 12 నెలలు,నిర్మాణ దశకు 30 నెలలు, స్థిరీకరణ, ప్రారంభఅనుకూల దశకు 6 నెలలు
|
-
|
అవంతిపుర,పుల్వామా, కశ్మీర్
|
72 నెలలు
స్థూలంగా నిర్మాణ ముందు దశ 12 నెలలు, నిర్మాణ దశ 54 నెలలు,
స్టెబిలైజేషన్, కమిషనింగ్ దశ 6 నెలలు.
|
-
|
రాజ్కోట్, గుజరాత్
|
45 నెలలు
- స్థూలంగా నిర్మాణ ముందస్తు దశ 10 నెలలు,నిర్మాణ దశ 32 నెలలు,
స్టెబిలైజేషన్, కమిషన్ దశ 3 నెలలు
|
వివరాలు :
నూతన ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు ద్వారా ఆస్పత్రుల నిర్మాణం, మెడికల్, నర్సింగ్‌కోర్సులకు టీచింగ్ బ్లాక్ నిర్మాణం, రెసిడెన్షియల్‌కాంప్లెకస్, ఇతర అనుబంధ సౌకర్యాలు సేవలు అందుబాటులోకి వస్తాయి. స్థూలంగా న్యూఢిల్లీలోని ఎఐఐఎంఎస్ తరహాలో అలాగే పి.ఎం.ఎస్.ఎస్.వై తొలి దశ కింద చేపట్టిన ఎఐఐఎం ఎస్‌ల తరహాలో సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన వైద్యసేవలు ఈ ప్రాంతాలలో అందుబాటులోకితీసుకువచ్చేందుకు, వైద్య విద్య, నర్సింగ్ విద్య, పరిశోధనలకోసం ఈ కొత్త ఎఐఐఎం ఎస్‌లను జాతీయ ప్రాధాన్యతగల సంస్థలుగా ఏర్పాటు చేస్తున్నారు.
బి)
1)ప్రతి కొత్త ఎఐఐఎం 100 యజి(ఎం.బి.బిఎస్)సీట్లు, 60 బిఎస్‌సి నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
2)ప్రతి కొత్త ఎఐఐఎంఎస్‌కు 15-20 సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటుఅవుతాయి.
3)ప్రతి కొత్త ఎఐఐఎంఎస్‌కు 750 వరకు ఆస్పత్రి పడకలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఎమర్జెన్సీ, ట్రామా కేర్ బెడ్‌లు, ఆయుష్ బెడ్‌లు, ప్రైవేట్ బెడ్‌లు, ఐసియు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ బెడ్లు ఉంటాయి.
4)ప్రతి కొత్త ఎఐఐఎంఎస్ ప్రతి రోజూ సుమారు 1500 ఒపిడి పేషెంట్లను చూస్తుంది. నెలకు సుమారుగా 1000 ఐపిడి పేషెంట్లను చూస్తుంది,
5) వీటిలో మెడికల్ కాలేజి, ఆయుష్‌బ్లాక్, ఆడిటోరియం, నైట్‌షెల్టర్, అతిథి గృహం, హాస్టల్స్, రెసిడెన్షియల్ సదుపాయాలు ఉంటాయి.
వ్యయం:
నూతన ఎఐఐఎంఎస్‌ల నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వనిధులతోనే చేపట్టడం జరుగుతుంది. ఈ ఎఐఐఎంఎస్‌ల కార్యకలాపాలు, వాటి నిర్వహణ వ్యయాలను కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
కొత్త ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు మూలధన ఆస్తులను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు ఆరు కొత్త ఎఐఐఎంఎస్‌ల తరహాలో వాటి నిర్వహణకు ప్రత్యేక మానవ వనరుల కల్పన జరగుతుంది.
ప్రభావం:
కొత్త ఎఐఐఎంఎస్‌ల ఏర్పాటుతో వైద్య విద్యారంగం, శిక్షణ రంగంలో మార్పుకు దోహదం ఏస్తుంది. అలాగే ఈ ప్రాంతాలలో వైద్యసిబ్బంది కొరతను అధిగమించడానికి ఉపకరిస్తుంది.
కొత్త ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు రెండు ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఒకటి, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వైద్యులను ఇతర ఆరోగ్య కార్యకర్తలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. వీరు ప్రైమరి, సెంకడరీ స్థాయి సంస్థలలో,జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏర్పడిన సదుపాయాలకు , సెకండరీ స్థాయి సంస్థలకు ఉపయోగపడతారు
ఉపాధి అవకాశాల కల్పన:
జమ్ము, కాశ్మీర్, గుజరాత్‌లలో ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు వల్ల వివిధ ఫాకల్టీ, నాన్ ఫాకల్టీ ఉద్యోగాలలో ప్రతి ఎయిమ్స్‌కు 3000 ఉద్యోగాలవరకు అందుబాటులోకి వస్తాయి.
షాపింగ్ సెంటర్, కాంటీన్. ఎయిమ్స్ చుట్టుపక్కల ఇతర సదుపాయాల వల్ల పరోక్షంగా కూడా ఉపాధి కల్పన జరుగుతుంది.
కొత్త ఏయిమ్స్‌ల కోసం చేపట్టే నిర్మాణాల వల్ల సైతం నిర్మాణ దశలో చెప్పుకోదగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు సమకూరుతాయి.
నేపథ్యం:
ప్రధానమంత్రి స్వాస్త్య సురక్షా యోజన (పిఎంఎస్ఎస్‌వై), కేంద్ర ప్రభుత్వరంగ పథకం. ఇదిదేశంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులో వైద్య సేవలకు సంబంధించిన అసమానతలను తొలగించేందుకు ఉద్దేశించినది. అలాగే వైద్య విద్య సదుపాయాలకుసంబంధించి వెనుకబడి ఉన్న రాష్ట్రాలలో సదుపాయాలను కల్పించేందుకు ఉద్దేశించినది.
జమ్ము ప్రాంతానికి ఒకటి, కాశ్మీర్ ప్రాంతానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న ఎఐఐఎంఎస్‌లను ప్రధానమంత్రి అభివృద్ధి పాకేజ్‌పథకం కింద ప్రధానమంత్రి 2015 నవంబర్ 7న ప్రకటించారు. గుజరాత్‌లో ఏర్పాటు కానున్న ఎఐఐఎంఎస్‌ను ఆర్థికమంత్రి 2017-18 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
***
(रिलीज़ आईडी: 1559540)
आगंतुक पटल : 178