• Sitemap
  • Advance Search
Economy

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు 12 ఏళ్లు

అందరికీ బ్యాంకింగ్‌... అందరికీ సాధికారత

Posted On: 27 AUG 2026 2:06PM

2014లో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎం–జేడీవై) ప్రారంభమైనప్పటి నుంచి ఆర్థిక సమ్మిళిత ప్రస్థానంలో భారత్‌కు కీలక పునాదిగా నిలిచింది. 12 ఏళ్లలో అధికారిక బ్యాంకింగ్‌, రుణాలు, బీమా, పింఛన్లు, డిజిటల్ చెల్లింపు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ముఖ్యంగా ఇప్పటివరకు తగిన సేవలు అందని వర్గాలకు అవకాశాలను విస్తరించింది. పీఎం–జేడీవై ఖాతాలు 2015లో 14.72 కోట్ల నుంచి 2026 ఆగస్టు 19 నాటికి 59.09 కోట్లకు పెరిగాయి. వీరిలో 32.92 కోట్ల మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారు. డిపాజిట్లు కూడా స్థిరంగా పెరుగుతూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం మరింత విస్తరించిన తీరును ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక సమ్మిళితానికి భారత జాతీయ కార్యక్రమంగా అమలవుతున్న ఈ పథకం... ఆర్థిక సేవల అందుబాటును మరింత భద్రత, అవకాశాలు, ఆర్థిక సాధికారతగా మారుస్తోంది.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన: ఆర్థిక సమ్మిళితం దిశగా భారతదేశ‌ ప్రయాణానికి ఊతం

 


విస్తృత ప్రజానీకానికి ఆర్థిక వృద్ధి ఫలాలు అందించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి ఆర్థిక సమ్మిళితం అత్యవసరం. అధికారిక ఆర్థిక సేవలు అందుబాటులో ఉంటే ప్రజలు నష్టభయాలను సమర్థంగా ఎదుర్కోగలరు, తమ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టగలరు, జీవనోపాధిని నిర్మించుకోగలరు. ఇది ఆర్థిక కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు ఆదాయ అసమానతలను తగ్గిస్తుంది. మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే స్వావలంబన, ఆర్థిక సాధికారత బలపడతాయి. అందువల్ల అనేక లక్షిత కార్యక్రమాల ద్వారా ఆర్థిక సమ్మిళితానికి ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇచ్చింది.

ఆర్థిక సమ్మిళితం కోసం భారత జాతీయ కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎం-జేడీవై)ను 2014లో ప్రారంభించింది. 12వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఈ పథకం మరింత మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువస్తూ సమ్మిళిత వృద్ధికి బాటలు వేస్తోంది.

మీకు తెలుసా?
భారతదేశ‌ ఆర్థిక సమ్మిళిత సూచీ 2018లో 53.9 ఉండ‌గా, 2026లో 67కు పెరిగింది. రుణాలు, బీమా, పొదుపు, డిజిటల్ చెల్లింపు సేవలు ప్రజలకు మరింత విస్తృతంగా అందుతున్న తీరును ఇది వెల్లడిస్తోంది.

పీఎం–జేడీవై కింద చేపట్టిన ఆర్థిక సమ్మిళిత కార్యక్రమ విస్తృతిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2015 జనవరిలో గుర్తించింది. భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ‘‘ఒకే వారంలో 1,80,96,130 బ్యాంకు ఖాతాలను తెరిచారు.’’

భారత్‌లో ఆర్థిక సమ్మిళితానికి అందించిన తోడ్పాటుతో పీఎం–జేడీవైకి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. అధికారిక బ్యాంకింగ్ సేవలను విస్తరించడం, మరింత మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంలో ఈ పథకం పోషించిన పాత్రను అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు ప్రముఖంగా ప్రస్తావించాయి.

పీఎం–జేడీవై: అందుబాటు, ప్రయోజనాలు


ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన పీఎం–జేడీవై కోట్లాది నిరుపేద పౌరులకు బ్యాంకింగ్ సేవల అందుబాటును కొత్తగా నిర్వచిస్తోంది. తొలుత ‘‘ప్రతి కుటుంబానికీ’’ ఒక బ్యాంకు ఖాతా అందించడంపై పథకం దృష్టి సారించింది. 2018లో ‘‘బ్యాంకు ఖాతా లేని ప్రతి వయోజనుడికీ’’ ఖాతా అందించాలనే లక్ష్యంతో దీని పరిధిని విస్తరించారు. తద్వారా ఆర్థిక సమ్మిళిత సేవల చేరువను మరింత పెంచారు. తగిన సేవలు అందని, అల్పాదాయ వర్గాలకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు, అవసరాల ఆధారిత రుణాలు, నగదు బదిలీలు, బీమా, పింఛను సదుపాయాలను ఈ పథకం అందిస్తుంది.

ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు?
* భారత పౌరులందరూ పీఎం–జేడీవై ఖాతా తెరవవచ్చు. గరిష్ఠ వయోపరిమితి లేదు.
* బ్యాంకు ఖాతా లేని వ్యక్తికి ఒక ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతా తెరుస్తారు.
* కనిష్ఠ నిల్వను కొనసాగించాల్సిన అవసరం లేదు.

పీఎం–జేడీవై ఖాతాను ఎక్కడ తెరవవచ్చు? ఉమ్మడి ఖాతాగా నిర్వహించవచ్చా?
* పీఎం–జేడీవై కింద బ్యాంకు శాఖను లేదా బ్యాంకు శాఖకు అనుబంధంగా పనిచేసే బిజినెస్ కరస్పాండెంట్‌/బ్యాంక్ మిత్ర కేంద్రాన్ని సందర్శించి ఖాతా తెరవవచ్చు.
* అవసరమైన కేవైసీ పత్రాలతోపాటు ఖాతా ప్రారంభ దరఖాస్తును సమర్పించాలి. పరిశీలన పూర్తయిన తర్వాత బ్యాంకు ఖాతాను క్రియాశీలం చేస్తుంది.
* ఉమ్మడి ఖాతా కూడా తెరవవచ్చు.

ఖాతా తెరవడానికి ఏ పత్రాలు అవసరం?
పీఎం–జేడీవై ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు:
* ఆధార్ కార్డు
* ప్రభుత్వ గుర్తింపు పత్రం–ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు
* శాశ్వత చిరునామా ధ్రువీకరణ పత్రం–పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్, టెలిఫోన్ లేదా నీటి బిల్లు
* పాస్‌పోర్టు సైజు ఫొటో
* పూర్తి వివరాలతో నింపి సంతకం చేసిన పీఎం–జేడీవై ఖాతా ప్రారంభ దరఖాస్తు
* ప్రభుత్వం సూచించిన మరేదైనా పత్రం.

ఖాతాలోని పొదుపుపై ఎంత వడ్డీ ఆదాయం లభిస్తుంది?
* పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తించే వడ్డీ రేటే పీఎం–జేడీవై కింద తెరిచిన ఖాతాలకు వర్తిస్తుంది.

రూపే డెబిట్ కార్డు, దానితో లభించే ప్రమాద బీమా అంటే ఏమిటి?
* పీఎం–జేడీవై ఖాతాదారుకు రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఇది దేశీయ డెబిట్ కార్డు. అన్ని ఏటీఎంలతోపాటు చాలా పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల్లో దీనిని ఉపయోగించవచ్చు.
* ₹1 లక్ష ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది.(2018 ఆగస్టు తర్వాత తెరిచిన కొత్త పీఎం–జేడీవై ఖాతాలకు దీన్ని ₹2 లక్షలకు పెంచారు.)
* లబ్ధిదారు నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు. ప్రీమియాన్ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా చెల్లిస్తుంది.

ఎలాంటి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అందుబాటులో ఉంది?
* ఒక్కో కుటుంబంలో ఒక పీఎం–జేడీవై ఖాతాదారుకు ₹10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
* అర్హత నిబంధనలను నెరవేర్చడంతోపాటు ఖాతాను ఆరు నెలలపాటు సంతృప్తికరంగా నిర్వహించిన తర్వాత ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

పీఎం–జేడీవై కింద అందించే సామాజిక భద్రత పథకాలు ఏమిటి?
* పీఎం–జేడీవై ఖాతాదారులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం–జేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎం–ఎస్‌బీవై), అటల్ పింఛను యోజన (ఏపీవై), మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంకు (ముద్ర) పథకానికి అర్హులు.

జన్‌ధన్ ప్రభావం
ప్రారంభ‌మైన నాటి నుంచి పీఎం–జేడీవై అనేక కీలక మైలురాళ్లను చేరుకుంది:

పెరుగుతున్న ఖాతాలు

 


గత 12 ఏళ్లలో పీఎం–జేడీవై ఖాతాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2015లో 14.72 కోట్లుగా ఉన్న ఖాతాలు 2026 ఆగస్టు 19 నాటికి 59.09 కోట్లకు చేరాయి. వీటిలో గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో 45.95 కోట్ల ఖాతాలు ఉండగా, పట్టణాలు, మహానగర ప్రాంతాల్లో 13.14 కోట్ల ఖాతాలు ఉన్నాయి.

