ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు తిరిగి ఎన్నికైన జస్టిస్ దళ్ వీర్ భండారీ కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 NOV 2017 10:32AM by PIB Hyderabad

ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు తిరిగి ఎన్నికైన జస్టిస్ దళ్ వీర్ భండారీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసిజె)కు జస్టిస్ దళ్ వీర్ భండారీ తిరిగి ఎన్నిక కావడం పట్ల ఆయనకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.  ఆయన తిరిగి ఎన్నిక కావడం మనకు ఒక గర్వకారణమైనటువంటి ఘడియ.

ఐసిజె కు భారతదేశం మరో మారు ఎన్నిక అయ్యేటట్లుగా అలసట ఎరుగకుండా పరిశ్రమించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోని ఆమె యావత్తు బృందంతో పాటు రాయబార కార్యాలయాల వారికి ఇవే నా అభినందనలు.  భారతదేశం పట్ల నమ్మకాన్ని ఉంచినందుకు, భారతదేశానికి మద్దతు ఇచ్చినందుకుగాను యుఎన్ఎస్ సి కి, ఇంకా యుఎన్ జిఎ సభ్యులందరికి మేము ప్రగాఢ కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేస్తున్నాము’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
 

***


(रिलीज़ आईडी: 1510352) आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Tamil , Kannada