Economy
వుమనియా: మహిళా పారిశ్రామికవేత్తల కోసం సమగ్ర మార్కెట్ సౌలభ్యం
Posted On:
10 APR 2026 10:58AM
కీలకాంశాలు
- వుమనియా కార్యక్రమం మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్‌హెచ్‌జీలు జీఈఎం వేదిక ద్వారా నేరుగా ప్రభుత్వ కొనుగోలుదారులకు తమ ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పిస్తుంది.
- హస్తకళలు, చేనేత, జూట్, కొబ్బరి పీచు, హోమ్ డెకర్, ఆఫీస్ ఫర్నిషింగ్ వంటి విభాగాలకు ఇది వర్తిస్తుంది.
- జీఈఎంలో 2.1 లక్షలకు పైగా మహిళా ఎంఎస్ఈలు నమోదయ్యాయి. ఇవి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 13.7 లక్షల ఆర్డర్లను సాధించాయి.
పరిచయం: వుమనియా - ప్రతి మహిళకు ద్వారాలు తెరుస్తోంది
జీఈఎం అంటే ఏమిటి?
గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్(జీఈఎం) అనేది వివిధ కేంద్ర/రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీలు, సహకార సంఘాల ద్వారా వస్తువులు, సేవల కొనుగోలును సులభతరం చేసే ఆన్‌లైన్ వేదిక. "కనీస ప్రభుత్వం, గరిష్ట పరిపాలన" అనే దార్శనికతతో 2016లో ప్రారంభించిన జీఈఎం.. కాగిత రహిత, నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ వేదిక. ఇది ప్రభుత్వ కొనుగోలుదారులు భారతదేశం అంతటా ఉన్న విక్రేతల నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో వస్తువులను, సేవలను సేకరించడానికి వీలు కల్పిస్తుంది.
మరింత సమాచారం కోసం సందర్శించండి: https://gem.gov.in/

భారతదేశంలో ప్రభుత్వ కొనుగోళ్లు ఒక ప్రధాన వ్యవస్థీకృత మార్కెట్‌గా ఉన్నాయి. జీఈఎం ద్వారా డిజిటల్ కొనుగోళ్ల విస్తరణతో ఈ వ్యవస్థ మరింత పారదర్శకంగా, ప్రామాణికంగా, విస్తృత సరఫరాదారులకు అందుబాటులోకి వచ్చింది. మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలు(ఎంఎస్ఈలు), స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2019లో జీఈఎంలో వుమనియా చొరవను ప్రవేశపెట్టింది. ఈ చొరవ ఒక నిర్దేశిత డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ను అందించడం, యాక్సెస్ అవసరాలను సరళీకరించడం, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్‌హెచ్‌జీలు ప్రభుత్వ కొనుగోలుదారులతో కనెక్ట్ కావడానికి నిర్మాణాత్మక మార్గాలను సృష్టించడం ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల చేరికను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
వుమనియా చొరవ: మహిళా పారిశ్రామికవేత్తల కోసం అంకితమైన వేదిక
వుమనియా అనేది జీఈఎంలో చేరికపై దృష్టి సారించిన ఒక చొరవ. ఇది అధికారిక ప్రభుత్వ మార్కెట్‌లకు మహిళల ప్రాప్తిని పరిమితం చేసిన అడ్డంకులను పరిష్కరించడంలో సహాయపడుతుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది మహిళా ఎంఎస్ఈలు, ఎస్‌హెచ్‌జీలు తమ ఉత్పత్తులైన చేనేత, జూట్, కొబ్బరి పీచు, హోమ్ డెకర్ వస్తువులు మొదలైనవాటిని నమోదు చేయడానికి, జాబితా రూపొందించిన ఒక అంకితమైన డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. వీటిని భారతదేశంలో ఎక్కడైనా ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు, పీఎస్‌యూలు నేరుగా కొనుగోలు చేయవచ్చు.
మీకు తెలుసా?
ఎస్‌హెచ్‌జీలు గ్రామీణ మహిళల సాధికారతను లక్ష్యంగా చేసుకున్న అట్టడుగు స్థాయి అనధికారిక సంస్థలు. ఎస్‌హెచ్‌జీలలో సాధారణంగా 10 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. వారు తమ వనరులను సమీకరించి, పొదుపు చేయడానికి కలిసి పని చేస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఆదాయాన్ని ఇచ్చే కార్యకలాపాలలో పాల్గొంటారు.
