Energy & Environment
సౌర విద్యుత్ వృద్ధిలో కొత్త శకంలోకి భారత్ ప్రవేశం
Posted On:
02 AUG 2026 12:01PM
ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం-ఎస్ఎస్‌వై)కు ఆమోదం లభించడంతో భారత సౌర విద్యుత్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ఇంధన నిల్వ వ్యవస్థల మద్దతుతో 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ ఇంధన పరివర్తన దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి సౌరశక్తి అత్యంత బలమైన చోదక శక్తుల్లో ఒకటిగా అవతరించింది. సామర్థ్య విస్తరణ, తయారీ రంగ పురోగతి, వినియోగదారుల ఆదరణలో వృద్ధి... సమన్వయంతో కూడిన విధానపరమైన మద్దతు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ప్రధాన ఇంధన వనరుగా ఎలా మార్చగలదో చాటుతున్నాయి. ఈ రంగం ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తోంది. వాతావరణ పరిరక్షణ చర్యలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతోంది.
భారత్‌లో సౌరశక్తి ప్రస్థానం
దశాబ్దం క్రితం భారత విద్యుత్ వనరుల సమ్మేళనంలో సౌరశక్తికి చాలా తక్కువ స్థానం ఉండేది. నేడు దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఇదే అత్యధిక వాటాను కలిగి ఉంది. 2014లో సుమారు 3 గిగావాట్లుగా ఉన్న స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం యాభై రెట్లకు పైగా విస్తరించి.. 2026 జూన్ 30 నాటికి 162.15 గిగావాట్లకు చేరుకుంది.
విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ విస్తరణ, ప్రజల భాగస్వామ్యం ఈ పరివర్తనకు దోహదం చేశాయి. సౌర పార్కులు, భవనాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలు, సౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ పంపుల వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతం చేస్తున్నాయి. కొత్తగా ఆమోదం పొందిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం-ఎస్ఎస్‌వై) సౌర విద్యుత్ వృద్ధికి తాజా ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం-ఎస్ఎస్‌వై)కు 2026 జూలై 31న ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసే ఇంధన నిల్వ వ్యవస్థలతో(ఈఎస్ఎస్) కూడిన 5,000 మెగావాట్ల తేలియాడే సోలార్ ఫొటోవోల్టాయిక్(ఎఫ్ఎస్‌పీవీ) ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం రెండు గంటల నిల్వ సామర్థ్యం(10,000 మెగావాట్ అవర్స్) కలిగిన ఇంధన నిల్వ వ్యవస్థలు గరిష్ఠ విద్యుత్ డిమాండ్‌ను నిర్వహించడంలో రాష్ట్రాలకు మరింత తోడ్పడతాయి. ప్రస్తుతం ఉన్న జలాశయాలు, పారిశ్రామిక చెరువులను వినియోగించడం ద్వారా పరిమితంగా ఉన్న భూ వనరులపై ఒత్తిడిని ఈ పథకం తగ్గిస్తుంది. సమీకృత ఇంధన నిల్వ ద్వారా విద్యుత్ గ్రిడ్ విశ్వసనీయతను కూడా మెరుగుపరుస్తుంది. ₹5,070 కోట్ల వ్యయంతో 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని అమలు చేస్తారు.
జాతీయ సౌరశక్తి సంస్థ(ఎన్ఐఎస్ఈ) అంచనా ఆధారంగా ఈ పథకాన్ని రూపొందించారు. దేశంలోని జలాశయాలు, అనువైన అంతర్గత జల వనరుల్లో సుమారు 102.18 గిగావాట్ పీక్ తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యానికి అవకాశం ఉందని ఈ అంచనా పేర్కొంది. ఈ పథకం ద్వారా ఏటా దాదాపు కోటి టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. పూర్తికాల ఉద్యోగాలతో సమానమైన 16,000–17,000 ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. తేలియాడే వ్యవస్థలు, ఫొటోవోల్టాయిక్ సెల్స్, మాడ్యూళ్లు, ఇంధన నిల్వ వ్యవస్థల దేశీయ తయారీకి కూడా ఇది ప్రోత్సాహం అందిస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. ప్రస్తుతం సుమారు 700 మెగావాట్లుగా ఉన్న భారత తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యానికి ఈ కార్యక్రమం మరో 5,000 మెగావాట్లను జోడిస్తుంది.
