Rural Prosperity
పేదలకు సాధికారత: సమ్మిళిత మార్పుతో కూడిన దశాబ్దం
Posted On:
08 JUN 2026 11:22AM
గడచిన పన్నెండేళ్లలో భారతదేశం నిరంతరాయంగా చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిత్యావసర సేవల లభ్యతను పెంచాయి. దీనివల్ల నిరుపేద కుటుంబాలలో కొరత తగ్గింది. విస్తృత సంక్షేమ కార్యక్రమాల అమలు, సామాజిక రక్షణ చర్యల ద్వారా దాదాపు 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి సౌకర్యం ఉన్న కుటుంబాల సంఖ్య 2019 నాటి 3.23 కోట్ల నుంచి మే 2026 నాటికి 15.84 కోట్ల కుటుంబాలకు పెరిగింది. 12.11 కోట్లకు పైగా గృహ మరుగుదొడ్లను నిర్మించింది. దీంతో గ్రామీణ పారిశుద్ధ్య కవరేజ్ 2014 నాటి 39 శాతం నుంచి నూటికి నూరు శాతం సాధించే స్థాయికి చేరింది. పీఎం ఉజ్వల యోజన ద్వారా 10.57 కోట్లకు పైగా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. ఇది మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక ఇళ్లలో గాలి కాలుష్యాన్ని తగ్గించింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా 43.93 కోట్ల హెల్త్ కార్డులను జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సరసమైన ధరల్లో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. పీఎంజీకేఏవై ద్వారా 81 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించింది. దేశవ్యాప్తంగా పేద కుటుంబాల ఆహార భద్రతను ఇది బలోపేతం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ రేటు 2013-14 నాటి 4.6 శాతం నుంచి 2024-25 నాటికి 0.3 శాతానికి గణనీయంగా తగ్గింది. డిజిటల్ పాలనా సంస్కరణల వల్ల ఆధార్ ఆధారిత రేషన్ పంపిణీ సాధ్యమైంది. ఆశావహ జిల్లాలు, గిరిజన ప్రాంతాలలో నీరు, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి లక్షిత కార్యక్రమాల ద్వారా సంక్షేమ అమలు మరింత విస్తరించింది.
పేదరిక నిర్మూలన, బహుళ రంగాల సంక్షేమంలో వ్యూహాత్మక నమూనాలు
గడచిన దశాబ్ద కాలంలో భారతదేశం పేదరిక నిర్మూలన, సామాజిక రక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఒక ముఖ్యమైన మార్పును చూసింది. అందరినీ కలుపుకుపోవడం, సులభంగా అందుబాటులో ఉండటం, చివరి వ్యక్తికి కూడా సేవలు అందడం అనే సూత్రాలపై ఆధారపడి ప్రజా విధానాలు సాగాయి. ఆర్థిక వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కావడానికి ఇది తోడ్పడింది.
ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం 2004-2014 కాలంలో ఉన్న 8.1 శాతం నుంచి 2014-2025 కాలానికి 5.1 శాతానికి తగ్గింది. ధరల స్థిరత్వానికి, కుటుంబాల కొనుగోలు శక్తి పెరగడానికి ఇది దోహదపడింది. అదే సమయంలో భారతదేశంలో బహుమితీయ(మల్టీడైమెన్షనల్) పేదరికం 2013-14 నాటి 29.17 శాతం నుంచి 2022-23 నాటికి 11.28 శాతానికి పడిపోయింది. ఇది 17.89 శాతం పాయింట్ల తగ్గుదలను సూచిస్తుంది. ఈ కాలంలో దాదాపు 25 కోట్ల మంది బహుమితీయ పేదరికం నుంచి విముక్తి పొందారు.
సంక్షేమ పథకాలు, సామాజిక రక్షణ చర్యలను పెద్ద ఎత్తున విస్తరించడం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది. ఆర్థిక సమ్మిళితం, సరసమైన వైద్యం, ఆహార భద్రత, గృహ వసతి, జీవనోపాధికి మద్దతు, డిజిటల్ గవర్నెన్స్ సంస్కరణలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల పంపిణీ ఈ ప్రయత్నాలను మరింత బలోపేతం చేశాయి. మొత్తంగా ఈ కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ భారతంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి.
గౌరవప్రదమైన జీవనానికి పునాదులు: ప్రాథమిక అవసరాల సార్వత్రిక లభ్యత
ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ భారతంలో కుళాయి నీటి కనెక్షన్లు, పారిశుద్ధ్య కవరేజ్, ఎల్పీజీ లభ్యత, గ్రామీణ విద్యుద్దీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ప్రయత్నాలు మెరుగైన జీవన నాణ్యత, మానవాభివృద్ధి, పెద్ద ఎత్తున ప్రాథమిక సేవల పంపిణీ వైపు సాగుతున్న విస్తృత మార్పును ప్రతిబింబిస్తాయి.
I. నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత(వాష్) సార్వత్రిక లభ్యత
గడచిన దశాబ్ద కాలంలో స్వచ్ఛమైన ఇంధనం, సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్యం భారతదేశ సంక్షేమ, ప్రజారోగ్య వ్యూహంలో ప్రధాన స్తంభాలుగా ఉద్భవించాయి. పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాలు జీవన నాణ్యతను గణనీయంగా పెంచాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించాయి. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ప్రజల గౌరవాన్ని ఇవి బలోపేతం చేశాయి.
జల్ జీవన్ మిషన్
2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్(జేజేఎం).. గ్రామీణ కుటుంబాలకు తాగునీటి లభ్యతను కల్పించడానికి ఉద్దేశించిన ఒక పరివర్తనాత్మక మౌలిక సదుపాయాల కార్యక్రమం.

గ్రామీణ మహిళలు తాగునీటిని చేతితో సేకరించడానికి పడే దీర్ఘకాలిక శ్రమను తగ్గించడానికి ఈ మిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం గ్రామీణ జనాభా ఆరోగ్యం, విద్యా రంగంలో సాధించిన విజయాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులలో గణనీయమైన పురోగతికి దోహదం చేస్తుంది.
దీని వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. బడ్జెట్ కేటాయింపులు 2020-21 నుంచి 2026-27 మధ్య సుమారు 488 శాతం పెరిగి రూ.67,670 కోట్లకు చేరుకున్నాయి. ఆచరణాత్మకంగా చూస్తే ఈ మిషన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. గృహ కుళాయి నీటి కవరేజ్ ఆగస్టు 2019 నాటి 3.23 కోట్ల నుంచి మే 2026 నాటికి 15.84 కోట్లకు పెరిగింది. మొత్తం 19.35 కోట్ల కుటుంబాలలో ఇది 81.87 శాతం కవరేజీని సూచిస్తుంది. అంతేకాకుండా, హర్ ఘర్ జల్ ప్రచారం కింద 2.77 లక్షల గ్రామాలు 100 శాతం కుళాయి నీటి కవరేజీని సాధించాయి.
ఆశావహ జిల్లాలు, బ్లాకులలో లక్షిత కార్యక్రమాల ద్వారా అభివృద్ధి అసమానతలను ఈ పథకం పరిష్కరించింది. ఆయా జిల్లాలలో గృహ కుళాయి నీటి కవరేజ్ ఆగస్టు 2019 నాటి 23.62 లక్షల నుంచి మే 2026 నాటికి 2.20 కోట్లకు పెరిగింది. అదేవిధంగా, ఆకాంక్షిత బ్లాకులలో మే 2026 నాటికి 1.11 కోట్ల కుటుంబాలు కుళాయి నీటి సదుపాయాన్ని పొందాయి. ఈ వ్యవస్థాగత విస్తరణ ప్రజారోగ్యం, గ్రామీణ గౌరవాన్ని పెంపొందించడంలో ఉన్న బలమైన నిబద్ధతను తెలియజేస్తుంది.
జల్ జీవన్ మిషన్ కార్యాచరణ మార్గదర్శకాలు "హర్ ఘర్ జల్" ఫ్రేమ్‌వర్క్ కింద గ్రామాల ధ్రువీకరణ నిబంధనలను నిర్దేశిస్తాయి. ఈ వ్యవస్థాగత దృష్టి తాగునీటి లభ్యత గణనీయంగా విస్తరించడానికి దారితీసింది. కీలకమైన సమాజ సంస్థలు, గృహాలలో కుళాయి నీటి సదుపాయం పూర్తిగా సంతృప్త స్థాయికి చేరుకున్న తర్వాతనే ఒక గ్రామాన్ని ధ్రువీకరిస్తారు.

ఈ నేపథ్యంలో కుళాయి నీటి అనుసంధానం ఉన్న పాఠశాలల సంఖ్య ఆగస్టు 2019 నాటి 29,711 నుంచి మే 2026 నాటికి 9.23 లక్షలకు పెరిగింది. అదే కాలంలో అంగన్‌వాడీ కేంద్రాలలో కుళాయి నీటి కవరేజ్ 15,464 నుంచి 9.66 లక్షలకు పెరిగింది. గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కుళాయి నీటి అనుసంధానం 3.93 లక్షల సంస్థలకు చేరింది. ఇటువంటి సౌకర్యాలలో ఇది 77.27 శాతం కవరేజీని సూచిస్తుంది. స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం మెరుగుపడటం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులు తగ్గాయి. పారిశుద్ధ్యం బలపడింది. ముఖ్యంగా పిల్లలు, యుక్తవయస్సు బాలికలలో మెరుగైన విద్యా ఫలితాలకు ఇది మద్దతుగా నిలిచింది.
స్వచ్ఛ భారత్ అభియాన్ - అర్బన్
2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) భౌతిక మౌలిక సదుపాయాలు, ప్రవర్తనా మార్పు రెండింటినీ లక్ష్యంగా చేసుకున్న ఒక బహుముఖ వ్యూహం. బహిరంగ మలవిసర్జన, చేతితో మలమూత్రాల సేకరణను నిర్మూలించడమే కాకుండా, తక్కువ ప్రమాణాలు కలిగిన పారిశుద్ధ్య సౌకర్యాలను మార్చడం, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణను వ్యవస్థీకరించడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ఉద్యమం సామాజిక నిబంధనలను ప్రాథమికంగా మార్చింది. పారిశుధ్య మౌలిక సదుపాయాల డిమాండ్, వినియోగంలో గణనీయమైన పెరుగుదలను ప్రేరేపించింది.

