Infrastructure
భవ్య: పెట్టుబడులకు అనుకూలమైన తయారీ రంగానికి మౌలిక వసతుల నిర్మాణం
Posted On:
14 OCT 2026 12:33PM
భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) అనేది దేశవ్యాప్తంగా 100 ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి చేపట్టిన ₹33,660 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక పథకం. ఈ పార్కులు ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నమ్మకమైన సేవలు, వేగవంతమైన అనుమతులను అందిస్తాయి. కొత్త పరిశ్రమల స్థాపనకు పట్టే సమయాన్ని తగ్గిస్తాయి. పెట్టుబడులను ఆకర్షించడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, ఉద్యోగాలను సృష్టించడం, ప్రాంతీయంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
తయారీ రంగ విధానంలో కొత్త అధ్యాయం
భారతదేశ తయారీ రంగం నిర్మాణపరమైన మార్పులకు లోనవుతోంది. ప్రస్తుతం ఇది జీడీపీలో 16-17 శాతం వాటాను కలిగి ఉంది. 2.7 కోట్లకు పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. 2035 నాటికి ఈ వాటాను 25 శాతానికి పెంచాలని జాతీయ తయారీ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమల స్వరూపంలో కూడా మార్పులు వస్తున్నాయి. తయారీ రంగం విలువ జోడింపులో మధ్యస్థ, ఉన్నత సాంకేతిక పరిశ్రమల వాటా 46.3 శాతంగా ఉంది. ఎక్కువ విలువైన, సాంకేతికతతో కూడిన తయారీ విధానం వైపు సాగుతున్న మార్పును ఇది స్పష్టం చేస్తోంది.
పరిశ్రమలు విస్తరిస్తున్న కొద్దీ వాటికి నమ్మకమైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన రవాణా రంగానికి సంబంధించిన మద్దతు, వేగంగా లభించే అనుమతులు అవసరమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు కూడా విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నాయి. చక్కని రవాణా అనుసంధానం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించక ముందే అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులు, ఉమ్మడి సదుపాయాలను అందించడం ద్వారా ప్లగ్-అండ్-ప్లే పార్కులు ఈ అవసరాలను తీరుస్తున్నాయి. కొత్త తయారీ యూనిట్లను స్థాపించడానికి అయ్యే సమయాన్ని, ఖర్చును ఇవి తగ్గిస్తాయి. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన (భవ్య)కు మార్చి 2026లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ₹33,660 కోట్ల నిధులతో 2026 ఏప్రిల్ 10న నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రాలు, ప్రైవేట్ డెవలపర్లతో కలిసి భవష్య పథకాన్ని అమలు చేస్తున్నారు. సరళీకృత అనుమతులు, సమర్థవంతమైన సింగిల్-విండో విధానం, పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్కరణల ద్వారా దేశంలో తయారీ సామర్థ్యాన్ని, సులభతర వ్యాపార నిర్వహణను( పెంచడంపై ఈ పథకం దృష్టి పెడుతుంది. ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక వాతావరణం ప్రాథమిక అడ్డంకులను తొలగించి, పరిశ్రమలు పెట్టుబడుల దశ నుంచి త్వరగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సహాయపడుతుంది.
విధానాల పరిణామక్రమం: 2020కి పూర్వం నుంచి ప్లగ్-అండ్-ప్లే పద్ధతి వరకు
పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి భారతదేశ అనుసరిస్తున్న విధానాలు కాలక్రమేణా మారాయి. ప్రతి దశ పరిశ్రమలకు మద్దతు ఇచ్చే, కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించే దేశ సామర్థ్యాన్ని పెంచింది.
మొదటి దశ పారిశ్రామిక ఎస్టేట్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)పై దృష్టి పెట్టింది. ఇవి పారిశ్రామిక భూమి, ఉమ్మడి మౌలిక సదుపాయాలు, నిబంధనలకు సంబంధించిన రాయితీలను అందించాయి. ఫిబ్రవరి 2026 నాటికి భారతదేశంలో 370 నోటిఫై చేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఉన్నాయి. ఈ మండళ్లు ₹7.82 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 31.7 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించాయి.
