Social Welfare
మధ్యతరగతి ప్రయాణం: విధానపరమైన నిర్ణయాలతో పురోగతి
Posted On:
03 JUN 2026 10:55AM
భారతదేశ సామాజిక-ఆర్థిక ముఖచిత్రం మారుతోంది. ఈ మార్పునకు కేంద్రబిందువుగా ఎదుగుతున్న, ఆత్మవిశ్వాసంతో కూడిన మధ్యతరగతి నిలుస్తోంది. ఒకప్పుడు పొదుపుగా ఖర్చు చేయడం, పరిమిత ఎంపికలకే పరిమితమవ్వడం మధ్యతరగతి లక్షణంగా ఉండేది. నేటి మధ్యతరగతి కుటుంబాలు మరింత భద్రతను, అవకాశాలను, ఉన్నత ఆశయాలను సొంతం చేసుకుంటున్నాయి. గత 12 ఏళ్లుగా పన్నులు, ఆరోగ్యం, గృహనిర్మాణం, డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవస్థాపకత రంగాలలో వచ్చిన సంస్కరణలు దైనందిన జీవితాన్ని మరింత చౌకగా, సౌకర్యవంతంగా మార్చాయి. మెరుగైన రవాణా సౌకర్యాలు, సేవలు సులభంగా అందుబాటులోకి రావడం, సరసమైన ధరలకే ఇళ్లు, బలమైన సామాజిక భద్రత, డిజిటల్ సారాంశం వంటివి సౌకర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆదాయాలు పెరుగుతుండటం, అవకాశాలు విస్తరిస్తుండటంతో భారతదేశ మధ్యతరగతి కేవలం మార్పునకు అలవాటు పడటమే కాకుండా దేశ వృద్ధిని, ఆశయాలను, భవిష్యత్తు సంపదను చురుగ్గా ముందుకు నడిపిస్తోంది.
సాధికారత, ఎదుగుదల: నూతన భారతీయ మధ్యతరగతి
ఒకప్పుడు భారతదేశ మధ్యతరగతి అంటే జాగ్రత్తగా ఖర్చు చేయడం, పరిమిత ఎంపికలు, సాధారణ ఆశయాలకు ప్రతీకగా ఉండేది. నేడు ఆ పరిస్థితి మారింది. పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ సేవలు, విస్తరిస్తున్న అవకాశాలతో ఆశయాలు విజయాలుగా మారుతున్నాయి. భారత సమాజంలోని ఈ విభాగానికి ప్రభుత్వ మద్దతు నిరంతరం లభిస్తోంది. 2014 నుండి పన్ను మినహాయింపు పరిమితుల్లో రికార్డు స్థాయి పెరుగుదల, జీఎస్టీ(జీఎస్టీ) సంస్కరణల వంటివి పొదుపును పెంచి, ఖర్చు చేయదగిన ఆదాయాన్ని ఎక్కువ చేశాయి. మధ్యతరగతి ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో, శక్తివంతంగా దేశ వృద్ధి కథలో కీలక పాత్ర పోషిస్తోంది.
మధ్యతరగతి అంటే ఎవరు?
కొనుగోలు శక్తి, విద్యా ప్రమాణాలు, సామాజిక సేవలు, సంపదపై ఉన్న అవగాహన వంటి అంశాల ఆధారంగా దేశాన్ని బట్టి "మధ్యతరగతి" నిర్వచనం మారుతుంటుంది. ప్రపంచ బ్యాంకు అందించిన ప్రామాణికం ఇందుకు విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఏటా తలసరి స్థూల జాతీయ ఆదాయం(జీఎన్ఐ) ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను వర్గీకరిస్తుంది. అన్ని రంగాల ప్రాథమిక ఆదాయాల విలువను బట్టి 2026 ఆర్థిక సంవత్సరానికి అమెరికన్ డాలర్లలో తాజా దేశాల ఆదాయ వర్గీకరణలు ఇలా ఉన్నాయి:
అల్ప ఆదాయం: ≤ $1,135
దిగువ-మధ్య ఆదాయం: $1,136 – $4,495
ఎగువ-మధ్య ఆదాయం: $4,496 – $13,935
అధిక ఆదాయం: > $13,935
ఈ వర్గీకరణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి సహా వివిధ ఆదాయ సమూహాల స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విస్తృతమైన విధానాన్ని అందిస్తాయి.
మారుతున్న భారతీయ మధ్యతరగతి ముఖచిత్రం
2010లో ప్రపంచంలోని అత్యధిక మధ్యతరగతి జనాభా ఓఈసీడీ దేశాలలో నివసించేవారు. కానీ ఈ పరిస్థితి వేగంగా మారింది. 2009 నుండి 2017 మధ్య కాలంలో మధ్యతరగతి జనాభా 1.8 బిలియన్ల నుంచి 3.5 బిలియన్లకు పెరిగింది. ఇందులో దాదాపు 40 శాతం జనాభా ఆసియాలోనే ఉన్నారు. భారత్, చైనాల వల్లే ఇది ప్రధానంగా సాధ్యమైంది. 2011 నుంచి 2019 మధ్య కాలంలో భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 53 శాతం పెరిగింది. అదే సమయంలో భారతీయ మధ్యతరగతి కూడా ఏటా 6.3 శాతం చొప్పున(1995 నుంచి 2021 మధ్య) విస్తరించింది. ప్రస్తుతం ఇది భారతదేశ జనాభాలో దాదాపు 31 శాతంగా ఉంది.
ఈ ధోరణి మరింత పెరగనుంది. ఓఈసీడీ అంచనాల ప్రకారం 2030 నుంచి 2035 మధ్య కాలంలో మధ్యతరగతి జనాభా పరంగా భారతదేశం చైనాను అధిగమించనుంది. ఇది కోట్లాది మంది భారతీయుల పెరుగుతున్న ఆదాయాలు, విస్తరిస్తున్న ఆర్థిక అవకాశాలు, మెరుగుపడుతున్న జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది. ఇది బలమైన వినియోగదారుల డిమాండ్, ఎక్కువ కొనుగోలు శక్తి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ పెరుగుతున్న ప్రభావాన్ని కూడా సూచిస్తుంది.
పెరుగుతున్న ఈ విభాగం ప్రపంచవ్యాప్త డిమాండ్‌ను సరికొత్తగా మారుస్తోంది. ఇది పట్టణీకరణతో, గ్లోబల్ జీడీపీ వృద్ధిని నడిపించే ఎదుగుతున్న నగరాల ఆవిర్భావంతో ముడిపడి ఉంది. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు, సామరస్యపూర్వక సమాజానికి బలమైన మధ్యతరగతి ఎంతో అవసరం. ఇది వినియోగాన్ని పెంచుతుంది, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణ రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. పన్నుల చెల్లింపులు, మెరుగైన సేవల కోసం డిమాండ్ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మధ్యతరగతి మానవ వనరులను నిర్మిస్తుంది, దీర్ఘకాలిక ఉత్పాదకతను, ఆదాయ వృద్ధిని సమర్థిస్తుంది. ఇది వ్యవస్థాపకతను, ఆవిష్కరణలను, చిన్న వ్యాపారాల వృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది.
ఈ నేపథ్యంలో భారతీయ మధ్యతరగతి వినియోగంలో నిర్మాణాత్మక మార్పు వస్తోందని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. పట్టణ వినియోగదారుల వృద్ధిలో 93 శాతం మొదటి ఐదు నగరాల (న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై) వెలుపలే నమోదు కానుంది. దాదాపు 500 "వినియోగదారు నగరాలు" ఆవిర్భవించే అవకాశం ఉంది. ఇది ఆదాయాల పెరుగుదలకు దారితీసి మధ్యతరగతిని విస్తరిస్తుంది. 2036 నాటికి భారతదేశ మధ్యతరగతితో పాటు సంపన్న వినియోగదారులు) మొత్తం ఖర్చులలో 93 శాతం వాటాను కలిగి ఉంటారని కూడా డబ్ల్యూఈఎఫ్ అభిప్రాయపడింది. 2026 లోని 80 శాతం నుంచి ఇది భారీ పెరుగుదల కానుంది. అదనంగా, 2035 నాటికి ముఖ్యమైన తరాలలోని(బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, మిలీనియల్స్, జనరేషన్ జీ) 20 శాతానికి పైగా జనాభా రోజుకు 45 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయనున్నారు. ఇది వివిధ వయో సమూహాలను ఆకర్షించే ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడానికి వ్యాపారాలకు పెద్ద అవకాశాలను సృష్టిస్తుంది.
ఆర్థికాంశాలకే పరిమితం కాకుండా, మధ్యతరగతి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, అసమానతలను తగ్గిస్తుంది, స్థిరమైన, సుపరిపాలన కలిగిన సమాజాలకు మద్దతు ఇస్తుంది. మొత్తంగా, బలమైన మధ్యతరగతి ఉన్న దేశాలు మరింత సమగ్రమైన, స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తాయి.
