Economy
పీఎం-సేతు: భారత ఐటీఐల రూపాంతరానికి ఏడాది
Posted On:
03 OCT 2026 3:22PM
హబ్-అండ్-స్పోక్ నమూనా, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ ద్వారా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించడంపై పీఎం-సేతు దృష్టి సారిస్తోంది. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఐదు ఎన్‌ఎస్‌టీఐల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ఈ పథకంలో అవకాశం ఉంది. స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్, యాంకర్ ఇండస్ట్రీ పార్ట్‌నర్స్ ద్వారా పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఇందులో పొందుపరిచారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వృత్తులకు సంబంధించిన కొత్తతరం కోర్సులను ఈ పథకం ప్రవేశపెడుతోంది. ఎంపిక చేసిన ఎన్‌ఎస్‌టీఐల్లో అధునాతన నైపుణ్య శిక్షణకు అంతర్జాతీయ భాగస్వామ్యాలు తోడ్పడుతున్నాయి. స్టేట్ స్టీరింగ్ కమిటీలు, పరిశ్రమల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం అమలు కూడా విస్తరించింది. ఏడాది పురోగతిలో భాగంగా 850 ఐటీఐలను గుర్తించారు, 14 ఐటీఐ క్లస్టర్లకు ఆమోదం తెలిపారు. ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నైపుణ్య ప్రయోగశాలలు విద్యార్థులకు వృత్తి విద్యపై మరింత పరిచయం కల్పిస్తాయి.
నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి కోసం ఐటీఐల రూపాంతరం
భారతదేశంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఐటీఐలు) దేశ వృత్తి శిక్షణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ఉపాధి, పరిశ్రమల అవసరాల కోసం యువతకు ఆచరణాత్మక నైపుణ్యాలను అందిస్తున్నాయి. శ్రామికశక్తి అవసరాలు మారుతున్న నేపథ్యంలో వృత్తి శిక్షణ నాణ్యతను పెంచడం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మలచడం, పరిశ్రమలతో అనుసంధానాన్ని బలోపేతం చేయడం మరింత ముఖ్యమైంది.
ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్ 4న పీఎం-సేతు (ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్) ప్రారంభమైంది. ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ సంస్థలుగా మార్చడం ద్వారా వృత్తి శిక్షణ సమగ్ర నాణ్యతను, ప్రాసంగికతను ఈ పథకం పెంచుతుంది. పరిశ్రమల నేతృత్వంలోని పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మారుతున్న శ్రామికశక్తి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. పథకం మొత్తం వ్యయ కేటాయింపు ₹60,000 కోట్లు. ఇందులో కేంద్రం నుంచి ₹30,000 కోట్లు, రాష్ట్రాల నుంచి ₹20,000 కోట్లు, పరిశ్రమల నుంచి ₹10,000 కోట్లు సమకూరుతాయి. 2026 అక్టోబర్ 4న ఈ పథకం ఏడాది పూర్తిచేసుకుంటుంది.
ఐటీఐలు: నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి పునాది
ఉపాధి, పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడే ఆచరణాత్మక నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఐటీఐలు వృత్తి శిక్షణ కల్పిస్తాయి. క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్) కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్‌యేతర వృత్తుల్లో శిక్షణ అందిస్తారు. వృత్తిని బట్టి కోర్సు వ్యవధి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎంఎస్‌డీఈ) పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) జాతీయ స్థాయిలో వృత్తి శిక్షణ అభివృద్ధి, సమన్వయానికి బాధ్యత వహించే అత్యున్నత సంస్థ. విధానాలు, నియమాలు, ప్రమాణాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అభివృద్ధి, అనుబంధ గుర్తింపు, శిక్షకుల శిక్షణ, వృత్తి నైపుణ్య పరీక్షల నిర్వహణ దీని విధుల్లో ఉన్నాయి. ఐటీఐలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల పరిపాలనా, ఆర్థిక నియంత్రణలో ఉంటాయి.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల మొత్తం సంఖ్య 2014లో 9,776 నుంచి 2026లో 13,888కు పెరిగింది. ఇది 42% వృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా, దేశవ్యాప్తంగా ఐటీఐల్లో విద్యార్థుల నమోదు 2014–15 విద్యా సంవత్సరంలో 9.51 లక్షల నుంచి 2025–26 విద్యా సంవత్సరంలో 14.70 లక్షలకు పెరిగింది. ఇది 54% వృద్ధిని సూచిస్తుంది.
