Technology
గగన్: కచ్చితమైన నావిగేషన్‌తో భారత గగనతల ప్రయాణం
Posted On:
01 JUL 2026 2:53PM
గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్‌మెంటెడ్ నావిగేషన్) అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారతదేశ స్వదేశీ శాటిలైట్-ఆధారిత అగ్‌మెంటెషన్ వ్యవస్థ. ఇది జీపీఎస్ కచ్చితత్వాన్ని పెంచుతుంది. సురక్షితమైన విమాన ప్రయాణానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువీకరణ పొందిన గగన్.. ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్‌కు మద్దతు ఇస్తుంది. విమానయాన రంగానికే కాకుండా ఇతర రంగాలకు కూడా సేవలందిస్తుంది. స్వదేశీ నావిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా సాంకేతిక స్వావలంబన, శాటిలైట్ నావిగేషన్‌లో ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలనే భారతదేశ దార్శనికతకు గగన్ మరింత బలాన్ని చేకూరుస్తోంది.
కచ్చితమైన నావిగేషన్ ఆవశ్యకత: భారతదేశం గగన్‌ను ఎందుకు రూపొందించింది?
విమానయాన రంగానికి అత్యంత కచ్చితమైన నావిగేషన్ అవసరం. పొజిషనింగ్‌లో వచ్చే చిన్నపాటి లోపాలు కూడా విమాన భద్రతను ప్రభావితం చేస్తాయి. విమానాలు తమ స్థానాన్ని గుర్తించడంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహాయపడినప్పటికీ వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాల వల్ల దాని సిగ్నల్స్ ప్రభావితం కావచ్చు. భారతదేశం ఒక ప్రధాన విమానయాన మార్కెట్‌గా ఎదుగుతున్న తరుణంలో కచ్చితమైన, విశ్వసనీయమైన నావిగేషన్ అవసరం జాతీయ ప్రాధాన్యతగా మారింది.
ఈ అవసరాన్ని తీర్చడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కలిసి 'గగన్' వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఇది ఒక శాటిలైట్-ఆధారిత అగ్‌మెంటెషన్ వ్యవస్థ (ఎస్‌బీఏఎస్). ఈ సాంకేతికత రియల్ టైమ్ సవరణలు, సమగ్ర సమాచారాన్ని అందించడం ద్వారా జీపీఎస్ పనితీరును మెరుగుపరుస్తుంది. జీపీఎస్ సిగ్నల్ నావిగేషన్‌కు అనుకూలంగా లేనప్పుడు ఈ సమగ్ర సమాచార వ్యవస్థ పైలట్లను అప్రమత్తం చేస్తుంది.
గగన్ ప్రాజెక్ట్ 2015 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇది కార్యాచరణ కలిగిన ఎస్‌బీఏఎస్ ఉన్న అమెరికా, ఐరోపా, జపాన్ వంటి దేశాల జాబితాలో భారతదేశాన్ని చేర్చింది. ప్రస్తుతం గగన్ భారత గగనతలంలో సురక్షితమైన విమాన కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది. విమానయాన రంగానికి ఆవల కూడా దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది భారతదేశ స్వదేశీ నావిగేషన్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, దేశ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

భారతదేశ నావిగేషన్ వ్యవస్థలో గగన్ స్థానం
ప్రారంభమైనప్పటి నుంచి గగన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నావిగేషన్ శాటిలైట్‌గా క్రమంగా అభివృద్ధి చెందింది. ఈ సంవత్సరాల్లో ఇది కీలకమైన ధ్రువీకరణలను, కార్యాచరణ మైలురాళ్లను సాధించింది. దీని తాజా విజయం 2026 జూన్‌లో నమోదైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గగన్ వ్యవస్థను ఉపయోగించి ఒక కమర్షియల్ జెట్ విమానంలో భారతదేశపు మొదటి ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ సిస్టమ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించింది.

గగన్‌లోని ముఖ్య అంశాలు
గ్రౌండ్ స్టేషన్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, జియోస్టేషనరీ ఉపగ్రహాల సమగ్ర నెట్‌వర్క్ ద్వారా గగన్ పనిచేస్తుంది. ఈ అంశాలు జీపీఎస్ సిగ్నల్స్‌ను రియల్-టైమ్‌లో పర్యవేక్షిస్తాయి. లోపాలను సవరిస్తాయి. మెరుగుపరిచిన నావిగేషన్ సమాచారాన్ని విమానాలకు చేరవేస్తాయి.
|
ముఖ్య అంశాలు
|
ఏర్పాటు చేసిన సంఖ్య
|
పాత్ర
|
|
ఇండియన్ రిఫరెన్స్ స్టేషన్స్(ఐఎన్ఆర్ఈఎస్)
|
15
|
దేశవ్యాప్తంగా జీపీఎస్ సిగ్నల్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఏవైనా లోపాలు ఉంటే గుర్తిస్తాయి.
