మంత్రిమండలి
భారతదేశ రాజ్యాంగం అయిదో షెడ్యూల్ లో భాగంగా రాజస్థాన్ యొక్క్ షెడ్యూల్డ్ ఏరియాల ప్రకటన కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
25 APR 2018 1:11PM by PIB Hyderabad
1981వ సంవత్సరం ఫిబ్రవరి నాటి కాన్‌స్టిట్యూషన్ ఆర్డర్ (సి.ఒ.) 114 ని రద్దుచేయడంతో పాటు కొత్త సి.ఒ. ను జారీ చేయడం ద్వారా భారతదేశ రాజ్యాంగ అయిదో షెడ్యూల్ లో భాగంగా రాజస్థాన్ కు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ఏరియా ల ప్రకటనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నూతన సి.ఒ. యొక్క జారీ తో రాజస్థాన్ లోని షెడ్యూల్డ్ తెగల వారు భారతదేశ రాజ్యాంగ అయిదో షెడ్యూల్ ప్రకారం లభ్యమయ్యేటటువంటి రక్షణాత్మక చర్యల తాలూకు ప్రయోజనాలను పొందడం తథ్యం అవుతుంది.
భారతదేశ రాజ్యాంగం అయిదో షెడ్యూల్ పరిధి లో రాజస్థాన్ రాష్ట్రం లోని షెడ్యూల్డ్ ఏరియా లను విస్తరించవలసిందిగా రాజస్థాన్ ప్రభుత్వం అభ్యర్ధించింది.
లబ్దిదారులు:
రాజస్థాన్ లోని బాంస్ వాడా, డుంగర్ పుర్, ప్రతాప్ గఢ్, మరియు ఉదయ్ పుర్ లోని కొన్ని క్షేత్రాలు, రాజ్‌సమంద్, చిత్తౌడ్ గఢ్, పాలీ, ఇంకా సిరోహీ జిల్లాలలో ఉంటున్న షెడ్యూల్డ్ తెగల వారు భారతదేశ రాజ్యాంగం అయిదో షెడ్యూల్ పరిధిలో లభ్యమయ్యే రక్షణాత్మక చర్యల తాలూకు ప్రయోజనాలను పొందుతారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ ప్రాంతాలలో బాంస్ వాడా, డుంగర్ పుర్, ప్రతాప్ గఢ్ జిల్లాలను పూర్తి గాను, 9 తహసీళ్ళు పూర్తి గాను, 1 సంపూర్ణ బ్లాకు, మరియు ఉదయ్ పుర్, రాజ్ సమంద్, చిత్తౌడ్ గఢ్, పాలీ ఇంకా సిరోహి జిల్లాల లోని 727 గ్రామాలను చుట్టివచ్చే 46 గ్రామ పంచాయతీలను చేర్చడం జరుగుతుంది.
షెడ్యూలు కులాలు గా ప్రకటించడానికి ఎటువంటి అదనపు నిధులను వెచ్చించవలసిన అవసరం ఉండదు. ఇది సత్వర అభివృద్ధి కోసం షెడ్యూల్డు ఏరియాల పై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రస్తుత పథకాల పరిధిలోకి వచ్చే ట్రైబల్ సబ్- ప్లాన్ (నూతనమైన నామధేయం ట్రైబల్ సబ్- స్కీమ్)లో భాగం అవుతుంది.
పూర్వరంగం:
భారతదేశ రాజ్యాంగం (244 (1) అధికరణం) తాలూకు అయిదో షెడ్యూల్ 6(1) పేరాగ్రాఫ్ ప్రకారం ‘షెడ్యూల్డు ఏరియాలు’ అనే పదాలకు ‘రాష్ట్రపతి తన ఆదేశం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే వీలు ఉన్న ప్రాంతాలు’ అని అర్థం వస్తుంది. రాజ్యాంగ అయిదో షెడ్యూల్ లోని పేరాగ్రాఫ్ 6(2) ప్రొవిజన్ ల ప్రకారం రాష్ట్రపతి ఏ సమయంలోనైనా రాష్ట్ర గవర్నర్ సలహా తీసుకొని ఏదైనా రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియా లో వృద్ధి తాలూకు ఆదేశాన్ని ఇవ్వవచ్చును; ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల విషయంలో ఈ పేరాగ్రాఫ్ ప్రకారం జారీ చేసే ఆదేశం లేదా ఆదేశాలను ఆ రాష్ట్ర గవర్నరు ను సంప్రదించి రద్దు చేయవచ్చును మరియు షెడ్యూల్డ్ ఏరియాలను పునర్ నిర్వచించడం కోసం తాజాగా ఆదేశాలను జారీ చేయవచ్చును.
షెడ్యూల్డు ఏరియాలను మొట్టమొదటి సారిగా 1950వ సంవత్సరంలో నోటిఫై చేయడం జరిగింది. తరువాత, 1981 లో రాజస్థాన్ రాష్ట్రం కోసం షెడ్యూల్డ్ ఏరియా లను నిర్దేశిస్తూ రాజ్యాంగ ఆదేశాలను జారీ చేయడమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు/పునర్ వ్యవస్థీకరణ మరియు 2011 జనగణన ప్రకారం షెడ్యూల్డ్ తెగల జనాభా లో చోటు చేసుకొన్న మార్పుల కారణంగా రాజస్థాన్ రాష్ట్రం లో షెడ్యూల్డ్ ఏరియా ల విస్తరణకై రాజస్థాన్ ప్రభుత్వం అభ్యర్ధించింది.
***
(Release ID: 1530272)
Visitor Counter : 391