హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర పాలిత ప్రాంత‌ం దాద్ రా మరియు నాగ‌ర్ హ‌వేలీ లోని సిల్‌వాసా లో వైద్య క‌ళాశాల ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 22 NOV 2018 1:30PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కేంద్ర పాలిత ప్రాంత‌మైన దాద్ రా మరియు నాగ‌ర్ హ‌వేలీ లోని సిల్‌వాసా లో వైద్య క‌ళాశాల ను ఏర్పాటు చేయ‌డానికి  ఆమోదం తెలిపింది.  

ప్ర‌ధానాంశాలు:

1.   కేంద్ర పాలిత ప్రాంత‌మైన దాద్ రా మరియు నాగ‌ర్ హ‌వేలీ లోని సిల్‌వాసా లో వైద్య క‌ళాశాల‌ ను  ఏర్పాటు చేయడం కోసం రెండు సంవత్సరాలలో 189 కోట్ల రూపాయ‌ల మూల‌ధ‌నాన్ని వ్య‌యపరచాలని నిర్ధారించడమైంది.  ఇందులో 114 కోట్ల రూపాయ‌లను 2018-19 లోను, 75 కోట్ల రూపాయ‌లను 2019-20 లోను వెచ్చిస్తారు.  ఈ క‌ళాశాల‌ లో ఏటా 150 మంది విద్యార్థుల‌ ను చేర్చుకొంటారు.  

2.  ఈ ప‌థ‌కాన్ని 2019-20 క‌ల్లా పూర్తి చేస్తారు.  దీని నిర్మాణాన్ని, మూలధ‌న వ్య‌యాన్ని ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌క సూత్రాలు, ఇంకా మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నియ‌మాల‌కు అనుగుణం గా చేయడం జ‌రుగుతుంది.

3.  వైద్య క‌ళాశాల సంబంధిత వార్షిక పున‌రావృత్త వ్య‌యాన్ని కేంద్ర పాలిత ప్రాంత బ‌డ్జెటు లో స‌ర్దుబాటు చేస్తారు.
 
4.  క‌మిటీ ఆన్ ఎస్టాబ్లిశ్ మెంట్‌ ఎక్స్‌పెండిచ‌ర్‌ (సిఇఇ) సిఫారసు కు అనుగుణంగా 357 రెగ్యుల‌ర్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. వీటిలో 14 జెఎస్ స్థాయి, అంత‌కు మించిన (బోధ‌న‌, బోధ‌నేత‌ర‌ ప‌ద‌వులు స‌హా)  21 రెగ్యుల‌ర్ పోస్టులు కూడా ఉంటాయి. 

ప్ర‌యోజ‌నాలు:
  
ఈ ఆమోదం వైద్యుల ల‌భ్య‌త ను పెంచుతుంది.  అలాగే, వైద్యుల కొర‌త స‌మ‌స్య‌ ను తీరుస్తుంది.  ఇది రెండు కేంద్ర పాలిత ప్రాంతాల‌ విద్యార్థుల‌ కు వైద్య విద్యావ‌కాశాల‌ను అధికం చేస్తుంది.  అంతేకాకుండా, జిల్లా ఆసుప‌త్రుల లో ఇప్పుడు ఉన్నటువంటి మౌలిక స‌దుపాయాల‌ను అభిల‌ష‌ణీయ‌మైన స్థాయి లో వినియోగించుకోవ‌డానికి దారి తీయ‌డం తో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌ కు మ‌రియు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌ల‌ కు సంబంధించి మూడో అంచె ఆరోగ్య స‌దుపాయాల‌ను  మెరుగుప‌ర‌చ‌గ‌లుగుతుంది.  ఈ వైద్య క‌ళాశాల విద్యార్థుల‌ కు- ప్ర‌త్యేకించి ఉభ‌య కేంద్ర పాలిత ప్రాంతాల లోని ఆదివాసీ ప్రాంతాలు, ఇంకా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల‌ కు- ప్ర‌యోజ‌న‌కారి గా ఉండ‌డం తో పాటు, సామాజిక స‌మాన‌త్వాన్ని ప్రోత్స‌హించ‌ గ‌లుగుతుంది.  కేంద్ర పాలిత ప్రాంతాల‌ లో వైద్యుల సంఖ్య‌ ను మెరుగుప‌ర‌చ‌డం ద్వారా చ‌క్క‌ని సేవ‌ ల‌ను అందుబాటు లోకి తీసుకు వ‌చ్చేందుకు, ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మాన‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు మార్గం సుగ‌మం అవుతుంది.


**(Release ID: 1553505) Visitor Counter : 96


Read this release in: English , Tamil , Kannada