Economy
జీఎస్టీకి తొమ్మిదేళ్లు: పన్నుల సరళీకరణ, భారతదేశ బలోపేతం
Posted On:
30 JUN 2026 2:14PM
విడివిడిగా ఉండే కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో సమగ్రమైన విధానాన్ని తీసుకురావడం ద్వారా భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక పెద్ద మార్పును తెచ్చింది. ఇది ఉమ్మడి జాతీయ మార్కెట్ ఏర్పాటుకు, 'ఒకే దేశం - ఒకే పన్ను' అనే దార్శనికతకు ఊతమిచ్చింది. 2017లో అమలులోకి వచ్చినప్పటి నుంచి నిరంతర సంస్కరణలు, డిజిటల్ వ్యవస్థలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం ద్వారా జీఎస్‌టీ పరిణామం చెందింది. 2025లో తెచ్చిన తర్వాతి-తరం జీఎస్టీ సంస్కరణలు తక్కువ పన్ను రేట్లు, మినహాయింపులు, సులభమైన ప్రక్రియల ద్వారా ఈ విధానాన్ని మరింత సరళీకరించాయి. ఈ చర్యలు గృహాలు, ఎంఎస్ఎంఈలు, రైతులు, కళాకారులు, ఎగుమతిదారులు, వివిధ వ్యాపార రంగాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉన్నాయి.
జీఎస్టీ: భారతదేశ పన్ను సంస్కరణల ప్రస్థానంలో ఒక మైలురాయి
2017 జూలై 1న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభం కావడం భారతదేశ సంస్కరణల ప్రస్థానంలో ఒక చరిత్రాత్మక విజయం. "ఒకే దేశం - ఒకే పన్ను" అనే సూత్రం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. సమగ్ర పన్ను వ్యవస్థ వైపు భారతదేశం అడుగులు వేయడానికి ఇది సహాయపడింది.
గత తొమ్మిదేళ్లలో జీఎస్టీ భారతదేశ 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' దార్శనికతను బలోపేతం చేసింది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, ప్రామాణిక విధానాల ద్వారా ఇది పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చింది.
17 రకాల విభిన్న పన్నులను, 13 రకాల సెస్సులను జీఎస్టీ ఒకే ఉమ్మడి వ్యవస్థలోకి విలీనం చేసింది. గతంలో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో అనేక కేంద్ర, రాష్ట్ర స్థాయి పన్నులు ఉండేవి. ఇవి రేట్లు, నిర్మాణాలలో వ్యత్యాసాలను సృష్టించేవి. ఈ పరిస్థితి వ్యాపార, పారిశ్రామిక రంగాలపై అదనపు భారాన్ని వేసింది. పన్ను మీద మరో పన్ను పడేలా చేసింది. బలమైన ఐటీ మౌలిక సదుపాయాల మద్దతుతో, పన్ను పరిధిని విస్తరించడం, పన్ను క్రమశిక్షణను మెరుగుపరచడం జీఎస్టీ లక్ష్యంగా ఉంది.
జీఎస్టీ ప్రధాన లక్షణాలు
పన్ను ఎలా విధించాలో, ఎలా నిర్వహించాలో తెలిపే అనేక కీలక లక్షణాలను జీఎస్టీ ఒకచోటకు చేర్చింది.
అమలు: జీఎస్టీ కింద తయారీ, అమ్మకం లేదా సేవలపై విడివిడిగా కాకుండా వస్తువులు లేదా సేవల "సరఫరా" పై పన్ను విధిస్తారు.
గమ్యస్థాన ఆధారిత వినియోగ పన్ను: జీఎస్టీ అనేది గమ్యస్థాన ఆధారిత వినియోగ పన్ను. అంటే వస్తువులు లేదా సేవలు చివరిగా ఎక్కడ వినియోగించబడతాయో ఆ రాష్ట్రానికే పన్ను ఆదాయం చెందుతుంది.
పరిధి, ఏకరూపత: మానవ వినియోగానికి ఉపయోగించే మద్యం జీఎస్టీ పరిధి వెలుపల ఉంటుంది. దాదాపు మిగతా అన్ని వస్తువులు, సేవలకు ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పన్ను రేట్లను వర్తింపజేయడం ద్వారా ఇది గొప్ప ఏకరూపతను తీసుకువస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన తక్షణమే జీఎస్టీ విధించదగిన 5 వస్తువులు ఉన్నాయి.
జీఎస్టీ కౌన్సిల్: ఈ కౌన్సిల్ జీఎస్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలకు మార్గదర్శకత్వం వహిస్తుంది. దేశవ్యాప్తంగా దీని అమలుకు మద్దతు ఇస్తుంది.
సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడం
నిర్ణయాధికారంలో కేంద్రం, రాష్ట్రాలను ఒకచోటకు చేర్చడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసింది. ఇది క్రమం తప్పకుండా సమస్యలను సమీక్షిస్తూ, ఎదురవుతున్న సవాళ్లకు స్పందిస్తూ ముఖ్య పాత్ర పోషించిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ సరళమైన విధానం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా పన్ను వ్యవస్థలో సకాలంలో మార్పులు, దిద్దుబాట్లు చేయడానికి అనుమతించింది.
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్(జీఎస్టీఎన్): కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వాలు 50% వాటా కలిగిన కంపెనీ అయిన జీఎస్టీఎన్.. జీఎస్టీ వ్యవస్థకు ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఇది వివిధ డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు, పన్ను చెల్లింపుదారులు, ఇతర భాగస్వాములకు మద్దతు ఇస్తుంది.
ద్వంద్వ జీఎస్టీ: జీఎస్టీ ఒక ద్వంద్వ నిర్మాణాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ రాష్ట్రాల పరిధిలోని సరఫరాలపై కేంద్రం 'సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్' (సీజీఎస్టీ), రాష్ట్రాలు 'స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్' (ఎస్‌జీఎస్టీ) విధిస్తాయి. అంతర్రాష్ట్ర వస్తువులు, సేవల సరఫరాపై 'ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్' (ఐజీఎస్టీ) విధిస్తారు. జీఎస్టీ రేట్లు సాధారణంగా సీజీఎస్టీ/ఎస్‌జీఎస్టీకి రెట్టింపు ఉంటాయి.
నెక్స్ట్-జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు
సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, వ్యాపారాలకు పన్ను ప్రక్రియలను సరళీకరించడానికి జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం నెక్స్ట్-జెన్ జీఎస్టీ సంస్కరణలను ఆమోదించింది. ఈ సంస్కరణలు రేట్లు, మినహాయింపులను సవరించాయి. ఇవి 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చాయి. జీఎస్టీ 2.0 గా ప్రశంసలు పొందిన ఈ సంస్కరణలు.. ఆర్థిక వృద్ధి అవకాశాలను బలోపేతం చేసే పన్ను సంస్కరణల కొత్త దశను సూచిస్తున్నాయి.

వివరణాత్మక సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది:
కీలక చర్యలు
సరళీకృత రేట్ల నిర్మాణం: పన్ను నిర్మాణం ప్రాథమికంగా 5%, 18% అనే రెండు స్లాబులకు మారింది.
లగ్జరీ, సిన్ గూడ్స్ పన్ను: పన్ను నిర్మాణంలో మరింత న్యాయబద్ధతను నిర్ధారిస్తూనే, ఆదాయ సమతుల్యతను కాపాడటానికి లగ్జరీ, సిన్ గూడ్స్(విలాసవంతమైన, హానికరమైన వస్తువులు)పై 40% రేటును ప్రవేశపెట్టారు. ఇందులో లాటరీ/ ఆన్‌లైన్ గేమింగ్, పొగాకు, కార్బోనేటేడ్ పానీయాలు, హై-ఎండ్ కార్లు, విలాసవంతమైన పడవలు, ప్రైవేట్ విమానాలు ఉన్నాయి.
సులభమైన నిబంధనల అమలు: రిజిస్ట్రేషన్, రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం జీఎస్టీ 2.0 చేసింది. ఇదే సమయంలో రీఫండ్‌లను వేగవంతం చేస్తూ ఖర్చులను తగ్గించింది. ఇది వ్యాపారాలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, అంకురసంస్థలకు విధానపరమైన సౌలభ్యాన్ని తెస్తుంది.
తక్కువ ఖర్చులు, విస్తృత ప్రభావం
రేట్ల తగ్గింపుతో పాటు జీఎస్టీ 2.0 ఖర్చులను తగ్గించడం, స్థోమతను మెరుగుపరచడం, నిబంధనల అమలును, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశ వృద్ధి చక్రానికి మద్దతు ఇస్తోంది. విస్తృతమైన రంగాల పరిధితో ఎగుమతులు, కళాకారులు, రైతులు, స్థిరమైన తయారీ రంగానికి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యం జీఎస్టీ 2.0 లక్ష్యం.
గృహాలు, వినియోగదారులకు ఉపశమనం:
చౌకైన వస్తువులు, సేవలు వినియోగం పెరగడానికి తోడ్పడుతున్నాయి. పొదుపుకు దోహదపడుతున్నాయి.
బీమా, అవసరమైన మందులపై జీఎస్టీ మినహాయింపులు గృహ రక్షణను బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి.
ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలకు ఊతం:
సిమెంట్, హస్తకళలు వంటి కీలక వస్తువులు, రంగాలపై తగ్గించిన జీఎస్టీ రేట్లు ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తాయి. వ్యాపార పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి.
