వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ మెట్రాలజీ రంగం లో మారిషస్ తో ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2018 1:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వినియోగదారు పరిరక్షణ మరియు న్యాయబద్ధమైన తూనికలు, కొలతల కు సంబంధించిన శాస్త్రం అంశాల లో భారతదేశాని కి మరియు మారిషస్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని కి ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
ఈ ఎంఒయు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల కు ప్రయోజనకారి గా ఉంటుంది. ఇది వినియోగదారు పరిరక్షణ రంగం లో సహకారాన్ని విస్తృతం చేయడం లో దోహదపడుతుంది. సంబంధిత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని సమకూర్చడంతో పాటు ఉభయ దేశాల లో చోటు చేసుకొనే పరిణామాల నుండి పరస్పరం లాభాల ను పొందేందుకు కూడా వీలు కల్పిస్తుంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ మెట్రాలజీ రంగాల లో తప్పుదారి పట్టించే ప్రకటన, టెలి మార్కెటింగ్, బహుళ అంచె లతో కూడిన మార్కెటింగ్, ఇ-కామర్స్ ల వంటి నూతన సవాళ్ళ ను ఎదుర్కొనేందుకు ఒక సమ్మిళిత చర్యలకు, సుస్థిర చర్యలకు, హుషారైన చర్యల కు ఊతాన్ని అందిస్తుంది కూడాను. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణాలను అన్వేషించేందుకు, తద్వారా నవీన సవాళ్ళను పరిష్కరించడం లో తోడ్పడే కొత్త రంగాల తాలూకు ప్రావీణ్యాన్ని అభివృద్ధి పరచుకొనేందుకూ ఇది సాయపడుతుంది. అంతేకాక, సమాచారాన్ని, ఇంకా శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పక ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వినియోగదారు హక్కులపై జరిగే దాడులతో పోరాడడానికి మరియు సుపరిపాలనకు సంబంధించిన ప్రావీణ్యం సమకూరేటట్లు గా ఇది చూస్తుంది.
**
(రిలీజ్ ఐడి: 1553508)
సందర్శకుల సూచీ సంఖ్య : : 149