Rural Prosperity
ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన(పీఎంబీజేపీ)
అందుబాటు ధరలో, అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణకు మరింత ఊతం
Posted On:
07 MAR 2026 1:42PM
కీలకాంశాలు
- 18,000కి పైగా జన్ఔషధి కేంద్రాలు నాణ్యమైన జెనరిక్ మందులను 50-80% తక్కువ ధరలకు అందిస్తున్నాయి.
- మార్చి 2027 నాటికి 25,000 కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాంచైజీ ఆధారిత నమూనా ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కూడా వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.2 లక్షల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుతాయి. ఇది సమ్మిళిత వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది.
- రూ.1కే లభించే జన్ఔషధి సువిధ శానిటరీ నాప్‌కిన్లు, సుగమ్ మొబైల్ యాప్ వంటి కార్యక్రమాలు రుతుక్రమ ఆరోగ్యాన్ని, సరసమైన ఆరోగ్య సంరక్షణకు డిజిటల్ ప్రాప్తిని మెరుగుపరుస్తాయి.
పరిచయం
ఇటీవలికాలంలో ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి, సరసమైన ధరలోకి తీసుకురావడానికి భారతదేశం స్థిరమైన విధానపరమైన చర్యలను చేపట్టింది. కుటుంబాల ఖర్చులలో మందుల వాటా గణనీయంగా ఉన్నందున, వాటిని సహేతుకమైన ధరలకు అందుబాటులో ఉంచడం ఆర్థిక రక్షణకు, సమానమైన ప్రాప్తికి కీలకం. బ్రాండెడ్(జెనరిక్) మందులు వాటి బ్రాండ్ లేని జెనరిక్ సమానమైన మందుల కంటే చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తారు. అయితే రెండింటి చికిత్సా విలువ ఒకటే. ఈ వ్యత్యాసాన్ని పరిష్కరించడానికి చికిత్స ఖర్చులను తగ్గించడానికి, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు అవసరమైన మందుల లభ్యతను రక్షించడానికి నిరంతర విధానపరమైన జోక్యం అవసరం.

ఈ దిశగా ఒక ముఖ్యమైన చొరవగా ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) ప్రారంభమైంది. ఈ పథకం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న జన్ఔషధి కేంద్రాల(జేఏకే) నెట్‌వర్క్ ద్వారా నాణ్యతతో కూడిన జెనరిక్ మందులను చాలా తక్కువ ధరలకు అందించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా జెనరిక్ ఔషధాల లభ్యతను, అందుబాటు ధరల్లో లభ్యమయ్యే పరిస్థితిని బలోపేతం చేస్తుంది.
జన్ఔషధి సప్తాహ్ 2026 సరసమైన, నాణ్యమైన జెనరిక్ మందులపై అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త విస్తరణ కార్యక్రమంగా ప్రారంభమైంది. ఇది మార్చి 7న 8వ జన్ఔషధి దివస్ వేడుకలతో ముగిసింది. ఈ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) ద్వారా 1 నుంచి 5 మార్చి 2026 వరకు దేశవ్యాప్తంగా 250 కంటే ఎక్కువ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు జరిగాయి.
“జన్ఔషధి సస్తీ భీ, భరోసేమంద్ భీ, సేహత్ కీ బాత్, బచత్ కే సాత్” (జనౌషధి చౌకైనది, నమ్మదగినది, పొదుపుతో కూడిన ఆరోగ్యం) అనే ఈ సంవత్సరం ఇతివృత్తానికి అనుగుణంగా జేఏకేలలో అందుబాటులో ఉన్న సరసమైన, నాణ్యమైన జెనరిక్ మందుల గురించి అవగాహన పెంచడానికి ఈ చొరవ రోగనిర్ధారణ సేవలను ప్రజల భాగస్వామ్య కార్యకలాపాలతో మిళితం చేస్తుంది.
పీఎంబీజేపీ కింద మందుల నాణ్యతకు భరోసా
పీఎంబీజేపీ కింద సరఫరా చేసే మందులు ప్రత్యేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ) నిబంధనలకు అనుగుణంగా ఉన్న తయారీదారుల నుంచి మాత్రమే సేకరిస్తారు. తద్వారా అంతర్జాతీయంగా గుర్తించిన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూస్తారు. ప్రతి బ్యాచ్‌కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్ఏబీఎల్) చేత గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో కఠినమైన పరీక్షలు జరుగుతాయి. మందులు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తర్వాతే జన్ఔషధి కేంద్రాలకు పంపిణీ అవుతాయి.
