ప్రధాన మంత్రి కార్యాలయం

నాలుగు రాష్ట్రాల‌లో ఒడిఎఫ్ ల‌క్ష్యాల సాధ‌న దిశ‌గా చోటు చేసుకొంటున్న పురోగ‌తిని స‌మీక్షించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 13 MAR 2018 7:02PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, ఇంకా జమ్ము & క‌శ్మీర్.. ఈ నాలుగు రాష్ట్రాల క‌లెక్ట‌ర్ లతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు స‌మావేశాన్ని నిర్వహించారు.  ఈ నాలుగు రాష్ట్రాల‌లో ప్రతి ఒక్క రాష్ట్రంలో బ‌హిరంగ ప్ర‌దేశాల‌ను మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జ‌న‌కు వీలు లేనివి (ఒడిఎఫ్‌)గా మార్చ‌డంలో చోటు చేసుకొంటున్న పురోగ‌తిపై ఆయ‌న స‌మీక్ష జరిపారు.

స్వ‌చ్ఛ్ భార‌త్ మ‌రియు పారిశుధ్య ల‌క్ష్య సాధ‌న‌ లో ఇంత‌వ‌ర‌కు చేసిన కృషి తాలూకు అనుభ‌వాల‌ను, అభిప్రాయాల‌ను పంచుకోవాలంటూ రాష్ట్రాలను ప్ర‌ధాన మంత్రి ప్రోత్సహించారు.  ఈ ప‌నిని పూర్తి చేయ‌డం లో మ‌హాత్మ గాంధీ యొక్క 150వ వార్షికోత్సవాని క‌న్నా గొప్ప ప్రేర‌ణ‌ను మరేదీ అందించ జాల‌ద‌ని ఆయ‌న నొక్కిచెప్పారు.  ఈ అంశంలో పురోగ‌తి ని ప‌ర్య‌వేక్షించడానికిగాను జిల్లా స్థాయిలో బృందాల‌ను ఏర్పాటు చేయవలసిందిగా ఆయ‌న సూచించారు.  

ఈ ఉద్య‌మాన్ని ఒక సామూహిక ఉద్యమంగా మార్చేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు.  ఈ విష‌యంలో మ‌హా చైత‌న్యాన్ని ర‌గిలించడంలో విద్యార్థులు, బడిపిల్లలు ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించ‌గ‌లుగుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు.



(Release ID: 1524244) Visitor Counter : 116