తగిన సేవలు అందని, బ్యాంకు ఖాతాలు లేని ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంలో పథకం సాధించిన విస్తృత వ్యాప్తి, గణనీయ ప్రగతిని ఇది ప్రతిబింబిస్తోంది.

పెరిగిన మహిళా లబ్ధిదారుల సంఖ్య

 


2026 ఆగస్టు 19 నాటికి పీఎం–జేడీవై ఖాతాలు కలిగిన మహిళా లబ్ధిదారుల సంఖ్య 32.92 కోట్లకు చేరింది. ఏళ్లుగా ఈ సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. ఆర్థిక సేవల అందుబాటులో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో పథకం పోషిస్తున్న పాత్రను ఇది స్పష్టం చేస్తోంది.

ఏటేటా పెరుగుతున్న డిపాజిట్లు

 


పీఎం–జేడీవై డిపాజిట్లు దాదాపు 20 రెట్లు పెరిగాయి. 2015 మార్చిలో ₹15,670 కోట్లుగా ఉన్న డిపాజిట్లు 2026 ఆగస్టు 19 నాటికి ₹3,16,514 కోట్లకు చేరాయి.

అల్పాదాయ కుటుంబాల్లో పెరుగుతున్న పొదుపు అలవాటు, అధికారిక బ్యాంకింగ్‌పై బలపడుతున్న విశ్వాసం, ఆర్థిక వ్యవస్థలో విస్తరిస్తున్న భాగస్వామ్యాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తోంది.

కొనసాగుతున్న రూపే కార్డుల జారీ

 


2026 ఆగస్టు 19 నాటికి పీఎం–జేడీవై ఖాతాదారులకు 41.29 కోట్ల రూపే డెబిట్ కార్డులను జారీ చేశారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న తీరుకు ఇది నిదర్శనం.

ఒకే ఖాతా... అపార అవకాశాలు
పీఎం–జేడీవై ఆర్థిక సమ్మిళితాన్ని విధానపరమైన లక్ష్యం నుంచి కోట్లాది భారతీయుల జీవితాల్లో వాస్తవ అనుభవంగా మార్చింది. బ్యాంకింగ్ సేవలను విస్తరించి, ఆర్థిక భద్రతను బలోపేతం చేసి, ఇప్పటివరకు తగిన సేవలు అందని పౌరులను రుణాలు, బీమా, పింఛన్లు, డిజిటల్ చెల్లింపులతో అనుసంధానించింది. పెరుగుతున్న ఖాతాలు, డిపాజిట్లకే దీని ప్రభావం పరిమితం కాలేదు. అధికారిక ఆర్థిక గుర్తింపును బలోపేతం చేస్తూ ప్రజల్లో ఆర్థిక విశ్వాసాన్ని పెంపొందిస్తోంది.

 

References

Prime Minister's Office

https://www.pmindia.gov.in/en/major_initiatives/pradhan-mantri-jan-dhan-yojana/

 

Ministry of Finance

https://pmjdy.gov.in/files/E-Documents/PMJDY_BROCHURE_ENG.pdf

https://pmjdy.gov.in/guinness-world-record

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2161432&reg=48&lang=2

https://pmjdy.gov.in/scheme

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2101428&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2161432&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=1854909&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=1952793&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2049231&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2161432&reg=48&lang=2

 

Ministry of Electronics and Information Technology

https://www.myscheme.gov.in/hi/schemes/pmjdy

 

Ministry of Information & Broadcasting

https://www.facebook.com/inbministry/videos/the-pradhan-mantri-jan-dhan-yojana-has-empowered-people-giving-them-identity-rig/1942870073774934/

 

Directorate of Information and Public Relations

https://www.facebook.com/diprassam/posts/financial-inclusion-in-india-is-no-longer-about-opening-bank-accounts-alone-the-/1463797019114645/

 

Reserve Bank of India

https://www.rbi.org.in/FinancialEducation/content/English_16042021.PDF

 

Bank of Baroda

https://bankofbaroda.bank.in/accounts/pradhan-mantri-jan-dhan-yojana

 

State Bank of India

https://sbi.bank.in/hi/web/faq-s/faq-pradhan-mantri-jan-dhan-yojana-pmjdy

 

Union Bank of India

https://www.unionbankofindia.bank.in/hindi/details/pradhan-mantri-jandhan-yojana

https://www.unionbankofindia.bank.in/en/details/business-correspondent-bc-model

 

Indian Overseas Bank

https://www.youtube.com/watch?v=VfGyhGJ-JmQ

 

Others

https://www.youtube.com/watch?v=HplYaTTWY78

 

PIB Archives

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155102&ModuleId=3&reg=3&lang=2

Click here to see pdf 

 

***

(Explainer ID: 159722) आगंतुक पटल : 29
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Kannada