సమన్వయంతో కొనసాగుతున్న ఈ కృషి గణనీయమైన ఫలితాలను అందించింది. 2025లో దేశం 37 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి, వార్షిక సామర్థ్య విస్తరణలో అమెరికాను అధిగమించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సౌర విద్యుత్ వృద్ధి మార్కెట్‌గా కూడా భారత్ అవతరించింది. ప్రపంచ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఇది స్పష్టం చేస్తోంది.
దశాబ్ద కాలంలో సౌర విద్యుత్ విస్తరణ
బలమైన విధాన వ్యవస్థ భారత సౌర విద్యుత్ విస్తరణకు పునాది వేసింది. జాతీయ సౌర మిషన్(2010), సౌర పార్కుల పథకం, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కార్యక్రమం, పోటీ బిడ్డింగ్ ఇందులో కీలక కార్యక్రమాలుగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి భారీ స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేశాయి.
దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ సామర్థ్యం
విభిన్న భౌగోళిక ప్రాంతాలు, వాతావరణ మండలాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు విస్తరించాయి. స్థాపిత సామర్థ్యంలో రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు 118.79 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. భడ్లా సౌర పార్కు (రాజస్థాన్), పావగడ సౌర పార్కు (కర్ణాటక), రేవా అల్ట్రా మెగా సౌర పార్కు (మధ్యప్రదేశ్) ప్రధాన భారీ ప్రాజెక్టుల్లో కొన్ని. విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించిన పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థలు మరో 27.88 గిగావాట్ల సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. మిగిలిన సామర్థ్యం హైబ్రిడ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు, ఆఫ్-గ్రిడ్ సౌర విద్యుత్ వ్యవస్థల నుంచి వస్తోంది. హైబ్రిడ్ ప్రాజెక్టులు సౌరశక్తిని బ్యాటరీ నిల్వ లేదా ఇతర విద్యుత్ వనరులతో అనుసంధానిస్తాయి. గ్రిడ్ సదుపాయం లేని ప్రాంతాలకు ఆఫ్-గ్రిడ్ వ్యవస్థలు విద్యుత్‌ను అందిస్తాయి.

2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు వృద్ధి
సౌర విద్యుత్, శిలాజేతర ఇంధన సామర్థ్య విస్తరణలో రికార్డు నమోదుతో 2025–26 ఆర్థిక సంవత్సరం భారత పునరుత్పాదక ఇంధన రంగానికి మైలురాయిగా నిలిచింది.
* భారత్ 44.61 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించింది. ఇది 2024–25 ఆర్థిక సంవత్సరంలో జోడించిన 23.83 గిగావాట్ల కంటే దాదాపు రెట్టింపు.
* సౌర మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం 2014లో 2.3 గిగావాట్ల నుంచి 2026 మార్చి 31 నాటికి సుమారు 172 గిగావాట్లకు పెరిగింది.
* 274.68 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో కలిపి మొత్తం శిలాజేతర ఇంధన సామర్థ్యం 283.46 గిగావాట్లకు చేరుకుంది.
* శిలాజేతర ఇంధన సామర్థ్యంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఒక్క ఏడాదిలో 55.29 గిగావాట్ల వృద్ధి నమోదైంది.
* 2025 జూలై 29న దేశ విద్యుత్ డిమాండ్‌లో 51.5 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరులు తీర్చాయి. ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ వాటా ఇదే.
