మంత్రిమండలి
హరియాణా లోని గురుగ్రామ్ లో ఇండియన్ డిఫెన్స్ యూనివర్సిటీ భూమి సమీపంలో బస్ బే స్థాపనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
20 FEB 2018 1:18PM by PIB Hyderabad
హరియాణా లోని గురుగ్రామ్ లో ఇండియన్ డిఫెన్స్ యూనివర్సిటీ భూమి సమీపంలో బస్ బే ను ఏర్పాటు చేసేందుకు ఎన్‌హెచ్ఎఐ తో పాక్షికంగా ఆవరించిన ఉన్న 03 మర్ల భూమి ని డి-నోటిఫై చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ భూమిని డి-నోటిఫై చేసినందుకు గాను హరియాణా ప్రభుత్వం నుండి 1,82,719 రూపాయలను రక్షణ మంత్రిత్వ శాఖకు వాపసు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ సొమ్మును 2011 లో భూ సేకరణ జరిగిన సమయంలో హరియాణా ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది.
పూర్వరంగం:
ఇండియన్ డిఫెన్స్ యూనివర్సిటీ ని హరియాణా లోని గురుగ్రామ్ జిల్లా లో బినోల మరియు బిలాస్ పుర్ లో నెలకొల్పుతున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఢిల్లీ- జైపుర్ హైవే మార్గంలో జైపుర్ దిశగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్ క్వార్టర్స్ నుండి రమారమి 11 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు కానుంది.
ఈ విశ్వవిద్యాలయం జాతీయ భద్రత అధ్యయనాలకు సంబంధించి ఉన్నత విద్యను రూపొందించడంతో పాటు, దానిని వ్యాప్తి లోకి కూడా తీసుకురానుంది. దీనితో పాటు డిఫెన్స్ మేనేజ్‌మెంట్ మరియు డిఫెన్స్ టెక్నాలజీ, ఇంకా జాతీయ భద్రతకు సంబంధించి ఇటు అంతర్గతంగా, అటు బాహ్యమైన అంశాలు అన్నింటి మీదా విధాన ప్రధానమైన పరిశోధనలను ప్రోత్సహిస్తుంది కూడాను. త్రి విధ దళాలతో నే కాకుండా అర్థ సైనిక బలగాలు, గుఢచార సేవల విభాగాలు, రాయబారులు, విద్యావేత్తలు, వ్యూహ ప్రణాళిక కర్తలు, విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇంకా మిత్ర పూర్వక విదేశాల అధికారుల వంటి ఇతర ఏజెన్సీలతో కూడా సమన్వయాన్ని ఈ యూనివర్సిటీ పెంపొందిస్తుంది.
ఎన్ హెచ్ఎఐ తో మొత్తం 03 మర్ల భూమి పాక్షికంగా ఆవరించి వుంది. ఈ భూమి రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒడి) మరియు ఎన్ హెచ్ఎఐ.. ఈ రెంటి యాజమాన్యంలో ఉంది. దేశ విశాల హితం కోసం, ఢిల్లీ- జైపుర్ హైవే మార్గంలో వాహన రాకపోకల భారీ రద్దీని సడలించడం కోసం ఎన్ హెచ్- 8 వెంబడి బస్ బే ను నిర్మించాలని ఇండియన్ డిఫెన్స్ యూనివర్సిటీ ప్రతిపాదించింది. 03 మర్ల భూమి ని బస్ బే నిర్మాణం కోసమని ఎన్ హెచ్ఎఐ సేకరించింది. ఇది గురుగ్రామ్- ఢిల్లీ
అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచగలుగుతుంది. ఇండియన్ డిఫెన్స్ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది తో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇంకా స్థానిక నివాసులు కలుపుకొంటే మొత్తం 12000-15000 మంది దాకా ఉంటారు.
***
(Release ID: 1521141)