సరళీకృత నిర్మాణం వర్గీకరణకు సంబంధించిన వివాదాలను తగ్గిస్తోంది. వ్యాపారాలకు పన్ను నిర్ణయాలను సులభతరం చేస్తోంది. కాలక్రమేణా ఇది పన్ను పరిధిని విస్తరించడానికి, ఆదాయ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి సహాయపడుతోంది.
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ల సవరణ దేశీయ విలువ జోడింపును పెంచుతుంది. ఎగుమతులను ప్రోత్సహిస్తుంది.
ఎంఎస్ఎంఈలు, చిన్న పన్ను చెల్లింపుదారులకు నిబంధనల సులభతరం
ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలులు, చిన్న పన్ను చెల్లింపుదారుల కొరకు నిబంధనల అమలును సులభతరం చేయడానికి కాలక్రమేణా అనేక చర్యలు ప్రవేశపెట్టారు.
అధిక మినహాయింపులు: 2019 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చేలా వస్తువుల సరఫరాదారుల జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచారు. కాంపోజిషన్ స్కీమ్ పరిమితిని కూడా రూ.75 లక్షల నుంచి రూ.1.5 కోట్లకు పెంచారు(కొన్ని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు మినహా).
కాంపోజిషన్ స్కీమ్:
ఈ పథకం చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం రూపొందించినది. ఇది టర్నోవర్‌పై స్థిరమైన రేటుతో జీఎస్టీ చెల్లించడానికి వారిని అనుమతిస్తుంది. దీనికి తక్కువ పత్రాలు సరిపోతాయి. సరళమైన రిటర్న్-ఫైలింగ్ ఉంటుంది.
సరళమైన రిటర్న్ ఫైలింగ్‌లు: త్రైమాసిక రిటర్న్ ఫైలింగ్, నెలవారీ చెల్లింపు(క్యూఆర్ఎంపీ) పథకాన్ని త్రైమాసిక ప్రాతిపదికన రిటర్న్‌లను దాఖలు చేయడానికి అనుమతించేలా 2020లో ప్రవేశపెట్టారు. ఇది రూ.5 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది.
దీంతో పాటు ఎటువంటి లావాదేవీలు లేని పన్ను చెల్లింపుదారులు ఎస్ఎంఎస్ ద్వారా కూడా నిల్ అని నెలవారీ జీఎస్టీ రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు.
చిన్న వ్యాపారాలు, ఈ-కామర్స్ విక్రేతలకు మద్దతు: ఈ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా అంతర్రాష్ట్ర వస్తువుల సరఫరా చేసే చిన్న పన్ను చెల్లింపుదారులకు 2023 అక్టోబర్ నుంచి తప్పనిసరి జీఎస్టీ రిజిస్ట్రేషన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
తక్కువ రిస్క్ ఉన్న దరఖాస్తుదారుల కోసం సులభ ఆధారిత రిజిస్ట్రేషన్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మూడు పని దినాలలో రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తుంది.
వివాదాలు, గత డిమాండ్లలో ఉపశమనం: జీఎస్టీ అప్పీళ్లను దాఖలు చేయడానికి అవసరమైన ప్రీ-డిపాజిట్ మొత్తాన్ని తగ్గించడానికి సవరణ చేశారు.
కొన్ని షరతులకు లోబడి పలు డిమాండ్ నోటీసుల కోసం వడ్డీ, జరిమానాల మినహాయింపును కూడా అందించారు. ఇది 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు వర్తిస్తుంది.
జీఎస్టీ పరిధిలో డేటా ఆధారిత పన్ను పరిపాలన పెరుగుదల
జీఎస్టీ సంస్కరణలు పన్ను పరిపాలనను ప్రధానంగా సాంకేతికతతో నడిచే వ్యవస్థ వైపుగా మార్చాయి.
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్(జీఎస్టీఎన్) పోర్టల్, ఈ-ఇన్‌వాయిసింగ్ విధానాలు ఇన్‌వాయిస్ డేటాను రియల్-టైమ్‌లో సేకరించడం ద్వారా పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చాయి. ఇది మాన్యువల్ రిపోర్టింగ్‌ను తగ్గించడానికి, కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, రిపోర్టింగ్‌లో వ్యత్యాసాలను తగ్గించడానికి సహాయపడింది.
ఆటోమేషన్ పన్ను చెల్లింపుదారులకు ఫైలింగ్ ప్రక్రియలను సులభతరం చేసింది. సరఫరాదారు పన్ను బాధ్యతను, గ్రహీత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్(ఐటీసీ)తో సరిపోల్చడం ప్రక్రియలను క్రమబద్ధీకరించింది. ముందే నింపిన రిటర్న్‌లు, సరళీకృత సమన్వయం, నిజసమయ ధ్రువీకరణ లోపాలను తగ్గించాయి. మొత్తం విధానపరమైన అవసరాలను తగ్గించాయి.