సౌర విద్యుత్ విస్తరణ వెనుక విధాన వ్యవస్థ
స్థిరమైన విధాన వ్యవస్థ, పోటీ బిడ్డింగ్ విధానాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు భారీ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఒకదానికొకటి బలం చేకూర్చే చర్యలు భారత సౌర విద్యుత్ విస్తరణకు తోడ్పడ్డాయి. వీటిని ప్రధానంగా ఐదు మూలస్తంభాలుగా వర్గీకరించవచ్చు:
దార్శనికత రూపకల్పన: వాతావరణ పరిరక్షణ హామీలు, దీర్ఘకాలిక లక్ష్యాలు
గ్లాస్గోలో జరిగిన కాప్-26 సదస్సులో భారత్ పంచామృత లక్ష్యాలను ప్రకటించింది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యం, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల సాధన వీటిలో ఉన్నాయి. పారిస్ ఒప్పందం కింద భారత్ నవీకరించిన జాతీయ నిర్ధారిత సహకారాల్లో ఈ హామీలు ప్రతిబింబించాయి.
ఈ ప్రయత్నాలకు అనుబంధంగా మిషన్ లైఫ్ (పర్యావరణానికి అనుగుణమైన జీవనశైలి) స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ స్పృహతో కూడిన పద్ధతులను అనుసరించేందుకు ప్రజలను ప్రేరేపిస్తోంది.
డిమాండ్ సృష్టి: జాతీయ మిషన్లు, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు
బలమైన, నిరంతర డిమాండ్ భారత సౌర విద్యుత్ వృద్ధిలో కీలకంగా నిలిచింది. జాతీయ సౌర మిషన్ దీర్ఘకాలిక సామర్థ్య లక్ష్యాలను నిర్దేశించి, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు తొలినాళ్లలోనే ప్రోత్సాహం అందించింది.
విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇతర బాధ్యతగల సంస్థలు తమ విద్యుత్ అవసరాల్లో నిర్దేశిత వాటాను పునరుత్పాదక వనరుల నుంచి కొనుగోలు చేయాలని పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు(ఆర్‌పీవోలు) నిర్దేశిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచుతూనే ప్రాజెక్టు అభివృద్ధిదారులు, పెట్టుబడిదారులకు ఆర్‌పీవోలు దీర్ఘకాలిక మార్కెట్ భరోసా కల్పిస్తాయి. ఆర్‌పీవో లక్ష్య ప్రణాళికను 2029–30 వరకు ప్రకటించారు. 2026–27 లక్ష్యాన్ని 35.95 శాతంగా నిర్ణయించారు.
విద్యుత్ సంస్థలు, భారీ ప్రాజెక్టు అభివృద్ధిదారుల పరిధిని దాటి డిమాండ్ విస్తరించింది. గృహాలు పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన ప్రోత్సహిస్తోంది. మరోవైపు వ్యవసాయ రంగంలో సౌర పంపుల వినియోగం, ఫీడర్ల సౌరీకరణకు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) మద్దతు ఇస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ కలిసి సౌరశక్తి మార్కెట్‌ను విస్తరిస్తూ వినియోగదారులు, రైతులు, వ్యాపార సంస్థలు, విద్యుత్ సంస్థల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి.
వ్యయాల తగ్గింపు: పోటీ బిడ్డింగ్, విద్యుత్ ధరల నిర్ధారణ
గత దశాబ్దంలో విద్యుత్ ధరలు తగ్గడం సౌర రంగంలో అత్యంత కీలక పరిణామాల్లో ఒకటి. అత్యల్ప ధరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రాజెక్టు అభివృద్ధిదారులు పోటీపడే ఈ-రివర్స్ వేలం విధానం ద్వారా చేపట్టిన బిడ్డింగ్ ఇందుకు దోహదం చేసింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వంటి కొనుగోలు సంస్థలు ఈ పారదర్శక ధరల నిర్ధారణ విధానాన్ని విస్తృతం చేయడంలో కీలకపాత్ర పోషించాయి. ఎక్కువ మంది ప్రాజెక్టు అభివృద్ధిదారులు పాల్గొనడంతో యూనిట్ విద్యుత్ ధర 2010లో సుమారు ₹18 నుంచి రికార్డు కనిష్ఠ స్థాయి ₹2.44కు తగ్గింది. 2017లో భడ్లా సౌర పార్కు వేలంలో ఈ విశేషమైన ఘనత సాధ్యమైంది. దీంతో సౌర విద్యుత్ అందుబాటు ధరల్లోకి రావడంతో పాటు దేశవ్యాప్తంగా దాని వినియోగం వేగంగా పెరిగింది.
