మంత్రిమండలి
ఒడిశా రాష్ట్ర అభ్యర్థన మేరకు అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం, 1956 లో భాగంగా మహానది జల వివాదాల పై ప్రత్యేక న్యాయ స్థానం నియామక ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
20 FEB 2018 1:20PM by PIB Hyderabad
మహానది జలాల తాలూకు వివాదంలో న్యాయ నిర్ణయం చేసేందుకు ఒక ప్రతిపాదన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మహానది సంపూర్ణ జల గ్రహణ క్షేత్రంలో మొత్తం మీద జలాల లభ్యత, ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క వాటా, ప్రతి రాష్ట్రంలోని ప్రస్తుత జల వనరుల వినియోగం తీరు, ఇంకా భావి అభివృద్ధికి సంబంధించిన సంభావ్యతల ప్రాతిపదికన జల గ్రహణ క్షేత్రం విస్తరించిన రాష్ట్రాలు జలాలను వాటి మధ్య పంచుకొనే భాగాలను ఈ ప్రత్యేక న్యాయ స్థానం నిర్ణయిస్తుంది.
ఈ ప్రత్యేక న్యాయస్థానంలో ఒక చైర్మన్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరిని అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్‌డబ్ల్యుడి) చట్టం, 1956 లోని ఏర్పాట్లకు అనుగుణంగా సర్వోన్నత న్యాయ స్థానానికి, లేదా ఉన్న న్యాయ స్థానానికి సంబంధించిన న్యాయమూర్తుల శ్రేణిలో నుండి భారత ప్రధాన న్యాయమూర్తి నామనిర్దేశం చేస్తారు. అంతే కాకుండా ఈ ప్రత్యేక న్యాయస్థానం ప్రొసీడింగ్స్ లో సలహాలను అందించడం కోసం సున్నిత జల సంబంధ సమస్యలను పరిష్కరించడంలో అనుభజ్ఞులు మరియు జల వనరుల అంశాలలో నిపుణులైన ఇద్దరు మదింపుదారులను నియమించడం జరుగుతుంది.
ఐఎస్ఆర్‌డబ్ల్యుడి చట్టం, 1956 లోని ఏర్పాట్లకు అనుగుణంగా ఈ ప్రత్యేక న్యాయస్థానం తన నివేదికను మరియు నిర్ణయాన్ని 3 సంవత్సరాల అవధి లోపల సమర్పించవలసి ఉంటుంది. ఈ అవధిని- అనివార్య కారణాలు ఎదురైతే- మరో రెండు సంవత్సరాలకు మించకుండా పొడిగించేందుకు వీలు ఉంటుంది.
ఈ ప్రత్యేక న్యాయ స్థానం వివాదం విషయంలో చేసే ఫైసలా మహానది జలాలకు సంబంధించి చత్తీస్‌గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా మిగిలిన వివాదంపై అంతిమ తీర్పునకు దారి తీస్తుందని ఆశిస్తున్నారు.
***
(Release ID: 1521149)
Visitor Counter : 206