|
|
ఇండియన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్స్ (ఐఎన్ఎంసీసీ)
|
2
|
అన్ని రిఫరెన్స్ స్టేషన్ల నుంచి వచ్చే డేటాను ప్రాసెస్ చేస్తాయి. సిగ్నల్ లోపాలను సవరిస్తాయి. సమగ్ర సమాచారాన్ని రూపొందిస్తాయి.
|
|
ఇండియన్ ల్యాండ్ అప్‌లింక్ స్టేషన్స్ (ఐఎన్‌ఎల్‌యూఎస్)
|
3
|
గ్రౌండ్ స్టేషన్ల నుంచి సవరించిన, సమగ్ర సమాచారాన్ని గగన్ ఉపగ్రహాలకు పంపుతాయి.
|
|
సమాచార వ్యవస్థలు
|
4
|
అన్ని గగన్ స్టేషన్లను అనుసంధానిస్తూ, నావిగేషన్ డేటాను సురక్షితంగా, రియల్-టైమ్‌లో బదిలీ చేయడానికి వీలు కల్పిస్తాయి.
|
|
గగన్ పేలోడ్‌లతో కూడిన జియోస్టేషనరీ ఉపగ్రహాలు
|
3
|
సవరించిన నావిగేషన్ సిగ్నళ్లను సర్వీస్ ఏరియా మొత్తం ప్రసారం చేస్తాయి.
|
ప్రాంతవ్యాప్తంగా నావిగేషన్ కచ్చితత్వాన్ని, అంతరాయం లేని కార్యకలాపాలను మెరుగుపరచడం ద్వారా శాటిలైట్ ఆధారిత విమానయాన సేవల్లో భారతదేశ నాయకత్వాన్ని ఇది నిరంతరం బలపరుస్తోంది.
మీకు తెలుసా? జియోస్టేషనరీ ఉపగ్రహాలు భూభ్రమణ వేగంతోనే కదులుతాయి. అందువల్ల అవి ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. జీశాట్-8, జీశాట్-10, జీశాట్-15 భారతదేశ జియోస్టేషనరీ ఉపగ్రహాలు గగన్ పేలోడ్‌లను కలిగి ఉన్నాయి. ఇవి గగన్ సవరణ, సమగ్ర సమాచారాన్ని వినియోగదారులకు ప్రసారం చేసే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థలు.
భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ
గగన్ సమగ్ర నిర్మాణం భారతదేశ విస్తృత ఉపగ్రహ నావిగేషన్ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. గగన్‌తో పాటు, భారతదేశం తన స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అయిన నావిక్ (నేవిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్) ను అభివృద్ధి చేసింది. నావిక్ స్థానాన్ని, నావిగేషన్, సమయ సేవలను అందిస్తుండగా, గగన్ కచ్చితమైన విమాన నావిగేషన్, ల్యాండింగ్‌కు మద్దతుగా జీపీఎస్ సిగ్నల్స్‌ను మెరుగుపరుస్తుంది.
|
గగన్
|
నావిక్
|
|
శాటిలైట్-బేస్డ్ అగ్‌మెంటెషన్ సిస్టమ్ (ఎస్‌బీఏఎస్)
|
స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ
|
|
రియల్-టైమ్ సవరణలు, సమగ్ర సమాచారం ద్వారా జీపీఎస్ పనితీరును మెరుగుపరుస్తుంది
|
స్థానాన్ని, నావిగేషన్, సమయ సేవలను అందిస్తుంది
|
|
ఇండియన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ అంతటా పౌర విమానయానానికి మద్దతు ఇస్తుంది
|
కవరేజ్ ఏరియాలో భారతదేశంతో పాటు దేశ సరిహద్దుల అవతల 1500 కిలోమీటర్ల వరకు ప్రాంతం ఉంటుంది
|
మీకు తెలుసా? 2025 లో నావిక్ రిఫరెన్స్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి భారతదేశం దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చొరవ భారతదేశ స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ పనితీరును, పరిధిని జాతీయ సరిహద్దులు దాటి బలోపేతం చేస్తుంది. ఈ భాగస్వామ్యం నావిగేషన్ సహకారాన్ని పెంచుతుంది. భారతదేశ అంతరిక్ష ఆధారిత పొజిషనింగ్, సమయ సామర్థ్యాలపై పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది.
