• Sitemap
  • Advance Search
Economy

ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు

అన్ని జిల్లాల‌కు ఎగుమ‌తి అవ‌కాశాల‌ విస్త‌ర‌ణ‌

Posted On: 02 SEP 2026 11:38AM

భారతదేశ‌ ఎగుమతి ప్రస్థానం విశేష వృద్ధిని నమోదు చేసినప్పటికీఈ వేగాన్ని కొనసాగించేందుకు మరింత సమ్మిళిత అభివృద్ధి విధానం అవసరం. ప్రపంచస్థాయి సామర్థ్యం కలిగిన ఉత్పత్తులుసేవలను గుర్తించడంస్థానిక ఉత్పత్తిదారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ప్రతి జిల్లాను ఎగుమతి ప్రణాళిక కేంద్రంగా మార్చే ‘ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమం సమ్మిళిత ఎగుమతి వృద్ధి సాధనకు ఒక వ్యవస్థను అందిస్తోంది. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’(ఓడీఓపీ) భావన ఆధారంగా కేంద్రరాష్ట్ర పథకాలుసంస్థలుపరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే సమన్వయ విధానాన్ని ఈ కార్యక్రమం అనుసరిస్తోంది. జిల్లాస్థాయి సామర్థ్యాలను వెలికితీసిఅంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఉపాధి కల్పనకు ఊతమిస్తూసూక్ష్మచిన్నమధ్య తరహా సంస్థలను బలోపేతం చేస్తోంది. భారత ఎగుమతి వృద్ధిని మరింత సమ్మిళితంగాప్రపంచస్థాయి పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దుతోంది.

 

భార‌త్‌కు జిల్లా ఆధారిత ఎగుమతి నమూనా అవ‌స‌ర‌మేంటి?

భారత వృద్ధి ప్రస్థానానికి ఎగుమతులు కీలక చోదకశక్తిగా మారాయి. విదేశీ మార్కెట్ల నుంచి ఆర్జించే ప్రతి రూపాయి దేశంలో ఉపాధిఆదాయంపరిశ్రమలకు తోడ్పడుతుంది. భారత వస్తుసేవల మొత్తం ఎగుమతులు 2024–25లో రికార్డు స్థాయిలో 825.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. 2025–26లో ఇవి మరింత పెరిగి 863.11 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరినట్లు అంచనా. దశాబ్దాలుగా ఎగుమతి కార్యకలాపాలు కొన్ని స్థిరపడిన పారిశ్రామిక సమూహాలుఓడరేవు నగరాలకే పరిమితమయ్యాయి. ప్రత్యేకమైననాణ్యమైన ఉత్పత్తులు ఉన్నప్పటికీ చిన్న పట్టణాలుగ్రామీణ జిల్లాలుమారుమూల ప్రాంతాలు ఎగుమతి సరకు జాబితాల్లో అరుదుగా చోటు పొందాయి. బస్తర్‌ ఇనుప హస్తకళలుజల్‌గావ్‌ అరటిపండ్లుమేఘాలయ మాండరిన్ నారింజలు ఈ అపారమైన సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచాయి.

 

ఈ అవకాశాన్ని గుర్తించిన ప్రభుత్వం ‘ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమం రూపంలో జిల్లా ఆధారిత ఎగుమతి వ్యూహాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లా తన ప్రత్యేక సామర్థ్యాలను ఉపయోగించుకొని భారత ఎగుమతి వృద్ధికి తోడ్పడేందుకు ఇది వీలు కల్పిస్తోంది.

 

ఓడీఓపీ నుంచి డీఈహెచ్ వరకు: వ్యవస్థ పరిణామం

ప్రతి జిల్లా సామర్థ్యాలువనరులను వినియోగించుకొని దాని ఎగుమతి అవకాశాలను వెలికితీసేందుకు ‘ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి జిల్లాను కేవలం ఉత్పత్తి విభాగంగా కాకుండా ఎగుమతి ప్రణాళిక విభాగంగా పరిగణిస్తున్నారు. స్థానిక సంస్థలు ప్రపంచ మార్కెట్లను చేరుకోవడంపోటీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంజిల్లా ఆధారిత ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంలో ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. ఆత్మనిర్భర్ భారత్వోకల్ ఫర్ లోకల్ విస్తృత దార్శనికతకు కూడా ఇది అనుగుణంగా ఉంది.