మధ్యతరగతి సాధికారత: 12 ఏళ్ల పరివర్తనాత్మక పాలన
గత 12 ఏళ్లుగా ప్రభుత్వం విస్తృతమైన సంస్కరణల ద్వారా భారతదేశ మధ్యతరగతికి అధికారాలు కల్పించింది. సరళీకృత పన్ను విధానం, బలమైన బ్యాంకింగ్, భీమా, పెన్షన్ వ్యవస్థలు ఆర్థిక భద్రతను పెంచాయి. విస్తరిస్తున్న పట్టణ వృద్ధి, మెరుగైన రవాణా సౌకర్యాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వసతులు సులభంగా లభించడం, అందుబాటులో ఉన్న వైద్యం, బలమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతరాయం లేని డిజిటల్ పాలన దైనందిన సౌకర్యాన్ని పెంచాయి. ఈ చర్యలన్నీ కలిసి సంపద సృష్టికి, దీర్ఘకాలిక స్థిరత్వానికి సురక్షితమైన మార్గాలను అందిస్తున్నాయి.

పన్నుల తగ్గింపు, మెరుగైన బ్యాంకింగ్, బీమా, విస్తరించిన పెన్షన్లు
గత పన్నెండేళ్లుగా భారతదేశ మధ్యతరగతి ఆర్థిక భద్రతను ప్రభుత్వం బలోపేతం చేసింది. పన్నుల తగ్గింపు, మెరుగైన బ్యాంకింగ్ సేవలు, విస్తృత బీమా రక్షణ, విస్తరించిన పెన్షన్లు ఆర్థిక ఒత్తిడిని తగ్గించాయి. రాయితీ రుణ రేట్లు, డిజిటల్ సంస్కరణలు పొదుపు, రుణాలు, ఆర్థిక ప్రణాళికలను మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చాయి.
సరళీకృత పన్ను విధానం- 2024 జూలైలో ఆదాయపు పన్ను చట్టం-1961 పై ప్రభుత్వం సమగ్ర సమీక్షను ప్రకటించింది. ఇది రికార్డు సమయంలో పూర్తయి ఆదాయపు పన్ను చట్టం-2025.. 2026 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. ఈ పన్ను సంస్కరణలు మధ్యతరగతిపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించాయి. 2014లో 2.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు సున్నా పన్ను ఉండేది. ఇప్పుడు(2023లో ప్రవేశపెట్టిన) కొత్త పన్ను విధానం ప్రకారం ఏటా రూ.12 లక్షల వరకు(ప్రామాణిక తగ్గింపుతో జీతభత్యాలు పొందే వారికి రూ.12.75 లక్షలు) ఆదాయం ఉన్న వ్యక్తులు సున్నా పన్ను చెల్లిస్తున్నారు. ఇది వారి పొదుపును, ఖర్చు చేయదగిన ఆదాయాన్ని, మొత్తం ఆర్థిక ఎంపికలను పెంచింది.
వస్తు సేవల పన్ను- 2017 జూలైలో ప్రవేశపెట్టిన జీఎస్టీ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చిన అత్యంత ముఖ్యమైన పరోక్ష పన్ను సంస్కరణ. ఇది బహుళ కేంద్ర, రాష్ట్ర పన్నులను ఒకే వ్యవస్థలోకి తెచ్చి, ఉమ్మడి జాతీయ మార్కెట్‌ను సృష్టించింది. ముఖ్యంగా మధ్యతరగతికి, జీఎస్టీ పన్నులను సరళీకృతం చేయడం, రోజువారీ ఖర్చులను తగ్గించడం ద్వారా పలు స్పష్టమైన ప్రయోజనాలను అందించింది. నిత్యావసర వస్తువులపై తక్కువ రేట్లు, హేతుబద్ధమైన పన్ను స్లాబులు రోజువారీ వినియోగాన్ని మరింత అందుబాటు ధరల్లోకి తెచ్చాయి. దాదాపు తొమ్మిదేళ్ల కాలంలో రేట్ల హేతుబద్ధీకరణ, డిజిటలైజేషన్ ద్వారా ఇది పరోక్ష పన్నుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017 లోని 66.5 లక్షల నుంచి ఏప్రిల్ 2026 నాటికి 1.64 కోట్లకు పెరిగింది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్- 2025 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన యూపీఎస్.. భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత జీవిత భద్రతను బలోపేతం చేస్తుంది. వీరు మధ్యతరగతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఉద్యోగి, ప్రభుత్వ సహకారాలను ఒక విరాళాల నిర్మాణంలో కలిపి, పదవీ విరమణ తర్వాత ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉన్న నిశ్చిత పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది. యూపీఎస్ పదవీ విరమణ తర్వాత(కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉంటే) నెలకు కనీసం రూ.10,000 కనీస పెన్షన్‌కు హామీ ఇస్తుంది. ఇది పదవీ విరమణ అనంతర ఆదాయం, ఆర్థిక స్థిరత్వంపై ఉన్న అనిశ్చితిని తగ్గిస్తుంది. ముఖ్యంగా తక్కువ జీతాలు, తక్కువ సేవా కాలం ఉన్న ఉద్యోగులకు మద్దతు ఇస్తుంది. ఈ పథకం పెన్షనర్లకు కరువు భత్యం కూడా అందిస్తుంది. ఇది పెరుగుతున్న జీవన వ్యయాలను, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి రిటైర్డ్ ఉద్యోగులకు సహాయపడుతుంది. దీంతో పాటు కుటుంబ పెన్షన్ ప్రయోజనాలు పెన్షనర్ మరణం తర్వాత జీవిత భాగస్వామికి అండగా నిలుస్తాయి. ఇది ఆధారపడిన కుటుంబ సభ్యులకు నిరంతర ఆర్థిక రక్షణను ఇస్తుంది.
బీమా-ప్రీమియం పరిమాణం పరంగా ప్రపంచంలోనే 10వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా భారతదేశం అవతరించింది. ఇది విస్తరిస్తున్న ఆర్థిక రక్షణను ప్రతిబింబిస్తుంది. బీమాలో విస్తృతంగా లైఫ్ ఇన్సూరెన్స్(మరణం, వైకల్యం, పదవీ విరమణ ప్రమాదాలను కవర్ చేస్తుంది). నాన్-లైఫ్ ఇన్సూరెన్స్(ఆరోగ్యం, ఆస్తులను ఊహించని సంఘటనల నుంచి రక్షిస్తుంది) ఉన్నాయి.
కుటుంబ ఆర్థిక విషయాలలో బీమా ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది. బీమా, పెన్షన్ నిధుల వాటా ఆర్థిక సంవత్సరం 2018-19లోని 28.6 శాతం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29.6 శాతానికి పెరిగింది. ఇది కుటుంబాలలో పెరుగుతున్న ఆర్థిక అవగాహనను, దీర్ఘకాలిక భద్రత వైపు మారుతున్న ధోరణిని సూచిస్తుంది.
మధ్యతరగతి కోణం నుంచి.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) "2047 నాటికి అందరికీ బీమా" అనే లక్ష్యానికి కట్టుబడి ఉంది. ప్రతి పౌరుడికి తగిన జీవిత, ఆరోగ్య, ఆస్తి భీమా ఉండేలా; ప్రతి వ్యాపారానికి తగిన ప్రమాద రక్షణ అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం.
ప్రభుత్వ మద్దతు ఉన్న పలు పథకాలు ఈ విస్తరణకు మూలస్తంభాలుగా నిలిచాయి. 2015 లో ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 26.88 కోట్ల నమోదులు జరిగాయి. 10 లక్షలకు పైగా క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన 57.11 కోట్ల నమోదులను చూసింది. ఇది అందుబాటు ధరలో ప్రమాద రక్షణను అందిస్తుంది. అదే సమయంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 43.52 కోట్ల హెల్త్ కార్డులను అందించి, వైద్య రక్షణ లభ్యతను విస్తరించింది.
ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం 3.24 కోట్ల మంది ఉద్యోగులను కవర్ చేయడం ద్వారా సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. కుటుంబాలతో సహా దాదాపు 14.91 కోట్ల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
2025లో వచ్చిన 'సబ్‌కా బీమా, సబ్‌కీ రక్షా' సవరణల వంటి సంస్కరణలు నియంత్రణను మెరుగుపరిచాయి. వినియోగదారుల రక్షణను పెంచాయి. విదేశీ పెట్టుబడుల పరిమితులను ఎక్కువ చేశాయి. ఈ ప్రయత్నాలన్నీ కలిసి బీమా విస్తృతిని పెంచాయి. ఆర్థిక బలాన్ని మెరుగుపరిచాయి. మధ్యతరగతికి ప్రమాద రక్షణను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చాయి.