విద్యుత్ ధరల తగ్గుదలతో సౌరశక్తి మరింత అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ప్రపంచంలో అత్యల్ప వ్యయంతో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మార్కెట్లలో భారత్ ఒకటిగా అవతరించింది. 2025లో భారీ స్థాయి సోలార్ పీవీ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ సగటు జీవితకాల వ్యయం(ఎల్‌సీఓఈ) మెగావాట్ అవర్‌కు 35 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది మెగావాట్ అవర్‌కు 44 అమెరికన్ డాలర్ల ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ.
మౌలిక సదుపాయాల కల్పన
ప్రాజెక్టు అభివృద్ధిదారులకు అవసరమైన భూమి, అనుబంధ మౌలిక సదుపాయాలు సిద్ధంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సౌర పార్కుల పథకాన్ని ప్రారంభించింది. తొలుత 20 గిగావాట్ల లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకాన్ని 2017లో 40 గిగావాట్లకు విస్తరించారు. 2026 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 39,188 మెగావాట్ల సంయుక్త మంజూరు సామర్థ్యంతో 54 సౌర పార్కులకు ఆమోదం లభించింది.
అనేక రాష్ట్రాల్లో భారీ స్థాయి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి సౌర పార్కులు కీలక కేంద్రాలుగా అవతరించాయి:
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు
|
పార్కుల సంఖ్య
|
మంజూరైన సామర్థ్యం (మెగావాట్లు)
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
5
|
4,200
|
|
2
|
ఛత్తీస్‌గఢ్
|
1
|
100
|
|
3
|
గుజరాత్
|
7
|
12,150
|
|
4
|
ఝార్ఖండ్
|
2
|
334
|
|
5
|
ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్*
|
1
|
310
|
|
6
|
కర్ణాటక
|
1
|
2,000
|
|
7
|
కేరళ
|
3
|
255
|
|
8
|
మధ్యప్రదేశ్
|
9
|
4,208
|
|
9
|
మహారాష్ట్ర
|
4
|
1,105
|
|
10
|
మిజోరం
|
1
|
20
|
|
11
|
ఒడిశా
|
1
|
40
|
|
12
|
రాజస్థాన్
|
11
|
10,726
|
|
13
|
ఉత్తరప్రదేశ్
|
8
|
3,740
|
| |
మొత్తం
|
54
|
39,188
|
* ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో విస్తరించిన ఒక అంతర్రాష్ట్ర తేలియాడే సౌర పార్కు ఇందులో ఉంది.
దేశంలోని కొన్ని ప్రముఖ సౌర పార్కుల అభివృద్ధికి ఈ పథకం వీలు కల్పించింది.
భడ్లా సౌర పార్కు: ఎడారి ప్రాంతం నుంచి స్వచ్ఛ ఇంధన కేంద్రంగా పరివర్తన
రాజస్థాన్‌లోని శుష్క భడ్లా ప్రాంతంలో ఉన్న ఈ పార్కు విస్తారమైన బంజరు భూములను ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ సముదాయాల్లో ఒకటిగా మార్చింది. సౌర పార్కుల పథకం కింద 2015లో దీని అభివృద్ధి ప్రారంభమై, దశలవారీగా 2020 నాటికి పూర్తయింది.
దాదాపు 5,700 హెక్టార్లలో(56 చదరపు కిలోమీటర్లు) విస్తరించిన ఈ పార్కు 2,245 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. అధిక సౌర వికిరణం, తక్కువ వర్షపాతం, పలుచని వృక్షసంపద కారణంగా ఈ ప్రాంతం భారీ స్థాయి సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉంది.
భారీ సామర్థ్యంతో పాటు సౌర పార్కు నమూనా ఆచరణలో ఎలా పనిచేస్తుందో భడ్లా చాటుతోంది. భూమి సిద్ధం చేయడం, విద్యుత్ ప్రసార సదుపాయాలు సహా ఉమ్మడి మౌలిక వసతులు ప్రాజెక్టుల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పించి, గణనీయమైన ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ పార్కులో పోటీ బిడ్డింగ్ దేశంలోనే అత్యల్ప సౌర విద్యుత్ ధరలు నమోదయ్యేందుకు దోహదం చేసి, సౌరశక్తిని మరింత అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చింది.

