• Sitemap
Economy

మేక్‌ ఇన్‌ ఇండియాకు 12 ఏళ్లు

తయారీ దేశంగా భారత్‌ ప్రయాణం

Posted On: 24 SEP 2026 5:31PM

మేక్‌ ఇన్‌ ఇండియా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తి, పెట్టుబడులు, సామర్థ్యాలను విస్తరించడం ద్వారా ఈ కార్యక్రమం భారత తయారీ రంగ రూపురేఖలను మార్చింది. ఈ కాలంలో ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌, ఔషధాలు, ఉక్కు, రైల్వేలు, రక్షణ రంగాల్లో ఉత్పత్తి పెరిగింది. విడిభాగాలు, యంత్రాలు, వ్యూహాత్మక పదార్థాలు, అధునాతన సాంకేతికతలను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా భారత్‌ అభివృద్ధి చేసుకుంది. ఎన్ఎస్‌డ‌బ్ల్యూఎస్‌, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు(పీఎల్ఐ), పీఎం గతిశక్తి, ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ వంటి కార్యక్రమాలు పెట్టుబడులు, ఉత్పత్తికి మద్దతు ఇచ్చాయి. సెమీకండక్టర్లు, మొబైల్‌ ఫోన్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఉక్కు, అరుదైన భూ మూలకాల అయస్కాంతాలపై దృష్టి పెట్టే కొత్త పథకాలు దేశీయ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

 

భారత తయారీ రంగానికి కొత్త దిశ

ప్రపంచ తయారీ, రూపకల్పన, ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 ఏళ్ల క్రితం 2014 సెప్టెంబర్‌ 25న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి పెట్టింది. ‘కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ స్ఫూర్తితో విధానాలు, ప్రక్రియలను ఆధునికీకరించేందుకు కూడా కృషి చేసింది.

 

భారత తయారీ రంగ ప్రయాణంలో వ్యాపారాలు, పెట్టుబడిదారులు పాలుపంచుకునేందుకు మేక్‌ ఇన్‌ ఇండియా కొత్త అవకాశాలు తెరిచింది. ఆ తర్వాత దీన్ని మేక్‌ ఇన్‌ ఇండియా 2.0 కింద విస్తరించారు. ప్రస్తుతం 15 తయారీ రంగాలు, 12 సేవా రంగాలు సహా మొత్తం 27 రంగాలపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతోంది.

 

భారీ స్థాయికి చేరుతున్న భారత తయారీ రంగం

తయారీ రంగం కాలక్రమంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. తాజా సూచికలు కూడా ఈ వృద్ధి కొనసాగుతున్నట్లు తెలియజేస్తున్నాయి.

 

సవరించిన జాతీయ ఖాతాల గణాంకాల ప్రకారం స్థిర ధరల వద్ద తయారీ రంగ స్థూల విలువ జోడింపు(జీవీఏ) 2022–23 నుంచి 2025–26 మధ్య 10.88 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది.

 

పారిశ్రామిక ఉత్పత్తి కూడా తాజా వృద్ధిని సూచిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లోని తయారీ విభాగం 2025 ఏప్రిల్‌–జులైతో పోలిస్తే 2026 ఏప్రిల్‌–జులైలో 7 శాతం పెరిగింది.

 

కీలక తయారీ పరిశ్రమల్లో పెరుగుతున్న ఉత్పత్తి

పలు పరిశ్రమల్లో ఉత్పత్తి, సామర్థ్యం గణనీయంగా పెరగడం ద్వారా తయారీ రంగ విస్తరణ స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఎలక్ట్రానిక్స్‌

- ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి 2014–15లో సుమారు ₹1.9 లక్షల కోట్ల నుంచి 2025–26లో సుమారు ₹13.11 లక్షల కోట్లకు పెరిగింది. ఇది దాదాపు ఏడు రెట్ల వృద్ధి.

- ఇదే కాలంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి సుమారు ₹18,900 కోట్ల నుంచి ₹6.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇది దాదాపు 32 రెట్ల వృద్ధి. ఉత్పత్తి పరిమాణం ఆధారంగా భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ దేశంగా నిలిచింది.