విస్తరిస్తున్న ఈ సంస్థల వ్యవస్థ వృత్తి శిక్షణను బలోపేతం చేసేందుకు, వివిధ రంగాల్లో మారుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా మలచేందుకు విస్తృత సంస్థాగత పునాదిని అందిస్తోంది.
ఐటీఐలను పీఎం-సేతు ఎలా రూపాంతరం చేస్తోంది?
వృత్తి విద్య నాణ్యతను బలోపేతం చేసేందుకు పీఎం-సేతు మౌలిక సదుపాయాల ఆధునీకరణ, పరిశ్రమల భాగస్వామ్యం, కొత్తతరం శిక్షణను సమన్వయం చేస్తోంది. ఈ రూపాంతరం రెండు ప్రత్యేక విభాగాలపై ఆధారపడి ఉంది. మొదటిది ప్రభుత్వ ఐటీఐలపై, రెండోది ఎన్‌ఎస్‌టీఐలపై దృష్టి సారిస్తుంది.

* మొదటి విభాగంలో 1,000 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. వీటిలో 200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలు ఉన్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణతో హబ్-అండ్-స్పోక్ నమూనా ద్వారా ఈ సంస్థలను మెరుగుపరుస్తున్నారు. ప్రతి హబ్‌కు సగటున నాలుగు స్పోక్‌లు అనుసంధానమై ఉంటాయి. దీంతో అధునాతన మౌలిక సదుపాయాలు, ఆధునిక వృత్తి కోర్సులు, డిజిటల్ అభ్యాస వ్యవస్థలు, ఇంక్యుబేషన్ సదుపాయాలను ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు.
హబ్‌లు ఆవిష్కరణ కేంద్రాలు, శిక్షకులకు శిక్షణ ఇచ్చే మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి యూనిట్లు, ఉద్యోగ నియామక సేవలు వంటి సదుపాయాలను అందిస్తాయి. స్పోక్‌లు శిక్షణ అందుబాటును విస్తరించి, విద్యార్థులను ఆయా క్లస్టర్లలో అందుబాటులో ఉన్న వనరులతో అనుసంధానిస్తాయి.
స్మార్ట్ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ పాఠ్యాంశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులతో ఐటీఐలను మెరుగుపరచేందుకు ఈ నమూనా తోడ్పడుతోంది.
* రెండో విభాగం భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లుధియానాల్లోని 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్‌ఎస్‌టీఐలు) సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తుంది. రంగాలవారీగా నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా శిక్షకులకు అధునాతన శిక్షణ ఇందులో భాగంగా ఉన్నాయి.
పీఎం-సేతు అమలు: రాష్ట్రాలు, పరిశ్రమలు, కేంద్రం సమన్వయం
* పీఎం-సేతు కింద ఐటీఐల ఎంపికకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిశ్రమలతో సంప్రదించి నాయకత్వం వహిస్తాయి. పరిశ్రమ భాగస్వాములతో కలిసి ఐటీఐల అభివృద్ధికి ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఈ ప్రక్రియలో కొత్తగా ఏర్పడుతున్న నైపుణ్య అవసరాలు, ఆయా ప్రాంతాల పారిశ్రామిక అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
* జాతీయ స్థాయిలో ఈ పథకానికి సమగ్ర దిశానిర్దేశం చేసేందుకు ఎంఎస్‌డీఈ తన కార్యదర్శి అధ్యక్షతన నేషనల్ స్టీరింగ్ కమిటీని (ఎన్‌ఎస్‌సీ) ఏర్పాటు చేసింది. ఎన్‌ఎస్‌సీ విస్తృత విధాన దిశానిర్దేశం చేస్తుంది, కార్యాచరణ మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది, అమలును పర్యవేక్షిస్తుంది, అవసరమైన చోట సవరణ చర్యలు చేపడుతుంది.
ఎంపిక ప్రక్రియలోనే పరిశ్రమల భాగస్వామ్యాన్ని కూడా పొందుపరిచారు. భాగస్వామ్యం కోరుకునే సంస్థలు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను (ఎస్‌ఐపీ) సమర్పించాలి.
ఎస్‌పీవీల ద్వారా పరిశ్రమల నేతృత్వంలో పాలన
అభివృద్ధి చేసే ఐటీఐ క్లస్టర్లలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీలు) ద్వారా పరిశ్రమల నేతృత్వంలోని పాలనకు పీఎం-సేతు అవకాశం కల్పిస్తుంది. ప్రతిపాదిత నిర్మాణం ప్రకారం యాంకర్ ఇండస్ట్రీ పార్ట్‌నర్‌కు 51% యాజమాన్య వాటా ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కొక్కటి 24.5% వాటా ఉంటుంది.
