• Sitemap
  • Advance Search
Infrastructure

క్యూల నుంచి క్లిక్ల వరకు: భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ నాలుగు దశాబ్దాల ప్రస్థానం

Posted On: 06 AUG 2026 2:10PM

క్యూల నుంచి క్లిక్ల వరకు ప్రయాణికుల రిజర్వేషన్విధానంలో భారతీయ రైల్వే  సమూల మార్పు తీసుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా రిజర్వేషన్వ్యవస్థల్లో ఒకటైన దీనిని ఇప్పుడు నూతన సాంకేతికత నడిపిస్తోంది. నిరంతర ఆధునికీకరణ వల్ల టికెట్బుకింగ్మరింత వేగంగా, విశ్వసనీయంగా మారింది. ఆధునికీకరించిన ప్రయాణికుల రిజర్వేషన్వ్యవస్థ మరింత మెరుగైన, అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది.

రైల్వే రిజర్వేషన్లకు వెన్నెముక

ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకటైన భారతీయ రైల్వే ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను అనుసంధానిస్తోంది. ఉద్యోగం, విద్య, వైద్యం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం ప్రయాణించే వారంతా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకునేందుకు విశ్వసనీయ రిజర్వేషన్వ్యవస్థపై ఆధారపడతారు. ప్రతి రిజర్వ్డ్టికెట్వెనుక ప్రయాణికుల రిజర్వేషన్వ్యవస్థ (పీఆర్ఎస్‌) ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రైల్వే బుకింగ్లకు సాంకేతిక ఆధారిత వెన్నెముకగా ఇది పనిచేస్తోంది. 1986లో ప్రవేశపెట్టిన పీఆర్ఎస్మొదట మానవ ఆధారిత రిజర్వేషన్కౌంటర్ల స్థానాన్ని భర్తీ చేసింది. ఆ తర్వాత ఆన్లైన్‌, మొబైల్టికెట్బుకింగ్కు మద్దతు ఇచ్చే స్థాయికి పరిణామం చెందింది.

వినియోగదారుల సంఖ్య, ఆన్లైన్సేవల వినియోగం పెరగడంతో వేగవంతమైన, విశ్వసనీయమైన, అవాంతరాలు లేని బుకింగ్సదుపాయాలపై అంచనాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా తత్కాల్రిజర్వేషన్ల సమయంలో గరిష్ఠ బుకింగ్వేళల్లో భారీ డిమాండ్ఏర్పడుతోంది. గత కాలపు అవసరాలకు అనుగుణంగా రూపొందించిన మౌలిక సదుపాయాలపై ఇది తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. మారుతున్న ఈ అవసరాలను తీర్చేందుకు భారతీయ రైల్వే పీఆర్ఎస్ను సమగ్రంగా ఆధునికీకరిస్తోంది. కొత్త పీఆర్ఎస్బుకింగ్సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణికుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే సదుపాయాలను ప్రవేశపెట్టి, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే ఆన్లైన్మౌలిక వ్యవస్థను రూపొందిస్తుంది.

నాలుగు దశాబ్దాల ప్రయాణికుల రిజర్వేషన్వ్యవస్థ ప్రస్థానం

దేశవ్యాప్త రైల్వే నెట్వర్క్లో రిజర్వ్డ్ టికెట్ల జారీని పీఆర్ఎస్పర్యవేక్షిస్తుంది. సీట్ల కేటాయింపులు, వెయిటింగ్ లిస్టులు, ఆర్ఏసీ నిర్వహణ, చార్టుల తయారీ వంటి విధులను ఇది నిర్వహిస్తుంది. ఈ విధానం వల్ల రిజర్వేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా మారింది.

మానవ ఆధారిత రిజర్వేషన్రిజిస్టర్లు, కౌంటర్బుకింగ్స్థానంలో పీఆర్ఎస్ఎలక్ట్రానిక్వ్యవస్థను ప్రవేశపెట్టింది. రైల్వే నెట్వర్క్విస్తరించిన కొద్దీ దేశవ్యాప్త రిజర్వేషన్వేదికగా పీఆర్ఎస్పరిణామం చెందింది. దేశంలోని ఏ రైలుకైనా ఒకే ప్రాంతం నుంచి టికెట్లు బుక్చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించింది. ప్రస్తుతం కౌంటర్లు, వెబ్సైట్లు, మొబైల్యాప్ల ద్వారా రిజర్వేషన్లకు పీఆర్ఎస్మద్దతు ఇస్తోంది. ఆన్లైన్రిజర్వేషన్ల కోసం ప్రయాణికులు భారతీయ రైల్వే క్యాటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్‌, మొబైల్యాప్ద్వారా పీఆర్ఎస్ను వినియోగిస్తారు. అవాంతరాలు లేని డిజిటల్వేదిక ద్వారా ఎక్కడి నుంచైనా రిజర్వ్డ్టికెట్లు బుక్చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