బడ్జెట్ వ్యయం ఎస్‌బీఎం-యూ తొలి దశ(2014-2021) కింద ఉన్న రూ.62,009 కోట్ల నుంచి ఎస్‌బీఎం-యూ 2.0(2021-2026) కింద రూ.1.41 లక్షల కోట్లకు పెరిగింది. ఇది సుమారు 128.3 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ మిషన్ కింద ఇంటింటికీ వ్యర్థాల సేకరణ 2014 లోని 43 శాతం నుంచి 2026 నాటికి 98 శాతానికి పెరిగింది. వివిధ కలెక్షన్ అండ్ మెటీరియల్ రికవరీ సెంటర్లలో వ్యర్థాల ప్రాసెస్ 2014లోని 16 శాతం నుంచి 2026 నాటికి 82 శాతానికి పెరిగింది.
వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణం నిర్దేశిత లక్ష్యాలను మించిపోయింది. 63.74 లక్షల యూనిట్లు పూర్తయి, లక్ష్యంలో 108.62 శాతం సాధించాయి. కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్ మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించి 6.36 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఇది లక్ష్యంలో 125.46 శాతానికి సమానం. ఈ కార్యక్రమాల ఫలితంగా 4,692 నగరాలు బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) నగరాలుగా మారాయి. 4,314 నగరాలు ఓడీఎఫ్+ గా, 1,973 నగరాలు ఓడీఎఫ్++ గా ధ్రువీకరణ పొందాయి. ఇది పట్టణ పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది.
ఓడీఎఫ్+, ఓడీఎఫ్++ అంటే ఏమిటి?
ఓడీఎఫ్ అంటే బహిరంగ మలవిసర్జన రహిత స్థితి. ఎవరూ బహిరంగంగా మలవిసర్జన చేయకుండా, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించే పరిస్థితి ఇది. ఓడీఎఫ్+ అంటే ఒక ప్రాంతం బహిరంగ మలవిసర్జన రహితంగా ఉండటమే కాకుండా, సమర్థవంతమైన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను కలిగి ఉండటం. దీనివల్ల ఆ ప్రాంతం మొత్తంగా స్పష్టమైన పరిశుభ్రత స్థాయితో కనిపిస్తుంది. ఓడీఎఫ్++ అంటే ఆ ప్రాంతంలోని అన్ని మరుగుదొడ్లు పని చేస్తూ, సరైన నిర్వహణలో ఉండటం. ఆ ప్రాంతంలోని మల వ్యర్థాలు, మురుగునీటిని నేరుగా కాలువలు లేదా జలాశయాలలోకి వదలకుండా సురక్షితంగా శుద్ధి చేయడం.
స్వచ్ఛ భారత్ అభియాన్ - గ్రామీణ్
2014 కంటే ముందు గ్రామీణ భారతదేశంలో సుమారు 55 కోట్ల మందికి తగిన పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. ఇది ప్రజారోగ్య సవాళ్లకు దారితీసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల సామాజిక గౌరవాన్ని దెబ్బతీసింది. దీనికి సమాధానంగా అక్టోబర్ 2014 లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ప్రారంభమైంది. ఈ వ్యూహాత్మక ప్రాధాన్యత బడ్జెట్ కేటాయింపులలో 83 శాతం పెరుగుదలలో కనిపిస్తుంది. బడ్జెట్ కేటాయింపులు 2014-15 లోని రూ.3,929 కోట్ల నుంచి 2026-27 నాటికి రూ.7,192 కోట్లకు పెరిగాయి.

ఈ మిషన్ కింద ఇప్పటివరకు 12.11 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను నిర్మించారు. మొదటి దశలో పారిశుద్ధ్య కవరేజ్ 2014 నాటి 39 శాతం నుంచి 2019 నాటికి 100 శాతానికి గణనీయంగా పెరిగింది. దీంతో 2019లో భారతదేశం బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా గుర్తింపు పొందింది. 2026 మార్చి నాటికి 5 లక్షలకు పైగా గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్(మోడల్) హోదాను సాధించాయి. ఓడీఎఫ్ ప్లస్‌లో గ్రామీణ భారతదేశంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల ద్వారా సమగ్ర గ్రామ పరిశుభ్రత ఉంటుంది. ఈ పురోగతి ప్రాథమిక సదుపాయం నుంచి సమగ్ర పర్యావరణ పారిశుధ్యం వైపు సాగిన వ్యవస్థాగత మార్పును నొక్కి చెబుతుంది.

గ్రామీణ భారతదేశం అంతటా సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల వ్యవస్థీకరణ జరిగింది. 5.31 లక్షల గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, 5.50 లక్షల గ్రామాలలో ద్రవ/గ్రేవాటర్ నిర్వహణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఈ మౌలిక సదుపాయాలు 5,482 బ్లాకులలో విస్తరించి ఉన్న 2,415 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల ద్వారా మరింత బలోపేతమయ్యాయి. వ్యాధుల బారిన పడటం, మరణాల రేటు తగ్గడం వంటివి స్వచ్ఛ భారత్ మిషన్ సాధించిన విజయాలు.
గోబర్ధన్ కార్యక్రమం కూడా అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇది 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 14 చురుకైన బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి 2026 మే నాటికి 1,213కు పైగా ప్లాంట్లకు చేరుకుంది. వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలు, బయో-ఎనర్జీ ఉత్పత్తి సర్క్యులర్ ఎకానమీ దిశగా బలమైన మార్పును చాటుతోంది.
II. స్వచ్ఛమైన వంట ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ విద్యుద్దీకరణ పురోగతి
సార్వత్రిక ఇంధన లభ్యత కోసం భారతదేశ సమగ్ర వ్యూహం స్వచ్ఛమైన వంట ఇంధనం, రూఫ్‌టాప్ సౌర వ్యవస్థ ఏర్పాటు, పూర్తి గ్రామీణ విద్యుద్దీకరణపై దృష్టి పెడుతుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన
2016లో ప్రారంభించిన పీఎం ఉజ్వల యోజన(పీఎంయూవై).. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో సాంప్రదాయ వంట ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకం పేద కుటుంబాలకు చెందిన వయోజన మహిళా లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, రీఫిల్ మద్దతును అందిస్తుంది.

ఇళ్ల లోపల గాలి కాలుష్యాన్ని, బయోమాస్ ఆధారిత ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా గ్రామీణ ఆరోగ్యం, జీవన పరిస్థితులను పీఎంయూవై మెరుగుపరిచింది. ఈ పథకం మహిళల శ్రమను తగ్గిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇస్తుంది. పోషకాహార ఫలితాలను మెరుగుపరుస్తుంది.
2026 మే నాటికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాల మహిళలకు 10.57 కోట్లకు పైగా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందాయి. దీంతో దేశంలో మొత్తం ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 2014లోని 14.52 కోట్ల నుంచి 2026 నాటికి 33.39 కోట్లకు పెరిగింది. ఇది 12 ఏళ్లలో దాదాపు 129.9 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన

2024లో ప్రారంభించిన పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఇది గృహ సౌర విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీలను అందిస్తుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తుంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యుత్తు వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. సంక్షేమ ఆధారిత కార్యక్రమంగా ఇది ఇంధన స్వయం సమృద్ధికి మద్దతు ఇస్తుంది. శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ఈ పథకానికి పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ కేంద్ర బడ్జెట్ కేటాయింపులు 2026-27లో రూ.22,000 కోట్లకు పెరిగాయి. 2024-25లో ఈ పథకానికి రూ.6,250 కోట్లు కేటాయించారు.
2026 ఏప్రిల్ నాటికి ఈ పథకం ద్వారా 36.8 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్‌ల సంఖ్య 2024 డిసెంబర్‌లోని 6.3 లక్షల నుంచి 2026 ఏప్రిల్ నాటికి 30 లక్షలకు గణనీయంగా పెరిగింది.
సార్వత్రిక గ్రామ విద్యుద్దీకరణ
దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో 2017లో ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన(సౌభాగ్య) ప్రారంభమైంది. విద్యుత్ కనెక్షన్ కోరుకునే ప్రతి ఇంటికీ ఈ పథకం ద్వారా విద్యుత్ సరఫరా లభిస్తుంది. ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యం, విద్యా రంగ ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా కిరోసిన్‌పై ఆధారపడటాన్ని తగ్గించింది. ముఖ్యంగా మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఈ పథకం కింద విద్యుత్ కోరుకున్న నూటికి నూరు శాతం గృహాలకు మార్చి 2019 నాటికే విద్యుద్దీకరణ పూర్తయింది.
కేవలం గృహాలకే పరిమితం కాకుండా వీధులు, సామాజిక మౌలిక సదుపాయాలకు కూడా విద్యుత్ సౌకర్యాన్ని విస్తరించారు. 2014లో ప్రారంభించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన.. గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ కార్యకలాపాలకు నమ్మకమైన విద్యుత్ సరఫరా అందేలా కూడా ఈ పథకం చూస్తుంది. ఈ కార్యక్రమం కింద 2025 నాటికి నూటికి నూరు శాతం గ్రామాల విద్యుద్దీకరణ సాధ్యమైంది.

