మంత్రిమండలి

ఆహార భద్రత సంబంధ సహకారం అంశంలో భారతదేశానికి మరియు డెన్మార్క్ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 23 MAY 2018 3:55PM by PIB Hyderabad

ఆహార భద్రత సంబంధ సహకారం అంశంలో భారతదేశానికి మరియు డెన్మార్క్ కు మధ్య కుదిరినటువంటి అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ ఎమ్ఒయు పై 2018 ఏప్రిల్ 16వ తేదీన సంతకాలు అయ్యాయి.

ప్రయోజనాలు:

ఈ ఎమ్ఒయు ద్వైపాక్షిక సంబంధాలను, పరస్పర అవగాహనను మరియు విశ్వాసాన్ని గాఢతరం చేయడంలో తోడ్పడనుంది.  తద్వారా క్రమేణా ఆహార భద్రత దిశగా ఇరు పక్షాలు వాటి సామర్థ్య నిర్మాణ యత్నాలను పటిష్టపడగలవు.  ఇది రెండు దేశాలలోను ఆహార భద్రత రంగంలో ఉత్తమమైన అభ్యసాల పట్ల , ఆహార భద్రత కు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్ల అవగాహనను మరింత ప్రోత్సహించగలదు.

ఈ ఎమ్ఒయు ఉత్తమ పద్ధతులను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా మరియు ముఖ్య ఆహార సరకుల వాణిజ్యానికి మార్గాన్ని సుగమం చేయడం ద్వారా ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచేందుకు సహాయకారిగా ఉండగలదు.


***

 

 



(Release ID: 1533207) Visitor Counter : 100