మానవ ఆధారిత రిజర్వేషన్రిజిస్టర్లు, కౌంటర్బుకింగ్స్థానంలో పీఆర్ఎస్ఎలక్ట్రానిక్వ్యవస్థను ప్రవేశపెట్టింది. రైల్వే నెట్వర్క్విస్తరించిన కొద్దీ కంప్యూటరీకృత మెరుగైన రిజర్వేషన్‌, టికెటింగ్దేశవ్యాప్త నెట్వర్క్‌ (కాన్సర్ట్‌) ద్వారా పీఆర్ఎస్జాతీయ రిజర్వేషన్వేదికగా పరిణామం చెందింది. రైలు బయలుదేరే లేదా గమ్యస్థానంతో సంబంధం లేకుండా అనుసంధానిత రిజర్వేషన్కేంద్రం నుంచి దేశంలోని ఏ రైలుకైనా టికెట్లు బుక్చేసుకునేందుకు ఇది ప్రయాణికులకు వీలు కల్పించింది. కాలక్రమంలో రిజర్వేషన్కౌంటర్లకు పరిమితమైన బుకింగ్మార్గాలు వెబ్సైట్లు, మొబైల్యాప్లకు విస్తరించాయి. ప్రస్తుతం ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్‌, మొబైల్యాప్ద్వారా ఆన్లైన్లో పీఆర్ఎస్ను వినియోగిస్తూ ఎక్కడి నుంచైనా రిజర్వ్డ్టికెట్లు బుక్చేసుకుంటున్నారు.

పీఆర్ఎస్పరిణామంలో కీలక మైలురాళ్లు

సంవత్సరం

మైలురాయి

1986

పీఆర్ఎస్ప్రవేశంతో భారత్లో రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణకు నాంది పలికింది.

1990 లు

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు పీఆర్ఎస్నెట్వర్క్విస్తరించింది. దీంతో దేశంలోని ఎక్కడి నుంచైనా టికెట్ రిజర్వేషన్లకు అవకాశం లభించింది.

2002

ఇంటర్నెట్ఆధారిత టికెట్బుకింగ్ను ప్రవేశపెట్టడంతో కౌంటర్ల అవసరం లేకుండానే టికెట్లు పొందే అవకాశం లభించింది.

2014

ఆన్లైన్బుకింగ్సామర్థ్యం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు తదుపరి తరం ఈటికెటింగ్వ్యవస్థను (ఎన్జీఈటీ) ప్రారంభించారు.

2025

రైల్వన్యాప్ను ప్రారంభించారు. గణనీయంగా మెరుగైన బుకింగ్‌, విచారణ సామర్థ్యంతో తదుపరి తరం పీఆర్ఎస్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

2026 ఆగస్టు

ఆధునికీకరించిన పీఆర్ఎస్కు రైళ్లను దశలవారీగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. రైల్వే రిజర్వేషన్ల డిజిటల్పరివర్తనలో ఇది కొత్త దశకు నాంది పలికింది.

 

ఈ చర్యలు పారదర్శకతను పెంచడంతో పాటు పనితీరును మెరుగుపరిచాయి.

పీఆర్ఎస్‌: భారీ స్థాయిలో పనిచేసే డిజిటల్వేదిక

2025 జూన్నుంచి 2026 జూన్మధ్య ప్రయాణికులు పీఆర్ఎస్ద్వారా 65.08 కోట్ల రిజర్వ్డ్టికెట్లను బుక్చేసుకున్నారు. వీటిలో 57.90 కోట్ల టికెట్లను, అంటే 89 శాతాన్ని ఆన్లైన్లో బుక్చేశారు. రైలు ప్రయాణికులు డిజిటల్సేవలను వేగంగా స్వీకరిస్తున్నట్లు ఇది తెలియజేస్తోంది.