తక్కువ రుణ రేట్లు- 2015 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశంలో గృహ రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. 2015లో రేట్లు ఏటా 9.5 శాతం నుంచి 10.5 శాతం మధ్య ఉండేవి. 2025 నాటికి అవి దాదాపు 7.35 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గి, ఇళ్ల కొనుగోలు శక్తిని, లభ్యతను మెరుగుపరిచాయి. ఈ తగ్గుదల నియంత్రణ సంస్కరణలు, విస్తృత ఆర్థిక మార్పుల వల్ల సాధ్యమైంది. భారతదేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధాన నిర్ణయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. రెపో రేటులో గణనీయమైన తగ్గింపు కనిపించింది. 2015 లోని 8 శాతం నుంచి 2026లో 5.25 శాతానికి తగ్గింది. బ్యాంకులు ఈ ప్రయోజనాలను క్రమంగా రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ, రుణ రేట్లను తగ్గించాయి.
గృహ రుణాల మాదిరిగానే వ్యక్తిగత రుణ రేట్లు 14.25 శాతం(2014) నుంచి 12.5 శాతానికి(2026) తగ్గాయి. విద్యా రుణాల రేట్లు 14.25 శాతం నుంచి 9.4 శాతానికి తగ్గాయి. ఈ తక్కువ రేట్లు మధ్యతరగతికి రుణాలను మరింత అందుబాటు ధరల్లోకి తెచ్చాయి. ఇవి ఈఎంఐలను, ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇళ్లు, విద్య, వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయడానికి కూడా ఇవి మద్దతు ఇస్తాయి.

ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై)- 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన పీఎంఎంవై.. తయారీ, వ్యాపారం, సేవలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలలో రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తుంది. ఇది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనంగా మారి 57 కోట్లకు పైగా రుణాల ద్వారా రూ.40.07 లక్షల కోట్లను(మార్చి 2026 నాటికి) పంపిణీ చేసింది. ఇది క్షేత్రస్థాయి వ్యాపారాలను బలోపేతం చేసింది. ఆర్థిక సమగ్రతను పెంచింది. భారతదేశ స్థానిక ఆర్థిక వ్యవస్థల నిరంతర వృద్ధికి మద్దతు ఇచ్చింది. మధ్యతరగతికి, పీఎంఎంవై చిన్న వ్యాపారాల సృష్టికి తోడ్పడుతుంది. స్వయం ఉపాధికి మద్దతు ఇస్తుంది. అనధికారిక రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
భోపాల్‌కు చెందిన లవకుష్ మెహ్రా 2021లో తన మొదటి ముద్ర రుణాన్ని రూ.5 లక్షలు తీసుకున్నప్పుడు కొంత సంకోచంతోనే ముందడుగు వేశారు. కొన్నేళ్లలోనే ఆ ఒక్క అడుగు ఒక అద్భుతమైన ప్రయాణానికి నాంది అయింది. ఆయన ఔషధ వ్యాపారం రూ.12 లక్షల టర్నోవర్ నుంచి రూ.50 లక్షల పైచిలుకు పెరిగింది. ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువైంది. ఆయన ఒక ఇంటి యజమాని అయ్యారు. యువ పారిశ్రామికవేత్తలకు తమ సొంత నిబంధనలపై జీవనోపాధిని నిర్మించుకోవడానికి ఆర్థిక పునాదిని ఇవ్వాలనే లక్ష్యంతో పీఎంఎంవైని ఎలా రూపొందించారో ఆయన కథ ప్రతిబింబిస్తుంది.
పట్టణాభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణ
గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాలను, రవాణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరించింది. మెరుగైన గృహనిర్మాణం, వేగవంతమైన రవాణా, ఆధునిక ప్రజా మౌలిక సదుపాయాలు పట్టణ దైనందిన జీవితాన్ని మెరుగుపరిచాయి. విస్తరించిన మెట్రో నెట్‌వర్క్‌లు, ఆధునికీకరించిన రైల్వేలు, పెరుగుతున్న విమానయాన సౌకర్యాలు మధ్యతరగతి ప్రయాణాలను మరింత సురక్షితంగా, వేగంగా, సరసమైనవిగా మార్చాయి.
గృహనిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్(పీఎంఏవై-యూ): 2015 లో ప్రారంభమైన ఈ పథకం కోట్లాది మందికి సురక్షితమైన గృహాలను అందించి వారి జీవితాలను మార్చేసింది. పీఎంఏవై-యూ 2.0 పథకం ఈ బలమైన పునాదిని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 'అందరికీ ఇళ్లు' మిషన్ కింద(సెప్టెంబర్ 2024 నుంచి అమలులోకి వచ్చేలా) ఇది ప్రారంభమైంది. పట్టణ ప్రాంతాలలో రాబోయే ఐదేళ్లలో మరో 1 కోటి మంది అర్హులైన లబ్ధిదారులకు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. మధ్యతరగతికి ఇళ్లు ఇవ్వడానికి రూ.8.76 లక్షల కోట్లు కేటాయించారు.
మంజూరైన మొత్తం 125.31 లక్షల ఇళ్లలో దేశవ్యాప్తంగా 98.1 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందాయి(మే 2026 నాటికి). (2005-14) మధ్యకాలంలో నిర్మించిన 8.04 లక్షల ఇళ్లతో పోలిస్తే ఇది 1,120 శాతం అద్భుతమైన వృద్ధి. ఈ పథకం ఇతరులతో పాటు మధ్య ఆదాయ సమూహానికి చెందిన పట్టణ కుటుంబాలకు గౌరవప్రదమైన, సరసమైన గృహాలను అందించడానికి ప్రభుత్వ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
దీంతో పాటు (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్ - స్పెషల్ విండో ఫర్ అఫార్డబుల్ అండ్ మిడ్-ఇన్‌కమ్ హౌసింగ్) ఫండ్ ప్రత్యేకంగా మధ్యతరగతి, దిగువ-మధ్యతరగతి కోసం రూపొందించి, నిలిచిపోయిన నివాస ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 146 ప్రాజెక్టులలో 58,000 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తయ్యాయి. ఈ నిధి దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాజెక్టులలో రూ.49,500 కోట్లకు పైగా మూలధనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది 90 మిలియన్ చదరపు అడుగుల కంటే ఎక్కువ అభివృద్ధి ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఇందులో 44 శాతం అల్పాదాయ సమూహం, మధ్య ఆదాయ సమూహం ఇళ్ల కోసం కేటాయించారు.
చెన్నైలోని ఎలైట్ ఎకర్స్‌లో పెట్టుబడి పెట్టిన కుటుంబాలు తమ కలల ఇళ్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాయి. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనుమతులు, ఆర్థిక సవాళ్ల కారణంగా పదే పదే ఆలస్యమైంది. చాలా మంది కొనుగోలుదారులకు, ఇళ్లు స్వాధీనం చేసుకునే తేదీలు మారుతుండటంతో అనిశ్చితి పెరుగుతూనే వచ్చింది.

ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్ నిధి 2020లో రంగంలోకి దిగి, నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు పునరుజ్జీవనం పోసింది. రెండేళ్లలోనే నిర్మాణం పూర్తయింది. పెండింగ్ బకాయిలు కూడా క్లియర్ అయ్యాయి. 250కి పైగా కుటుంబాలు ఎట్టకేలకు తమ ఇళ్లను అందుకున్నాయి. ఇది ఇళ్ల కొనుగోలుదారులలో ఉపశమనాన్ని, స్థిరత్వాన్ని, సరికొత్త నమ్మకాన్ని నింపింది.
మెట్రో రైల్ విస్తరణ: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, ఇది లక్షలాది మంది దినసరి ప్రయాణాలను మారుస్తోంది. మెట్రో విస్తరణ 2014 కి ముందు నెలకు 0.68 కిలోమీటర్లు ఉండగా, నేడు అది దాదాపు 6 కిలోమీటర్లకు వేగవంతమైంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా మెట్రో రవాణాను విస్తరించడానికి దాదాపు ₹3.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. మెట్రో సేవలు ఉన్న నగరాల సంఖ్య 2014 లో కేవలం 5 ఉండగా, 2025 నాటికి 26 కి పెరిగింది. అలాగే రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2013-14 లోని 28 లక్షల నుండి నేడు 1.15 కోట్లకు పైగా పెరిగింది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై నగరాల కోసం మార్చి 2026 నాటికి బీఈఎంఎల్ ద్వారా 2,100 కంటే ఎక్కువ మెట్రో కోచ్‌లు స్వదేశీయుంగా తయారయ్యాయి. మధ్యతరగతికి మెట్రో విస్తరణ వేగవంతమైన ప్రయాణ సమయాన్ని, తక్కువ ప్రయాణ ఖర్చులను, నమ్మకమైన ప్రజా రవాణాను అందించింది. ఇది నగర జీవితాన్ని మరింత అందుబాటు ధరల్లోకి తెచ్చింది.