ఇలాంటి లక్షిత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యతను, సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు రోజువారీ విద్యుత్ సరఫరా 2014 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 12.5 గంటల నుంచి 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 22.6 గంటలకు పెరిగింది. పట్టణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా 2014 ఆర్థిక సంవత్సరంలోని 22.1 గంటల నుంచి 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 23.4 గంటలకు పెరిగింది. మెరుగైన విద్యుత్ లభ్యత విద్యుత్ ఆధారిత నీటి పారుదల వ్యవస్థల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి మద్దతుగా నిలిచింది. ఇది తయారీ రంగ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పట్టణ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.
III. ప్రజారోగ్యం, ఆహార భద్రతా వ్యవస్థల బలోపేతం
ఆరోగ్య సేవల లభ్యత, సరసమైన ధరలు, సేవల పంపిణీని బలోపేతం చేయడానికి భారతదేశం ముఖ్యమైన సంస్కరణలను చేపట్టింది. విస్తృత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు లక్షలాది మందికి బలమైన పోషకాహారాన్ని, సమగ్ర సామాజిక భద్రతను అందిస్తున్నాయి.
ఆయుష్మాన్ భారత్

భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య రక్షణను సాధించడానికి ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య పథకంగా గుర్తింపు పొంది.. ప్రతి కుటుంబానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా రక్షణను కల్పిస్తుంది. జనాభాలో దిగువన ఉన్న 40 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే దాదాపు 12.37 కోట్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇందులో ఉన్నాయి. మార్చి 2024లో ఈ పథకం పరిధిని మరింత విస్తరించి సుమారు 37 లక్షల మంది ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్మికులు, సహాయకులు, వారి కుటుంబాలను కూడా చేర్చారు.
2026 మే నాటికి ఈ పథకం కింద 43.93 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులను జారీ చేశారు. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య జూన్ 2019లోని 29.96 లక్షల నుంచి మే 2026 నాటికి 12.03 కోట్లకు భారీగా పెరిగింది. దీని మొత్తం చికిత్స ఖర్చు రూ.1.80 లక్షల కోట్లుగా ఉంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) డిజిటల్ ఆరోగ్య పరిపాలనను వ్యవస్థీకరించింది. ఇది 14 అంకెల ప్రత్యేక డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ అయిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్(ఏబీహెచ్ఏ)ను ప్రవేశపెట్టింది. ఇది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య రికార్డుల నిర్వహణకు వీలు కల్పిస్తుంది. 2026 మే నాటికి 88.33 కోట్ల అభా ఖాతాలు నమోదయ్యాయి. వీటితో దాదాపు 97.81 కోట్ల ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు. తద్వారా కాగిత రహిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సాధ్యమైంది.
ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా అదే స్థాయిలో విస్తరించాయి. 1.85 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు 540 కోట్ల సందర్శనలకు వేదికయ్యాయి. సరసమైన ధరలలో మందుల లభ్యత కూడా గణనీయంగా విస్తరించింది. 7.41 కోట్ల మంది పౌరులు సరసమైన అమృత్ అవుట్‌లెట్ల నుంచి ప్రయోజనం పొందారు.
ఆయుష్మాన్ భారత్ వయ వందన యోజన కింద 1.20 కోట్లకు పైగా మంది సీనియర్ సిటిజన్లు నమోదయ్యారు. రూ.3,000 కోట్లకు పైగా వ్యయంతో సుమారు 13.84 లక్షల చికిత్సలు అందాయి. ఈ కాలంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా గణనీయమైన విస్తరణకు సాక్ష్యంగా నిలిచాయి. ఆమోదం పొంది, అందుబాటులోకి వచ్చిన ఎయిమ్స్ సంఖ్య గత 12 ఏళ్లలో(2014-2026) 8(1947-2014) నుంచి 15కి పెరిగింది. ఎయిమ్స్ సంస్థల కార్యాచరణ విస్తరణ 2014 నుంచి దాదాపు రెట్టింపు అయింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ఉన్న బలమైన నిబద్ధతను, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సరసమైన ఆరోగ్య సేవలను అందించడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
బాలల, మాతృ ఆరోగ్య కార్యక్రమాలు
వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మాతృ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసింది. ఈ కార్యక్రమాలలో జనని సురక్షా యోజన, జనని శిశు సురక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) ఉన్నాయి. పీఎంఎస్‌ఎంఏ కింద 7 కోట్లకు పైగా ప్రసవ పూర్వ తనిఖీలు నిర్వహించారు., ఇది అధిక ముప్పు ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించడానికి, ప్రత్యేక శ్రద్ధతో చూసుకునేందుకు వీలు కల్పించింది. మిషన్ ఇంద్రధనుష్ 5.46 కోట్ల మంది పిల్లలకు, 1.32 కోట్ల మంది గర్భిణులకు టీకాలు వేసింది. తద్వారా ఆరోగ్య ఫలితాలను గణనీయంగా మెరుగుపరిచింది.

ఈ కార్యక్రమాలు గణనీయమైన దీర్ఘకాలిక పురోగతిని అందించాయి. మాతృ మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్) ప్రతి 1,00,000 సజీవ జననాలకు 130(2014-16) నుంచి 88 (2021-23)కి తగ్గింది. ఎన్ఎఫ్‌హెచ్ఎస్-6 గణాంకాలు మొదటి త్రైమాసిక ప్రసవ పూర్వ సంరక్షణ తనిఖీలు 2015-16(ఎన్ఎఫ్‌హెచ్ఎస్-4), 2023-24 మధ్య 59 శాతం నుంచి 76.2 శాతానికి పెరిగాయని సూచిస్తున్నాయి. కనీసం నాలుగు ప్రసవ పూర్వ తనిఖీల లభ్యత 51 శాతం నుంచి 65.2 శాతానికి విస్తరించింది. ఇది సంస్థాగత మాతృ ఆరోగ్య సేవల వినియోగం పెరగడాన్ని సూచిస్తుంది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన 80వ రౌండ్ హౌస్‌హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ప్రకారం:
- గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంస్థాగత ప్రసవాలలో దాదాపు మూడింట రెండు వంతులు(66.8 శాతం) ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో దీనికి సంబంధించిన నిష్పత్తి 47 శాతంగా ఉంది.
- దీర్ఘకాలిక విశ్లేషణల ప్రకారం అవుట్‌పేషెంట్ సేవల కోసం ప్రభుత్వ సౌకర్యాల వినియోగం పెరిగింది. గ్రామీణ భాగస్వామ్యం 2014 లోని 28 శాతం నుంచి 2025 నాటికి 35 శాతానికి పెరిగింది.
ఈ కొలమానాలు ఆరోగ్య సేవల పంపిణీ నమూనా కేవలం సమస్య వచ్చినప్పుడు స్పందించే స్థితి నుంచి క్రియాశీలక, సమానమైన, నివారణా నమూనా వైపు విజయవంతంగా మారడాన్ని ప్రతిబింబిస్తాయి.
అందరికీ ఆహార భద్రత

2020లో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) ఒక కీలకమైన సామాజిక రక్షణ వలయంగా పనిచేస్తుంది. మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక అడ్డంకులను తగ్గించడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది. ఇది 81 కోట్లకు పైగా మంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తుంది. 2024 జనవరిలో ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించారు.
పీఎంజీకేఏవై ప్రస్తుతం ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటుంది. పీడీఎస్ సంస్థాగత చట్రం కూడా గణనీయమైన ఆధునికీకరణకు గురైంది. పీడీఎస్ పరిధిలోని 5.51 లక్షల సరసమైన ధరల దుకాణాలలో 5.50 లక్షలకు పైగా (99.8 శాతం) దుకాణాలు ఆధార్ ఆధారిత పంపిణీ కోసం ఆటోమేట్ అయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రేషన్ కార్డులు నూటికి నూరు శాతం డిజిటలైజ్ అయ్యాయి.
ఆహార ధాన్యాల పంపిణీ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రభుత్వం మే 2026 లో రూ.25,530 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో సార్థక్-పీడీఎస్ పథకానికి ఆమోదం తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, ఈ పథకం అధునాతన సాంకేతిక ఏకీకరణ ద్వారా రవాణా, చివరి వ్యక్తికి పంపిణీని మరింత మెరుగుపరుస్తుంది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్(ఓఎన్ఎఆర్‌సీ) దేశవ్యాప్త రవాణా సౌకర్యాన్ని వ్యవస్థీకరించింది. దీని ద్వారా 2.07 బిలియన్లకు పైగా లావాదేవీలు సాధ్యమయ్యాయి. ఇది పీఎంజీకేఏవై లబ్ధిదారులందరినీ కవర్ చేస్తుంది. వలస వెళ్లే, ఒక చోట స్థిరంగా ఉండని జనాభాకు సబ్సిడీ ఆహార ధాన్యాల లభ్యతను గణనీయంగా పెంచుతుంది.
ఈ కార్యక్రమాలతో పాటు పోషకాహార ఫలితాలలో కొలవదగిన మెరుగుదలలు కనిపించాయి. ఎన్ఎఫ్‌హెచ్ఎస్-6 (2023-24) ప్రకారం.. పిల్లలలో ఎదుగుదల లోపం(స్టంటింగ్) రేటు ఎన్ఎఫ్‌హెచ్ఎస్-4 (2015-16)లోని 38.4 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గింది. తీవ్ర పోషకాహార లోపం(వేస్టింగ్) 21 శాతం నుంచి 19 శాతానికి తగ్గింది. తక్కువ బరువు ఉన్న పిల్లల నిష్పత్తి 35.8 శాతం నుంచి 31.8 శాతానికి పడిపోయింది. ఇది పిల్లలలో పోషకాహార ఫలితాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని సూచిస్తుంది.
IV. విద్యా లభ్యత, అభ్యాస ఫలితాల బలోపేతం
భారతదేశ అభివృద్ధి పథం అనేది లింగ ప్రాతినిధ్యం, సంస్థాగత లభ్యతలో చారిత్రక వ్యత్యాసాలను పూడ్చే ఒక బహుళ రంగాల విధానం. ఆధునికీకరించిన భౌతిక మౌలిక సదుపాయాలు, అధునాతన డిజిటల్ బోధనా పద్ధతుల వ్యూహాత్మక ఏకీకరణ వెనుకబడిన వర్గాలకు విద్యా అవకాశాలను విస్తరించింది.
సమగ్ర శిక్షా అభియాన్

సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఉపాధ్యాయ విద్యా పథకాలను విలీనం చేస్తూ 2018-19 లో సమగ్ర శిక్షా అభియాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, డిజిటల్ అభ్యాసాన్ని వ్యవస్థీకరించడం, వృత్తి విద్యా శిక్షణను పెంచడం ద్వారా సార్వత్రిక లభ్యతకు, విద్యా సమ్మేళనానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పథకం కింద 4,073 పాఠశాలలు అప్‌గ్రేడ్ అయ్యాయి. 1.49 లక్షల ఐసీటీ, డిజిటల్ కార్యక్రమాలు(స్మార్ట్ క్లాస్‌రూమ్‌లతో సహా) అమలయ్యాయి. 25,000 పాఠశాలలు నైపుణ్య విద్య పరిధిలోకి తీసుకువచ్చింది.(2018-19 నుంచి 2025-26 మధ్య).
ఈ పథకం లింగ-నిర్దిష్ట మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. ప్రస్తుతం 97.3 శాతం పాఠశాలలు పనిచేసే స్థితిలో ఉన్న బాలికల పారిశుద్ధ్య సౌకర్యాలను కలిగి ఉన్నాయి. కేవలం బాలికల పారిశుధ్య సౌకర్యాలను అందించే మొత్తం పాఠశాలల సంఖ్య 2013-14 లోని 13.5 లక్షల నుంచి 2024-25 నాటికి 14.2 లక్షలకు పెరిగింది. 2014-15 నుంచి పాఠశాలల్లో బాలికల కోసం 1.39 లక్షలకు పైగా ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించారు. లింగ-సున్నితమైన పారిశుధ్య మౌలిక సదుపాయాల ఈ విస్తరణ విద్యార్థినుల డ్రాపౌట్ రేట్లను తగ్గించడానికి, విద్యలో వారి నిరంతర భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి దోహదపడింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో బాలికల డ్రాపౌట్ రేటు 4.6 శాతం (2013-14) నుంచి 0.3 శాతానికి (2024-25) తగ్గింది. మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఇది 14.5 శాతం (2013-14) నుంచి 11.5 శాతానికి (2024-25) తగ్గింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్
రాజ్యాంగ(103వ సవరణ) చట్టం-2019.. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉపాధిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు వీలు కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ వర్గాల వెలుపల ఉన్న అభ్యర్థులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందుబాటులో ఉంది. ఈ నిర్ణయం జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చింది. రూ.8 లక్షల వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి అర్హులైన ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులను గుర్తిస్తుంది.
ఈ నిరంతర ప్రయత్నాల ఫలితంగా భారతదేశం 2024-25 లో ప్రాథమిక స్థాయిలో దాదాపు సార్వత్రిక భాగస్వామ్యాన్ని సాధించింది. స్థూల నమోదు నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 90.9 శాతంగా, ఎగువ-ప్రాథమిక స్థాయిలో 90.3 శాతంగా నమోదైంది. హయ్యర్ సెకండరీ స్థాయిలో జీఈఆర్ 2014-15 లోని 46.4 శాతంతో పోలిస్తే 2024-25 నాటికి 58.4 శాతానికి పెరిగింది.
బేటీ బచావో బేటీ పఢావో

2015లో ప్రారంభించిన బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ఒక సమగ్రమైన, బహుళ రంగాల కార్యక్రమం. ఇది తగ్గుతున్న బాలల లైంగిక నిష్పత్తిని పరిష్కరించడానికి, లింగ వివక్షతో కూడిన లింగ నిర్ధారణ పద్ధతులను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధి చట్రాలను ఏకీకృతం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం ఆడపిల్లల మనుగడ, రక్షణ, విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది.
ఈ పథకం నిరంతర అమలు లింగ సంబంధిత సూచికలలో గణనీయమైన మెరుగుదలలకు దోహదపడింది. లింగ నిష్పత్తి 943 (జనాభా గణన 2011) నుంచి 2021 నాటికి ప్రతి 1,000 మంది పురుషులకు 1,020 మంది మహిళలకు మెరుగైంది. అంతేకాకుండా, బాలికల మాధ్యమిక పాఠశాల నమోదు 2014-15 లోని 75.51 శాతం నుంచి 2024-25 నాటికి 80.2 శాతానికి విస్తరించింది, ఇది విద్యలో లింగ సమానత్వం వైపు వచ్చిన మార్పును ప్రతిబింబిస్తుంది.
కస్తూర్బా బాలికా విద్యాలయాలు, పీఎం ఈవిద్య

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ) పథకం గత దశాబ్దంలో గణనీయంగా విస్తరించింది. మంజూరైన కేజీబీవీల సంఖ్య 2014-15 లోని 3,609 నుంచి 2024-25 నాటికి 5,639కి పెరిగింది. ఈ కాలంలో మొత్తం నివాస సామర్థ్యం 8.07 లక్షల మంది బాలికలకు పెరిగింది. 2024-25 నాటికి దేశవ్యాప్తంగా 5,133 కేజీబీవీలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల నమోదు 2014-15 లోని 3.52 లక్షల నుంచి 2024 నాటికి 7.11 లక్షలకు పెరిగింది. కేజీబీవీలు వెనుకబడిన వర్గాల బాలికలకు నివాస పాఠశాల సౌకర్యాలను అందిస్తాయి. ఈ పథకం ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలకు మద్దతు ఇస్తుంది.
సమగ్ర శిక్ష కింద పన్నెండో తరగతి వరకు నివాస పాఠశాల విద్యను అందించడానికి కేజీబీవీల విస్తరణ జరుగుతోంది. మార్చి 2024 నాటికి 2,616 పాఠశాలలు అప్‌గ్రేడ్ అయ్యాయి(313 పదో తరగతి వరకు, 2,303 పన్నెండవ తరగతి వరకు).
ఈ పథకం తద్వారా విద్యా నిరంతరాయతను బలోపేతం చేస్తుంది, వెనుకబడిన వర్గాల బాలికలకు అవకాశాలను విస్తరిస్తుంది.
సాంప్రదాయ పాఠశాల విద్యతో పాటు వివిధ డిజిటల్ మాడ్యూల్స్ ద్వారా విద్యను అందిస్తున్నారు. పీఎం ఈవిద్య కింద స్వయం ప్రభ 280కి పైగా ఛానెల్‌లను నిర్వహిస్తుంది, దీనికి నెలకు 3 లక్షల మందికి పైగా వీక్షకులు ఉన్నారు, ఇది దేశవ్యాప్తంగా విద్యా విషయాల లభ్యతను సాధ్యం చేస్తుంది. భారతదేశ స్వదేశీ మూక్(ఎంఓఓసీ) వేదిక అయిన స్వయం పోర్టల్, అధిక నాణ్యత గల బోధనా వనరుల సార్వత్రిక లభ్యతను వ్యవస్థీకరించింది. ఇది జనవరి 2026 నాటికి 5.80 కోట్ల కంటే ఎక్కువ నమోదులను నమోదు చేసింది.
దీక్ష వేదిక 2.17 కోట్ల నమోదిత వినియోగదారులు, 1.68 లక్షల రోజువారీ క్రియాశీల వినియోగదారులతో డిజిటల్ అభ్యాస వేదికలను అందిస్తుంది. ఈ డిజిటల్ కార్యక్రమం మెరుగైన అభ్యాస ఫలితాలు, విద్యా సమ్మేళనం, మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
పునాది నిర్మాణం: మౌలిక సదుపాయాలు, అనుసంధానం
ప్రాంతాల మధ్య ప్రజలు, వస్తువులు, సేవల నిరంతర రవాణాకు వీలు కల్పిస్తూ సమగ్ర అభివృద్ధికి బలమైన రవాణా అనుసంధానం అత్యంత ప్రాథమిక అవసరంగా నిలుస్తుంది. గ్రామీణ రోడ్లు, వంతెనలు, రైల్వే ఆధునికీకరణ, ఆర్థిక చెల్లింపుల వ్యవస్థలలో నిరంతర పెట్టుబడులు భౌతిక, ఆర్థిక మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేశాయి. ఇది మార్కెట్ లభ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక ఏకీకరణను పెంపొందించింది.
I. ఇళ్ల నిర్మాణం, సమాజాల బలోపేతం
సామాజిక-ఆర్థిక, కుల గణన(ఎస్ఈసీసీ) 2011 అంచనాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల కుటుంబాలకు సరైన గృహ వసతి లేదా ప్రాథమిక వసతులు లేవు. భారతదేశ నివాస, వినియోగ మౌలిక సదుపాయాల విస్తరణ బడ్జెట్ కేటాయింపులలో వచ్చిన పరివర్తనాత్మక మార్పుపై ఆధారపడి సాగింది. పీఎంఏవై, అమృత్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు ఇళ్ల లభ్యతను, ప్రాథమిక సేవలను, జీవన నాణ్యతను మెరుగుపరిచాయి. ఈ కార్యక్రమాలు మహిళల ఆస్తి యాజమాన్యాన్ని పెంచడంతో పాటు అందరికీ ఇళ్లు, మౌలిక సదుపాయాల లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాయి.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్, గ్రామీణ్
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పీఎంఏవై-యూ) బడ్జెట్ మద్దతులో గణనీయమైన పెరుగుదలను చూసింది. బడ్జెట్ కేటాయింపులు 2015-16లోని రూ.4,175 కోట్ల నుంచి 2026-27 నాటికి రూ.18,625.05 కోట్లకు పెరిగాయి. ఇది సుమారు 346.1 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ పథకం పట్టణ గృహాల పంపిణీని గణనీయంగా వేగవంతం చేసింది. 2005-2014 కాలంలో కేవలం 8.04 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, 2015 నుంచి 2026 మధ్య కాలంలో 98.10 లక్షల కంటే ఎక్కువ ఇళ్లు పూర్తయ్యాయి.
2026 మే నాటికి రూ.8.77 లక్షల కోట్ల మొత్తం వ్యయంతో 1.25 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి. క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద దాదాపు రూ.59,318 కోట్ల వడ్డీ సబ్సిడీ పంపిణీ జరిగింది. ముఖ్యంగా, పీఎంఏవై-యూ 2.0 కింద నిర్మించే ఇళ్లలో దాదాపు 96 శాతం ఇళ్లు మహిళల పేరిట నమోదవుతున్నాయి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్(పీఎంఏవై-జీ) కోసం కేంద్ర బడ్జెట్ కేటాయింపులు 2015-16 లోని రూ.21 కోట్ల నుంచి 2026-27 నాటికి రూ.54,916.70 కోట్లకు పెరిగాయి. ఇది సుమారు 2.61 లక్షల శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఈ పథకం గ్రామీణ గృహ వసతి లభ్యతను గణనీయంగా విస్తరించింది, మే 2026 నాటికి 3.91 కోట్ల ఇళ్లు మంజూరు కాగా, 3.03 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా, లబ్ధిదారులలో దాదాపు 75 శాతం మంది మహిళలు ఉండటం, గ్రామీణ భారతదేశంలో మహిళల సాధికారతకు, ఆస్తి యాజమాన్యానికి ఈ కార్యక్రమం అందిస్తున్న సహకారాన్ని నొక్కి చెబుతుంది.
అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్(అమృత్)
అమృత్, అమృత్ 2.0 ద్వారా పట్టణ పునరుజ్జీవనంలో వ్యూహాత్మక పెట్టుబడులు 2015, 2026 మధ్య కాలంలో రూ.2.79 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనికి విరుద్ధంగా, 2015 కంటే ముందు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్(జేఎన్ఎన్‌యూఆర్ఎం) కింద కేవలం రూ.62,983 కోట్ల విలువైన ప్రాజెక్టులు మాత్రమే మంజూరయ్యాయి. ఇది మునుపటి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం వ్యవస్థ కంటే సుమారు 343 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ మిషన్ ఇతర పథకాలతో అనుసంధానం కావడం ద్వారా 2.53 కోట్ల కంటే ఎక్కువ కుళాయి నీటి కనెక్షన్ల సరఫరాకు వీలు కల్పించింది. ఇప్పటివరకు మొత్తం 7,943 పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
పట్టణాభివృద్ధిపై ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు 2014-15 లోని రూ.1,630 కోట్ల నుంచి 2026-27 నాటికి రూ.8,000 కోట్లకు పెరిగాయి. ఈ ఆర్థిక విస్తరణ బడ్జెట్ కేటాయింపులలో 390.8 శాతం వృద్ధిలో కనిపిస్తుంది. గృహ నిర్మాణ రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలతో కలిపి, ఈ కార్యక్రమాలు అందరికీ సరసమైన ధరల్లో ఇళ్లను కల్పించే దిశగా భారతదేశం సాధిస్తున్న పురోగతిని తెలియజేస్తాయి.