ఆ తర్వాత ఈ విధానం వ్యక్తిగత పారిశ్రామిక ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉండే పెద్ద తయారీ కేంద్రాలకు విస్తరించింది. 14 అక్టోబర్ 2026 నాటికి ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్‌బీ) పోర్టల్‌లో 4,164 పారిశ్రామిక పార్కులను నమోదు చేశారు. అదే సమయంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీపీ) పారిశ్రామిక భూములను కేటాయించడానికే పరిమితం కాలేదు. పారిశ్రామిక ప్రాంతాలను విద్యుత్, నీరు వంటి సదుపాయాలు, రవాణా రంగం, నగర సేవలతో అనుసంధానించి సమగ్ర పారిశ్రామిక కేంద్రాలను రూపొందించింది.
ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (గుజరాత్), షేంద్రా-బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియా (మహారాష్ట్ర), విక్రమ్ ఉద్యోగ్ పురి (మధ్యప్రదేశ్), ఇంటెగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్) వంటి పారిశ్రామిక కేంద్రాలు ఈ సమగ్ర ప్రణాళికలోని ప్రయోజనాలను నిరూపించాయి.
|
కాలం
|
విధాన విధానం
|
సమకూరిన సదుపాయాలు
|
|
2020 కంటే ముందు
|
పారిశ్రామిక ఎస్టేట్లు, సెజ్‌లు (SEZs)
|
ఆర్థిక ప్రోత్సాహకాలు; ఎగుమతులకు ప్రాధాన్యం ఇచ్చే నిబంధనలు
|
|
ఎన్ఐసిడిపి (NICDP)
|
సమగ్ర మౌలిక వసతులతో కూడిన స్మార్ట్ పారిశ్రామిక నగరాలు
|
ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక కేంద్రాలు, బహుళ రవాణా అనుసంధానం, పైలట్ ప్రాజెక్టులుగా ప్లగ్-అండ్-ప్లే
|
|
బడ్జెట్ 2026-27
|
రంగానికి ప్రత్యేకం అయిన ప్లగ్-అండ్-ప్లే పార్కులు (కెమికల్ పార్కులు, పిఎమ్ మిత్ర)
|
నిర్ణీత రంగాల్లో క్లస్టర్ ఆధారిత నమూనా
|
|
భవష్య (BHAVYA - 2026)
|
దేశవ్యాప్తంగా అమలు: 100 ప్లగ్-అండ్-ప్లే పార్కుల ఏర్పాటు ప్రతిపాదన
|
జాతీయ స్థాయిలో విస్తృత పరిధి, వేగవంతమైన సంస్కరణలతో కూడిన ప్రణాళిక
|
భవ్య అమలు చట్రం
పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఎకరాకు ₹1 కోటి వరకు భవష్య పథకం ద్వారా ఆర్థిక సాయం లభిస్తుంది. అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా, మంచి నీటి వ్యవస్థ, మురుగునీటి పారుదల, ఉమ్మడి వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, విలువైన మౌలిక సదుపాయాలు, సమాచార ప్రసార సాంకేతికతతో(ఐసీటీ) కూడిన పరిపాలన వంటి అవసరమైన అంశాలను ఈ పథకం కవర్ చేస్తుంది. భూగర్భంలో మౌలిక వసతుల కారిడార్లను నిర్మిస్తారు. దీనివల్ల తవ్వకాల అవసరం లేకుండానే పనులను సులభంగా నిర్వహించవచ్చు. పారిశ్రామిక కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగదు.
ఈ పార్కుల్లో తక్షణమే ఉపయోగించుకునేలా ఫ్యాక్టరీ షెడ్లు, అవసరాలకు తగినట్లుగా నిర్మించే యూనిట్లు, నాణ్యతా పరిశీలన, ధృవీకరణ కేంద్రాలు, గోదాముల సదుపాయాలు ఉంటాయి. కార్మికుల సంక్షేమం, పని సామర్థ్యాన్ని పెంచడానికి కార్మికుల వసతి గృహాలు, వైద్య సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఇతర సామాజిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. రహదారి, రైలు, చివరి మైలు వరకు సరుకు రవాణా అనుసంధానం వంటి బాహ్య మౌలిక సదుపాయాల కోసం ఆమోదించిన నిధులలో 25 శాతం వరకు కేటాయించడానికి ఈ పథకం మద్దతు ఇస్తుంది. ఇది విస్తృతమైన రవాణా వ్యవస్థతో సులభమైన అనుసంధానాన్ని నిర్ధారిస్తుంది.