రైల్వేల విస్తరణ: గత 12 ఏళ్లలో భారతదేశంలో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా, వేగంగా, పర్యావరణహితంగా, సౌకర్యవంతంగా మారింది. భారతీయ రైల్వేకు బడ్జెట్ మద్దతు 2014-15 లోని రూ.32,000 కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2.78 లక్షల కోట్లకు పెరిగింది. స్వయంచాలక బ్రేకింగ్ ద్వారా రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే స్వదేశీ వ్యవస్థ 'కవచ్' ద్వారా భద్రత మెరుగుపడింది. గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని సమర్థించే హై-స్పీడ్ రైలు మార్గాలు 2014లోని 5,036 కిలోమీటర్ల నుంచి 2026 లో 23,713 కిలోమీటర్లకు విస్తరించాయి. భారతదేశం తన భవిష్యత్తు వందే భారత్ స్లీపర్ సేవలను కూడా జనవరి 2026 లో ప్రారంభించింది. అలాగే 60 అమృత్ భారత్ రైళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి.
రైలు వినియోగం పెరుగుతూనే ఉంది. ప్రయాణికుల సంఖ్య 2024-25లోని 716 కోట్ల నుంచి 2025-26 లో 741 కోట్లకు పెరిగింది. ప్రతిరోజూ భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రెండు కోట్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేస్తోంది. కాగా, ఏప్రిల్ 2026 నాటికి 208 రైల్వే స్టేషన్లు ఆధునిక ప్రయాణికుల వసతులతో అభివృద్ధి చెందాయి. మధ్యతరగతికి ఇది వేగవంతమైన రైళ్లను, మెరుగైన భద్రతను, మంచి స్టేషన్లను అందిస్తోంది. ఇది సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, నమ్మదగినవిగా మారుస్తోంది.
విమానాశ్రయాల విస్తరణ: భారతదేశంలో విమాన ప్రయాణం మధ్యతరగతి కుటుంబాలకు మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మారింది. పని చేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లోని 74 నుండి 2026లో 165 కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఆధునిక విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం రూ.1.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. మోపా, కన్నూర్, హోల్లోంగి, నవీ ముంబై, నోయిడా (జెవార్) వంటి కొత్త విమానాశ్రయాలు ప్రాంతీయ రవాణాను మెరుగుపరిచాయి.
వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం, సరసమైన విమానాశ్రయ వసతుల ద్వారా ప్రయాణికుల అనుభవం కూడా మెరుగైంది. 'ఉడాన్ యాత్రి కేఫ్‌లు' ఇప్పుడు ప్రయాణికులకు బడ్జెట్ అనుకూల ఆహార ఎంపికలను అందిస్తున్నాయి. 'డిజి యాత్ర' 38 విమానాశ్రయాలలో అంతరాయం లేని, కాగిత రహిత, స్పర్శ రహిత ప్రయాణాన్ని సాధ్యం చేస్తోంది. డిసెంబర్ 2022 నుండి, 9.3 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఈ డిజిటల్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఇ-బీసీఏఎస్ వేదిక డిజిటల్ పర్యవేక్షణ, శిక్షణ వ్యవస్థల ద్వారా విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసింది.
'ఉడాన్' పథకం చిన్న నగరాలకు, మొదటిసారి విమానం ఎక్కే వారికి విమాన ప్రయాణాన్ని అందుబాటు ధరల్లోకి తెచ్చింది. 2016 నుండి, 665 మార్గాలు 95 విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్‌లను అనుసంధానించాయి. ఈ పథకం కింద 3.45 లక్షల కంటే ఎక్కువ విమానాలు 164 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా తక్కువ సేవలు ఉన్న విమానాశ్రయాలను పునరుద్ధరించడానికి రూ.4,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. 2026 లో ఆమోదం పొందిన సవరించిన ఉడాన్ పథకం రాబోయే దశాబ్దంలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించనుంది. మొత్తంగా, సరసమైన విమాన టిక్కెట్లు, మెరుగైన ప్రాంతీయ రవాణా, ఆధునిక విమానాశ్రయాలు మధ్యతరగతి కుటుంబాలకు విమాన ప్రయాణాన్ని సులభంగా, మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి.

ప్రాథమిక వసతుల లభ్యతలో విపరీతమైన పెరుగుదల
పరిశుభ్రత, విద్యుత్, కుళాయి నీరు, స్వచ్ఛమైన వంట గ్యాస్ వంటి వసతులు విస్తృతంగా లభించడం భారతదేశ మధ్యతరగతి సౌకర్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. అదనంగా, గత 12 ఏళ్లుగా బలమైన ప్రజా మౌలిక సదుపాయాలు పట్టణ, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంపొందించాయి.
కుళాయి నీటి కనెక్షన్లు: భారతదేశంలో కుళాయి నీటి కనెక్షన్లు 2019లోని 3.23 కోట్ల నుండి మే 2026 నాటికి 15.85 కోట్లకు పెరిగాయి. ఇది 390 శాతానికి పైగా పెరుగుదలను సూచిస్తుంది. ఈ వేగవంతమైన విస్తరణ ప్రాథమిక వసతులను మెరుగుపరచడంపై, కుటుంబాలకు అవసరమైన సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చడంపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తుంది.
చెత్త, వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ: వేగవంతమైన పట్టణీకరణ వల్ల సమర్థవంతమైన వ్యర్థాలు, చెత్త, మురుగునీటి నిర్వహణకు డిమాండ్ పెరిగింది. దీనిని పరిష్కరించడానికి, ప్రభుత్వం అక్టోబర్ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ ప్రారంభించింది. పట్టణ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం, మున్సిపల్ ఘన వ్యర్థాల 100 శాతం శాస్త్రీయ నిర్వహణను సాధించడం దీని లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 దీనిని మరింత బలోపేతం చేసింది. వ్యర్థాల ప్రాసెసింగ్ 2014లో దాదాపు నామమాత్రపు స్థాయి నుంచి 2026లో సుమారు 97 శాతానికి పెరిగింది. ఇది పట్టణ పరిశుభ్రతలో ఒక పరివర్తనాత్మక మెరుగుదలను సూచిస్తుంది.
ఈ ప్రయత్నానికి తోడుగా, నీరు, మురుగునీటి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 2015లో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్(అమృత్)ను ప్రారంభించింది. ఇది నగరాలను స్వయం సమృద్ధంగా, నీటి భద్రత కలిగినవిగా మార్చడంపై దృష్టి పెడుతుంది. 2021లో ప్రారంభమైన అమృత్ 2.0 కింద, 583 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇవి 6,649 ఎమ్‌ఎల్‌డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని జోడించాయి. గత దశాబ్దంలో అమృత్, అమృత్ 2.0 కింద 2.53 కోట్ల కుళాయి కనెక్షన్లు, 1.50 కోట్లకు పైగా మురుగునీటి కనెక్షన్లు అందాయి.
విద్యుత్ లభ్యత, ఇంధన కొరత తగ్గింపు: విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగాలలో వచ్చిన గణనీయమైన మార్పులు దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యతను బలోపేతం చేశాయి. ఫలితంగా, ఇంధన కొరత 2013-14 ఆర్థిక సంవత్సరంలోని 4.2 శాతం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.03 శాతానికి పడిపోయింది. ఈ పురోగతి కుటుంబాలకు రోజువారీ విద్యుత్ సరఫరాను పెంచింది. గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు 2014 లోని 12.5 గంటలతో పోలిస్తే దాదాపు 22.6 గంటల విద్యుత్‌ను పొందుతున్నాయి. పట్టణ ప్రాంతాలు మునుపటి 22.1 గంటలతో పోలిస్తే 23.4 గంటల వరకు విద్యుత్‌ను పొందుతున్నాయి. ఈ విజయాలన్నీ కలిసి మరింత నమ్మకమైన, విస్తృతమైన విద్యుత్ లభ్యతను ప్రతిబింబిస్తాయి.
2014 డిసెంబర్‌లో ప్రారంభమైన దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్ రెండింటి కింద, ఇంధన పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి. వీటికి తోడుగా ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విద్యుద్దీకరణ కార్యక్రమాలలో ఒకటైన ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన(సౌభాగ్య) నిలిచింది. ఇది దేశంలోని విద్యుత్ లేని అన్ని గృహాలకు చివరి మైలు అనుసంధానాన్ని, విద్యుత్ కనెక్షన్లను అందించడంపై దృష్టి పెట్టింది.
మొత్తంగా, ఈ కార్యక్రమాలలో దాదాపు రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఫలితంగా, మధ్యతరగతి కుటుంబాలకు నమ్మకమైన విద్యుత్ సరఫరా లభిస్తోంది, దైనందిన జీవితంలో అంతరాయాలు తగ్గాయి, గృహాలు, విద్య, ఉద్యోగాలకు మరింత సౌకర్యం చేకూరింది.