స్థానిక పరిశ్రమల అవసరాలకు తగిన చర్యలను ప్రతిపాదిస్తూ ఎస్‌పీవీలు క్లస్టర్ల అభివృద్ధి, కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తాయి. ఈ చర్యల్లో పాఠ్యప్రణాళిక, శిక్షణ అందించే విధానం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం వంటివి ఉండవచ్చు.
ఏడాదిలో పీఎం-సేతు: ప్రణాళిక నుంచి అమలు వరకు
పీఎం-సేతు తొలి ఏడాదిలో అమలు ప్రక్రియ సంస్థాగత సన్నద్ధత, ఐటీఐల గుర్తింపు నుంచి ఐటీఐ క్లస్టర్లు, ఎస్‌ఐపీల ఆమోదం వరకు ముందుకు సాగింది. మొత్తం 850 ఐటీఐలను గుర్తించారు. వీటిలో 172 హబ్ ఐటీఐలు, 678 స్పోక్ ఐటీఐలు ఉన్నాయి. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్లస్టర్లను గుర్తించి, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక పద్దులను ఏర్పాటు చేశాయి. మరోవైపు, అమలుకు మార్గదర్శకత్వం వహించేందుకు, పర్యవేక్షించేందుకు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ స్టేట్ స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాయి. 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఆహ్వానించే ప్రక్రియను కూడా ప్రారంభించాయి.
పీఎం-సేతును ప్రయోగాత్మక దశ నుంచి గుర్తించిన మొత్తం 200 ఐటీఐ క్లస్టర్లలో దేశవ్యాప్త అమలు దశకు తీసుకెళ్లేందుకు కూడా ఎన్‌ఎస్‌సీ ఆమోదం తెలిపింది. పరిశ్రమల సన్నద్ధత, అమలు సామర్థ్యం ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఈ విస్తరణ వీలు కల్పిస్తుంది.
పీఎం-సేతు కింద ₹3,446 కోట్ల పెట్టుబడితో 14 ఐటీఐ క్లస్టర్ల ఎస్‌ఐపీలకు ఆమోదం తెలిపారు.
8 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 14 ఎస్‌ఐపీలకు నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆమోదం
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
క్లస్టర్
|
యాంకర్ ఇండస్ట్రీ పార్ట్‌నర్ (ఏఐపీ)
|
రంగం
|
విలువ (₹ కోట్లు)
|
|
1
|
ఏపీ
|
కంచరపాలెం
|
ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా
|
ఉక్కు, లోహాలు
|
200
|
|
2
|
ఒడిశా
|
కేందుఝర్-బర్బిల్
|
జిందాల్ నవీన్ అవసర్ లిమిటెడ్ (జేఎన్‌ఏఎల్)
|
వివిధ రకాల తయారీ
|
240
|
|
3
|
గుజరాత్
|
సూరత్
|
ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా
|
ఉక్కు, లోహాలు
|
240
|
|
4
|
తెలంగాణ
|
ఓల్డ్ సిటీ
|
అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్
|
ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు
|
241
|
|
5
|
తెలంగాణ
|
సంగారెడ్డి
|
న్యూలాండ్ ఫౌండేషన్
|
ఔషధాలు, రసాయనాలు
|
241
|
|
6
|
తెలంగాణ
|
పటాన్‌చెరు
|
శ్రీ సిద్ధార్థ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్
|
వివిధ రకాల తయారీ
|
275
|
|
7
|
రాజస్థాన్
|
భివాడి
|
హెచ్.జీ. ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్
|
మౌలిక సదుపాయాలు, నిర్మాణం
|
241
|
|
8
|
యూపీ
|
మీరట్
|
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ)
|
నైపుణ్యాభివృద్ధి
|
240
|
|
9
|
తెలంగాణ
|
మేడ్చల్
|
జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్
|
రక్షణ, ఎలక్ట్రానిక్స్
|
254
|
|
10
|
హర్యానా
|
కురుక్షేత్ర
|
జిందాల్ నవీన్ అవసర్ లిమిటెడ్ (జేఎన్‌ఏఎల్)
|
వివిధ రకాల తయారీ
|
320
|
|
11
|
మహారాష్ట్ర
|
ఛత్రపతి శంభాజీనగర్
|
బెల్‌రైజ్ ఇండస్ట్రీస్
|
వాహన పరిశ్రమ
|
238
|
|
12
|
మహారాష్ట్ర
|
పుణె
|
బీవీజీ గ్రూప్
|
సమగ్ర సదుపాయాల నిర్వహణ
|
241
|
|
13
|
జమ్మూ కశ్మీర్
|
శ్రీనగర్
|
ఇందర్‌దీప్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్
|
మౌలిక సదుపాయాలు, నిర్మాణం
|
235
|
|
14
|
జమ్మూ కశ్మీర్
|
జమ్మూ
|
ఈగల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్
|
మౌలిక సదుపాయాలు, నిర్మాణం
|
240
|
| |