ప్రస్తుతం పీఆర్ఎస్ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్రైల్వే బుకింగ్వేదికల్లో ఒకటిగా ఉంది. రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం దీన్ని అభివృద్ధి చేసి, నిర్వహిస్తోంది. పలు బుకింగ్మార్గాల ద్వారా ప్రతిరోజూ 20.5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు ఇది సేవలు అందిస్తోంది. పీఆర్ఎస్లావాదేవీల్లో దాదాపు 73 శాతం నగదు రహితంగా జరుగుతున్నాయి. దేశంలో ప్రజలు నేరుగా వినియోగించే అతిపెద్ద ఆన్లైన్వేదికల్లో ఒకటిగా పీఆర్ఎస్పరిణామం చెందింది.

 

 

డిజిటల్ఇండియా లక్ష్యాల వైపు

భారతీయ రైల్వే పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మరింత భద్రమైన మరియు వేగవంతమైన బుకింగ్ వ్యవస్థను నిర్మిస్తోంది.

రిజర్వేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రైల్వే శాఖ పలు కీలక సంస్కరణలను చేపట్టింది::

  • ప్రయాణికుల బుకింగ్ధోరణులకు  సరళికి అనుగుణంగా ముందస్తు రిజర్వేషన్వ్యవధిని (ఏఆర్పీ) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు.
  • న్యాయబద్ధత, పారదర్శకతను మెరుగుపరచేందుకు 2025 జులైలో ఆధార్ధ్రువీకరణతో కూడిన తత్కాల్బుకింగ్ను ప్రవేశపెట్టారు.
  • ఆటోమేటెడ్బాట్లు, అనధికార ఏజెంట్ల నియంత్రణకు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణను చేర్చారు. ఇటానియం సర్వర్లు, ఓపెన్వీఎంఎస్వేదికపై 2010లో ఏర్పాటు చేసిన ప్రస్తుత పీఆర్ఎస్ను అప్పటి డిజిటల్డిమాండ్కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడు దీన్ని క్లౌడ్సదుపాయంతో కూడిన తదుపరి తరం రిజర్వేషన్వ్యవస్థగా ఆధునికీకరిస్తున్నారు.

ఆధునికీకరించిన ఈ పీఆర్ఎస్విశేషాలు ఇవే:

  • ప్రస్తుత వ్యవస్థలో నిమిషానికి 32 వేల టికెట్బుకింగ్లతో పోలిస్తే 1.5 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్సామర్థ్యం.
  • ప్రస్తుత నిమిషానికి 4 లక్షల విచారణల స్థానంలో 40 లక్షలకు పైగా విచారణలను నిర్వహించే సామర్థ్యం.
  • బుకింగ్‌, విచారణల కోసం పలు భాషల్లో వినియోగదారులకు అనుకూలమైన వ్యవస్థ.
  • భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అపరిమిత విస్తరణ సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది.

 

 

ఐఆర్సీటీసీ వెబ్సైట్ను కూడా సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. 2026 జూలైలో ప్రారంభమైన కొత్త వెర్షన్లో బుకింగ్ దశలను తగ్గించి సులభతరం చేశారు. ఈ కొత్త పోర్టల్ తదుపరి తరం పీఆర్ఎస్తో కలిసి పనిచేస్తుంది.

రైల్వే టికెటింగ్తో పాటు ఐఆర్సీటీసీ తన పర్యాటక వేదిక ద్వారా హోటల్బుకింగ్లు, విశ్రాంతి గదులు, లాంజ్బుకింగ్లు, పర్యాటక ప్యాకేజీలు, విమాన టికెట్లు, బస్సు టికెట్లు వంటి ప్రయాణ సంబంధిత సేవలను కూడా అందిస్తోంది.

సీఆర్ఐఎస్‌ (క్రిస్): రైల్వే సాంకేతిక సారథి

1986లో ఏర్పాటైన రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సీఆర్ఐఎస్‌) భారతీయ రైల్వేకు అవసరమైన సమాచార సాంకేతిక మౌలిక వ్యవస్థను రూపొందించి, అభివృద్ధి చేసి, నిర్వహిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాల్లో రైల్వే బుకింగ్ల కంప్యూటరీకరణ నుంచి సమగ్ర డిజిటల్వేదికల అభివృద్ధి వరకు క్రిస్విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థ రూపొందించిన పరిష్కారాలు ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి సేవలు అందిస్తున్నాయి.

ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్సేవలు

ప్రయాణికులు భారతీయ రైల్వే సేవలను వినియోగించే విధానాన్ని మార్చిన పీఆర్ఎస్తో సహా పలు వేదికలను క్రిస్అభివృద్ధి చేసింది.