సౌర పార్కుల పథకానికి అనుబంధంగా పునరుత్పాదక ఇంధన వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి దేశంలోని విద్యుత్ డిమాండ్ కేంద్రాలకు విద్యుత్‌ను తరలించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కార్యక్రమం తోడ్పడుతోంది. ఈ కార్యక్రమం విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌లను బలోపేతం చేసి, పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌లో నిరంతరాయంగా అనుసంధానించేందుకు మద్దతు ఇస్తోంది.
2026 ఫిబ్రవరి నాటికి బలోపేతమైన విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ల ద్వారా 24,567.8 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ తరలింపునకు ఈ కార్యక్రమం వీలు కల్పించింది. పది రాష్ట్రాల్లో చేపడుతున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులు దాదాపు 44 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ తరలింపునకు మద్దతు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. జాతీయ గ్రిడ్‌లో పునరుత్పాదక విద్యుత్ అనుసంధానాన్ని కూడా ఈ ప్రాజెక్టులు బలోపేతం చేస్తాయి.
తయారీ రంగానికి మద్దతు
దేశీయ సౌర పరికరాల తయారీని బలోపేతం చేసి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
అధిక సామర్థ్య సౌర పీవీ మాడ్యూళ్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం
₹4,500 కోట్ల ప్రారంభ వ్యయంతో 2021లో అధిక సామర్థ్య సౌర పీవీ మాడ్యూళ్ల పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించారు. 2022లో అదనంగా ₹19,500 కోట్లు కేటాయించి పథకాన్ని విస్తరించారు. ఈ పథకం దేశీయ తయారీని ప్రోత్సహించి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, సౌర విలువ గొలుసు అంతటా విలువ జోడింపునకు ప్రోత్సాహం అందిస్తోంది. 2024 అక్టోబరు నాటికి ఈ పథకం దాదాపు ₹35,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కూడా కల్పించింది.
ఆమోదిత నమూనాలు, తయారీదారుల జాబితా (ఏఎల్ఎంఎం)
2019లో ప్రవేశపెట్టిన ఏఎల్ఎంఎం సౌర పీవీ మాడ్యూళ్లు, సెల్స్‌కు నాణ్యత భరోసా వ్యవస్థగా పనిచేస్తోంది. అర్హతగల ప్రాజెక్టుల్లో ఉపయోగించే సౌర పరికరాలు నిర్దేశిత నాణ్యత, పనితీరు ప్రమాణాలను పాటించేలా ఇది చూస్తుంది. ఆమోదిత జాబితాల్లో ఉన్న తయారీదారులు, నమూనాలు మాత్రమే నిర్దేశిత ప్రభుత్వ మద్దతుగల, పోటీ బిడ్డింగ్ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అర్హత పొందుతాయి. ఆమోదిత ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ విధానం దేశీయ తయారీకి కూడా తోడ్పడుతోంది.
పీఎల్ఐ పథకం, ఏఎల్ఎంఎం కలిసి భారత దేశీయ సౌర పరికరాల తయారీ వ్యవస్థను బలోపేతం చేశాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టుల వేగవంతమైన విస్తరణకు వీలు కల్పిస్తూనే స్వావలంబన పెంపునకు తోడ్పడ్డాయి. ఆమోదిత సౌర పరికరాల వినియోగానికి భరోసా ఇవ్వడం ద్వారా వినియోగదారులు, ప్రాజెక్టు అభివృద్ధిదారుల్లో ఈ విధానం మరింత విశ్వాసాన్ని కల్పిస్తోంది.