II. ఆర్థిక, సామాజిక సమ్మేళనం కోసం అనుసంధానం బలోపేతం
భారతదేశం అంతటా రవాణాను, ఆర్థిక ఏకీకరణను, నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరచడంలో రోడ్డు, రైల్వే అనుసంధానం కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ రోడ్లు, వంతెనలు, రైల్వే ఆధునికీకరణ, స్టేషన్ల పునరాభివృద్ధిలో పెట్టుబడులు గ్రామాలు, పట్టణాలు, పట్టణ కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేశాయి.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
ప్రతి వాతావరణాన్ని తట్టుకునే రోడ్డు అనుసంధానాన్ని సార్వత్రికం చేయడం ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) గ్రామీణ సామాజిక-ఆర్థిక ఏకీకరణకు ఒక కీలక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇది వ్యవసాయ వృద్ధి, ఉపాధి కల్పన, విద్యా, ఆరోగ్య సేవల లభ్యత మెరుగుదల, పేదరిక నిర్మూలనకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు రూ.386 కోట్ల (2014-15) నుంచి రూ.19,000 కోట్లకు (2026-27) పెరిగాయి.

పీఎంజీఎస్‌వై కింద ఇప్పటివరకు అర్హత కలిగిన జనాభా ఆవాసాలలో 99.6 శాతం ఆవాసాలు అన్ని వాతావరణాలను తట్టుకునే రోడ్లతో అనుసంధానితమయ్యాయి. వ్యవసాయ మార్కెట్లు(1.38 లక్షలు), విద్యా కేంద్రాలు (1.46 లక్షలు), వైద్య కేంద్రాలు (82,806) తో సహా 6.96 లక్షల సదుపాయాలు అనుసంధానితమయ్యాయి.
పూర్తయిన రోడ్ల పొడవు 3.86 లక్షల కిలోమీటర్ల (2000-2014) నుంచి 4.11 లక్షల కిలోమీటర్లకు (2014-2026) పెరిగింది. ఇదే కాలంలో పూర్తయిన వంతెనల సంఖ్య 484 నుంచి 10,256 కి పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా గ్రామీణ అనుసంధాన మౌలిక సదుపాయాల నిరంతర విస్తరణను ప్రతిబింబిస్తుంది.
అమృత్ భారత్ రైళ్లు
సరసమైన ధరలో, నమ్మకమైన రవాణాను అందించే ఆధునిక, నాన్-ఏసీ సుదూర స్లీపర్ రైలు సేవగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పండుగ సీజన్లు, వలసల రద్దీ సమయాలలో ప్రయాణికుల భారీ డిమాండ్‌ను తీర్చడానికి ఈ సేవ రూపొందింది. మే 2026 నాటికి మొత్తం 60 అమృత్ భారత్ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ అనుసంధాన పురోగతి అల్ప ఆదాయ కుటుంబాల సామాజిక-ఆర్థిక రవాణా సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ కార్యక్రమం మార్కెట్లు, నిత్యావసర సేవలు, ఉపాధి అవకాశాలను సమానంగా అందుకోవడానికి వీలు కల్పిస్తుంది.
III. డిజిటల్ అనుసంధానం, ప్రజా సేవల పంపిణీ పురోగతి
భారతదేశ డిజిటల్ విప్లవం గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఆర్థిక చెల్లింపుల వ్యవస్థ వ్యూహాత్మక ఏకీకరణతో కూడి ఉంది. ఈ పురోగతులు స్థానిక పరిపాలనలో పారదర్శకతను వ్యవస్థీకరిస్తూనే, సురక్షితమైన, రియల్ టైమ్ ఆర్థిక వ్యవస్థల లభ్యతను దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెస్తున్నాయి.
గ్రామ పంచాయతీల డిజిటలీకరణ
డిజిటల్ పరివర్తన భారతదేశ సమాచార, విద్యా, సామాజిక-ఆర్థిక రంగాలను ప్రాథమికంగా పునర్నిర్మిస్తుంది. గ్రామీణ-పట్టణ డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి 2015లో భారత్‌నెట్ కార్యక్రమం ప్రారంభమైంది. భారత్‌నెట్ మౌలిక సదుపాయాలు గ్రామీణ పేదలకు ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, ఈ-వ్యవసాయం, ఈ-కామర్స్ వంటి రంగాలలో డిజిటల్ సేవల పంపిణీని ప్రేరేపిస్తాయి. ఈ కార్యక్రమం మే 2026 నాటికి 2.19 లక్షల గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను విస్తరించింది.
దీనికి అదనంగా 2020లో ప్రారంభించిన ఈ-గ్రామస్వరాజ్ అప్లికేషన్.. పంచాయతీ రాజ్ సంస్థలలో(పీఆర్ఐ) పారదర్శక ఆర్థిక పరిపాలనను వ్యవస్థీకరించింది. ఈ అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.53,342 కోట్లు పంపిణీ అయ్యాయి. దీనిలో 2.59 లక్షల పంచాయతీ రాజ్ సంస్థలు చేరగా, 2.50 లక్షల సంస్థలు ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. 2.55 లక్షల గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి ప్రణాళికలను డిజిటల్ పద్ధతిలో అప్‌లోడ్ చేశాయి. నమోదైన విక్రేతల (వెండర్స్) వ్యవస్థ 1.60 కోట్లు దాటింది.
2025లో ప్రారంభించిన సభాసార్ అనే కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా సారాంశ సాధనం. 1.11 లక్షల స్థానిక సంస్థలలో పరిపాలనా పత్రాల తయారీని ఆధునికీకరించింది. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి పరిపాలన సామర్థ్యాన్ని, సమ్మేళనాన్ని మరింత పెంపొందిస్తుంది.
డిజిటల్ చెల్లింపుల విస్తరణ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) నేతృత్వంలోని భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అపారమైన వృద్ధిని సాధించింది. ఇది ఏటా 100 కోట్ల కంటే తక్కువ లావాదేవీల నుంచి నెలకు 2,100 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలకు పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2026 లో ఇప్పటివరకు నమోదైన పర్సన్-టు-మర్చంట్(పీ2ఎం) లావాదేవీలలో 86 శాతం రూ.500 కంటే తక్కువగా ఉన్నాయి. దైనందిన రిటైల్, రోజువారీ లావాదేవీలలో యూపీఐ లోతైన ఏకీకరణను ఇది చాటుతోంది. 2016, 2026 మధ్య కాలంలో, మద్దతు ఇచ్చే బ్యాంకింగ్ వ్యవస్థ 21 నుంచి 705 సంస్థలకు విస్తరించింది. ఈ కాలంలో లావాదేవీల విలువలు రూ.0.38 కోట్ల నుంచి రూ.29.52 లక్షల కోట్లకు పెరిగాయి.
ఈ డిజిటల్ కార్యక్రమాలు పేద, గ్రామీణ కుటుంబాలకు సంక్షేమ పంపిణీని, ఆర్థిక సమ్మిళిత్వాన్ని, స్థానిక సంస్థల లభ్యతను మెరుగుపరిచాయి. డిజిటల్ వ్యవస్థలు ప్రజా సేవల పంపిణీలో అవినీతిని, ఆలస్యాలను, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించాయి. విస్తరించిన డిజిటల్ లభ్యత వెనుకబడిన వర్గాల ఆర్థిక భాగస్వామ్యాన్ని, సంస్థాగత సమ్మేళనాన్ని బలోపేతం చేసింది.
సమృద్ధికి మార్గాలు: జీవనోపాధి, నైపుణ్యాలు, ఆర్థిక భద్రత
భారతదేశం కేవలం సంక్షేమ మద్దతు నుంచి ఆర్థిక సాధికారత, స్థిరమైన జీవనోపాధి వైపు మళ్లింది. స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ), నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా ప్రభుత్వం ఆదాయ అవకాశాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. వెనుకబడిన కుటుంబాల ఆర్థిక దృఢత్వాన్ని మెరుగుపరచడంపై కూడా ఇది దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని, క్షేత్రస్థాయి వ్యవస్థాపకతను నొక్కి చెబుతాయి. డిజిటల్ ఆర్థిక సమ్మిళితంపై కూడా ఇవి దృష్టి పెడతాయి. ఈ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులు, గ్రామీణ కుటుంబాలు, యువత, కళాకారులు, వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలుస్తాయి.
గ్రామీణ భారతదేశంలో రంగాల వారీగా ఉపాధి పంపిణీ
2025లో గ్రామీణ శ్రామిక శక్తిలో దాదాపు 57 శాతం మందికి వ్యవసాయం ఉపాధి కల్పించింది. గ్రామీణ జీవనోపాధిలో దీని నిరంతర ఆధిపత్యాన్ని ఇది చాటుతోంది. తయారీ, నిర్మాణ రంగాలతో కూడిన ద్వితీయ రంగం గ్రామీణ జనాభాలో సుమారు 21.7 శాతం మందికి ఉపాధి కల్పించింది. మిగిలిన 21 శాతం గ్రామీణ శ్రామిక శక్తి తృతీయ రంగం, దానికి సంబంధించిన సేవలలో నిరతమై ఉంది.
I. మహిళల నేతృత్వంలోని ఆర్థిక సాధికారత, మెరుగైన జీవనోపాధి అవకాశాలు
స్వయం సహాయక సంఘాలు, సాంకేతికత ఆధారిత నైపుణ్యాభివృద్ధిని ఉపయోగించుకోవడం ద్వారా వివిధ మిషన్లు దేశవ్యాప్తంగా బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థాపక వాతావరణాన్ని పెంపొందిస్తున్నాయి.
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం ద్వారా పేదరికాన్ని తగ్గిస్తుంది. డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్ కింద 2011-14, మే 2026 మధ్య కాలంలో మహిళల నేతృత్వంలోని జీవనోపాధిలో గణనీయమైన విస్తరణ నమోదైంది. స్వయం సహాయక సంఘాలలో మహిళల భాగస్వామ్యం 2.37 కోట్ల నుంచి 10 కోట్లకు పెరిగింది. స్వయం సహాయక సంఘాల సంఖ్య 21.31 లక్షల నుంచి 91.75 లక్షలకు చేరింది. రుణాల పంపిణీ రూ.22,944 కోట్ల నుంచి రూ.1.2 లక్షల కోట్లకు విస్తరించింది, పెట్టుబడి మద్దతు రూ.1,501 కోట్ల నుంచి రూ.42,098 కోట్లకు పెరిగింది. మహిళల ఆర్థిక సాధికారతకు, గ్రామీణ జీవనోపాధి వైవిధ్యీకరణకు ఈ మిషన్ అందిస్తున్న సహకారాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్ కింద ప్రారంభించిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు:
- 2023లో ప్రారంభించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమం మే 2026 నాటికి 3.07 కోట్ల మంది గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చింది. ఈ కార్యక్రమం స్వయం సహాయక సంఘాలతో ముడిపడి ఉన్న మహిళలు ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ కుటుంబ ఆదాయాన్ని సాధించేలా సాధికారత కల్పిస్తుంది.
- 2023లో ప్రారంభించిన నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద, 2023-24 లో 500 డ్రోన్లు పంపిణీ అయ్యాయి. ఈ కార్యక్రమం డ్రోన్ ఆధారిత జీవనోపాధి అవకాశాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత ద్వారా మహిళలకు సాధికారత కల్పిస్తుంది.
చివరి మైలుకు పథకాలు చేర్చడంతో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ పాత్ర
గ్రామీణ సమాజాలతో నిరంతర నిశ్చితార్థాన్ని పెంపొందించే స్థానిక వనరుల వ్యక్తుల ఉనికి గ్రామీణాభివృద్ధికి ఒక ముఖ్యమైన కారణం. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్మికులు, స్వచ్ఛాగ్రహీలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(సీఆర్‌పీ)లతో కూడిన అంకితభావం గల ఫ్రంట్‌లైన్ కార్మికుల వ్యవస్థ చివరి వ్యక్తికి సేవలు అందేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 9 లక్షల కంటే ఎక్కువ మంది సీఆర్‌పీలు క్రియాశీలంగా ఉన్నారు. వీరు ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, వ్యవస్థాపకత, బ్యాంకింగ్, బీమా వంటి రంగాలలో సేవలందిస్తున్నారు.
50,548 కంటే ఎక్కువ మంది బ్యాంక్ సఖీలు బ్యాంకింగ్ సేవలు, లావాదేవీలు, రుణాల లభ్యతతో మహిళలకు మద్దతు ఇస్తున్నారు. 1.91 లక్షల మంది కృషి సఖీలు, 2,012 మంది మత్స్య సఖీలు, 1.70 లక్షల మంది పశు సఖీల ఉనికి ద్వారా జీవనోపాధి మద్దతు మరింత విస్తరిస్తోంది. క్షేత్రస్థాయిలో వెనుకబడిన వర్గాల వ్యవసాయ, పశుసంవర్ధక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.
సెల్ఫ్-హెల్ప్ ఆంట్రప్రెన్యూర్ మార్ట్(షీ-మార్ట్) పరిచయం
2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన షీ-మార్ట్స్.. స్వయం సహాయక సంఘాల పరిధిలోని మహిళల కోసం ప్రత్యేక రిటైల్ స్థలాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి స్వయం సహాయక సంఘాల సమాఖ్యలచే నిర్వహించే సమాజ యాజమాన్య అవుట్‌లెట్లుగా ఏర్పాటవుతాయి. ఇది మహిళలు నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి, వారి ఉత్పత్తుల గుర్తింపును మెరుగుపరచడానికి, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనుమతిస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం మహిళలు చిన్న తరహా జీవనోపాధి కార్యకలాపాల నుంచి స్థిరమైన పరిశ్రమల యాజమాన్యం, నిర్వహణ వైపు మారడానికి వీలు కల్పిస్తుంది.
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్‌యూఎల్ఎం)
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్‌యూఎల్ఎం) 2013 నుంచి 2024 వరకు క్రియాశీలంగా ఉంది. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మద్దతు ద్వారా పట్టణ జనాభా సామాజిక-ఆర్థిక రవాణా సౌకర్యాన్ని వ్యవస్థీకరించింది.
ఏప్రిల్ 2014, జూలై 2024 మధ్యకాలంలో ఈ మిషన్ 9.55 లక్షల స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు వీలు కల్పించింది. 6.58 లక్షల సంఘాలకు రివాల్వింగ్ ఫండ్స్ అందించింది. ఈ కార్యక్రమం 15.39 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా, 8.62 లక్షల మంది అభ్యర్థులకు ఉపాధి కల్పించింది. ఈ కార్యక్రమం వెనుకబడిన పట్టణ కుటుంబాలకు జీవనోపాధి భద్రతను, సామాజిక రక్షణ వలయాలను బలోపేతం చేసింది. ఈ మిషన్ 30 సెప్టెంబర్ 2024 న ముగిసింది.
ఈ కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ భారతదేశం అంతటా స్థిరమైన జీవనోపాధిని, మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని, క్షేత్రస్థాయి వ్యవస్థాపకతను విస్తరించాయి.
II. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉపాధి సామర్థ్యం పెంపు
భారతదేశ శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహం పెద్ద ఎత్తున, పరిశ్రమలకు అనుగుణంగా ఉండే నైపుణ్య కార్యక్రమాలను వ్యవస్థీకరించడం ద్వారా నిర్వచించింది. ఇది యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుంది, స్వయం సమృద్ధిని పెంపొందిస్తుంది.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన
సమగ్ర అభివృద్ధి దిశగా ఒక పరివర్తనాత్మక అడుగుగా 2014 లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ప్రారంభమైంది. ఈ పథకం భారతదేశ గ్రామీణ యువతను 'ఆత్మనిర్భర్'గా మార్చడంపై దృష్టి పెట్టింది. ఈ పథకం కింద, శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్య 2014-15 లోని 43,038 నుంచి 2025-26 నాటికి 17.71 లక్షలకు పెరిగింది. ఉపాధి పొందిన అభ్యర్థులు 2014-15 లోని 21,446 నుంచి 2025-26 నాటికి 11.51 లక్షలకు పెరిగారు.