గ్లోబల్ నావిగేషన్ నెట్‌వర్క్‌తో పరస్పర అనుసంధానం
గగన్ అంతర్జాతీయ పౌర విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది. జీపీఎస్ సిగ్నల్స్ కచ్చితత్వాన్ని మెరుగుపరిచే ఇతర విదేశీ వ్యవస్థలతో కలిసి పనిచేసే వీలుంది. అవి:
అమెరికాకు చెందిన వైడ్ ఏరియా అగ్‌మెంటెషన్ సిస్టమ్ (డబ్ల్యూఏఏఎస్)
యూరోపియన్ జియోస్టేషనరీ నావిగేషన్ ఓవర్లే సర్వీస్ (ఈజీఎన్ఓఎస్)
జపాన్‌కు చెందిన మల్టీ-ఫంక్షనల్ శాటిలైట్ అగ్‌మెంటెషన్ సిస్టమ్ (ఎంఎస్ఏఎస్)
భూమధ్యరేఖా ప్రాంతం కోసం ధ్రువీకరణ పొందిన మొదటి ఎస్‌బీఏఎస్ (ఎస్‌బీఏఎస్) కూడా గగన్ కావడం విశేషం. ఇది అంతరిక్ష ఆధారిత అగ్‌మెంటెషన్ సిస్టమ్ కలిగిన కొన్ని దేశాలలో ఒకటిగా భారతదేశాన్ని నిలిపింది.
స్వదేశీ ఆవిష్కరణలను అంతర్జాతీయ ప్రమాణాలతో కలపడం ద్వారా గగన్ భారతదేశ విమానయాన భద్రతను, నావిగేషన్ సేవలను బలోపేతం చేస్తోంది.
అమలులో గగన్: విమానయాన రంగానికి ఆవల బహుళ-రంగాల అనువర్తనాలు
గగన్ ప్రాథమికంగా పౌర విమానయానం కోసం అభివృద్ధి చేసినప్పటికీ దీని అధిక-కచ్చితత్వ పొజిషనింగ్, నావిగేషన్ సామర్థ్యాలు ఇతర రంగాలకు కూడా తోడ్పడుతున్నాయి. జీపీఎస్ సిగ్నల్స్ కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను మెరుగుపరచడం ద్వారా గగన్ సురక్షితమైన కార్యకలాపాలకు, మెరుగైన ప్రణాళికకు, మరింత సమర్థవంతమైన సేవలందించడానికి వీలు కల్పిస్తుంది.
· సముద్ర నావిగేషన్: తీరప్రాంత, లోతైన సముద్ర జలాల్లో మరింత కచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.
· రోడ్డు రవాణా, రహదారులు: ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్‌కు మద్దతు ఇస్తుంది.
· రైల్వేలు: కార్యాచరణ సామర్థ్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తుంది.
· విపత్తు నిర్వహణ: అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్‌కు సహాయపడుతుంది.
· రక్షణ, భద్రత: రక్షణ రంగ కార్యకలాపాల కోసం నావిగేషన్‌ను బలోపేతం చేస్తుంది.
· టెలికమ్యూనికేషన్స్: టెలికాం మౌలిక సదుపాయాల విశ్వసనీయ సమకాలీకరణకు మద్దతు ఇస్తుంది.
· సర్వేయింగ్, మ్యాపింగ్: భూమి సర్వేలు, జియోస్పేషియల్ మ్యాపింగ్ కచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
కచ్చితమైన శాటిలైట్ నావిగేషన్ ప్రయోజనాలను విమానయాన రంగానికి ఆవల కూడా విస్తరించడం ద్వారా గగన్ మరింత సమర్థవంతమైన ప్రజా సేవలకు సహకరిస్తోంది.
భవిష్యత్తు మార్గం
భవిష్యత్తులో గగన్ సురక్షితమైన వైమానిక నావిగేషన్‌కు మద్దతు ఇస్తూ, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుస్తూ, దేశవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సేవలను విస్తరిస్తూ భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. నావిక్‌తో కలిసి ఇది స్వదేశీ నావిగేషన్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రవాణా, విపత్తు నిర్వహణ, సర్వేయింగ్, ఇతర రంగాలలో పెరుగుతున్న అనువర్తనాలతో, అనుసంధానించిన, స్వయంసమృద్ధ, సాంకేతిక ఆధారిత భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణంలో గగన్ ఒక ముఖ్యమైన స్తంభంగా నిలవనుంది.
References
Department of Space
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=130384®=48&lang=2
PIB Backgrounder
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2181865®=48&lang=2
Ministry of Civil Aviation
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=124704®=48&lang=2
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=123209®=3&lang=2
U R Rao Satellite Centre
https://www.ursc.gov.in/navigation/gagan.jsp
ISRO
https://www.isro.gov.in/Navic.html
Click here for pdf file
****
(Explainer ID: 159116)
आगंतुक पटल : 63
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Assamese
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Kannada
,
Malayalam