మంత్రిమండలి

స‌స్‌టైన‌బుల్ అండ్ స్మార్ట్ అర్బ‌న్ డివెల‌ప్‌మెంట్ రంగంలో సాంకేతిక సంబంధ స‌హ‌కారానికి గాను భార‌త‌దేశం మ‌రియు డెన్మార్క్ ల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి (ఎంఓయూ) ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 06 JUN 2018 3:27PM by PIB Hyderabad

స‌స్‌టైన‌బుల్ అండ్ స్మార్ట్ అర్బ‌న్ డివెల‌ప్‌మెంట్ రంగంలో భార‌త‌దేశం మ‌రియు డెన్మార్క్ లు సాంకేతికంగా స‌హ‌క‌రించుకోవ‌డానికి గాను 2018 ఏప్రిల్ నెల‌లో సంతకాలైన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఓయూ) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావ‌డ‌మైంది.

వివ‌రాలు

జ‌లం మ‌రియు పారిశుధ్య నిర్వ‌హ‌ణ, శ‌క్తిని స‌మ‌ర్ధంగా వినియోగించుకోవ‌డం, వ‌న‌రుల స‌మీక‌ర‌ణ, స్మార్ట్ అర్బ‌న్ సొల్యూష‌న్స్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ త‌దిత‌ర రంగాల‌లో ప‌ర‌స్ప‌రం అంగీకారం కుదిరిన మేర‌కు ఆదాన ప్రదానం, ఇంకా ఇరు పక్షాలకు లబ్ధి ల ప్రాతిపదికన రెండు దేశాలూ స‌హ‌క‌రించుకోవాలన్నది ఈ ఎంఓయూ ధ్యేయం. 

అమ‌లు సంబంధిత వ్యూహం  

ఈ ఎమ్ఒయు లో భాగంగా కార్య‌క్ర‌మాల అమ‌లుకు ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని (జెడ‌బ్ల్యుజి) ఏర్పాటు చేయ‌నున్నారు.  ఈ బృందం ఒక ఏడాది  డెన్మార్క్‌ లోను, ఆ త‌దుప‌రి సంవ‌త్స‌రం భార‌త‌దేశం లోను స‌మావేశ‌మ‌వుతుంది.

ప్రధాన ప్రభావం

ఈ ఎంఓయూ రెండు దేశాల మధ్య స‌స్‌టైన‌బుల్ అండ్ స్మార్ట్ అర్బ‌న్ డివెల‌ప్‌మెంట్ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.

లబ్ధిని అందుకొనే వర్గాలు

ఈ ఎంఓయూ వ్యర్ధాల నుండి శక్తి, జ‌లం మ‌రియు పారిశుధ్య నిర్వ‌హ‌ణ, శక్తి యొక్క సమర్ధ వినియోగం, వనరుల సమీకరణ, సస్టైనబుల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్స్ లతో సహా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగాల‌లో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆశిస్తున్నారు.


***



(Release ID: 1534602) Visitor Counter : 78