ఈ పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2031-32 వరకు ఆరేళ్ల పాటు అమలు చేస్తారు. మొదటి దశలో రెండు ఎంపిక రౌండ్ల ద్వారా ఛాలెంజ్ మోడ్ పద్ధతిలో 50 పారిశ్రామిక పార్కులను ఎంపిక చేస్తారు. మిగిలిన పార్కులను తదుపరి దశల్లో ఎంపిక చేస్తారు. దీనితో భవష్య పథకం కింద మద్దతు పొందే మొత్తం పార్కుల సంఖ్య 100కి చేరుతుంది. ప్రాజెక్టు సిద్ధంగా ఉండటం, భూమి లభ్యత, పారిశ్రామిక అవకాశాల ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత భూ పరిమాణ నిబంధనలకు లోబడి ప్రతి పార్కు 25 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రత్యేక ప్రయోజన సాధన సంస్థల (ఎస్పీవీ) ద్వారా ప్రాజెక్టులను అమలు చేసి నిర్వహిస్తారు. ఇవి అభివృద్ధి, నిర్వహణ, పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం, సుదీర్ఘ కాలం పాటు పర్యవేక్షించడం వంటి బాధ్యతలను చూసుకుంటాయి.

తయారీ సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు భవష్య ద్వారా ఉమ్మడి సదుపాయాలను, సరళీకృత ఆమోదాలను పొందవచ్చు.
పథకం అమలు, పర్యవేక్షణ కోసం 2026 జూన్‌లో 'భవ్య పోర్టల్' ప్రారంభమైంది. పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తూ ప్రాజెక్ట్ దాఖలు, అంచనా, మూల్యాంకనానికి ఈ పోర్టల్ సహకరిస్తుంది.
ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు: భావన - ముఖ్యాంశాలు
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధానంగా స్థానిక ప్రభుత్వాలు అందించే ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానం. ఇది నిర్ణీత ప్రాంతాల్లోని పరిశ్రమల ఉమ్మడి అవసరాలను తీరుస్తుంది. ఇందులో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రహదారులు, వీధిదీపాలు, విద్యుత్ వంటి ప్రధాన వ్యవస్థల నిర్మాణం ఉంటుంది.
ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు అనేవి ముందే అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ భూమి, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, ఉమ్మడి వసతులు ముందే అందుబాటులో ఉంటాయి. అనేక సందర్భాల్లో సింగిల్-విండో విధానాల ద్వారా ఆమోదాలు, ప్రాథమిక అనుమతులు వేగంగా లభిస్తాయి. ఇది ప్రారంభ వ్యయాన్ని, జాప్యాన్ని తగ్గించి పరిశ్రమలు తమ ఆర్థిక నిర్ణయాల నుంచి వేగంగా ఉత్పత్తి దిశగా సాగడానికి అనుమతిస్తుంది.
సరఫరా గొలుసులు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్న తరుణంలో, కాలపరిమితితో కూడిన తయారీ విధానం పెరుగుతున్న నేపథ్యానికి ఇటువంటి నమూనాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. భూమి లభ్యత, రవాణా అనుసంధానం, సదుపాయాలు, నిబంధనలకు సంబంధించిన ప్రక్రియలు స్పష్టంగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడానికి పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఈ ప్లగ్-అండ్-ప్లే నమూనా భారతదేశంలో ఇప్పటికే బాగా ఆదరణ పొందుతోంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం ₹2,500 కోట్లు కేటాయించారు. భారతదేశంలో ప్రస్తుతం 260 ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. విభిన్న రంగాలు, రాష్ట్రాల్లో మౌలిక వసతులు సిద్ధంగా ఉన్న తయారీ ప్రాంతాలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది.