ప్రతి ఇంటికి, ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సౌరశక్తి
భారత సౌరశక్తి పరివర్తన భారీ విద్యుత్ కేంద్రాలకే పరిమితం కాలేదు. గృహాలు, రైతుల కోసం ప్రత్యేక పథకాల ద్వారా సౌరశక్తి విద్యుత్ అందుబాటును మెరుగుపరుస్తోంది, విద్యుత్ ఖర్చులను తగ్గిస్తోంది, కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన
₹75,021 కోట్ల వ్యయంతో 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించిన పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన దేశవ్యాప్తంగా గృహాలకు పైకప్పు సౌర విద్యుత్ ప్రయోజనాలను నేరుగా అందిస్తోంది. గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఉద్దేశించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఇది. అర్హతగల కుటుంబాలకు పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు రాయితీలు అందిస్తుండగా, పూచీకత్తు అవసరం లేని రుణాలు వాటి వినియోగాన్ని సులభతరం చేస్తున్నాయి. ప్రత్యేక జాతీయ పోర్టల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తూ నమోదు, వ్యవస్థ ఏర్పాటు, రాయితీ పంపిణీని సులభతరం చేస్తున్నారు.
ముఖ్య విజయాలు
* 2026 జూన్ నాటికి 43 లక్షలకు పైగా గృహాలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించారు.
* 2025 డిసెంబరు వరకు కేంద్ర ఆర్థిక సహాయం కింద ₹14,771.82 కోట్లు పంపిణీ చేశారు.
* 2025 డిసెంబరు 9 నాటికి 7.7 లక్షలకు పైగా గృహాలు సున్నా విద్యుత్ బిల్లులను పొందాయి.
కుటుంబాలు సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోంది. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి, పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్‌లో గృహ పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయానికి ఆమోదం తెలపడంతో పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనకు అంతర్జాతీయ మద్దతు కూడా లభించింది.
అధిక విద్యుత్ బిల్లుల నుంచి సౌరశక్తి పొదుపు వరకు
పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన గురించి తెలుసుకున్న గ్వాలియర్‌లోని జవార్ కాలనీ నివాసి సుధాంశు దూబే పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థను ఎంచుకున్నారు.
సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, రాయితీ ప్రక్రియ సజావుగా పూర్తికాగా, రాయితీ మొత్తం నేరుగా ఆయన బ్యాంకు ఖాతాలో జమైంది. ఏడాదికి పైగా ప్రతి నెలా ఈ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆయన ఇంటి విద్యుత్ బిల్లు తరచూ ₹10,000 దాటేది. నేడు అది దాదాపు శూన్యానికి చేరింది. పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థ విశ్వసనీయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, నెలవారీ ఖర్చులను తగ్గించడంతో పాటు కుటుంబ విద్యుత్ అవసరాలను తీర్చడంలో తోడ్పడుతోంది.
సుధాంశుకు ఈ పథకం సూర్యరశ్మిని పొదుపుగా మార్చింది. దేశవ్యాప్తంగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనాన్ని స్వీకరించి, తమ విద్యుత్ ఖర్చులపై మరింత నియంత్రణ సాధించేందుకు పీఎం సూర్య ఘర్ ఎలా తోడ్పడుతోందో ఆయన అనుభవం ప్రతిబింబిస్తోంది.
ప్రధానమంత్రి-కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్)
2019లో ప్రారంభించిన పీఎం-కుసుమ్ వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకృత సౌర విద్యుత్ కేంద్రాలు, స్వతంత్ర సౌర వ్యవసాయ పంపుల ఏర్పాటు, గ్రిడ్‌కు అనుసంధానించిన వ్యవసాయ పంపుల సౌరీకరణకు ఈ పథకం మద్దతు ఇస్తోంది. సాగునీటి అవసరాలకు పగటిపూట విశ్వసనీయ విద్యుత్‌ను అందించడం, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు ఆదాయ అవకాశాలను పెంచడం దీని లక్ష్యాలు.
సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా రైతులు సౌరశక్తిని వినియోగించుకునేలా పీఎం-కుసుమ్ వీలు కల్పిస్తోంది. ఈ పథకం కింద రైతులు సాగునీటి కోసం సౌర పంపులను ఏర్పాటు చేసుకుని, అర్హత ఉన్న సందర్భాల్లో మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయిస్తారు. ₹34,422 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయంతో 2026–27 నాటికి దాదాపు 34,800 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించడంపై ఈ పథకం దృష్టి సారించింది.
