మంత్రిమండలి

రాయ్‌బ‌రేలీ, గోర‌ఖ్‌ పుర్‌, భ‌టిండా, గువాహాటీ, బిలాస్‌పుర్, ఇంకా దేవ్ ఘర్ ల‌లో నూత‌న ఎఐఐఎమ్ఎస్ ల‌కు ఒక్కొక్క‌ దానికి రూ. 2,25,000/- మూల‌వేత‌నానికి (స్థిర ప్రాతిప‌దిక‌ న) ఎన్‌పిఎ కూడా క‌లుపుకొని.. రూ.2,37,500/- కి మించ‌ని విధం గా.. ఒక డైరెక్ట‌ర్ ప‌ద‌వి ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం.

Posted On: 24 OCT 2018 1:25PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్‌బ‌రేలీ లో, గోర‌ఖ్‌ పుర్‌ లో, పంజాబ్ లోని భ‌టిండా లో, అసమ్ లోని గువాహాటీ లో, హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పుర్ లో ఇంకా ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో నూత‌న ఎఐఐఎమ్ఎస్ ల‌లో ఒక్కొక్క‌ ఎఐఐఎమ్ ఎస్ లో డైరెక్ట‌ర్ ప‌ద‌వి ని రూ. 2,25,000/-  మూల‌వేత‌నానికి (స్థిర ప్రాతిప‌దిక‌న) ఎన్‌పిఎ కూడా క‌లుపుకొని..  రూ.  2,37,500/- కి మించ‌ని విధం గా..  ఏర్పాటు చేసేందుకు  ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమో దం తెలిపింది.
 
ఈ డైరెక్ట‌ర్ సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి (సిఇఒ)గాను, సంస్థ కు మొత్తంమీద ప‌రిపాల‌న ప‌ర్య‌వేక్ష‌క అధికారి గాను ఉంటూ సంస్థ కు చెందిన అధికారుల కు మ‌రియు ఉద్యోగుల కు విధుల‌ను కేటాయిస్తారు.


**



(Release ID: 1550639) Visitor Counter : 174