ఈ ప్లగ్-అండ్-ప్లే నమూనాను నిర్దిష్ట రంగాలకు చెందిన పారిశ్రామిక వసతులకు కూడా విస్తరిస్తున్నారు. జూలై 2026లో ప్రభుత్వం మూడు కెమికల్ పార్కుల కోసం భవ్య-రసాయన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పార్కులు రసాయన తయారీకి అవసరమైన ఉమ్మడి వసతులను, పర్యావరణ పరిరక్షణ చర్యలను అందిస్తాయి.

ధోలేరా ఎస్ఐఆర్: ఒక సమగ్ర పారిశ్రామిక నగరం
గుజరాత్‌లోని ధోలేరా కొత్త తరం పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంటోంది. విస్తారమైన రహదారులు, నమ్మకమైన సదుపాయాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు, ఆధునిక నగర సేవలను ప్రారంభం నుంచే ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేశారు. విద్యుత్, నీరు, గ్యాస్, మురుగునీటి వ్యవస్థలు ఉమ్మడి భూగర్భ నెట్వర్క్ ద్వారా సాగుతాయి. ఇది పరిశ్రమలకు అనుకూలమైన ప్లగ్-అండ్-ప్లే వాతావరణాన్ని సృష్టిస్తుంది.
అధునాతన తయారీ రంగాలకు ఈ ప్రాంతం ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, రక్షణ రంగం, సోలార్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ, హెవీ ఇంజనీరింగ్ వంటి కీలక రంగాలపై ప్రాథమికంగా దృష్టి సారించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లతో ఉన్న బలమైన రవాణా అనుసంధానం ధోలేరాను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తుంది. ఫలితాలు:
* 11 ప్లాట్లలో 495 ఎకరాల భూమి కేటాయింపు
* పెట్టుబడి లభించే అవకాశం: ₹97,328 కోట్లు
* ఉపాధి లభించే అవకాశం: 6,000 పైగా ఉద్యోగాలు
టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంట్, రెన్యూ పవర్ సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ సహా ప్రధాన ప్రాజెక్టులకు భూమిని కేటాయించారు.
నూతన తయారీ వాతావరణం వైపు ప్రయాణం
సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ తయారీ రంగం రూపాంతరం చెందుతోంది. సాధారణ పారిశ్రామిక ఎస్టేట్ల నుంచి ప్రణాళికాబద్ధమైన తయారీ కేంద్రాల వైపు వచ్చిన ఈ మార్పు అభివృద్ధి చెందిన విధానాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పరిణామక్రమంలో భవష్య తదుపరి అడుగును సూచిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇతర కార్యక్రమాలతో పాటు, తన తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ తయారీ రంగంలో తన పాత్రను పెంచుకోవడానికి భారతదేశం చేస్తున్న విస్తృతమైన ప్రయత్నాలలో ఇది ఒక భాగం.
References
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241785®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288863®=48&lang=1
Ministry of Commerce & Industry
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241814®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2114840®=3&lang=2
https://www.dpiit.gov.in/static/uploads/2025/07/a7f8726a772d283c2c10a7d02ab5b190.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2270334®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2264533®=3&lang=1
Ministry of Finance
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2219990®=3&lang=1
Ministry of Housing and Urban Affairs
https://pmay-urban.gov.in/uploads/guidelines/Operational-Guidelines-of-PMAY-U-2.pdf
Ministry of Textiles
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241103®=3&lang=2
NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2025-04/India_Hand_Power_Tools_Sector_Report.pdf
https://niti.gov.in/sites/default/files/2025-10/Reimagining_Manufacturing_Indias_Roadmap_to_Global_Leadership_in_Advanced_Manufacturing.pdf
United Nations Industrial Development Organization
https://www.unido.org/sites/default/files/files/2019-11/International_Guidelines_for_Industrial_Parks.pdf
NICDC
https://nicdc.in/projects/4-projects-developed/dholera-special-investment-region-gujarat
https://dholera.gujarat.gov.in/advantage_dholera
https://dholera.gujarat.gov.in/business
IBEF
https://dev.ibef.org/industry/manufacturing-sector-india
Click here to see pdf
***
(Explainer ID: 160508)
आगंतुक पटल : 4
Provide suggestions / comments