భారతదేశమంతటా సరసమైన మందుల విస్తరణ
ఈ పథకం కింద 18,000కు పైగా జన్ఔషధి కేంద్రాలు(జేఏకే) పనిచేస్తున్నాయి. పథకం ఉత్పత్తుల జాబితాలో 2,110 మందులు, 315 సర్జికల్ వస్తువులు, వైద్య వినియోగ వస్తువులు, పరికరాలు ఉన్నాయి. ఇవి యాంటీ-ఇన్ఫెక్టివ్స్, యాంటీ డయాబెటిక్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్, యాంటీ క్యాన్సర్ మందులు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ చికిత్సలతో సహా 29 రకాల విభాగాలలో విస్తరించి ఉన్నాయి. సగటున, ప్రతిరోజూ సుమారు 10 నుంచి 12 లక్షల మంది ఈ కేంద్రాలను సందర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలతో సహా సరసమైన ధరలకు నాణ్యమైన మందులను పొందుతున్నారు.

ముఖ్యంగా పీఎంబీజేపీ కింద అందుబాటులో ఉన్న మందుల గరిష్ట విక్రయ ధరలు(ఎంఆర్‌పీ) సాధారణంగా సమానమైన బ్రాండెడ్ మందుల కంటే 50-80% తక్కువగా ఉంటాయి. ఇది గ్రామీణ కుటుంబాల ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. జూన్ 2025 నాటికి రూ.7,700 కోట్ల మొత్తం ఎంఆర్‌పీ విలువ కలిగిన జన్ఔషధి మందుల విక్రయాలు జరిగాయి. దీనివల్ల పౌరులకు బ్రాండెడ్ ప్రత్యామ్నాయాలతో పోలిస్తే సుమారు రూ.38,000 కోట్ల ఆదా అయ్యింది.
ఫ్రాంచైజీ ఆధారిత జన్ఔషధి కేంద్రాల(జేఏకే) విస్తరణ
మార్చి 2027 నాటికి ఈ పథకం కింద 25,000 జేఏకేలను తెరవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఫ్రాంచైజీ ఆధారిత నమూనాను అవలంబించారు. వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, సంస్థలు, ప్రైవేట్ సంస్థల నుంచి పీఎంబీఐ అధికారిక పోర్టల్ www.janaushadhi.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ సమ్మిళిత చట్రం పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో, బ్లాకులు, తహసీల్‌లతో సహా జేఏకేల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది. తద్వారా అందరికీ నాణ్యమైన జెనరిక్ మందుల లభ్యతను నిర్ధారిస్తుంది.

పౌర-కేంద్రీకృత చొరవ: జన్ఔషధి సువిధ శానిటరీ నాప్‌కిన్

ఆరోగ్య సంరక్షణ పంపిణీలో ప్రాప్తి, స్థోమత, అవగాహనను మెరుగుపరచడానికి పీఎంబీజేపీ అనేక పౌర-కేంద్రీకృత కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. జన్ఔషధి సువిధ ఆక్సో-బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్‌కిన్లు అటువంటి ఒక ముఖ్యమైన చొరవ. భారతదేశంలోని మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి 2019లో ఇది ప్రారంభమైంది. ఒక ప్యాడ్‌కు కేవలం రూ.1 చొప్పున భారీ సబ్సిడీ ధరతో అందించే ఈ కార్యక్రమం సురక్షితమైన రుతుక్రమ పద్ధతులకు ఉన్న ఆర్థిక అడ్డంకులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నాప్‌కిన్లు ఆక్సో-బయోడిగ్రేడబుల్ సంకలితాన్ని కలిగి ఉంటాయి. ఇవి వినియోగించిన తర్వాత ఆక్సిజన్‌కు గురైనప్పుడు త్వరగా విచ్ఛిన్నం కావడానికి సహాయపడతాయి. తద్వారా పర్యావరణ బాధ్యతాయుతమైన వినియోగానికి మద్దతు ఇస్తాయి.
పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రాప్తి అనే సూత్రాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 31 జనవరి 2026 నాటికి 100 కోట్లకు పైగా సువిధ శానిటరీ ప్యాడ్‌లు ఈ పథకం కింద అమ్ముడయ్యాయి. వీటిలో, 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే 31 జనవరి 2026 వరకు 22.50 కోట్లకు పైగా ప్యాడ్‌లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 18,000 కంటే ఎక్కువ జేఏకేలు సువిధ నాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నాయి.
డిజిటల్ ఆధారిత చొరవ: జన్ఔషధి సుగమ్ మొబైల్ అప్లికేషన్
ప్రాప్తి, పారదర్శకత, వినియోగదారు సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి “జన్ఔషధి సుగమ్” మొబైల్ అప్లికేషన్ 2019లో ప్రారంభమైంది. ఈ అప్లికేషన్ పౌరులకు జెనరిక్ మందులు, సంబంధిత సేవల గురించి సమాచారాన్ని సులభతరంగా పొందేలా చేసే డిజిటల్ ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది.
ముఖ్య లక్షణాలు:
- గూగుల్ మ్యాప్స్ అనుసంధానం ద్వారా సమీపంలోని జేఏకేను గుర్తించడం.