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) 2015లో ప్రారంభమైంది. 2025లో ఇది స్కిల్ ఇండియా కార్యక్రమంలో ఒక భాగమైంది. ఈ పథకం స్వల్పకాలిక శిక్షణ ద్వారా యువతకు ఉపాధి నైపుణ్యాలను అందిస్తుంది. ఇది పూర్వ అభ్యాస గుర్తింపుపై కూడా దృష్టి పెడుతుంది. పీఎంకేవీవై కింద ప్రారంభం నాటి నుంచి 1.64 కోట్ల మందికి పైగా యువత నైపుణ్య శిక్షణ పొందారు. ఏప్రిల్ 2024, మార్చి 2026 మధ్య కాలంలో 10.91 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. మొత్తం 69 కోర్సులు, 154 భవిష్యత్-నైపుణ్య ఉద్యోగ పాత్రలు పరిచయం చేశారు.
పీఎంకేవీవై 4.0 కింద 38 రంగాలలో 27.43 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. ఇది ఏఐ, ఇండస్ట్రీ 4.0 వంటి అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలపై దృష్టి పెడుతుంది. 16,900 కంటే ఎక్కువ సంస్థలు పీఎంకేవీవై 4.0ను అమలు చేస్తున్నాయి. వీటిలో పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, ఐటీఐలలో ఉన్న 6,800 కంటే ఎక్కువ స్కిల్ హబ్‌లు ఉన్నాయి.
ఈ కార్యక్రమాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండే శిక్షణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా శ్రామిక శక్తి సామర్థ్యాలను బలోపేతం చేశాయి.
III. ఉపాధి హామీ, శ్రామిక సాధికారత
ఉపాధి హామీ, శ్రామిక సంక్షేమ కార్యక్రమాలు ఆదాయ భద్రతను, గ్రామీణ వ్యవస్థ దృఢత్వాన్ని, సామాజిక రక్షణను బలోపేతం చేశాయి.
వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)
గతంలో ఎంజీఎన్ఆర్ఈజీఏగా పిలిచే 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)', చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల ఉపాధిని కల్పిస్తుంది.
ఈ పథకం కింద కల్పించిన పనిదినాలు(పర్సన్‌డేస్) 1,660 కోట్లు (ఆర్థిక సంవత్సరం 2006-14) నుంచి 3,036.7 కోట్లకు (ఆర్థిక సంవత్సరం 2014-25) పెరిగాయి. ఇదే కాలంలో విడుదలైన కేంద్ర నిధులు రూ.2,13,220 కోట్ల నుంచి రూ.7,81,635.65 కోట్లకు పెరిగాయి. పూర్తయిన పనులు 153 లక్షల నుంచి 809.05 లక్షలకు చేరాయి. మహిళల భాగస్వామ్యం 48 శాతం (ఆర్థిక సంవత్సరం 2013-14) నుంచి 58.19 శాతానికి (ఆర్థిక సంవత్సరం 2024-25) పెరిగింది.