రిజర్వేషన్లేని టికెటింగ్వ్యవస్థ (యూటీఎస్‌): రిజర్వేషన్అవసరం లేని ప్రయాణాలకు కాగితరహిత, మొబైల్టికెటింగ్కు మద్దతు ఇస్తుంది.

జాతీయ రైలు విచారణ వ్యవస్థ (ఎన్టీఈఎస్‌): రైళ్ల రాకపోకల తాజా స్థితి, సమయ పట్టికలు, రాక లేదా బయలుదేరే వివరాలను అందిస్తుంది.

రైల్కనెక్ట్‌: 2017లో ప్రవేశపెట్టిన రైల్కనెక్ట్మొబైల్యాప్పీఆర్ఎస్సేవలను స్మార్ట్ఫోన్లకు తీసుకొచ్చింది. ఆన్లైన్టికెట్బుకింగ్‌, టికెట్రద్దు, పీఎన్ఆర్విచారణలకు ఇది వీలు కల్పించింది.

 

రైల్వన్‌: 2025 జులైలో ప్రారంభించిన రైల్వన్ఒక సమగ్ర మొబైల్యాప్‌. రైల్వే సేవలను సులభంగా పొందేందుకు పలు విధులను ఒకే వ్యవస్థలో అందిస్తుంది. జులై 22 నాటికి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్పరికరాల్లో ఈ యాప్‌ 4.55 కోట్లకు పైగా డౌన్లోడ్లను నమోదు చేసింది. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 9.65 లక్షల టికెట్బుకింగ్లకు వీలు కల్పిస్తోంది. కృత్రిమ మేధ ఆధారిత నిరీక్షణ జాబితా టికెట్ఖరారు అంచనా దీని తాజా సదుపాయాల్లో ఒకటి. టికెట్బుకింగ్సమయంలోనే నిరీక్షణ జాబితాలోని టికెట్ప్రయాణానికి ముందుగా ఖరారయ్యే అవకాశాన్ని ఇది అంచనా వేస్తుంది. అంచనా కచ్చితత్వం 53 శాతం నుంచి 94 శాతానికి మెరుగుపడటంతో ప్రయాణికులు పూర్తి సమాచారంతో ప్రయాణ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.

రైల్మదద్‌: ప్రయాణికుల ఫిర్యాదులు, అభిప్రాయాలు, సేవా అభ్యర్థనలకు సమగ్ర వేదికను అందిస్తుంది. రైల్మదద్వెబ్సైట్‌, మొబైల్యాప్‌, సంక్షిప్త సందేశం, రైల్వే సహాయవాణి 139 ద్వారా ప్రయాణికులు సహాయం పొందవచ్చు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు ఈ వేదిక ఆటోమేటిక్ఫిర్యాదు కేటాయింపు, ఉన్నతస్థాయికి స్వయంచాలక బదిలీ వ్యవస్థలను వినియోగిస్తుంది. గత మూడేళ్లలో పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలు:

సంవత్సరం

పరిష్కరించిన ఫిర్యాదుల శాతం

2023-24

99.98%

2024-25

99.99%

2025-26

99.98%

  • కోచ్మిత్ర: ప్రయాణ సమయంలో పరిశుభ్రత, ఇతర సహాయం వంటి రైల్లోని సదుపాయాలను కోరేందుకు ప్రయాణికులకు సహాయపడుతుంది.
  • రైల్సుగమ్‌: రైల్వే సేవలు, సరకు రవాణా, ప్రయాణికుల సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
  • రైల్రాజభాష: డిజిటల్సాధనాల ద్వారా రైల్వే పరిపాలనలో హిందీ వినియోగానికి మద్దతు ఇస్తుంది.

రైల్వే కార్యకలాపాలకు సాంకేతిక అండ

ప్రయాణికుల సేవలకు మించి రైల్వే సామర్థ్యాన్ని మెరుగుపరిచే డిజిటల్వ్యవస్థలను క్రిస్అభివృద్ధి చేసింది.