2026 ఫిబ్రవరి నాటికి 10.05 కోట్ల మంది మహిళలు 90.09 లక్షల ఎస్‌హెచ్‌జీలలో ఉన్నారు. ఇది ఆర్థిక సమ్మిళిత్వాన్ని, సామూహిక ఆర్థిక చర్యను విస్తరింపజేసింది.
ఈ చొరవ మార్కెట్ గుర్తింపును మెరుగుపరచడం, పారదర్శక కొనుగోలుదారు-విక్రేత పరస్పర సంప్రదింపులను ప్రారంభించడం, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తుంది. ఇది ప్రభుత్వ విస్తృత ప్రాధాన్యతలతో ఏకీభవిస్తుంది. కింది జాతీయ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది:
- సరఫరాదారుల వైవిధ్యాన్ని విస్తరించడం,
- మహిళల నేతృత్వంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడం,
- తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సమూహాలను వ్యవస్థీకృత కొనుగోలు మార్గాల్లోకి చేర్చడం.
స్వయత్ అంటే ఏమిటి?
స్వయత్(స్టార్టప్స్, వుమెన్ & యూత్ అడ్వాన్‌టేజ్ త్రూ ఈ-ట్రాన్సాక్షన్స్) అనేది ప్రభుత్వ కొనుగోళ్లలో సమగ్ర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 2019లో ప్రారంభించిన భారత ప్రభుత్వ కార్యక్రమం. ఈ చొరవ స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువత, సూక్ష్మ & చిన్న పరిశ్రమలు(ఎంఎస్ఈలు), స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ), వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ మార్కెట్‌ల సౌలభ్యం పొందేందుకు వీలు కల్పించడంపై దృష్టి పెడుతుంది. జీఈఎం వేదికలో ఈ సమూహాల కోసం ప్రవేశ అడ్డంకులను తొలగించడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం స్వయత్ లక్ష్యం.
వుమనియా అనేది స్వయత్(ఎస్‌డబ్ల్యూఏవైఏటీటీ) కార్యక్రమంలోని విస్తృత ఎజెండాకు అనుబంధంగా ఉంటుంది.
వుమనియా పరిధిలోని ఉత్పత్తి విభాగాలు
మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎస్‌హెచ్‌జీలు ఇప్పటికే బలమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఉత్పత్తి-విభాగాలను వుమనియా సమూహంగా మారుస్తుంది. ఈ విభాగాలు అధికారికంగా గుర్తించాయి. జీఈఎంలో క్యూరేటెడ్ స్టోర్‌ఫ్రంట్‌ల ద్వారా ప్రభుత్వ కొనుగోలుదారులకు శోధించదగినవిగా మారుతాయి. వీటిలో ఉన్నవి:
- వుమనియా హస్తకళలు
- వుమనియా కిరాణా, పాంట్రీ
- వుమనియా ఆఫీస్ యాక్సెసరీస్
- వుమనియా చేనేత వస్త్రాలు
- వుమనియా పర్సనల్ హైజీన్, కేర్

ఈ వస్తువులను ఒకే విభాగ చట్రంలో చేర్చడం ద్వారా ఉత్పత్తుల గుర్తింపును జీఈఎం మెరుగుపరుస్తుంది. మహిళల నేతృత్వంలోని ఉత్పత్తిదారుల నుంచి పెద్ద ఎత్తున సేకరించడాన్ని సులభతరం చేస్తుంది.
వుమనియా చొరవ ముఖ్య లక్షణాలు
ఈ చొరవ జీఈఎంలోని ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ ఫీచర్లను ఉపయోగించుకుని మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎస్‌హెచ్‌జీల కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇది పారదర్శకమైన, మద్దతునిచ్చే డిజిటల్ వ్యవస్థలో వారు ప్రభుత్వ మార్కెట్‌లను చేరుకోవడానికి, తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, వారి వ్యాపారాలను క్రమంగా విస్తరించడానికి వీలు కల్పిస్తుంది.

మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్‌హెచ్‌జీల డిజిటల్ ఆన్‌బోర్డింగ్
మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఉద్యమ్ ధ్రువీకరణ, అవసరమైన పత్రాలను ఉపయోగించి డిజిటల్ ప్రక్రియ ద్వారా చేరవచ్చు. మహిళా ఎంఎస్ఈల సమీకరణ, సామర్థ్యాన్ని పెంపొందించడం జీఈఎం ద్వారా నిర్వహించే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణా వర్క్‌షాప్‌ల ద్వారా మరింత బలోపేతం అవుతోంది.
