మంత్రిమండలి

ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో ఒక కొత్త ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 16 MAY 2018 3:39PM by PIB Hyderabad

ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో కొత్త‌గా అఖిల భార‌త వైద్య శాస్త్ర సంస్థ (ఎఐఐఎమ్ఎస్) ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర‌ మంత్రి వ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ ప్రోజెక్టు కోసం 1103 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు.  ప్ర‌ధాన మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పిఎమ్ఎస్ఎస్‌వై) లో భాగంగా ఈ ఎఐఐఎమ్ఎస్ ను నెల‌కొల్పనున్నారు.

వివ‌రాలు:

దేవ్ ఘర్ లోని ఎఐఐఎమ్ఎస్ లో ..
750 ప‌డ‌క‌ల‌ తో కూడిన ఒక ఆసుప‌త్రి, ట్రామా సెంట‌ర్ స‌దుపాయాలు, 
ప్రతి ఏటా 100 మంది ఎమ్‌బిబిఎస్ విద్యార్థుల‌ను చేర్చుకొనే వైద్య క‌ళాశాల‌.
ప్రతి ఏటా 60 మంది బి.ఎస్‌సి. (న‌ర్సింగ్‌) విద్యార్థుల‌ను చేర్చుకొనే న‌ర్సింగ్ క‌ళాశాల, న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ఎస్ తరహాలో ఉండేటటువంటి నివాస భ‌వ‌న స‌ముదాయాలు మ‌రియు సంబంధిత స‌దుపాయాలు/సేవ‌లు,
15 ఆప‌రేష‌న్ థియేట‌ర్ ల‌తో స‌హా, 20 స్పెషాలిటీ/సూప‌ర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్ లతో పాటు 
సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తి లో చికిత్స సౌక‌ర్యాల‌ను అందించేందుకు 30 ప‌డ‌క‌ల తో కూడిన ఒక ఆయుష్ డిపార్ట్‌మెంట్ .. ఏర్పాటు అవుతాయి.

పిఎమ్ఎస్ఎస్‌వై లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో గల మంగళగిరి లో నూతనంగా ఎఐఐఎమ్ఎస్ స్థాపన సంబంధిత పనులు పురోగతిలో ఉన్నాయి.


***



(Release ID: 1532407) Visitor Counter : 71