తలసరి విద్యుత్ వినియోగం: భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం 2013-14 లోని 957 కిలోవాట్ అవర్స్ (కేడబ్ల్యూహెచ్) నుండి 2024-25 లో 1,460 కిలోవాట్ అవర్స్(కేడబ్ల్యూహెచ్)కు పెరిగింది. ఇది 52.6 శాతం పెరుగుదల. ఇది పెరుగుతున్న డిమాండ్‌ను, నమ్మకమైన విద్యుత్ విస్తృత లభ్యతను ప్రతిబింబిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది గృహోపకరణాలు, డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం నుండి మెరుగైన కూలింగ్, లైటింగ్, కనెక్టివిటీ వరకు దైనందిన సౌకర్యాన్ని పెంచింది. మెరుగైన విద్యుత్ లభ్యత రిమోట్ వర్క్, ఆన్‌లైన్ విద్య, చిన్న వ్యాపారాలు, పట్టణ, అర్ధ-పట్టణ భారతదేశవ్యాప్తంగా ఉన్నత జీవన ప్రమాణాలకు మద్దతు ఇచ్చింది.
భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం 2023-2032 కాలానికి జాతీయ విద్యుత్ ప్రణాళికను ఖరారు చేసింది. ఇది 2032 నాటికి 458 గిగావాట్ల గరిష్ట డిమాండ్‌కు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక పునరుత్పాదక ఇంధన అనుసంధానాన్ని కూడా సాధ్యం చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వంటి అభివృద్ధి చెందుతున్న అవసరాలకు మద్దతు ఇస్తూ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
అందుబాటులో, చౌకగా వైద్య సేవలు
దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కుటుంబాలకు చౌకైన వైద్య సేవలు గణనీయంగా విస్తరించాయి. గత పన్నెండేళ్లలో తక్కువ ధరలకే మందులు, విస్తృతమైన బీమా సౌకర్యం, మెరుగైన చికిత్స వసతులు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయి. నివారణ సంరక్షణ, వ్యాధి నియంత్రణ, బలమైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతను మరింత పెంచాయి.
ఈట్ రైట్ ఇండియా- ఊబకాయం, ఆహార సంబంధిత వ్యాధులను అరికట్టడానికి కేవలం ఆసుపత్రుల పరిధిలోనే కాకుండా అంతకుమించి చర్యలు అవసరం. ఆహార ఉత్పత్తి, విక్రయం, వినియోగ విధానాల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్పులు తీసుకువస్తూ ముందుండి పనిచేస్తోంది. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికి 2018 జూలైలో ఈట్ రైట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. 2025 జూలై నాటికి 17.76 లక్షల మంది ఆహార విక్రేతలకు శిక్షణ ఇచ్చారు, 179 క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్‌లను ధృవీకరించారు. రైల్వే స్టేషన్లలో 406 ఈట్ రైట్ స్టేషన్లతో పాటు 517 ధృవీకృత పండ్లు, కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. ఇది మధ్యతరగతి ప్రజలకు ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యలను, వైద్య ఖర్చులను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. మార్కెట్లు, వీధి ఆహార కేంద్రాలు, స్టేషన్ల విస్తృత ధృవీకరణ రోజువారీ జీవితంలో ఆహార నాణ్యతను, పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది.
ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన పథకం- ఈ పథకాన్ని 2015 తర్వాత భారీగా పునర్వ్యవస్థీకరించారు. జన్ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జెనరిక్ మందులను చాలా తక్కువ ధరలకే అందించడం దీని లక్ష్యం. ప్రస్తుతం 18,000 కంటే ఎక్కువ జన్ఔషధి కేంద్రాలు 50-80 శాతం తక్కువ ధరలకే నాణ్యమైన జెనరిక్ మందులను సరఫరా చేస్తున్నాయి. సగటున ప్రతిరోజూ సుమారు 10 నుండి 12 లక్షల మంది ఈ కేంద్రాలను సందర్శిస్తున్నారు. తద్వారా, భారతదేశ మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. 2,110 రకాల మందులు, 315 రకాల శస్త్రచికిత్స వస్తువులు మొదలైన ఉత్పత్తుల జాబితా చికిత్స లభ్యతను సులభతరం చేస్తోంది. గత 11 ఏళ్లలో జన్ఔషధి ఉత్పత్తులు కుటుంబాల సొంత వైద్య ఖర్చులను తగ్గించి రూ. 40,000 కోట్లు ఆదా చేయడానికి సహాయపడ్డాయి.

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ)- ఈ పథకం గర్భిణులకు(2వ, 3వ త్రైమాసికంలో ఉన్నవారికి) ప్రతి నెలా 9వ తేదీన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందిస్తుంది. పీఎంఎస్ఎంఏ జాతీయ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ ప్రైవేట్ లేదా స్వచ్ఛంద రంగ వైద్యుల భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తాయి. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి, దేశవ్యాప్తంగా 7.46 కోట్లకు పైగా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు, 22,000 కంటే ఎక్కువ కేంద్రాలు పీఎంఎస్ఎంఏ సేవలను అందిస్తున్నాయి(2026 మే 29 నాటికి).
ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన- 2018 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకం. ఈ పథకం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను అందిస్తుంది. 70 ఏళ్లు పైబడిన 86.51 లక్షల మందికి పైగా వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డులు అందించడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు ఇది ప్రయోజనం చేకూరుస్తోంది.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ఏఏఎం)- భారతదేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ(యూహెచ్‌సీ) సాధించే దిశగా ఇది ప్రజారోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా, పరివర్తనాత్మక అడుగుగా నిలిచింది (2018లో ప్రారంభమైంది). ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలలో ప్రజల నివాసాలకు సమీపంలోనే సమగ్రమైన, ఉచిత సేవలను అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇవి ప్రభుత్వం 2018లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఆరోగ్య కార్యక్రమం 'ఆయుష్మాన్ భారత్' లోని నాలుగు విభాగాలలో ఒకటి.
ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చౌకైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతను గణనీయంగా మెరుగుపరిచింది. దీని నాలుగు విభాగాలు కలిసి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలలో నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మిగిలిన విభాగాలలో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఉన్నాయి.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల కింద చేపట్టిన సంస్కరణలు అందరికీ ఆరోగ్య సంరక్షణ సాధనలో పురోగతిని బలోపేతం చేశాయి. హెల్త్ కవరేజ్ సూచీ 2015లో 57గా ఉండగా, 2021 నాటికి 63కి పెరిగింది. ప్రజలు తమ సొంత జేబుల నుండి పెట్టే ఖర్చు 60.6% (2014-15) నుండి 39.4% (2021-22)కి తగ్గింది. ప్రస్తుతం 1,85,555 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అందుబాటులో ఉన్నాయి (2026 ఏప్రిల్ 28 నాటికి). ఈ కేంద్రాలకు ఇప్పటివరకు 540 కోట్లకు పైగా ప్రజలు వచ్చారు (2026 జూన్ నాటికి). ముఖ్యంగా, నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల కోసం ఈ కేంద్రాలలో 60 కోట్లకు పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
క్షయ(టీబీ), మలేరియా, క్యాన్సర్ వంటి వ్యాధులపై పథకాలు- జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ద్వారా 2015-2024 మధ్య కాలంలో ప్రతి లక్ష జనాభాకు క్షయ వ్యాధి బారిన పడే వారి సంఖ్య 237 నుండి 187కి, అంటే 21% తగ్గింది. చికిత్స పరిధి 53% నుండి 92% కి వేగంగా పెరిగింది, ఇది ప్రపంచ సగటు 78% కంటే చాలా ఎక్కువ.
2016లో ప్రభుత్వం జాతీయ మలేరియా నిర్మూలన చట్రాన్ని ప్రారంభించింది, ఇది 2027 నాటికి మలేరియాను నిర్మూలించడానికి ఒక కార్యాచరణను అందిస్తుంది. ఈ చట్రం ఆధారంగా, జాతీయ మలేరియా నిర్మూలన వ్యూహాత్మక ప్రణాళిక (2023-2027) నిఘాను పెంచింది, కేసుల నిర్వహణ కోసం "పరీక్షించడం, చికిత్స చేయడం, పర్యవేక్షించడం" అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది నిజసమయ (రియల్ టైమ్) డేటా పర్యవేక్షణను కూడా అభివృద్ధి చేసింది. 2015-2023 మధ్య కాలంలో మలేరియా కేసులు, మరణాలు దాదాపు 80% తగ్గాయి. భారతదేశం 2024 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మలేరియా 'హై బర్డెన్ టు హై ఇంపాక్ట్' గ్రూప్ నుండి బయటపడింది.
సెంటినెల్ సర్వైలెన్స్ ఆసుపత్రులు 110 (2007) నుండి 869 (2025) కి పెరగడంతో డెంగ్యూ వ్యాధి నిర్ధారణ సామర్థ్యం మెరుగైంది. 2018లో ప్రారంభమైన జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం 1,140 కేంద్రాల ద్వారా ఉచిత నిర్ధారణ, చికిత్సను అందిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 18.23 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు (2018-సెప్టెంబర్ 2025).