- మొత్తం ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025–26లో 15.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

ఆటోమొబైల్స్‌

- వాహన ఉత్పత్తి 2024–25లో 3.103 కోట్ల యూనిట్లకు చేరింది. ఇది 2014–15తో పోలిస్తే సుమారు 33 శాతం ఎక్కువ.

- 2020–21తో పోలిస్తే 2024–25లో పలు వాహన విభాగాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది:

  - ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ఉత్పత్తి ఒక్కో విభాగంలో 65 శాతం పెరిగింది.

  - మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి 71 శాతం పెరిగింది.

  - ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 30 శాతం వృద్ధి చెందింది.

 

ఔషధాలు, వైద్య పరికరాలు

- ఉత్పత్తి పరిమాణంలో భారత ఔషధ పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో, విలువపరంగా 11వ స్థానంలో ఉంది.

- వార్షిక వ్యాపార పరిమాణం 2025–26లో ₹5,08,630 కోట్లకు చేరింది. అంతకుముందు ఐదేళ్లలో సగటున 9.2 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. 2025–26లో ఔషధ ఎగుమతుల విలువ ₹2,62,697 కోట్లుగా ఉంది.

- వైద్య పరికరాల దేశీయ తయారీ 2019–20లో సుమారు ₹28 వేల కోట్ల నుంచి 2024–25లో ₹41,500 కోట్లకు పెరిగింది. ఇది దాదాపు 48.2 శాతం వృద్ధి.

 

ఉక్కు

- ముడి ఉక్కు ఉత్పత్తి 2014–15లో 8.17 కోట్ల టన్నుల నుంచి 2025–26లో 17 కోట్ల టన్నులకు పెరిగింది.

 

రైల్వేలు

- భారతీయ రైల్వే 2014–24 మధ్య 54,809 కోచ్‌లను తయారు చేసింది. సగటు వార్షిక కోచ్‌ల ఉత్పత్తి 2004–14లో 3,300 కంటే తక్కువగా ఉండగా, 2014–24లో 5,481కు పెరిగింది.

- దేశీయ తయారీలో రైలింజన్లు, ఆధునిక ప్రయాణికుల కోచ్‌లు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వే 2025–26లో 1,674 రైలింజన్లను తయారు చేసింది.

- 2025–26లో 6,677 లింకే హోఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను తయారు చేసింది. తక్కువ బరువు, మెరుగైన భద్రత, అధిక సౌకర్యం, కుదుపులు తక్కువగా ఉండే ప్రయాణానికి అనుగుణంగా వీటిని రూపొందించారు.

 

రక్షణ రంగం

- దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ 2014–15లో ₹46,429 కోట్లు ఉండగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ₹1.78 లక్షల కోట్లకు చేరింది. ఇది సుమారు 283 శాతం వృద్ధి. 2014–15 స్థాయితో పోలిస్తే ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లకు చేరింది.

 

దేశీయ తయారీ సామర్థ్యం మరింత విస్తరణ

తుది ఉత్పత్తుల తయారీలో పెరుగుదల భారత తయారీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. పారిశ్రామిక విలువ శ్రేణుల్లో ఉపయోగించే ముడి పదార్థాలు, విడిభాగాలు, వ్యవస్థలు, యంత్రాల తయారీలోనూ దేశీయ సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి.

 

అధునాతన ఉత్పత్తులు, వ్యూహాత్మక పదార్థాలు

సంక్లిష్ట, అధునాతన ఔషధ ఉత్పత్తులు

- భారత్‌ ప్రస్తుతం సంక్లిష్ట, అధునాతన ఔషధాలను తయారు చేస్తోంది. రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు ప్రపంచంలోనే తొలి బయోసిమిలర్‌ యాంటీబాడీ–డ్రగ్‌ కాంజుగేట్‌ అయిన ట్రాస్టుజుమాబ్‌ ఎమ్‌టాన్సిన్‌ వీటిలో ఒకటి.

- రేబిస్‌ నివారణకు ప్రపంచంలోనే తొలి మోనోక్లోనల్‌ యాంటీబాడీ కలయిక అయిన డోకరవిమాబ్‌–మిరోమవిమాబ్‌ను కూడా భారత్‌ తయారు చేస్తోంది.

- బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనియా చికిత్స కోసం మూడు దశాబ్దాల్లో భారత్‌ అభివృద్ధి చేసిన తొలి మాక్రోలైడ్‌ యాంటీబయాటిక్‌ మిక్నాఫ్‌.

- మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల్లో రక్తహీనత చికిత్సకు ఉపయోగించే కొత్త రసాయన ఔషధం డెసిడుస్టాట్‌, వినూత్న ఔషధాల అభివృద్ధిలో భారత సామర్థ్యాన్ని చాటుతోంది.

 

రేర్-ఎర్త్ ప‌ర్మ‌నెంట్ మ్యాగ్నెట్స్‌

- హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ)లో 2026 మార్చిలో ఎన్‌డీ–ఎఫ్‌ఈ–బీ(నియోడిమియం, ఇనుము, బోరాన్‌) అరుదైన భూ మూలకాల శాశ్వత అయస్కాంతాల ప్రయోగాత్మక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్‌, అధునాతన తయారీ సాంకేతికతలకు ఈ అయస్కాంతాలు అత్యవసరం.

- సాంకేతికత ధ్రువీకరణ, తయారీ ప్రక్రియ మెరుగుదల, పరిశ్రమల సహకారానికి ఈ కేంద్రం మద్దతు ఇస్తుంది. దేశీయ ఆవిష్కరణలను వాణిజ్య తయారీ స్థాయికి విస్తరించడంతో పాటు డీప్‌టెక్‌ అంకుర సంస్థలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి తోడ్పడుతుంది.

 

విడిభాగాలు, వ్యవస్థలు, నిర్మాణ సముదాయాలు

సంక్లిష్ట తుది ఉత్పత్తుల్లో ఉపయోగించే మధ్యంతర విడిభాగాలు, సమీకృత వ్యవస్థలు, నిర్మాణ సముదాయాల తయారీకి దేశీయ సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి.

రంగం

ప్రధాన విజయం

అంతరిక్ష అవసరాలకు సెమీకండక్టర్లు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, సెమీకండక్టర్‌ లేబొరేటరీ కలిసి అంతరిక్ష అవసరాల కోసం విక్రమ్‌ 3201, కల్పన 3201 మైక్రోప్రాసెసర్లను అభివృద్ధి చేశాయి. ప్రయోగ వాహనాలు ఎదుర్కొనే కఠిన పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యంతో పూర్తిగా భారత్‌లో తయారైన తొలి మైక్రోప్రాసెసర్‌ విక్రమ్‌ 3201. దీన్ని ఎస్‌సీఎల్‌ కేంద్రంలో తయారు చేశారు. ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ సాధనాలతో పనిచేసేలా కల్పన 3201ను రూపొందించి, విమాన సాఫ్ట్‌వేర్‌తో పరీక్షించారు.

సౌర ఘటాలు, మాడ్యూల్స్‌

సౌర మాడ్యూల్‌ తయారీ సామర్థ్యం 2014లో 2.3 గిగావాట్ల నుంచి 2026 జూన్‌ నాటికి 192 గిగావాట్లకు పెరిగింది. సౌర ఘటాల సామర్థ్యం 1.2 గిగావాట్ల నుంచి సుమారు 30 గిగావాట్లకు చేరింది.

విద్యుత్‌ వాహన సాంకేతికత

మోటారు, ఇన్వర్టర్‌ను కలిపిన దేశీయ 30 కిలోవాట్ల డ్రైవ్‌ వ్యవస్థను 2026 మార్చిలో ప్రారంభించారు. రూపకల్పన, తయారీ, ధ్రువీకరణ పూర్తికాగా వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.

విమానాల తయారీ

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ 2025 అక్టోబర్‌లో తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ ఎంకే1ఏ కోసం మూడో అసెంబ్లీ లైన్‌ను ప్రారంభించింది. దీంతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 విమానాలకు చేరింది. హెచ్‌టీటీ–40 శిక్షణ విమానాలకు రెండో ఉత్పత్తి లైన్‌ను కూడా ప్రారంభించింది. విమాన ప్రధాన శరీరం, రెక్కలు, నియంత్రణ ఉపరితలాలు వంటి కీలక నిర్మాణాలను ఇక్కడ తయారు చేస్తారు.