మొత్తం
|
|
|
|
3,446
|

నైపుణ్య శిక్షణ పరిధి విస్తరణ
మారుతున్న శ్రామికశక్తి అవసరాలకు కొత్తతరం కోర్సులు
మౌలిక సదుపాయాలు, సంస్థాగత సంస్కరణలకు తోడుగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వృత్తుల అవసరాలకు స్పందించేలా వృత్తి శిక్షణను మలచడంపై కూడా పీఎం-సేతు దృష్టి సారిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ కింద 32 కొత్తతరం కోర్సులను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్, విద్యుత్ వాహనాలు, సెమీకండక్టర్ సాంకేతికత, రోబోటిక్స్, హరిత హైడ్రోజన్, డ్రోన్లు, ఐఓటీ, సౌరశక్తి, 5జీ, సాఫ్ట్‌వేర్ పరీక్ష వంటి రంగాలు వీటిలో ఉన్నాయి. తమ పరిపాలనా, ఆర్థిక నియంత్రణలో ఉన్న ఐటీఐల్లో రాష్ట్రాలు ఈ కోర్సులను ప్రవేశపెట్టవచ్చు.
అధునాతన నైపుణ్య శిక్షణకు అంతర్జాతీయ భాగస్వామ్యాలు
నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు, శిక్షణను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మలచేందుకు పీఎం-సేతు విధాన చట్రం అంతర్జాతీయ భాగస్వామ్యాలకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఎన్‌ఎస్‌టీఐ చెన్నై కోసం సింగపూర్‌తో, ఎన్‌ఎస్‌టీఐ కాన్పూర్ కోసం ఫ్రాన్స్‌తో, ఎన్‌ఎస్‌టీఐ భువనేశ్వర్ కోసం ఆస్ట్రేలియాతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నారు. ఎన్‌ఎస్‌టీఐ హైదరాబాద్ కోసం జర్మనీతో సంయుక్త ప్రకటనను పరస్పరం అందజేసుకున్నారు.
నైపుణ్యాల నుంచి ఉపాధికి మార్గం బలోపేతం
ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల భాగస్వామ్యం, డిమాండ్ ఆధారిత శిక్షణ ద్వారా పీఎం-సేతు భారత వృత్తి శిక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. దీని అమలు ప్రభుత్వ ఐటీఐలు, ఎన్‌ఎస్‌టీఐలను మారుతున్న శ్రామికశక్తి అవసరాలకు మరింత చేరువ చేస్తోంది. కొత్తతరం నైపుణ్యాలు, అంతర్జాతీయ నిపుణత, ప్రారంభ దశలోనే వృత్తి విద్యపై పరిచయాన్ని పొందే అవకాశాలను కూడా ఈ కార్యక్రమం విస్తరిస్తోంది. ఈ చర్యలన్నీ కలిసి భారత యువతకు మరింత అనుసంధానంతో, పరిశ్రమల అవసరాలకు స్పందించే నైపుణ్యాభివృద్ధి మార్గాన్ని అందించేందుకు తోడ్పడుతున్నాయి.
References
Ministry of Skill Development and Entrepreneurship
https://dgt.gov.in/sites/default/files/2025-01/NCVT_Affiliation_norms_ITIs.pdf
https://pmsetu.nimi.co.in/about-us
https://pm-setu.skillindiadigital.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246879&lang=1®=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286584®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222121®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2208158®=6&lang=1
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2238234®=6&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246879&lang=1®=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291100&lang=1®=3
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AS206_AQ2o13.pdf?source=lsapps
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2281937®=6&lang=1
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2307775&lang=1®=3
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2312980®=6&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2174932®=48&lang=2
Prime Minister's Office (PMO)
https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-unveil-various-youth-focused-initiatives-worth-more-than-rs-62000-crore-on-4th-october
PM-SETU: One Year of Transforming India’s ITIs
****
(Explainer ID: 160329)
आगंतुक पटल : 13
Provide suggestions / comments