నిఘా విస్తరణ, తృతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, జిల్లా స్థాయి చికిత్స వసతుల ద్వారా భారతదేశం క్యాన్సర్ సంరక్షణను బలోపేతం చేస్తోంది. తృతీయ స్థాయిలో క్యాన్సర్ సంరక్షణ వసతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం 2014-15 నుండి 'స్ట్రెంథనింగ్ ఆఫ్ టెర్షియరీ క్యాన్సర్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీస్' పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద 19 రాష్ట్ర క్యాన్సర్ సంస్థలు(ఎస్‌సీఐ), 20 తృతీయ క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలకు (టీసీసీసీ) ఆమోదం లభించింది. ఈ పథకం కింద రాష్ట్ర వాటాతో కలిపి ఒక్కో రాష్ట్ర క్యాన్సర్ సంస్థకు రూ. 120 కోట్ల వరకు, తృతీయ క్యాన్సర్ సంరక్షణ కేంద్రానికి రూ. 45 కోట్ల వరకు ఒకేసారి గ్రాంటు ఇచ్చే నిబంధన ఉంది. ప్రస్తుతం 20 రాష్ట్ర క్యాన్సర్ సంస్థలు, 19 తృతీయ క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలు, 439 జిల్లా క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలు పనిచేస్తూ రోగులకు సేవలు అందిస్తున్నాయి.
బలోపేతమైన విద్య, వ్యాపార, నైపుణ్యాభివృద్ధి
గత పన్నెండేళ్లలో దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్యం, వ్యాపార అవకాశాలు గణనీయంగా విస్తరించాయి. బలమైన విద్యా సంస్థలు, సులభంగా రుణాల లభ్యత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇచ్చే శిక్షణ కెరీర్ అవకాశాలను మెరుగుపరిచాయి. ఈ ప్రయత్నాలు ఆవిష్కరణలకు మద్దతునిచ్చాయి, స్వయం ఉపాధిని ప్రోత్సహించాయి, భారతదేశ మధ్యతరగతి ఆర్థిక, సామాజిక ఎదుగుదలను బలోపేతం చేశాయి.
పాఠశాల విద్యా రంగం- 2047 నాటికి వికసిత్ భారత్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న భారతదేశ సామాజిక, ఆర్థిక పురోగతికి నాణ్యమైన విద్యే కీలకం. భారతదేశంలోని 14.71 లక్షల పాఠశాలలు 24.69 కోట్లకు పైగా విద్యార్థులకు, 1.01 కోట్ల మంది ఉపాధ్యాయులకు మద్దతుగా నిలుస్తున్నాయి (2024-25).
2018లో 'సమగ్ర శిక్ష' ప్రారంభం అన్ని స్థాయిలలో పాఠశాల విద్యకు ఒక సమగ్ర విధానాన్ని సృష్టించింది. ఇది ఒక సమీకృత చట్రం ద్వారా ప్రణాళిక, వనరుల కేటాయింపు, అభ్యాస ఫలితాలను మెరుగుపరిచింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ 2020) సంపూర్ణ, నైపుణ్య ఆధారిత, భవిష్యత్తుకు అవసరమైన అభ్యాసాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ దార్శనికతను మరింత బలోపేతం చేసింది. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంరక్షణలు నాణ్యమైన విద్యను, మెరుగైన కెరీర్ అవకాశాలను అందుబాటులోకి తెస్తాయి. ఇవి విద్యాపరమైన వ్యత్యాసాలను తగ్గించి, ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గాలను సుగమం చేస్తాయి.
ఐఐటీల విస్తరణ- 2014 నాటికి భారతదేశంలో 16 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఉండేవి. ఆ తర్వాత సంవత్సరాల్లో 7 కొత్త ఐఐటీలను చేర్చడంతో, మొత్తం ఐఐటీల సంఖ్య 23కు పెరిగింది (2025). గత దశాబ్దంలో(2025-26 వరకు) విద్యార్థుల సంఖ్య 65,000 నుండి 1.35 లక్షలకు, అంటే రెట్టింపు అయింది. అంతేకాకుండా, అదనంగా 6,500 మంది విద్యార్థులకు చోటు కల్పించేలా కొత్త ఐఐటీలలో మౌలిక సదుపాయాలను విస్తరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుపతి, భిలాయ్, జమ్ము, ధార్వాడ్, పాలక్కాడ్‌లలో ఈ కొత్త విద్యా సామర్థ్యాన్ని సృష్టిస్తారు. 130 సీనియర్ ఫ్యాకల్టీ పోస్టులను మంజూరు చేయడం విద్యా నాణ్యతను మరింత బలోపేతం చేస్తుంది.
మధ్యతరగతి ప్రజలకు ఈ విస్తరణ నాణ్యమైన విద్యను, అగ్రశ్రేణి సంస్థలను మరింత చేరువ చేస్తుంది. ఇది మెరుగైన ఉద్యోగాలు, అధిక ఆదాయాలు, ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గాలను తెరుస్తుంది. అలాగే విద్యాపరమైన అసమానతలను తగ్గించి, నైపుణ్యంతో కూడిన, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది.
విద్యా లక్ష్మి పథకం- 2024లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నత విద్యకు అడ్డంకి కాకుండా చూస్తుంది. ఇది సరళమైన, పారదర్శకమైన, డిజిటల్ విధానం ద్వారా ఎలాంటి హామీ (ష్యూరిటీ) లేని విద్యా రుణాలను అందిస్తుంది. రూ. 8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం నిర్దేశించిన 860 నాణ్యమైన విద్యా సంస్థలలో దేనిలోనైనా ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందాల్సి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించి, నాణ్యమైన విద్య లభ్యతను విస్తరిస్తుంది. భారీ ముందస్తు ఖర్చులు లేదా రుణాల అడ్డంకులు లేకుండా విద్యార్థులు తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. 2025 ఫిబ్రవరి నుండి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో రూ. 7,750 కోట్లకు పైగా విలువైన 60,600 కంటే ఎక్కువ రుణాలు మంజూరయ్యాయి. ఇందులో మొదటి సెమిస్టర్ లేదా మొదటి సంవత్సరం కోసం రూ. 1,400 కోట్లు పంపిణీ చేశారు.
భారతదేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాల రాక- డీకిన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వోలాంగ్‌గాంగ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తమ క్యాంపస్‌లను ప్రారంభించాయి. అలాగే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ గురుగ్రామ్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్యాంపస్‌లు అంతర్జాతీయ పాఠ్యప్రణాళికను, అధ్యాపకులను, బోధనా పద్ధతులను భారతీయ విద్యార్థులకు దగ్గరగా తీసుకువస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఇది విదేశాలలో చదువుకోవడానికి అయ్యే భారీ ఖర్చులను తగ్గిస్తుంది, విదేశీ మారకద్రవ్యం బయటకు పోకుండా నియంత్రిస్తుంది. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొందిన డిగ్రీలను పొందే అవకాశాన్ని కూడా విస్తరిస్తుంది. మొత్తంగా ఇది విద్యా వ్యయాన్ని అందుబాటులోకి తెచ్చి, ఎంపికలను పెంచుతుంది. అలాగే ప్రపంచ విద్యా హబ్‌గా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. 2025లో విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ఆస్ట్రేలియా, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాలకు చెందిన 8 విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఆసక్తి లేఖ) జారీ చేసింది. బెంగళూరు, ముంబై, చెన్నై నగరాల్లో తమ క్యాంపస్‌లను తెరవడానికి యూజీసీ ఈ సంస్థలను ఆహ్వానించింది.
వైద్య విద్య- వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి, చౌకగా మార్చింది. 2026 మార్చి 31 నాటికి 818 అల్లోపతి, 323 డెంటల్, 942 ఆయుష్ కళాశాలలతో సహా మొత్తం 2,045 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్ సంస్థలు పనిచేస్తున్నాయి లేదా ఆమోదం పొందాయి. ఇది ప్రయాణ ఖర్చులను, వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు ఖరీదైన ప్రైవేట్ వైద్యంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

నర్సింగ్ రంగానికి కూడా సమాన ప్రాధాన్యత లభించింది. కొత్త వైద్య కళాశాలలతో పాటు 157 కొత్త నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఏటా సుమారు 15,700 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లను అదనంగా అందిస్తాయి. మానసిక ఆరోగ్య విషయానికి వస్తే, ఉత్తర భారతదేశంలో నిమ్హాన్స్-2 (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్) ఏర్పాటు కానుంది. ఇది తృతీయ స్థాయి మానసిక వైద్య సంరక్షణలో సుదీర్ఘకాలంగా ఉన్న లోటును భర్తీ చేస్తుంది. రాంచీ, తేజ్‌పూర్‌లలోని సంస్థలను ప్రాంతీయ అగ్రశ్రేణి సంస్థలుగా (రీజినల్ అపెక్స్ ఇన్‌స్టిట్యూషన్స్) అప్‌గ్రేడ్ చేస్తారు. జిల్లా ఆసుపత్రులలో అత్యవసర, ట్రామా కేర్ సామర్థ్యాన్ని 50% బలోపేతం చేస్తారు. 2026-27 బడ్జెట్‌లో 17 కొత్త మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. అలాగే సుంకం లేని వ్యక్తిగత దిగుమతి జాబితాలో అదనంగా 7 అరుదైన వ్యాధులను చేర్చారు. అంతేకాకుండా, ఐదు ప్రాంతీయ వైద్య విలువ పర్యాటక హబ్‌లు (మెడికల్ వాల్యూ టూరిజం హబ్స్) వైద్య, విద్యా, ఆయుష్, పునరావాస సేవలను ఏకీకృతం చేస్తాయి. ఇవి సమగ్ర సంరక్షణకు భారతదేశాన్ని ఒక ప్రపంచ గమ్యస్థానంగా నిలుపుతాయి.