ఆర్థిక సంవత్సరం 2026-27 కు గాను ఇప్పటివరకు 41.07 కోట్ల పనిదినాలు ఆమోదించగా, 9.76 కోట్లు కల్పించారు. 78.99 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించగా, ఇందులో 98.83 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందారు.
ఈ-శ్రమ్ పోర్టల్

అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఆధార్‌తో అనుసంధానిస్తూ ఒక సమగ్ర జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి 2021లో ఈ-శ్రమ్ పోర్టల్ ప్రారంభమైంది. ఇది అసంఘటిత కార్మికులను స్వీయ-ధ్రువీకరణ ఆధారంగా నమోదు చేసి, వారికి యూనివర్సల్ అకౌంట్ నంబర్లను(యూఏఎన్) జారీ చేస్తుంది.
ఈ పోర్టల్‌లో నమోదైన వారి సంఖ్య 14.40 కోట్లు(డిసెంబర్ 2021) నుంచి 31.64 కోట్లకు(మే 2026) పెరిగింది. ఈ కార్యక్రమాలు జీవనోపాధి భద్రతను మెరుగుపరిచాయి. మహిళల భాగస్వామ్యాన్ని పెంచాయి. భారతదేశ అసంఘటిత శ్రామిక శక్తి నమోదు ప్రక్రియను క్రమబద్ధీకరించాయి.
IV. స్వయం ఉపాధి, సమ్మేళిత పారిశ్రామికాభివృద్ధి పెంపు
చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, అసంఘటిత కార్మికులకు పరపతి లభ్యత, మార్కెట్ అవకాశాలు, జీవనోపాధి భద్రతను సూక్ష్మ-వ్యవస్థాపకత కార్యక్రమాలు బలోపేతం చేశాయి.
పీఎం విశ్వకర్మ యోజన

2023లో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం సాంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారికి సమగ్ర మద్దతును అందిస్తుంది. ఇది వృత్తిపరమైన వారసత్వాన్ని, మానవీయ నైపుణ్యాలను పరిరక్షించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పథకం సెప్టెంబర్ 2025 నాటికి 30 లక్షల మంది లబ్ధిదారులను చేరాలనే తన లక్ష్యాన్ని చేరుకుంది. మే 2026 నాటికి, ఈ కార్యక్రమం 30 లక్షల కంటే ఎక్కువ మంది కళాకారులను నమోదు చేయగా, వారిలో 23.97 లక్షల మంది ప్రత్యేక నైపుణ్య శిక్షణ పొందారు.
మంజూరైన రుణాల ద్వారా 5.92 లక్షల మంది కళాకారులు అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారు. 16 లక్షల మందికి ఆధునిక పరికరాలు (టూల్‌కిట్స్) అందించారు. ఈ జోక్యం సాంప్రదాయ చేతివృత్తుల రంగాల ఆర్థిక స్థితిస్థాపకతను పెంపొందిస్తోంది.
పీఎం స్వనిధి
వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని కార్యాచరణ మూలధన రుణాలను సులభతరం చేయడానికి 2020లో 'ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' (పీఎం స్వనిధి) పథకం ప్రారంభమైంది.
ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 26.37 లక్షల (నవంబర్ 2021) నుంచి 75.27 లక్షలకు (మే 2026) పెరిగింది. ఇప్పటివరకు సంచిత రుణ పంపిణీ రూ.17,710.55 కోట్లకు చేరుకోగా, లబ్ధిదారులలో మహిళలు 46 శాతంగా ఉన్నారు. ఇది లింగ-సమ్మేళిత ఆర్థిక ఏకీకరణ వైపు సాధించిన గణనీయమైన పురోగతిని నొక్కి చెబుతుంది.
స్టాండ్ అప్ ఇండియా పథకం
2016లో ప్రారంభించిన స్టాండ్ అప్ ఇండియా పథకం మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలో పారిశ్రామిక ఉత్సాహాన్ని వ్యవస్థీకరిస్తుంది. ఇది రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పూచీకత్తు లేని సంయుక్త బ్యాంకు రుణాలను సులభతరం చేస్తుంది. అక్టోబర్ 2025 నాటికి ఈ కార్యక్రమం 2.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ.62,807.46 కోట్లను మంజూరు చేసింది. ఈ జోక్యాలు ఆర్థిక సమ్మిళతాన్ని గణనీయంగా విస్తరించాయి. వెనుకబడిన వ్యాపారులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలలో ఆర్థిక స్వయం సమృద్ధిని పెంపొందించాయి.
VI. సమ్మేళిత సంక్షేమం కోసం సామాజిక భద్రత విస్తరణ
సామాజిక భద్రతా పరిధిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా పలు పెన్షన్, బీమా మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికులను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఈ పథకాలలో ముఖ్యమైనవి:
- జాతీయ పెన్షన్ వ్యవస్థ(ఎన్‌పీఎస్) పౌరులకు పదవీ విరమణ ఆదాయాన్ని అందిస్తుంది మరియు దీర్ఘకాలిక పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. ఎన్‌పీఎస్ కింద లబ్ధిదారులు 2016-17 లోని 1.05 కోట్ల నుంచి 2025-26 నాటికి 2.17 కోట్లకు పెరిగారు.
- 2015లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై), పెన్షన్ సదుపాయం లేని కార్మికులకు అధికారిక పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఏపీవై కింద లబ్ధిదారులు 2016-17 లోని 48.80 లక్షల నుంచి 2025-26 నాటికి 8.96 కోట్లకు పెరిగారు.
- 2015 లో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై), ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సరసమైన జీవిత బీమా రక్షణను అందిస్తుంది. మే 2026 వరకు ఈ పథకం కింద 27.33 కోట్ల మంది లబ్ధిదారులు చేరారు.
- 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్‌బీవై), ఆర్థికంగా బలహీనమైన పౌరులకు సరసమైన ప్రమాద బీమా రక్షణను అందిస్తుంది. మే 2026 వరకు పీఎమ్‌ఎస్‌బీవై కింద 57.92 కోట్ల మందికి బీమా రక్షణ అందింది.
- 2019 లో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్-ధన్(పీఎం-ఎస్‌వైఎం, స్వచ్ఛంద, అంచనా ఆధారిత పెన్షన్ వ్యవస్థ ద్వారా అసంఘటిత కార్మికులకు వృద్ధాప్య రక్షణను అందిస్తుంది. మే 2026 నాటికి 52.99 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు స్వీయ-ధృవీకరణ ఆధారంగా ఈ పథకం కింద నమోదయ్యారు.
ఈ కార్యక్రమాలు వెనుకబడిన, అసంఘటిత కార్మికుల కోసం భారతదేశ సామాజిక భద్రతా వలయాన్ని గణనీయంగా విస్తరించాయి. ఈ నమోదుల పెరుగుదల మెరుగైన ఆర్థిక సమ్మేళనాన్ని మరియు పెన్షన్, బీమా రక్షణల విస్తృత లభ్యతను ప్రతిబింబిస్తుంది.
VII. సమ్మిళిత వృద్ధి కోసం అధికారిక ఆర్థిక వ్యవస్థ విస్తరణ
ఆర్థిక సమ్మిళన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తగినంత సేవలు నోచుకోని జనాభాకు సరసమైన రుణాలు, బ్యాంకింగ్ సేవలు మరియు వ్యవస్థాపక అవకాశాల లభ్యతను విస్తరించాయి.
ప్రధానమంత్రి ముద్రా యోజన

ప్రధానమంత్రి ముద్రా యోజన కార్పొరేటేతర/వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించడం ద్వారా ఆర్థిక సమ్మిళిత్వాన్ని వ్యవస్థీకరిస్తుంది. దశాబ్ద కాలంలో ఈ కార్యక్రమం విపరీతమైన వృద్ధిని సాధించింది. రుణ ఖాతాలు 2016లోని 3.49 కోట్ల నుంచి 2026 నాటికి 57 కోట్లకు పైగా విస్తరించాయి.
ఈ వృద్ధి సామాజిక సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చింది. దాదాపు 49 శాతం రుణాలు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు మంజూరయ్యాయి. 66 శాతం రుణాలు (38.29 కోట్లు), అంటే రూ.16.88 లక్షల కోట్ల మొత్తం మహిళా పారిశ్రామికవేత్తలకు పంపిణీ అయ్యింది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఆర్థిక సమ్మేళనాన్ని ప్రోత్సహించడానికి 2014 లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభమైంది.. ఈ పథకం బ్యాంకు ఖాతాలు లేని, వెనుకబడిన కుటుంబాలకు బ్యాంకింగ్ సౌకర్యం, ఆర్థిక భద్రత మరియు రుణ మద్దతును అందిస్తుంది.
ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 17.9 కోట్ల (ఆగస్టు 2015) నుంచి 58.16 కోట్లకు (మే 2026) పెరిగింది. ఇది సుమారు 224.9 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఖాతాలలో మొత్తం నిల్వ రూ.3.02 లక్షల కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా 13.55 లక్షల మంది బ్యాంక్ మిత్రలు బ్రాంచ్ లేని బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు.
ఈ పథకం పేదలకు ప్రాథమిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది, తద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకాల సమర్థవంతమైన అమలును నిర్ధారిస్తుంది. ఈ డీబీటీ పథకాలలో పీఎం ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై, ఎస్‌బీఎమ్-జీ, పీఎం విశ్వకర్మ వంటివి ఉన్నాయి.
ఈ కార్యక్రమాలు కలిసి దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను బలోపేతం చేశాయి, అధికారిక బ్యాంకింగ్ భాగస్వామ్యాన్ని పెంచాయి మరియు వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించాయి.

సమన్వయ జోక్యాల ద్వారా గిరిజనాభివృద్ధి వేగవంతం
భారతదేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఆధునికీకరించిన మౌలిక సదుపాయాలు, ప్రత్యేక నివాస విద్య మరియు స్థిరమైన వ్యవస్థాపక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఈ కార్యక్రమాలు సమ్మేళిత వృద్ధిని పెంపొందిస్తున్నాయి.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్
2023లో ప్రారంభించిన పీఎం-జన్మన్ మిషన్ 75 రకాల ఆదిమ జాతి తెగల(పీవీటీజీ) సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ మిషన్ గిరిజన ప్రాంతాలలో గృహ వసతి, తాగునీరు, విద్య, ఆరోగ్యం, అనుసంధానం, విద్యుద్దీకరణ మరియు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుంది.
ఫిబ్రవరి 2026 నాటికి 2.66 లక్షల ఇళ్లు, 1,949 కిలోమీటర్ల రోడ్లు, 750 మొబైల్ మెడికల్ యూనిట్లు పూర్తయ్యాయి. ఇది పైపుల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని 8,473 గ్రామాలకు విస్తరించింది. 1.36 లక్షల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఇది 2,390 అంగన్‌వాడీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. 3,037 గిరిజన ఆవాసాలలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరిచింది.