 

ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమ ప్రస్థానం ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’తో మొదలైంది. ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేక ఉత్పత్తిని ఎంపిక చేసిదానికి బ్రాండ్ గుర్తింపు కల్పించిప్రోత్సహించడం ద్వారా స్థానిక గుర్తింపును ఆర్థిక అవకాశంగా మార్చాలని ఓడీఓపీ లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ విధానాన్ని బలోపేతం చేసేందుకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ పరిధిలోని డీఈహెచ్ కార్యక్రమం ద్వారా కేంద్ర వాణిజ్య విభాగం... ఉత్పత్తుల ప్రోత్సాహం నుంచి సమగ్ర ఎగుమతి ప్రోత్సాహంసంబంధిత వ్యవస్థ బలోపేతం వరకు దృష్టిని విస్తరించింది. 2026 జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలను ఈ కార్యక్రమం కవర్ చేసింది. కార్యక్రమం విస్తరిస్తున్న పరిధిసమగ్ర ఎగుమతి ప్రణాళికతో పెరుగుతున్న అనుసంధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

 

డీఈహెచ్‌ను నిధుల పథకంగా కాకుండా సమన్వయ వ్యవస్థగా అర్థం చేసుకోవాలి. ప్రత్యేక ఆర్థిక పథకాన్ని ప్రవేశపెట్టకుండా ప్రస్తుతం అమలవుతున్న వివిధ కేంద్రరాష్ట్ర పథకాల్లోని నిధులను డీఈహెచ్ వినియోగించుకుంటుంది. క్షేత్రస్థాయిలో ఎగుమతులుతయారీఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. జిల్లాల వారీ ఎగుమతి సవాళ్లను పరిష్కరించివాటి ఎగుమతి పోటీ సామర్థ్యాన్ని పెంచుతుంది.

 

మీకు తెలుసా?

ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ కార్యక్రమం 2018లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యక్రమంగా ప్రారంభమైంది. మొరాదాబాద్‌ ఇత్తడి పరిశ్రమను కేంద్రంగా చేసుకొని రూపొందించిన ఈ కార్యక్రమాన్ని తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించారు.

 

A blue and white timeline with icons

సంస్థాగత వ్యవస్థ

కేంద్రంరాష్ట్రాలుజిల్లాల మధ్య వివిధ స్థాయుల్లో సమన్వయంతో డీఈహెచ్ పనిచేస్తుంది. కేంద్ర వాణిజ్య విభాగం సమగ్ర విధానపరమైన దిశను నిర్దేశిస్తుంది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ అమలుకు నాయకత్వం వహిస్తూ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని సులభతరం చేసిపురోగతిని పర్యవేక్షిస్తుంది.

 

రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు అమలుకు మార్గనిర్దేశం చేసివివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని నిర్ధారిస్తాయి.

జిల్లా స్థాయిలో జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు ఎగుమతి అవకాశాలను గుర్తించిస్థానిక సవాళ్లను పరిష్కరిస్తాయి. పరిశ్రమలుఎగుమతిదారులుఇతర భాగస్వాములతో సమన్వయం చేస్తాయి.

 

జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ఎగుమతి సామర్థ్యం ఉన్న ఉత్పత్తులుసేవలను ఈ ప్రణాళికలు గుర్తిస్తాయి. మౌలిక వసతులురవాణా సదుపాయాలను అంచనా వేసిఎగుమతులకు అడ్డంకులను గుర్తిస్తాయి. పోటీ సామర్థ్యంమార్కెట్ అందుబాటును మెరుగుపరిచే చర్యలను కూడా సిఫారసు చేస్తాయి. 2026 మార్చి నాటికి 590 జిల్లాలకు ముసాయిదా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటిలో 249 ప్రణాళికలను సంబంధిత జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు అధికారికంగా ఆమోదించాయి.

 

జిల్లాస్థాయి ఎగుమతి వ్యవస్థల నిర్మాణం

ఎగుమతులకు పోటీ సామర్థ్యం కలిగిన ఉత్పత్తి ఒక్కటే సరిపోదు. జిల్లాల్లో ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచడంఎగుమతి సంబంధిత రవాణానాణ్యతా ప్రమాణాలుమార్కెట్ అందుబాటుపై అవగాహన లోపాలను పరిష్కరించడం ద్వారా ఎగుమతులకు సంసిద్ధతను బలోపేతం చేసేందుకు డీఈహెచ్ తోడ్పడుతుంది.

 

ఉత్పత్తులుసేవల గుర్తింపు

జిల్లాల్లో ఎగుమతికి అనువైన ఉత్పత్తులుసేవలను డీఈహెచ్ గుర్తిస్తుంది. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులువ్యవసాయ సమూహాలుబొమ్మల తయారీ సమూహాలుఇంజినీరింగ్ వస్తువులు తదితరాలు ఇందులో ఉన్నాయి. జిల్లాల వారీ గుర్తింపు లక్షిత ఎగుమతి వ్యూహాలను రూపొందించేందుకు తోడ్పడుతుంది. ఎగుమతి సామర్థ్యం కలిగిన కొన్ని ఉత్పత్తులు:

ఉత్పత్తి

జిల్లా

రాష్ట్రం

సిరామిక్‌టైల్స్‌బంగాళాదుంప

సబర్‌కాంతా

గుజరాత్

ఖనిజాలువ్యవసాయ ఉత్పత్తుల శుద్ధిగాజుటైల్స్‌

అరావళి

గుజరాత్

జల్‌గావ్ అరటిపండుజల్‌గావ్ భరిత్ వంకాయ

జల్‌గావ్

మహారాష్ట్ర

నారింజ

అగర్ మాల్వా

మధ్యప్రదేశ్

బస్తర్ ఇనుప హస్తకళలుబియ్యంజొన్నమొక్కజొన్న

బస్తర్

ఛత్తీస్‌గఢ్

వెదురు హస్తకళలుజీడిపప్పు

జామ్‌తారా

ఝార్ఖండ్

జిల్లాల వారీ డీఈహెచ్ ఉత్పత్తుల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

 

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా

గుర్తించిన తర్వాత ఈ ఉత్పత్తులు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవాలి. నాణ్యతా ప్రమాణాలుపరీక్షా సదుపాయాలుప్యాకేజింగ్‌బ్రాండింగ్‌ధ్రువీకరణపై అవగాహన పెంచడంసామర్థ్య నిర్మాణానికి డీఈహెచ్ మద్దతు ఇస్తుంది. ప్రపంచస్థాయి నిబంధనలను స్థానిక ఉత్పత్తులు నెరవేర్చేందుకు ఇది తోడ్పడుతుంది.

 

డిజిటల్ ఎగుమతులకు అవకాశం

డిజిటల్ సదుపాయాలు స్థానిక స్థాయిలోనూ విస్తృత చేరువకు వీలు కల్పించిమారుమూల ప్రాంతాల్లోని వ్యాపారాలతో సహా అన్ని సంస్థలకు మార్కెట్ అవకాశాలను పెంచాయి. డీఈహెచ్ కింద అమెజాన్‌షిప్‌రాకెట్‌డీహెచ్‌ఎల్‌ వంటి ఈ–కామర్స్ వేదికలతో భాగస్వామ్యాలు... రవాణా ఛార్జీల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించేందుకు సూక్ష్మచిన్నమధ్య తరహా సంస్థలకు తక్కువ ఖర్చుతో కూడిన కొరియర్‌ రవాణా ప్రత్యామ్నాయాలను అందిస్తున్నాయి. పత్రాల నిర్వహణప్యాకేజింగ్‌చిన్న సరకు రవాణా కోసం తక్కువ ఖర్చుతో కూడిన తపాలా ఎగుమతి సదుపాయాలను అందిస్తూ డాక్‌ ఘర్ నిర్యాత్ కేంద్రాలు ఈ పరిధిని మరింత విస్తరిస్తున్నాయి.

 

సామర్థ్య నిర్మాణంప్ర‌చార కార్య‌క్ర‌మాలు

ఎగుమతులకు సంసిద్ధతను పెంచేందుకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ప్రాంతీయ కార్యాలయాలుజిల్లా యంత్రాంగాలు సంయుక్తంగా రవాణా ప్రణాళికఎగుమతి ప్రక్రియలుప్యాకేజింగ్ ప్రమాణాలునియంత్రణ నిబంధనల అనుసరణపై సామర్థ్య నిర్మాణఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఈసీజీసీ)హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక మండలి(ఈపీసీహెచ్‌)ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఎక్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్స్‌(ఎఫ్ఐఈఓ)కేంద్ర సూక్ష్మచిన్నమధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖభారత తపాలా విభాగంఎగ్జిమ్ బ్యాంక్ వంటి వివిధ భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు చురుగ్గా సహకరిస్తున్నాయి. గుర్తించిన సమస్యలను అధిగమించేందుకు ఎగుమతిదారులకు ఈ కార్యక్రమాలు విలువైన నైపుణ్యాలను అందించాయి. చెల్లింపుల సమస్యలువిశ్వసనీయతకొనుగోలుదారుల ధ్రువీకరణ వంటి ఈ–కామర్స్ స్వీకరణతో ముడిపడిన సవాళ్లపై అవగాహన పెంచడంపైనా ఇవి దృష్టి సారిస్తున్నాయి.

 

అభివృద్ధికి క్షేత్రస్థాయి కార్యక్రమాల ప్రోత్సాహం

ప్రత్యేక సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా డీఈహెచ్‌కు మద్దతు లభిస్తోంది. ఎంపిక చేసిన జిల్లాల్లో ఎగుమతి వ్యవస్థలను బలోపేతం చేసేందుకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఎగ్జిమ్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా ఎగ్జిమ్ బ్యాంక్ గ్రాస్‌రూట్స్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్‌మెంట్‌(గ్రిడ్) కార్యక్రమం కింద సహాయం కోసం అనంతపురంరాయ్‌పూర్‌సోలన్‌తిరుప్పూర్‌కాన్పూర్‌కొల్హాపూర్‌ జిల్లాలను ఎంపిక చేశారు. రంగాల వారీ సమస్యలను పరిష్కరించడంసంభావ్య లబ్ధిదారులను గుర్తించడంఎగుమతి పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు జిల్లాల వారీ చర్యలను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

 

మీకు తెలుసా?