దీనితో పాటు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాల్లో విద్య, వైద్య అవసరాల కోసం వసూలు చేసే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 5% నుండి 2% కి తగ్గించాలని బడ్జెట్ 2026-27 ప్రతిపాదించింది. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై టీసీఎస్ తగ్గించడం మధ్యతరగతి ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
పారిశ్రామిక శిక్షణ సంస్థలు(ఐటీఐలు)- భారతదేశంలో దీర్ఘకాలిక వృత్తి విద్యా రంగానికి ఐటీఐలు వెన్నెముక లాంటివి. పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చూసే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.

ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి పీఎం-సేతు(ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్) పథకాన్ని రూ. 60,000 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా 2025 అక్టోబర్‌లో ప్రారంభించారు. మధ్యతరగతి ప్రజలకు ఇది నాణ్యమైన వృత్తి విద్యా శిక్షణను, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఖరీదైన డిగ్రీలు అవసరం లేకుండానే స్థిరమైన ఉద్యోగాలు, మెరుగైన ఆదాయాలు, వృత్తిపరమైన ఎదుగుదలకు ఇది మార్గాలను సుగమం చేస్తుంది.
స్కిల్ ఇండియా మిషన్- భారతదేశాన్ని ‘ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధ) దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా 2015లో ఈ మిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అప్రెంటిస్‌షిప్ శిక్షణ, సాంకేతిక ఇంటర్న్ శిక్షణా కార్యక్రమం, ఆన్‌లైన్ నైపుణ్యాభివృద్ధి మొదలైన వాటిని అందిస్తుంది. ఇందులో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై), జన్ శిక్షణ్ సంస్థాన్(జేఎస్ఎస్), ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్ఏపీఎస్), క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్(సీటీఎస్) వంటివి ముఖ్యమైన పథకాలు. 2022-2026 కాలానికి పునర్వ్యవస్థీకరించిన ఈ కార్యక్రమం మధ్యతరగతి ప్రజలకు సరిపోయే అనేక మార్గాలను అందిస్తోంది. ఏఐ, ఐఓటీ, ఉన్నత స్థాయి సేవల వంటి రంగాలలో ఉపాధిని పెంపొందించడానికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, స్వల్పకాలిక, డిజిటల్ అనుకూల నైపుణ్యాల పెంపుపై ఇది దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమం పూర్తిగా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్(ఎస్ఐడీహెచ్) ఆధారంగా నడుస్తుంది. ఇది కోర్సులు, ఉద్యోగావకాశాలు, అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెస్తుంది.
2026 మార్చి నాటికి పీఎంకేవీవై 4.0 కింద 27.74 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. జేఎస్ఎస్ కింద 36.48 లక్షల మంది లబ్ధి పొందారు. ఎన్ఏపీఎస్(ఎన్ఏపీఎస్) ద్వారా 54.41 లక్షల మంది అప్రెంటిస్‌లు చేరారు. ఇది వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను బలోపేతం చేస్తోంది.

స్టార్టప్ ఇండియా- స్టార్టప్ ఇండియా చొరవ కింద ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తోంది. అవి- ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్(ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్), క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్(సీజీఎస్ఎస్). ఇవి వివిధ రంగాలలోని స్టార్టప్‌ల వ్యాపార చక్రంలోని వివిధ దశలలో నిధుల అవకాశాలను అందిస్తాయి. 2016లో కేవలం 502 స్టార్టప్‌లు మాత్రమే గుర్తింపు పొందగా, అవి 308 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. 2026 మార్చి నాటికి 2.23 లక్షలకు పైగా స్టార్టప్‌లు గుర్తింపు పొంది, 23.3 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను ఉత్పత్తి చేశాయి. ఈ వేగవంతమైన వృద్ధి మధ్యతరగతి ప్రజలకు ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను విస్తరించింది. అదనంగా, ఈ స్టార్టప్‌లలో దాదాపు 48% మంది కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామిని కలిగి ఉండటం పెరుగుతున్న సమగ్రతను ప్రతిబింబిస్తుంది.
మరింత సౌకర్యం కోసం అంతరాయం లేని డిజిటల్ పాలన
భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) గుర్తింపు, బ్యాంకింగ్, కనెక్టివిటీల స్పష్టమైన ఏకీకరణ ద్వారా రూపుదిద్దుకుంది. ఇది జామ్(జేఏఎం) త్రయం- జన్ ధన్ ఖాతాలు, ఆధార్, విస్తృతమైన మొబైల్ సౌకర్యంగా రూపాంతరం చెందింది. ఇవి కలిసి పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష, ధ్రువీకరించదగిన సంబంధాలను ఏర్పరుస్తూ భారతదేశ డిజిటల్ పరివర్తనకు పునాది వేశాయి.
జామ్(జేఏఎం) త్రయం- ఆర్థిక సమగ్రత కోసం జాతీయ మిషన్‌గా 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభమైంది. భారతదేశంలో బ్యాంక్ ఖాతా లేని ప్రతి వయోజనుడికి ఒక బ్యాంక్ ఖాతా, ఆర్థిక గుర్తింపును అందించడం, రుణాలు, బీమా, పెన్షన్లు వంటి అవసరమైన సేవలను అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. గత 12 ఏళ్లలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమగ్రత కార్యక్రమాలలో ఒకటిగా ఎదిగింది. ఖాతాల సంఖ్య 2015 లో 14.72 కోట్లుగా ఉండగా, 2026 మే నాటికి 58.26 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 2015 మార్చిలో రూ. 15,670 కోట్లుగా ఉండగా, 2026 మే నాటికి రూ. 3.01 లక్షల కోట్లకు పెరిగాయి. మధ్యతరగతి కుటుంబాలు సురక్షితంగా పొదుపు చేసుకోవడానికి, ప్రయోజనాలను పొందడానికి, రుణాలు, బీమా, పెన్షన్లను పొందడానికి ఇవి ప్రయోజనకరంగా మారాయి.

దాదాపు పదేళ్ల క్రితం గోవాకు చెందిన రెబెక్కా మాథ్యూ పెన్షన్ చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ఇబ్బందులు పడేవారు. డబ్బులు వచ్చినప్పుడు కూడా దళారీలపై ఆధారపడాల్సి రావడం వల్ల అనిశ్చితిగా ఉండేది. జన్ ధన్ యోజన ఆ అనుభవాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ రోజు, ఆమె పెన్షన్ ప్రతి నెలా నేరుగా ఆమె బ్యాంక్ ఖాతాకు చేరుకుంటుంది. ఎలాంటి కమీషన్లు, ఆలస్యాలు లేదా కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ బ్యాంక్ సందేశం ఇప్పుడు ఆమెకు గౌరవాన్ని, నమ్మకాన్ని, ఆర్థిక భద్రతను అందిస్తోంది. రెబెక్కా చెప్పినట్లుగా, "నేను కొన్నిసార్లు దాని గురించి మర్చిపోతాను, కానీ పెన్షన్ రావడం మాత్రం మర్చిపోదు."
ఆధార్ దేశవ్యాప్తంగా ఉన్న నివాసితుల కోసం బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ గుర్తింపు వేదికను ప్రవేశపెట్టింది. ఇది సమర్థవంతమైన సేవల లెక్కింపు కోసం ప్రత్యేక గుర్తింపును, సురక్షితమైన ధృవీకరణను సాధ్యం చేసింది. 2026 మే నాటికి 144 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. దీని వినియోగం రోజువారీ వ్యవస్థలలో లోతైన ఏకీకరణను ప్రతిబింబిస్తుంది. ఒక్క 2024-25 లోనే 2,707 కోట్లకు పైగా గుర్తింపు ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గుర్తింపు ఎక్కడైనా ఉపయోగపడేలా మారింది. ధ్రువీకరణ తక్షణమే జరుగుతోంది. సేవల లభ్యత మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మారింది.

85.5% భారతీయ గృహాలు కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండటంతో, మొబైల్ ఫోన్లు బ్యాంకులుగా, తరగతి గదులుగా, ప్రభుత్వ సేవలకు ప్రవేశ ద్వారాలుగా మారాయి. ముఖ్యంగా, వైర్‌లెస్ టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 2014 నవంబర్‌లో 93.7 కోట్లుగా ఉండగా, 2025 డిసెంబర్ చివరి నాటికి 125.87 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది (2014-15 లో సుమారు రూ. 0.18 లక్షల కోట్ల నుండి 2024-25 నాటికి సుమారు రూ. 5.5 లక్షల కోట్లకు చేరింది).