ముఖ్య విజయాలు
* వ్యవసాయ అవసరాల కోసం దాదాపు 11.49 లక్షల ఆఫ్-గ్రిడ్ సౌర పంపులను ఏర్పాటు చేశారు.
* ఫీడర్ స్థాయి సౌరీకరణ ద్వారా 15.89 లక్షలకు పైగా వ్యవసాయ పంపులను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
* రైతుల భూముల్లో దాదాపు 1,726 మెగావాట్ల వికేంద్రీకృత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
* దేశవ్యాప్తంగా 21.77 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం పొందారు.
భారత వికేంద్రీకృత సౌర విద్యుత్ రంగానికి ఈ రెండు పథకాలు కీలక మూలస్తంభాలుగా అవతరించాయి.
2025–26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా జోడించిన 44.61 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంలో వికేంద్రీకృత సౌర పరిష్కారాలు 16.3 గిగావాట్లు లేదా 36 శాతం వాటాను అందించాయి. ఇందులో పీఎం-కుసుమ్ నుంచి 7.6 గిగావాట్లు, పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల నుంచి 8.7 గిగావాట్లు సమకూరాయి.
ప్రపంచ సౌర సహకారంలో భారత్‌కు పెరుగుతున్న నాయకత్వం
సౌరశక్తి రంగంలో భారత నాయకత్వం దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తోంది. అంతర్జాతీయ సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సామర్థ్య నిర్మాణాన్ని భారత్ బలోపేతం చేస్తోంది.
* అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ): 2015లో పారిస్‌లో జరిగిన కాప్-21 సదస్సులో భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా స్థాపించిన ఐఎస్ఏ ప్రపంచ సౌర సహకారానికి కీలక వేదికగా అవతరించింది. సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతం చేయడం, విజ్ఞానం, సాంకేతికతను పంచుకోవడం కోసం మాల్దీవులు, గ్రీస్, జర్మనీ, ఇటలీ, భూటాన్, లక్సెంబర్గ్, అర్జెంటీనా తదితర దేశాలను ఈ కూటమి ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. సభ్య దేశాల మధ్య సహకారానికి ఐఎస్ఏ కీలక వేదికగా రూపుదిద్దుకుంది.
* ఒకే సూర్యుడు–ఒకే ప్రపంచం–ఒకే గ్రిడ్ (ఓఎస్ఓడబ్ల్యూఓజీ): 2018లో భారత్ ప్రతిపాదించిన ఓఎస్ఓడబ్ల్యూఓజీ ప్రపంచవ్యాప్తంగా అనుసంధానిత పునరుత్పాదక ఇంధన నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న దార్శనికత. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 2021లో జరిగిన కాప్-26 సదస్సులో భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్–ఒకే సూర్యుడు–ఒకే ప్రపంచం–ఒకే గ్రిడ్ (జీజీఐ–ఓఎస్ఓడబ్ల్యూఓజీ) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా దేశాలు అంతర్జాతీయ సౌర కూటమి ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. అనుసంధానిత విద్యుత్ గ్రిడ్ల ద్వారా సరిహద్దులు దాటి పునరుత్పాదక విద్యుత్ వాణిజ్యాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తూ, ఇంధన భద్రతను బలోపేతం చేసి స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేస్తోంది.
ఐఎస్ఏ, ఇతర భాగస్వామ్యాల ద్వారా ప్రపంచ దక్షిణ దేశాల మధ్య పునరుత్పాదక ఇంధన సహకారాన్ని భారత్ బలోపేతం చేసింది. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు పెంచే అంశంపై ఏకాభిప్రాయ సాధనకు భారత్ తోడ్పడింది.
భవిష్యత్ మార్గం
సౌర విద్యుత్ మార్కెట్‌లో భారత విజయాలు నిరంతర విధానపరమైన మద్దతు, విస్తరిస్తున్న తయారీ సామర్థ్యం, బలోపేతమైన మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పంచామృత హామీలు, 2070 నాటికి నికర శూన్య ఉద్గారాల లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో సౌరశక్తి కీలక మూలస్తంభంగా కొనసాగుతుంది. స్వచ్ఛ ఇంధన పరివర్తనకు నిరంతరం చోదక శక్తిగా నిలుస్తుంది.