రైల్వే విడిభాగాలు

రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ 2025–26లో 2,10,026 చక్రాలు, 1,22,000 యాక్సిళ్లు, 1,20,100 వీల్‌సెట్లను తయారు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వీటి ఉత్పత్తి వరుసగా 4 శాతం, 30 శాతం, 22 శాతం పెరిగింది.

అణు విద్యుత్‌ విడిభాగాలు

భవిష్యత్తులో నిర్మించే 700 మెగావాట్ల భారత అణు రియాక్టర్ల కోసం న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ 2025 సెప్టెంబర్‌లో ఎనిమిదో విడత ఆవిరి ఉత్పాదక గొట్టాలను పంపించింది. వీటి తయారీ, పరీక్షలు, తనిఖీలు దేశీయంగానే చేపట్టారు.

 

క్యాపిట‌ల్ గూడ్స్‌: తయారీకి ఆధారమైన యంత్రాలు

వస్తువుల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, అసెంబ్లీకి ఉపయోగించే యంత్రాల తయారీలోనూ దేశీయ సామర్థ్యం విస్తరించింది. భారీ ఇంజినీరింగ్‌ పరికరాలు, వివిధ మూలధన వస్తువుల ఉప రంగాల్లో ఉత్పత్తి విలువ 2019–20లో ₹2,87,233 కోట్ల నుంచి 2024–25లో ₹5,69,900 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది.

వివిధ మూలధన వస్తువుల రంగాలు, భారీ ఇంజినీరింగ్‌ పరికరాల ఉత్పత్తి విలువ (₹ కోట్లలో)

విభాగం

2019–20

2024–25

పెరుగుదల

భూమి తవ్వకం, గనుల యంత్రాలు

31,028

80,750

160.3%

ముద్రణ యంత్రాలు

12,678

29,716

134.4%

యంత్ర పరికరాలు

6,152

14,286

132.2%

ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ యంత్రాలు

2,350

4,827

105.4%

భారీ విద్యుత్‌ ఇంజినీరింగ్‌ పరికరాలు

1,79,199

3,64,706

103.5%

ఆహార ప్రాసెసింగ్‌ యంత్రాలు

7,547

15,249

102.1%

వస్త్ర యంత్రాలు

5,355

10,461

95.4%

డైలు, మౌల్డ్‌లు, ప్రెస్‌ పరికరాలు

13,682

18,400

34.5%

ప్రాసెస్‌ ప్లాంట్‌ పరికరాలు

29,250

31,505

7.7%

మూలం: భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

 

మేక్‌ ఇన్‌ ఇండియా కింద సంస్కరణల ప్రయాణం

మేక్‌ ఇన్‌ ఇండియా సంస్కరణలు పెట్టుబడులు, వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడంతో పాటు దేశీయ ఉత్పత్తికి సహకరిస్తున్నాయి. తాజాగా చేపట్టిన కార్యక్రమాలు విడిభాగాలు, వ్యూహాత్మక పదార్థాలు, ప్రత్యేక సాంకేతికతలపై దృష్టిని విస్తరించాయి.

 

మేక్‌ ఇన్‌ ఇండియా కింద ప్రధాన కార్యక్రమాలు

- పెట్టుబడిదారులకు అనుకూలమైన భారత విధానం ప్రకారం కొన్ని వ్యూహాత్మక రంగాలు మినహా చాలా రంగాల్లో ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. 2014–15 నుంచి 2025–26 మధ్య మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 843 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు 12 ఏళ్లతో పోలిస్తే ఇది 169 శాతం వృద్ధి.

- నేష‌న‌ల్ సింగిల్ విండో సిస్ట‌మ్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌) వ్యాపార సంస్థలకు అవసరమైన అనుమతులను గుర్తించి, ఒకే డిజిటల్‌ వేదిక ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 327కు పైగా కేంద్ర అనుమతులు, 3,452 రాష్ట్ర అనుమతులను ఈ వేదిక ద్వారా పొందవచ్చు.