మధ్యతరగతి ప్రజలకు జామ్(జేఏఎం) త్రయం అంటే దళారీలు తగ్గడం, వేగవంతమైన సేవల లభ్యత, లీకేజీలు తగ్గడం, ఆర్థిక విషయాలపై పూర్తి నియంత్రణ సాధించడం. ఇది జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది, ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యానికి మద్దతు ఇస్తుంది.
డిజిలాకర్- 2015 లో ప్రారంభమైన డిజిలాకర్, పౌరుల డిజిటల్ పత్రాల వాలెట్‌కు ప్రామాణికమైన డిజిటల్ పత్రాల లభ్యతను అందించడం ద్వారా పౌరుల ‘డిజిటల్ సాధికారత’ ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మధ్యతరగతి ప్రజలు ముఖ్యమైన పత్రాలను డిజిటల్‌గా, ఎప్పుడైనా, ఎక్కడైనా నిల్వ చేయడానికి, పొందడానికి సహాయపడుతుంది. ఇది కాగితపు పనిని తగ్గిస్తుంది, భౌతిక పత్రాలను కోల్పోయే ప్రమాదాన్ని తొలగిస్తుంది, ప్రవేశాలు, బ్యాంకింగ్, ఉద్యోగ దరఖాస్తులు వంటి ప్రక్రియలను వేగవంతం చేస్తుంది. ఇది సౌకర్యాన్ని పెంచుతుంది, సమయాన్ని ఆదా చేస్తుంది, రోజువారీ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. 2015 లో 9.98 లక్షల మంది సైన్-అప్‌లు ఉండగా, ప్రస్తుతం (2026 జూన్ 2 నాటికి) మొత్తం 69.9 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. 950 కోట్లకు పైగా పత్రాలు జారీ అయ్యాయి (2026 మే నాటికి).
ఉమాంగ్ యాప్- 2017 లో ప్రారంభమైన ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్), భారతదేశంలో మొబైల్ పాలనను పెంపొందించడానికి రూపొందించబడింది. ఇది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థల నుండి సేవలను పొందడానికి ఒకే విండో మొబైల్, వెబ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. పౌరులు విస్తృత శ్రేణి సేవలను పొందడానికి ఉమాంగ్‌ను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్, క్లెయిమ్‌లు, పాన్-ఆధార్ సేవలు, డిజిలాకర్ లభ్యత, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, పెన్షన్ సేవలు, పాస్‌పోర్ట్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్ సేవలు, పరీక్షల ఫలితాలు మొదలైనవి ఉన్నాయి. ఉమాంగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్లు 2017 లో 0.24 కోట్ల నుండి స్థిరంగా పెరుగుతూ 11.39 కోట్లకు (2026 జూన్ 2 నాటికి) చేరుకున్నాయి.
మధ్యతరగతి సాధికారత: వృద్ధికి ఒక పునాది
గత పన్నెండేళ్లుగా ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీని విధానాలు, సంస్కరణలు మిలియన్ల కొద్దీ కుటుంబాల రోజువారీ సవాళ్లను సులభతరం చేశాయి. ఇవి ఆర్థిక భద్రత, గృహ వసతి, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను బలోపేతం చేశాయి. భారతదేశ వృద్ధి కథనంలో మధ్యతరగతి కీలక పాత్రను ఈ ప్రయత్నాలు ప్రతిబింబిస్తాయి. న్యాయబద్ధతను, లభ్యతను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం మధ్య ఆదాయ కుటుంబాలలో మరింత నమ్మకాన్ని పెంపొందించింది. ఈ నిరంతర విధానం జీవితాలను మెరుగుపరిచింది, భవిష్యత్తు పురోగతికి ఒక బలమైన పునాదిని సృష్టించింది.
References
Ministry of Finance
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2098352®=3&lang=2
www.indiabudget.gov.in/doc/budget_speech.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2212593®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2221439®=6&lang=1
Ministry of Jal Shakti
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
Ministry of Housing and Urban Affairs
sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2133_IaL9i8.pdf?source=pqals
Ministry of Power
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215187®=3&lang=2
Ministry of Housing and Urban Affairs
sansad.in/getFile/annex/270/AS325_mzQ0A3.pdf?source=pqars
https://pmay-urban.gov.in/
Ministry of Electronics & IT
https://www.myscheme.gov.in/schemes/pmbjp
Ministry of Chemicals & Fertilizers
https://janaushadhi.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2242928®=3&lang=1#:~:text=for%20GLP%20compliance
Ministry of Health and Family Welfare
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189415®=46&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2165607®=3&lang=2
https://eatrightindia.gov.in/streetfoodhub/home
https://aam.mohfw.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236917®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2124334®=3&lang=2
chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://ncvbdc.mohfw.gov.in/Doc/National-Strategic-Plan-Malaria-2023-27.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2087878®=3&lang=2
https://aam.mohfw.gov.in/
Ministry of Skill Development and Entrepreneurship
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222122®=3&lang=1
Ministry of Commerce & Industry
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2227597®=6&lang=1
Ministry of Science and Technology
https://dst.gov.in/anusandhan-national-research-foundation-anrf
Ministry of Education
https://sansad.in/getFile/annex/268/AU373_8QLBR4.pdf?source=pqars
Ministry of Ayush
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2221485®=3&lang=2
Ministry of Communications
https://www.trai.gov.in/sites/default/files/2024-09/PR-TSD-Nov-07_01_15.pdf
Ministry of Electronics & IT
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2224503®=3&lang=1
https://www.digilocker.gov.in/web/statistics
https://web.umang.gov.in/landing/dashboard
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2127411®=3&lang=2
Cabinet Committee on Economic Affairs (CCEA)
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1919985®=3&lang=2
World Bank
https://blogs.worldbank.org/en/opendata/understanding-country-income--world-bank-group-income-classifica
World Economic Forum
https://www.weforum.org/stories/2026/02/massive-urban-shift-in-india-consumer-growth-decentralizing/
Niti Aayog
https://niti.gov.in/sites/default/files/2025-08/Electric-Vehicles-WEB-LOW-Report.pdf
https://niti.gov.in/sites/default/files/2026-01/Trade_Watch_Quarterly_April_June_Q1_FY26.pdf
www.niti.gov.in/sites/default/files/2023-02/Health-Insurance-for-India%E2%80%99s-Missing-Middle_08-12-2021.pdf
https://niti.gov.in/sites/default/files/2026-05/School-Education-System-in-India.pdf
SBI
sbi.bank.in/documents/13958/14472/19012026_India+to+become+Upper+Middle+Income+country+soon_SBI+Research.pdf/a7c2377b-b58f-0bb6-21e0-af032519e73f?t=1768802982522
OECD
www.oecd.org/content/dam/oecd/en/publications/reports/2019/05/under-pressure-the-squeezed-middle-class_f3fa7167/689afed1-en.pdf
https://oecd-development-matters.org/2019/05/07/look-east-instead-of-west-for-the-future-global-middle-class/
National Library of Medicine
https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC12975087/
IBEF
https://www.ibef.org/government-schemes/skill-india
Twitter
https://x.com/PIB_India/status/1930216032368767432
YouTube
https://www.youtube.com/watch?v=gc7WZkS7ObM
https://www.youtube.com/watch?v=HplYaTTWY78
Others
https://ddnews.gov.in/en/indias-health-insurance-premiums-cross-%E2%82%B91-2-lakh-crore-sector-grows-at-9/
https://ddnews.gov.in/en/a-decade-of-change-healthcare-access-improves-for-millions-in-the-middle-class/
https://ddnews.gov.in/en/inflation-tamed-unified-pension-scheme-launched-middle-class-sees-tangible-benefits/
https://ddnews.gov.in/en/indias-ev-sales-cross-2-3-million-in-2025-market-share-rises-to-8/
https://www.kotak.bank.in/en/stories-in-focus/loans/home-loan/home-loan-interest-rate-history-india.html
https://www.asianstudies.org/publications/eaa/archives/the-middle-class-in-india-from-1947-to-the-present-and-beyond/
chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://docs.iza.org/dp15410.pdf
https://www.price360.in/expertview/the-rise-of-indias-middle-class-a-force-to-reckon-with/
PIB Archives
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157872&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155151&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=158466&NoteId=158466&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2254950®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239597®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157711&ModuleId=3®=5&lang=16
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155855&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256476®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=158056&NoteId=158056&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154950&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157296&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235812®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154635&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239597®=3&lang=1#:~:text=Launched%20in%202019%2C%20SWAMIH%20provides,benefiting%20over%202.38%20lakh%20people
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154588&ModuleId=3®=3&lang=2
PIB Research
Click here for pdf file
***
(Explainer ID: 158767)
आगंतुक पटल : 9
Provide suggestions / comments