ప్రామాణిక కేటలాగ్ లిస్టింగ్
నిర్వచించిన సాంకేతిక స్పెసిఫికేషన్లు, లక్షణాలతో ఏకరీతి కేటలాగ్ టెంప్లేట్‌లను ఉపయోగించి ఉత్పత్తులను జాబితాగా మార్చవచ్చు. ఇది విక్రేతల మధ్య పోలికను నిర్ధారిస్తుంది. కొనుగోలుదారుల మూల్యాంకనాన్ని సులభతరం చేస్తుంది.
పారదర్శక, పూర్తి డిజిటల్ కొనుగోలు ప్రక్రియలు
బిడ్డింగ్, ఆర్డర్ ప్లేస్‌మెంట్, అంగీకారం, ఇన్‌వాయిస్, చెల్లింపులు మొదలైన అన్ని కొనుగోలు కార్యకలాపాలు డిజిటల్‌గా అమలు అవుతాయి. ఇది మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మహిళల నేతృత్వంలోని సంస్థలు, ప్రభుత్వ కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందిస్తుంది.
కాలపరిమితితో కూడిన అంగీకారం, చెల్లింపు విధానాలు
డిజిటల్ వర్క్‌ఫ్లోలు సకాలంలో చెల్లింపులను నిర్ధారించడంలో సహాయపడతాయి. ఇది పరిమిత వర్కింగ్ క్యాపిటల్‌తో పనిచేసే సూక్ష్మ, చిన్న సరఫరాదారులకు కీలకమైన మద్దతు.
శిక్షణ, ప్రచార, సహకార సేవలు
స్వయత్, వుమనియా కేంద్రిత కార్యక్రమాల కింద జీఈఎం రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌బోర్డింగ్ వర్క్‌షాప్‌లు, ప్రాంతీయ భాషా శిక్షణ, కొనుగోలుదారు-విక్రేత సమావేశాల వంటి సామర్థ్య నిర్మాణ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
భాగస్వామ్యం నుంచి శ్రేయస్సు వరకు: వుమనియా ప్రభావం
"జీఈఎంలో వుమనియా" అమలు అనేది లింగ వివక్ష లేని సమగ్ర కొనుగోలు పోర్టల్ దిశగా ఒక అడుగు.
ప్రభుత్వ కొనుగోలుదారులు ఆర్డర్లు ఇస్తారు. వుమనియా-లిస్టెడ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను సృష్టిస్తారు. మహిళా ఉత్పత్తిదారులను కొనుగోలు చక్రాల్లో విలీనం చేస్తారు.
అట్టడుగు స్థాయిలో జిల్లా యంత్రాంగాలు, ఎంటర్‌ప్రైజ్ సపోర్ట్ సెంటర్లు, శిక్షణా సంస్థలు విక్రేతల సంసిద్ధతను పెంపొందించడానికి ఆన్‌బోర్డింగ్ డ్రైవ్‌లు, శిక్షణా కార్యక్రమాలు, ఉత్పత్తి కేటలాగ్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి.
వుమనియా చొరవ ప్రారంభించినప్పటి నుంచి గణనీయంగా విస్తరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో:
- 2.1 లక్షలకు పైగా మహిళా ఎంఎస్ఈలు జీఈఎంలో నమోదయ్యాయి. వీటి మొత్తం ఆర్డర్లు 13.7 లక్షలు.
- మహిళా ఎంఎస్ఈలకు రూ.28,000 కోట్లకు పైగా కాంట్రాక్ట్ విలువ లభించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 27.60% వృద్ధి.
- జీఈఎం మొత్తం ఆర్డర్లలో 5.6% మహిళలకు దక్కాయి. ఇది నిర్దేశించిన 3% కొనుగోలు లక్ష్యాన్ని గణనీయంగా అధిగమించింది.