- 2026 సెప్టెంబర్‌ 21 నాటికి ఈ వేదిక ఏటా సగటున 3.06 లక్షలకు పైగా దరఖాస్తులను నిర్వహిస్తోంది. వ్యక్తిగత యాజమాన్య సంస్థలు, కంపెనీలు, పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలు, విదేశీ సంస్థలు సహా 5.69 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఇందులో చేరాయి.

- ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ (ఐఐఎల్‌బీ) దేశవ్యాప్తంగా పారిశ్రామిక భూములకు సంబంధించిన తాజా భౌగోళిక, ఇతర సమాచారాన్ని అందించే జీఐఎస్‌ ఆధారిత కేంద్రీకృత వేదిక. 2026 మే నాటికి దాదాపు 6.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని 4,220 పారిశ్రామిక పార్కులను ఈ వేదికలో నమోదు చేశారు.

- 2021 అక్టోబర్‌లో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల ప్రణాళిక, సమన్వయంతో కూడిన అమలుకు వీలు కల్పిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమాచార ఆధారిత నిర్ణయాల కోసం భౌగోళిక గణాంకాలు, ఉపగ్రహ చిత్రాలు, ఏపీఐ అనుసంధానాన్ని ఉపయోగిస్తోంది.

- ఈ వ్యవస్థ కింద ప్రధాన కేంద్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక దశలోనే నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ పరిశీలిస్తుంది. సమన్వయం, వివిధ రవాణా మార్గాల మధ్య అనుసంధానం, చివరి దశ రవాణా, ప్రాజెక్టు ప్రాంతాల చుట్టుపక్కల అభివృద్ధిపై దృష్టి పెడుతుంది.

- 2026 ఆగస్టు 11 నాటికి దాదాపు ₹18.66 లక్షల కోట్ల విలువైన 396 ప్రాజెక్టులను నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ పరిశీలించింది. వీటిలో 256 ప్రాజెక్టులకు అనుమతి లభించగా, 198 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.

- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (పీఎల్‌ఐ) ఎలక్ట్రానిక్స్‌, ఔషధాలు, ఆటోమొబైల్స్‌, సౌర పీవీ మాడ్యూల్స్‌, ప్రత్యేక ఉక్కు, వస్త్రాలు సహా 14 రంగాల్లో అదనపు ఉత్పత్తి, విక్రయాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

- 2026 జూన్‌ నాటికి ఈ పథకాలు ₹2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ₹23.8 లక్షల కోట్ల ఉత్పత్తి, విక్రయాలను నమోదు చేశాయి. ₹15.5 లక్షల కోట్లకు పైగా ఎగుమతులకు మద్దతు ఇవ్వడంతో పాటు 14.6 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి.

- 2016 జనవరిలో ప్రారంభించిన స్టార్టప్‌ ఇండియా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంకుర సంస్థలకు సహకరించడం, భారత అంకుర సంస్థల వ్యవస్థలో పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పనిచేస్తోంది. 2026 సెప్టెంబర్‌ నాటికి దాదాపు 2.54 లక్షల సంస్థలు ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలుగా గుర్తింపు పొందాయి.

 

ఇటీవలి కార్యక్రమాలతో తయారీ రంగానికి మరింత బలం

పథకం పేరు

ప్రధాన అంశాలు

ప్రత్యేక ఉక్కు కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం–1.2 (మూడో విడతను 2025 నవంబర్‌లో ప్రారంభించారు)

అధునాతన, కొత్త ఉక్కు విభాగాలను మూడో విడత పరిధిలోకి తీసుకొచ్చారు. సూపర్‌ అల్లాయ్స్‌, సీఆర్‌జీఓ ఉక్కు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పొడవైన–చదునైన ఉత్పత్తులు, టైటానియం మిశ్రమాలు, పూత ఉక్కు ఇందులో ఉన్నాయి.

సింటర్డ్‌ అరుదైన భూ మూలకాల శాశ్వత అయస్కాంతాల తయారీ ప్రోత్సాహక పథకం (2025 డిసెంబర్‌లో ప్రకటించారు)

సింటర్డ్‌ ఎన్‌డీఎఫ్‌ఈబీ రకం అరుదైన భూ మూలకాల శాశ్వత అయస్కాంతాలకు ఏటా 6,000 మెట్రిక్‌ టన్నుల సమీకృత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ₹7,280 కోట్లు కేటాయించారు.

భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన–భవ్య (2026 మార్చిలో ఆమోదం)

సమీకృత పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో పెట్టుబడులకు సిద్ధంగా ఉండే 100 ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు ₹33,660 కోట్లు కేటాయించారు.

మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం (2026 జులైలో ఆమోదం)

2026–27 నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరాల మధ్య మొబైల్‌ ఫోన్‌ ఉత్పత్తిని పెంచడం, దేశీయ విలువ జోడింపును విస్తరించడం కోసం ₹62,500 కోట్లు కేటాయించారు. సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేసి, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడం కూడా పథకం లక్ష్యం.

సెమికాన్‌ 2.0 (2026 జులైలో ఆమోదం)

భారత సెమీకండక్టర్‌ వ్యవస్థకు నిరంతర, దీర్ఘకాలిక సహాయం అందించేందుకు ₹1,27,500 కోట్లు కేటాయించారు. రూపకల్పన, తయారీ, అధునాతన ప్యాకేజింగ్‌, పదార్థాలు, పరికరాలు, పరిశోధన, ప్రతిభాభివృద్ధి ఈ సహాయం పరిధిలోకి వస్తాయి.

భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన–రసాయన్‌ (2026 జులై 24న ఆమోదం)

దేశంలో మూడు ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటుకు సహకరించేందుకు ₹3,030 కోట్లు కేటాయించారు.

 

ముగింపు

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ తయారీ, పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

 

అధిక సంఖ్యలో వస్తువులను ఉత్పత్తి చేయడానికే ఈ కార్యక్రమం పరిమితం కావడం లేదు. వాటిని దేశంలోనే తయారు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి పెడుతోంది. ఈ పునాదులు మరింత బలపడే కొద్దీ భారత తయారీ రంగం దేశంలో అధిక విలువను సృష్టించి, ప్రపంచ మార్కెట్లలో ఆత్మవిశ్వాసంతో పోటీ పడగల స్థితికి చేరుకుంటోంది.

References:

Cabinet:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288863&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284789&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284784&reg=48&lang=2

Ministry of Defence:

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2180339&reg=48&lang=2

Ministry of Commerce & Industry:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246085&reg=48&lang=2

https://www.makeinindia.com/about

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2101785&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2271031&reg=48&lang=2

https://www.nsws.gov.in/about-us

https://www.nsws.gov.in/portal/approvalsandregistrations

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2271031&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297818&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2270334&reg=48&lang=2

https://www.startupindia.gov.in/

Ministry of Electronics & IT:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291171&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2234574&lang=2&reg=3

Ministry of Heavy Industries:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2224549&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2199441&lang=1&reg=3

https://heavyindustries.gov.in/sites/default/files/2025-12/scheme_notification_0.pdf

Ministry of Steel:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2186218&reg=48&lang=2

Ministry of Railways:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2118452&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2248962&lang=2&reg=48

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1753953

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2282449&lang=1&reg=20

Ministry of Chemicals and Fertilizers:

https://pharma-dept.gov.in/sites/default/files/Annual%20Report%202025-26.pdf

Ministry of Statistics & Programme Implementation:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298236&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2304222&lang=2&reg=48

Ministry of Science & Technology:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2243033&lang=1&reg=3

Ministry of New and Renewable Energy:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2116602&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250039&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2271289&lang=1&reg=3

Department of Atomic Energy:

https://www.nfc.gov.in/news-and-events.html

Indian Space Research Organisation (ISRO):

https://www.isro.gov.in/vikram3201.html

PIB Archives:

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150923&lang=1&reg=20

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286949&lang=1&reg=48

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=158442&lang=9&reg=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=154717&lang=1&reg=20

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=156676&lang=2&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2270740&lang=1&reg=3

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=160099&ModuleId=3&reg=48&lang=1

Click here to see PDF

 

***

 

(Explainer ID: 160207) आगंतुक पटल : 9
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Bengali , Kannada , Malayalam