  • సరుకు రవాణా కార్యకలాపాల సమాచార వ్యవస్థ (ఎఫ్ఓఐఎస్‌): సరకు రవాణా, వ్యాగన్ల నిర్వహణ, రవాణా ప్రణాళికను డిజిటలీకరిస్తుంది.
  • సిబ్బంది నిర్వహణ వ్యవస్థ (సీఎంఎస్‌): సిబ్బంది విధుల ప్రణాళిక, నియామకం, పర్యవేక్షణను క్రమబద్ధీకరిస్తుంది.
  • దృష్టి: రైల్వే పనితీరు, కార్యాచరణ సూచికల పర్యవేక్షణకు డ్యాష్బోర్డులను అందిస్తుంది.
  • ఆపూర్తి: సేకరణ, టెండర్ల నిర్వహణ ప్రక్రియలను డిజిటలీకరిస్తుంది.
  • చాలక్దళ్‌, చేతితో పట్టుకునే టెర్మినళ్లు: క్షేత్రస్థాయి కార్యకలాపాలు, తనిఖీలు, తాజా పరిస్థితుల పర్యవేక్షణకు మద్దతు ఇస్తాయి.

వర్ధమాన సాంకేతికతల స్వీకరణ

అధునాతన డిజిటల్పరిష్కారాల ద్వారా రైల్వే సాంకేతికతను క్రిస్నిరంతరం ఆధునికీకరిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యసనం (ఎంఎల్‌), భారీ సమాచార విశ్లేషణ, క్లౌడ్కంప్యూటింగ్ను స్వీకరిస్తోంది. రైల్వే అనువర్తనాల్లో బ్లాక్చైన్‌, అంతర్జాల ఆధారిత పరికరాల అనుసంధానం (ఐఓటీ), ఆగ్మెంటెడ్‌/వర్చువల్రియాలిటీ (ఏఆర్‌/వీఆర్‌) సాంకేతికతలను కూడా వినియోగిస్తోంది. ఈ సాంకేతికతలను కింది అవసరాలకు ఉపయోగిస్తున్నారు:

  • రైళ్ల ఆలస్యం, నిరీక్షణ జాబితా టికెట్ల ఖరారును అంచనా వేయడం.
  • రైలు మార్గాలు, సమయ పట్టికలను మరింత సమర్థంగా రూపొందించడం.
  • ఇంధన వినియోగాన్ని అంచనా.
  • రైల్వే ఆస్తులకు ముందస్తు నిర్వహణ.
  • ప్రణాళిక, కార్యాచరణ నిర్ణయాలను మెరుగుదల.

తదుపరి తరం పీఆర్ఎస్ఈ సాంకేతిక పునాదిపై రూపుదిద్దుకుంటోంది. వేగవంతమైన, తెలివైన, విస్తరణ సామర్థ్యం కలిగిన రిజర్వేషన్వేదికను రూపొందించేందుకు క్లౌడ్ఆధారిత మౌలిక వ్యవస్థను అధునాతన డిజిటల్సాంకేతికతలతో మేళవిస్తుంది.

భవిష్యత్తుకు సిద్ధమైన రిజర్వేషన్వ్యవస్థ

దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ రైల్వేలో కొనసాగుతున్న డిజిటల్పరివర్తనకు ప్రయాణికుల రిజర్వేషన్వ్యవస్థ అద్దం పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులు విశ్వసించే రిజర్వేషన్వేదికగా ఇది నిలిచింది. ఈ బలమైన పునాదిపై తదుపరి తరం పీఆర్ఎస్రూపుదిద్దుకుంటోంది. ఇవి సమష్టిగా వేగవంతమైన, విశ్వసనీయమైన, అవాంతరాలు లేని రైల్వే సేవలను అందిస్తాయి. ప్రయాణికుల అవసరాలు నిరంతరం మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తుకు సిద్ధమైన రిజర్వేషన్వ్యవస్థను భారతీయ రైల్వే నిర్మిస్తోంది.

 

References

Centre for Railway Information Systems:

https://cris.org.in/loadpage?page=indexNew#home

Ministry of Railways

https://indianrail.gov.in/enquiry/PNR/PnrEnquiry.jsp

https://sr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,4,268&dcd=19160&did=17678519509983E5D5568AFF4D66322B878236BFF8C69

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1685036&reg=48&lang=2

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1566211&lang=2&reg=48

https://indianrailways.gov.in/railwayboard/uploads/directorate/eff_res/work_Study/2019-20/208_SR_2019-20.pdf

https://www.pmf.irctc.co.in/cn/TermsAndConditions.html

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2141145&reg=48&lang=2

https://indianrailways.gov.in/railwayboard/uploads/directorate/eff_res/work_Study/2019-20/81_NR_2019-20.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258800&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2154363&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2140614&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285066&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2065879&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2135694&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1486017&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2140614&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287719&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1514686&reg=48&lang=2

 

***

(Explainer ID: 159821) आगंतुक पटल : 59
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Tamil , Telugu , Kannada , Malayalam