జీఎస్టీని బలోపేతం చేయడానికి ఏఐ, డేటా అనలిటిక్స్ ఉపయోగం
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను మరింత లక్ష్యబద్ధమైన రీతిలో పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఇవి డేటా నమూనాలు, రిస్క్ సూచికలను విశ్లేషించడం ద్వారా పన్ను ఎగవేతలను గుర్తించడంలో సహాయపడతాయి. రిజిస్ట్రేషన్, పరిశీలన వంటి వివిధ ప్రక్రియలలో ఈ సాధనాలను వర్తింపజేశారు. ఇది నిబంధనలను పాటించే పన్ను చెల్లింపుదారులపై నియంత్రణ అవసరాలను తగ్గిస్తూ, అధిక రిస్క్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై దృష్టి పెట్టడానికి వ్యవస్థను అనుమతిస్తోంది.
ఈ చర్యల ప్రభావం పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా భారతదేశ విస్తృత స్థూల ఆర్థిక స్థిరత్వానికి మద్దతునిచ్చింది. ఇవి వసూళ్లను మరింత ఊహించదగినవిగా మార్చాయి. తద్వారా బలమైన ఆదాయ వృద్ధికి, గొప్ప ఆర్థిక పారదర్శకతకు తోడ్పడ్డాయి.
జీఎస్టీ వృద్ధిలో కనిపిస్తున్న ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ ప్రయోజనాలు
జీఎస్టీ వసూళ్లు ఆర్థిక కార్యకలాపాల తీవ్రతను తెలిపే సంకేతంగా మారాయి. పెరుగుతున్న ఆదాయాలు కేవలం అధిక వినియోగం, వ్యాపారాన్ని మాత్రమే కాకుండా, విస్తృతమైన పన్ను చెల్లింపుదారుల పరిధిని, బలమైన రిపోర్టింగ్ వ్యవస్థలను, మెరుగైన నిబంధనల అమలును ప్రతిబింబిస్తాయి.
జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017లో 66.5 లక్షల నుంచి మే 2026 నాటికి 1.65 కోట్లకు పెరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధీకరణ చెందడాన్ని సూచిస్తోంది.

స్థూల జీఎస్టీ వసూళ్లు 2017-18లో సుమారు రూ.7.4 లక్షల కోట్లుగా ఉండగా, తర్వాత ఏటా క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
గత ఐదేళ్లలో వసూళ్లు 2021-22లో ~రూ.13.76 లక్షల కోట్ల నుంచి 2025-26లో ~రూ.22.27 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ వేగం 2026-27లోకి కూడా కొనసాగింది. 2026 ఏప్రిల్-మే కాలంలో జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.4.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
జీఎస్టీ నిరంతర సంస్కరణల ప్రస్థానం
జీఎస్టీ దినోత్సవ ప్రాముఖ్యత ఒక మైలురాయి లాంటి పన్ను సంస్కరణ ప్రారంభాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా అంతకుమించి ఉంటుంది. ఇది సరళమైన, మరింత పారదర్శకమైన, సమగ్రమైన పరోక్ష పన్ను వ్యవస్థను రూపొందించడానికి భారతదేశం చేస్తున్న నిరంతర కృషిని ప్రతిబింబిస్తుంది. జీఎస్టీ 2.0 కింద చేపట్టిన సంస్కరణలు పౌరులు, వ్యాపారాల అవసరాలను తీర్చడం ద్వారా వికసిత్ భారత్ వైపు దేశ పురోగతికి మద్దతు ఇస్తున్నాయి.
References
Prime Minister's Office (PMO)
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2163986&lang=1®=3
Ministry of Finance
https://www.indiabudget.gov.in/budget2017-2018/es2016-17/echap01_vol2.pdf
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=155151®=48&lang=2
https://dor.gov.in/concept-note-gst
https://cbic-gst.gov.in/pdf/01012018-GST-Concept-and-Status.pdf
https://gstcouncil.gov.in/about-us
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2414_pElIGR.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU3545_9tJ3Tw.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/183/AU2272_Pzuq3S.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU1430_6jAjKo.pdf?source=pqals
https://tutorial.gst.gov.in/downloads/news/monthly_gst_data_for_mar_2026_for_publishing_final.pdf
https://tutorial.gst.gov.in/downloads/news/final_monthly_gst_data_for_may_2026_for_publishing.pdf
https://sansad.in/getFile/annex/250/AU233.pdf?source=pqars
https://www.gstn.org.in/
World Bank
https://documents1.worldbank.org/curated/en/348501542614212003/pdf/India-develoment-Update-GST-December-2017.pdf
Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154789&ModuleId=3®=48&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155151&ModuleId=3®=48&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155156&ModuleId=3®=48&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=151915®=48&lang=2
Click to See In PDF
***
(Explainer ID: 159082)
आगंतुक पटल : 11
Provide suggestions / comments