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్
2024లో ప్రారంభించిన 'ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్', సమగ్ర గిరిజనాభివృద్ధిని పెంపొందించడానికి బహుళ-రంగాల, సమన్వయ చట్రాన్ని ఉపయోగిస్తుంది. దీనిని 'ధరితి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్' అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 2026 నాటికి ఈ మిషన్ 12.89 లక్షల ఇళ్లను, 2,411 కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేసింది. మొత్తం 2.87 లక్షల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించగా, జల్ జీవన్ మిషన్ కింద 6,305 గ్రామాలు చేర్చారు. అంతేకాకుండా, ఈ మిషన్ 5,252 గ్రామాలకు టెలికాం కనెక్టివిటీని మంజూరు చేసింది. తద్వారా గิరిజన ప్రాంతాలలో ప్రాథమిక సేవల పంపిణీని బలోపేతం చేసింది.
ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్
2021లో ప్రారంభించిన ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్(పీఎం-జేవీఎం), గిరిజన వ్యవస్థాపకతను, అటవీ ఆధారిత జీవనోపాధిని వ్యవస్థీకరించడానికి ట్రైఫెడ్‌ను ఉపయోగించుకుంటుంది. 2022, 2025 మధ్య కాలంలో, ట్రైఫెడ్ 79 కళాకృత మేళాలు, 50 ప్రదర్శనల ద్వారా తన మార్కెట్ పరిధిని విస్తరించింది. దీని ప్రచార వ్యయం ఇదే కాలంలో రూ.145 లక్షల నుంచి రూ.289 లక్షలకు పెరిగింది.
పీఎం-జేవీఎమ్, పీఎం-జన్మన్ పథకాల కింద దేశవ్యాప్తంగా మొత్తం 1,146 వన్ ధన్ వికాస్ కేంద్రాలు మంజూరయ్యాయి. ఈ పథకాలకు ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి 2025-26 వరకు మొత్తం రూ.11,288.70 లక్షల కేటాయింపులు లభించాయి. ఈ లక్షిత ప్రయత్నాలు గిరిజన జీవనోపాధిని, అటవీ ఉత్పత్తుల విలువ పెంపును మెరుగుపరిచాయి.
ఏకలవ్య మోడల్ ఆశ్రమ పాఠశాలలు
ఏకలవ్య మోడల్ ఆశ్రమ పాఠశాలలు(ఈఎంఆర్ఎస్) పథకం మారుమూల గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంది. పనిచేస్తున్న పాఠశాలల సంఖ్య 129 (2014-15) నుంచి 499 కి (మే 2026) పెరిగింది. మే 2026 నాటికి, ఈ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు.
ఈ లక్షిత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గిరిజన సమాజాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడటానికి మౌలిక సదుపాయాలు, విద్య, జీవనోపాధి మరియు నిత్యావసర సేవలను బలోపేతం చేశాయి.
అంత్యోదయ నుంచి సర్వోదయ వరకు: సమ్మేళిత అభివృద్ధి దశాబ్దం
భారతదేశ సంక్షేమ నిర్మాణం హక్కుల ఆధారిత పంపిణీ నుంచి సంతృప్త-ఆధారితం వైపు పరిణామం చెందింది. నిరంతర ప్రభుత్వ పెట్టుబడులు, లక్షిత సంక్షేమ జోక్యాలు, సాంకేతికత ఆధారిత పరిపాలన ప్రాథమిక వసతులు, మెరుగైన జీవనోపాధి అవకాశాల లభ్యతను విస్తరించాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, క్షేత్రస్థాయి వ్యాపార దృక్పథం, స్వయం సహాయక సంఘాల ఆధారిత ఆర్థిక భాగస్వామ్యం ఈ పరివర్తనకు కీలక స్తంభాలుగా నిలిచాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యక్ష ప్రయోజన పంపిణీ యంత్రాంగాలు ప్రజా సేవల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించాయి.
భారతదేశం తన దీర్ఘకాలిక అభివృద్ధి ఆకాంక్షల వైపు పయనిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాలు మరింత దృఢత్వం, సమానత్వం, సంపన్నమైన సమాజాన్ని నిర్మిస్తాయి. ఈ జోక్యాలు కలిసి "అంత్యోదయ నుంచి సర్వోదయ" వైపు సాగుతున్న విస్తృత ఉద్యమాన్ని ప్రతిబింబిస్తాయి. అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పిస్తూనే జాతీయ వృద్ధిని నడిపిస్తాయి.
References
Ministry of New & Renewable Energy
https://www.myscheme.gov.in/schemes/pmsgmb
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110283®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081250®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2081250®=3&lang=2
Ministry of Power
https://www.pib.gov.in/newsite/printrelease.aspx?relid=171101®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2036987®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215187®=3&lang=1
Ministry of Jal Shakti
https://gobardhan.sbm.gov.in/
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
https://sbm.gov.in/sbmgdashboard/statesdashboard.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223841®=3&lang=1
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2114291®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1941122®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2114291®=3&lang=2
https://jaljeevanmission.gov.in/sites/default/files/guideline/JJM_Operational_Guidelines.pdf
Ministry of Housing & Urban Affairs
https://sbmurban.org/
https://sbmurban.org/back-to-beginning
https://pmsvanidhi.mohua.gov.in/Home/PMSDashboard
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2220345®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2037057®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1946307®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/dec/doc2021121451.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU6273_GjXZtC.pdf?source=pqals
https://www.niua.in/sites/default/files/2025-07/2020_2_Energy%20Infrastructure%20and.pdf
Ministry of Health & Family Welfare
https://dashboard.nha.gov.in/public/
https://dashboard.abdm.gov.in/abdm/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256956®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1576128®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256538®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2017129®=3&lang=2
https://www.nfhsiips.in/nfhsuser/assets/National%20Family%20Health%20Survey%20(NFHS-6)%202023-2024%20Fact%20Sheets.pdf
Ministry of Consumer Affairs, Food & Public Distribution
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU6175_USX1ip.pdf?source=pqals
Ministry of Finance
https://www.pmjdy.gov.in/
https://www.indiabudget.gov.in/
https://www.mudra.org.in/
https://www.myscheme.gov.in/schemes/pmjdy
https://www.npci.org.in/product/upi/product-statistics
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1564084®=3&lang=2
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1854909®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257087®=3&lang=2
Ministry of Education
https://www.swayamprabha.gov.in/
https://diksha.gov.in/data/
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=67313®=3&lang=2
https://pmevidya.education.gov.in/swayam-portal.html
https://www.pib.gov.in/pressreleaseiframepage.aspx?prid=1606557®=3&lang=2
https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/document-reports/Part1.pdf
https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/document-reports/MoE_AR_En.pdf
Ministry of Women & Child Development
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777719
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1781673®=3&lang=2
PIB Backgrounders
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2113800®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237471®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257197®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258761®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2182568®=3&lang=2
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=148579®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154355&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158391&ModuleId=3®=44&lang=1
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2170998®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2185049®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2208381®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2094929®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2181702®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2023/aug/doc2023811236901.pdf
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156972&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154432&ModuleId=3®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/aug/doc202588603001.pdf
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158738&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156090&ModuleId=3®=48&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=157897&NoteId=157897&ModuleId=3®=3&lang=2
Ministry of Rural Development
https://namodronedidi.da.gov.in/about-scheme
https://lakhpatididi.gov.in/
https://pmgsy.dord.gov.in/dbweb
https://dashboard.dord.gov.in/dashboardnew/mgnrega.aspx
https://dashboard.dord.gov.in/dashboardnew/ddugky.aspx
https://pmayg.gov.in/netiay/PBIDashboard/PMAYGDashboard.aspx
https://nrlm.gov.in/dashboardForOuter.do?methodName=dashboard
https://nrlm.gov.in/outerReportAction.do?methodName=showIndex#gsc.tab=0
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1935711®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204496®=3&lang=2
https://cdnbbsr.s3waas.gov.in/s3d69116f8b0140cdeb1f99a4d5096ffe4/uploads/2026/04/202604211510022943.pdf
Ministry of Panchayati Raj
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247156®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1845366®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223107®=3&lang=1
Ministry of Communications
https://usof.gov.in/en/home
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1515906®=3&lang=2
Ministry of Skill Development and Entrepreneurship
https://www.skillindiadigital.gov.in/pmkvy-dashboard
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2003662®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2222122®=3&lang=2
Ministry of Labour & Employment
https://eshram.gov.in//dashboard
https://sansad.in/getFile/annex/266/AU2811_N7VJM7.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2099153®=3&lang=2
Ministry of MSMEs
https://pmvishwakarma.gov.in/
Ministry of Statistics & Programme Implementation
https://www.mospi.gov.in/uploads/publications_reports/publications_reports1780040415321_0624fb13-fb47-40bc-b470-7c7e9635c3ef_PLFS_2025_F_REV_29052026.pdf
Ministry of Commerce
https://www.ibef.org/government-schemes/stand-up-india
https://www.cgca.gov.in/ccadl/nps
https://www.ibef.org/government-schemes/pradhan-mantri-awas-yojana
https://www.ibef.org/government-schemes/swachh-bharat-mission
https://www.ibef.org/government-schemes/pm-surya-ghar-yojana
https://www.ibef.org/government-schemes/pm-vishwakarma-yojana
https://www.ibef.org/news/pradhan-mantri-suraksha-bima-yojana-a-decade-of-insurance-inclusion
https://www.ibef.org/government-schemes/pradhan-mantri-garib-kalyan-yojana
https://www.ibef.org/blogs/bharatnet-unplugged-transforming-rural-connectivity-in-india
Ministry of Tribal Affairs
https://pmagy.gov.in/
https://pmagy.gov.in/about
https://tribal.nic.in/EMRS.aspx
https://sansad.in/getFile/annex/270/AU3820_wEkEtr.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247601®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248491®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2198862®=3&lang=2
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=200303®=3&lang=2
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU3367_If5ZGQ.pdf?source=pqals
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154915&ModuleId=3®=3&lang=2
https://tribal.nic.in/downloads/Statistics/AnnualReport/AnnualReport2014-15.pdf
Ministry of Electronics and Information Technology
https://socialwelfare.vikaspedia.in/viewcontent/social-welfare/women-and-child-development/women-development-1/lakhpati-didi?lgn=en
Ministry of Social Justice & Empowerment
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1781643®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1602081®=3&lang=2
Government of Arunachal Pradesh
https://udarunachal.gov.in/daynulm.html
Niti Aayog
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1996271®=3&lang=2
https://niti.gov.in/sites/default/files/2026-05/School-Education-System-in-India.pdf
Cabinet Committee on Economic Affairs
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2265788®=3&lang=1
United Nations
https://www.unicef.org/india/faqs-open-defecation-free-plus-odf-and-sanitation
Click here to see pdf
***
(Explainer ID: 158820)
आगंतुक पटल : 28
Provide suggestions / comments