Reference:
Ministry of Power
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2240739®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2183866®=48&lang=2
https://beeindia.gov.in/show_content.php?lang=1&level=1&ls_id=119&lid=291
https://www.recregistryindia.nic.in/pdf/REC_Regulation/Renewable_Purchase_Obligation_and_Energy_Storage_Obligation_Trajectory_till_2029_30.pdf
https://aerc.assam.gov.in/information-services/renewable-purchase-obligation-rpo
Ministry of New and Renewable Energy (MNRE)
https://mnre.gov.in/en/physical-progress/
https://mnre.gov.in/en/development-of-solar-parks-and-ultra-mega-solar-power-projects/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292433®=48&lang=1
https://mnre.gov.in/en/green-energy-corridor-0verview/
https://mnre.gov.in/en/document/guidelines-for-tariff-based-competitive-bidding-process-for-procurement-of-firm-and-dispatchable-power-from-grid-connected-renewable-energy-power-projects-with-energy-storage-systems-2/
https://pmkusum.mnre.gov.in/#/landing
https://pmkusum.mnre.gov.in/#/landing/read-more
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250039®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1763712
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244667®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241551®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204466®=6&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2082901®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2042069®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2010133®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1983208®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622459®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1489763®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2081250®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1831364®=48&lang=2
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=122567®=3&lang=2
https://sansad.in/getFile/annex/270/AU2064_DoGkMO.pdf?source=pqars
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2011_5nmHOe.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/183/AU1418_Edvm7x.pdf?source=pqals
https://sansad.in/getFile/annex/270/AU1260_BzS52V.pdf?source=pqars
https://pmsuryaghar.gov.in/#/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1594759®=48&lang=2
https://cdnbbsr.s3waas.gov.in/s3716e1b8c6cd17b771da77391355749f3/uploads/2024/02/202402091231907238.pdf
https://x.com/mnreindia/status/1779835768795546038
https://x.com/byadavbjp/status/2062136611501113852
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1710114&lang=2®=48
https://forumofregulators.gov.in/Data/Meetings/Minutes/98.pdf
Ministry of Environment, Forest and Climate Change
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795071®=48&lang=2
PIB Backgrounder
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2233832®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2199729&lang=1®=3
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1861127®=48&lang=2
India Solar Alliance (ISA)
https://isa.int/who-we-are
NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2023-02/Brochure-10-pages-op-2-print-file-20102022.pdf
Government of Gujarat
https://gpcl.gujarat.gov.in/showpage.aspx?contentid=4354
https://cmogujarat.gov.in/en/latest-news/khavda-renewable-energy-park-gujarat-green-electricity
International Renewable Energy Agency (IRENA)
https://www.irena.org/-/media/Files/IRENA/Agency/Publication/2026/Mar/IRENA_DAT_RE_capacity_highlights_2026.pdf
https://www.irena.org/-/media/Files/IRENA/Agency/Publication/2026/Jul/IRENA_TEC_RPGC_2025_Executive_summary_2026.pdf
United Nations Framework Convention on Climate Change (UNFCCC)
https://unfccc.int/news/international-solar-energy-alliance-launched-at-cop21
Asian Development Bank (ADB)
https://www.adb.org/projects/44426-016/main
World Bank
https://www.worldbank.org/en/news/press-release/2026/07/09/world-bank-supports-india-s-solar-rooftop-program-to-boost-clean-energy-create-jobs-and-unlock-private-capital
India Brand Equity Foundation (IBEF)
https://www.ibef.org/news/india-surpasses-us-in-annual-solar-capacity-additions-becomes-second-largest-solar-growth-market-in-2025
Bhadla Solar Park Image
https://sauryaurja.com/1000-mw-bhadla-III
PM-KUSUM Video
https://youtu.be/9YFnxvpO89Q?si=y9PfyIRqM7KsS-TQ
Click here for pdf file
****
(Explainer ID: 159407)
आगंतुक पटल : 18
Provide suggestions / comments