భారత నిట్‌వేర్ రాజధానిగా పేరొందిన తిరుప్పూర్‌ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ₹46,000 కోట్ల ఎగుమతులను సాధించింది. 2030 నాటికి ₹1 లక్ష కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని తిరుప్పూర్ ఎగుమతిదారుల సంఘం నిర్దేశించుకుంది. 2030 నాటికి భారత వస్త్ర ఎగుమతులను 38 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచాలన్న దేశ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది.

 

డీఈహెచ్ అమలుకు లక్షిత విధానం

అమలును వేగవంతం చేసేందుకు 2026 జూన్ 1 నుంచి ‘ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమం కింద ఫలితాల ఆధారితలక్షితదశలవారీ విధానాన్ని ప్రభుత్వం స్వీకరించింది. తొలి దశలో 27 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లాలను కార్యక్రమ పరిధిలోకి తీసుకొచ్చారు. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్‌కు చెందిన 24 ప్రాంతీయ కార్యాలయాలు, 11 భాగస్వామ్య సంస్థలు మద్దతు అందిస్తున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న కేంద్రరాష్ట్ర పథకాల మధ్య సమన్వయంభౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులుసూక్ష్మచిన్నమధ్య తరహా సంస్థల సమూహాల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ కొత్త ఎగుమతిదారుల నమోదుఎగుమతుల విలువ పెంపు వంటి కొలవదగిన ఫలితాలపై దృష్టి పెట్టారు.

 

దీర్ఘకాలంగా కొనసాగుతున్న నిర్మాణాత్మక అవరోధాలను జిల్లాలు అధిగమించడంస్థానిక ఉత్పత్తి సామర్థ్యాలను ఎగుమతి అవకాశాలుగా మార్చడంలో డీఈహెచ్ వ్యవస్థ తోడ్పడుతోంది.

 

భ‌విష్య‌త్తు మార్గం

కొన్ని పారిశ్రామిక కేంద్రాల్లోనే వృద్ధిని కేంద్రీకరించే విధానం నుంచి ప్రతి జిల్లా సామర్థ్యాన్ని వెలికితీసే దిశగా భారత ఎగుమతి వ్యూహంలో వచ్చిన మార్పుకు ‘ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు’ కార్యక్రమం నిదర్శనం. స్థానిక సామర్థ్యాలకు మెరుగైన ఎగుమతి నైపుణ్యంమార్కెట్ అందుబాటుసంస్థాగత మద్దతును జోడించడం ద్వారా మరింత సమ్మిళితమైనదృఢమైన ఎగుమతి వ్యవస్థను ఈ కార్యక్రమం నిర్మిస్తోంది.

 

ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో కేంద్రంరాష్ట్రాలుజిల్లాల మధ్య బలమైన సమన్వయం అత్యంత కీలకం. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థలను వాణిజ్యంపెట్టుబడులుఉపాధికి చోదకశక్తులుగా మార్చిఎగుమతి ఆధారిత వృద్ధిని దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది.

References:

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2197651&reg=3&lang=1

https://content.dgft.gov.in/Website/dgftprod/a667478a-d204-4d95-a71c-a58452e1c6d9/Note%20-%20Districts%20as%20Export%20Hubs%20Initiative.pdf

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU5109_bmg27T.pdf?source=pqals

https://www.facebook.com/DeptofCommerceIndia/videos/india-is-strengthening-district-level-export-competitiveness-through-the-distric/1826517751372921/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2280927&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244401&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1897408&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201284&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256724&reg=3&lang=1

DD News

https://ddnews.gov.in/en/services-boom-drives-indias-exports-to-record-usd-863-billion-in-2025-26/

Other organizations

https://ifpuat.gujarat.gov.in/DIGIGOV/digigov.htm;jsessionid=-VKltUfx4n22mbT4IYiYjyFavY2jMvzQVM49b4Hn.DIGIGOV?actionFlag=getDistrictAsExportHubForView&pagedisp=static

https://silpasathi.wb.gov.in/export-hub/

https://prsindia.org/policy/report-summaries/implementation-of-the-districts-as-export-hubs-initiative

https://eodbodisha.odisha.gov.in/Home/DEH

ODOP

https://odopup.in/en#district-products

IBEF

https://www.ibef.org/news/government-expands-deh-initiative-to-boost-district-level-export-competitiveness

PIB Archives

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2217539&reg=3&lang=1

Click here to see pdf

 

***

(Explainer ID: 159820) आगंतुक पटल : 2
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Kannada