ఈ చొరవ ఒక ప్రత్యేకమైన సమగ్ర ప్రయత్నం నుంచి దేశంలో మహిళల నేతృత్వంలోని సంస్థల కోసం అతిపెద్ద వ్యవస్థీకృత ప్రభుత్వ కొనుగోలు మార్గాలలో ఒకటిగా ఎదిగింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయి సమీకరణ, సామర్థ్య నిర్మాణం, సంస్థాగత డిమాండ్ అన్నీ కలిసి మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి మద్దతునిచ్చే ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.
ముగింపు: సమాజంలోని మెరుగైన సగానికి ప్రాతినిధ్యం వహించే విపణి
మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎస్‌హెచ్‌జీలకు భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ మార్కెట్‌లలో ఒకదానికి ప్రత్యక్ష మార్గాన్ని అందించడం ద్వారా జీఈఎంలోని వుమనియా చొరవ ఇప్పటికే ఉన్న ఉత్పత్తి బలాలను అధికారిక, స్థిరమైన వ్యాపార భాగస్వామ్యంగా మారుస్తుంది. ఎక్కువ మంది మహిళలు గుర్తింపు పొంది, సామర్థ్యాన్ని పెంపొందించుకుని, ప్రభుత్వ కొనుగోలుదారులతో అనుసంధానమవుతున్నందున వుమనియా కేవలం ఒక కొనుగోలు చొరవ మాత్రమే కాకుండా గొప్ప ఆర్థిక స్వాతంత్య్రం, విస్తృత ప్రాతినిధ్యానికి ఒక మార్గంగా మారుతుంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లు.. సమాజంలోని మెరుగైన సగం(మహిళల) సామర్థ్యాలను, ఆకాంక్షలను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది.
PIB Research
References
MINISTRY OF COMMERCE & INDUSTRY
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215001®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2192297®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2106076®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1559864®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2106076®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1891303®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1565237®=3&lang=2#:~:text=Ceremonial%20lamp%20being%20lit%20to,Marketplace%20the%20national%20procurement%20portal.
MINISTRY OF EXTERNAL AFFAIRS
https://indbiz.gov.in/govt-e-marketplace-launches-womaniya-initiative/
MINISTRY OF RURAL DEVELOPMENT
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1620881®=3&lang=2
https://nrlm.gov.in/outerReportAction.do?methodName=showIndex#gsc.tab=0
SANSAD: LOK SABHA
https://www.commerce.gov.in/wp-content/uploads/2020/03/MOC_636848992668198129_LS-04-02-2019.pdf
WORLD BANK
https://documents1.worldbank.org/curated/en/099060425063724348/pdf/P177653-7547fc12-cde0-46aa-b682-8fd13b237aa2.pdf
OTHERS
https://gem.gov.in/resources/pdf/womaniya-flyer.pdf
https://mkp.gem.gov.in/search?q=womaniya
https://gem.gov.in/aboutus
https://gem.gov.in/womaniya
https://mkp.gem.gov.in/exclusive-estore-unique-seller-groups-womaniya-womaniya-handicrafts/search#/?q=womaniya
https://mkp.gem.gov.in/exclusive-estore-unique-seller-groups-womaniya-womaniya-grocery-and-pantry/search#/?q=womaniya
https://mkp.gem.gov.in/exclusive-estore-unique-seller-groups-womaniya-womaniya-office-accessories/search#/?q=womaniya
https://mkp.gem.gov.in/exclusive-estore-unique-seller-groups-womaniya-womaniya-handloom-textiles/search#/?q=womaniya
https://mkp.gem.gov.in/exclusive-estore-unique-seller-groups-womaniya-womaniya-personal-hygiene-and-care/search#/?q=womaniya
https://www.newsonair.gov.in/gem-promotes-transparency-inclusiveness-in-public-procurement-records-%E2%82%B94-lakh-crore-transactions/
https://gem.gov.in/training/training_module
https://wep.gov.in/
https://mpsrlm.mp.gov.in/uploads/files/SVEP.pdf
https://www.serp.telangana.gov.in/AboutUs/Serp_About.jsp
https://employmentnews.gov.in/newemp/MoreContentNew.aspx?n=Editorial&k=90385#:~:text=Self%2DHelp%20Groups%20or%20SHGs,carrying%20out%20social%20welfare%20programmes.
PRESS INFORMATION BUREAU
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/mar/doc202532511101.pdf
https://www.pib.gov.in/factsheetdetails.aspx?id=148586®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2227484®=3&lang=1
Click here to see pdf
***
(Explainer ID: 158121)
आगंतुक पटल : 14
Provide suggestions / comments