మంత్రిమండలి

అక్ర‌మ వ‌ల‌స‌దారులను తిప్పి పంప‌డానికి సంబంధించి భార‌త‌దేశానికి మ‌రియు యునైటెడ్ కింగ్‌డ‌మ్ కు మ‌రియు నార్దన్ ఐర్లాండ్ కు మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 11 APR 2018 2:04PM by PIB Hyderabad

అక్ర‌మ వ‌ల‌స‌దారులను తిప్పి పంప‌డానికి సంబంధించి భార‌త‌దేశం మ‌రియు యునైటెడ్ కింగ్‌డ‌మ్ మరియు నార్దన్ ఐర్లాండ్ కు మ‌ధ్య కుదిరినటువంటి ఎమ్ఒయు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.
 
ప్ర‌యోజ‌నాలు:

ఎమ్ఒయు తుదిరూపాన్ని సంతరించుకొన్న తరువాత, దౌత్య‌ప‌ర‌మైన పాస్ పోర్టుల‌ను క‌లిగి ఉన్న వారికి వీజా ఫ్రీ అగ్రిమెంట్ మ‌రియు చ‌ట్ట‌బ‌ద్ధంగా యుకె కు ప్ర‌యాణిస్తున్న వారికి  యుకె వీజా రెజీమ్ స‌ర‌ళీక‌ర‌ణ‌కు మార్గాన్ని సుగ‌మం చేయగలదు.
 
ఇది జాతీయ‌త ప‌ర‌మైన రుజువును స‌రి చూసిన అనంత‌రం అవ‌త‌లి ప‌క్షం యొక్క భూభాగంలో మ‌కాం పెట్టేందుకు ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైన ప్రాతిప‌దిక లేని వారిని వెనుక‌కు పంపివేసేందుకు రంగాన్ని సిద్ధం చేస్తుంది.
 
దీని వల్ల ఒక నిర్దిష్ట కాలావ‌ధి లో అవ‌త‌లి ప‌క్షానికి చెందిన భూభాగంలో చట్టవిరుద్ధంగా బ‌స చేస్తూ ప‌ట్టుబ‌డినటువంటి దేశస్తుల‌ను వెనుక‌కు పంపివేసే ప్ర‌క్రియ‌ను సరళతరం చేయ‌డం సాధ్యమవుతుంది.


***



(Release ID: 1528692) Visitor Counter : 86