మంత్రిమండలి

పునర్వినియోగ విద్యుత్తు సహకారంపై భారత్, హెల్లెనిక్ దేశాల మధ్య అవగాహనా ఒప్పందాన్ని మంత్రి మండలి ఆమోదించింది.

Posted On: 07 MAR 2018 7:23PM by PIB Hyderabad

పునర్వినియోగ విద్యుత్తు రంగంలో సహకారం పై  భారత్, హెల్లెనిక్  దేశాల మధ్య అవగాహనా ఒప్పందం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలికి తెలియజేయడం జరిగింది.   2017 నవంబరు నెలలో న్యూ ఢిల్లీ పర్యటనలో ఉన్న హెల్లెనిక్ రిపబ్లిక్ దేశానికి చెందిన విదేశీ వ్యవహారాల మంత్రి గౌరవనీయులైన నికోస్ కోటీజీయాస్ మరియు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. 

సమానత్వం, అన్యోన్యత ల పరస్పర ప్రయోజనం ఆధారంగా నూతన, పునరుత్పాదక సమస్యలపై  ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడానికి, సహకార సంస్థాగత సంబంధాలను పెంపొందించడానికి వీలుగా ఒక ఆధారాన్ని నెలకొల్పడానికీ ఇరుపక్షాలూ నిర్ణయించుకున్నాయి. 


సహకార రంగానికి సంబంధించిన విషయాలను సమీక్షించి, పర్యవేక్షించి, చర్చించేందుకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని నెలకొల్పడానికి ఈ అవగాహనా ఒప్పందం వీలుకలిగిస్తుంది.   నైపుణ్యాలనూ, నెట్ వర్క్ సమాచారాన్నీ ఇచ్చి పుచ్చుకునేందుకు ఈ అవగాహనా ఒప్పందాన్ని ఉద్దేశించారు. 

****
 



(Release ID: 1523222) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Assamese , Tamil