ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ ప్రియ రంజ‌న్ దాస్‌మున్శీ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 NOV 2017 2:33PM by PIB Hyderabad

కేంద్ర మాజీ మంత్రి శ్రీ ప్రియ రంజ‌న్ దాస్‌మున్శీ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘శ్రీ ప్రియ రంజ‌న్ దాస్‌మున్శీ రాజ‌కీయ ప‌రంగా, పాల‌న ప‌రంగా విశేషమైన అనుభ‌వం క‌లిగిన‌టువంటి ఒక లోక ప్రియ నాయ‌కుడు.  భార‌త‌దేశం లో ఫుట్ బాల్ కు ప్ర‌జాద‌ర‌ణ ల‌భించడం కోసం ఆయ‌న ఎన్నదగినటువంటి కృషి చేశారు.  ఆయ‌న క‌న్నుమూత నన్ను వేదనకు గురి చేసింది.  దీపా దాస్‌మున్శీ గారికి మ‌రియు కుటుంబ స‌భ్యులకు, ఇంకా ఆయ‌న మ‌ద్ద‌తుదారుల‌కు క‌లిగిన దు:ఖంలో నేను సైతం పాలు పంచుకొంటున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1510210) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Tamil , Kannada