- జెనరిక్ మందుల కోసం వెతకడం, వాటి అందుబాటు స్థితిని రియల్ టైమ్‌లో తెలుసుకోవడం.
- జన్ఔషధి జెనరిక్స్, బ్రాండెడ్ ప్రత్యామ్నాయాల మధ్య గరిష్ట విక్రయ ధరల(ఎంఆర్‌పీ) తులనాత్మక విశ్లేషణ సంభావ్య వ్యయ పొదుపును ప్రధానంగా మారుస్తుంది.
జన్ఔషధి సుగమ్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఉచితంగా లభిస్తుంది. సరసమైన ధరల్లో ఔషధాల లభ్యతను విస్తరించడం, దేశవ్యాప్తంగా నాణ్యమైన జెనెరిక్ మందుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా చేపట్టిన డిజిటల్ పరిపాలనా చర్యను ఈ అప్లికేషన్ ప్రతిబింబిస్తోంది.
వ్యూహాత్మక జేఏకే విస్తరణ ద్వారా చివరి మైలు వరకు ఆరోగ్య సంరక్షణను బలోపేతం
ఈ పథకం కేవలం జన్ఔషధి కేంద్రాల(జేఏకే) వ్యవస్థను విస్తరించడంపైనే కాకుండా, వాటి నిర్వహణ స్థిరత్వం, దీర్ఘకాలిక మనుగడను నిర్ధారించడంపై కూడా దృష్టి పెడుతుంది. ఈ విషయంలో జేఏకేల ప్రభావాన్ని పెంచడానికి అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకోవడమైంది:
- ఉత్పత్తుల విస్తరణ: దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధుల విస్తృత శ్రేణిని కవర్ చేయడానికి మందుల పరిధిని నిరంతరం పెంచుతున్నారు. అదనంగా, ప్రోటీన్ పౌడర్లు, మాల్ట్ ఆధారిత ఆహార పదార్ధాలు, గ్లూకోమీటర్ల వంటి న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టారు.
- ప్రజారోగ్య మౌలిక సదుపాయాలతో అనుసంధానం: ప్రభుత్వ ఆసుపత్రుల లోపల అద్దె లేని ప్రాంగణాలను అందించడం ద్వారా జేఏకేలను తెరవడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖలను ప్రోత్సహిస్తున్నారు.
- పనితీరు ఆధారిత నిల్వ నిబంధనలు: ప్రోత్సాహకాలకు అర్హత పొందడానికి కేంద్రాలు కనీసం 200 వేగంగా అమ్ముడయ్యే మందులను ఉంచాలనే నిబంధన ఉంది. ఇది ముఖ్యమైన ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేందుకు దోహదపడుతోంది.
- సహకార రంగ భాగస్వామ్యం: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) తమ గ్రామీణ వ్యవస్థను ఉపయోగించుకుని జన్ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ఇది మందుల ప్రాప్తి పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో సరసమైన మందుల కేంద్రాలుగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది పీఏసీఎస్‌లపై విశ్వాసాన్ని నెలకొల్పడంతో పాటు గ్రామీణ జనాభాతో వాటి బంధం ఈ కేంద్రాల విజయానికి దోహదపడతాయి.
రైల్వే స్టేషన్లలో జేఏకేలు
ఈ పథకం కింద 31 జనవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో మొత్తం 116 జేఏకేలు ఏర్పాటయ్యాయి. ఈ చొరవ వలస కార్మికులు, తక్కువ ఆదాయ ప్రయాణీకులతో సహా ప్రజలకు రైల్వే స్టేషన్ వద్ద నాణ్యమైన, సరసమైన మందుల లభ్యతను నిర్ధారించడం ద్వారా ప్రాప్తిని మెరుగుపరుస్తుంది. ఎక్కువ మంది ప్రయాణించే ప్రాంతాల్లో జేఏకేల ఏర్పాటు చివరి మైలు లభ్యతను పెంపొందించడంతో పాటు తక్కువ ధరలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచడాన్ని ప్రోత్సహిస్తుంది.
పీఎంబీజేకే అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడానికి సంస్థాగత, నియంత్రణ అవసరాలు
డీ.ఫార్మ లేదా బీ.ఫార్మ అర్హత కలిగిన వ్యక్తులు, అలాగే అర్హత కలిగిన ఫార్మసిస్ట్‌ను నియమించుకునే వ్యక్తులు/సంస్థలు జేఏకేలను స్థాపించడానికి అర్హులు. ఔట్‌లెట్ నెలకొల్పడానికి దరఖాస్తు చేసేందుకు ప్రధాన అర్హతలు:
- కనీస స్థలం: 120 చదరపు అడుగులు.
- ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్: సంబంధిత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మసిస్ట్ నమోదై ఉండాలి.
- కేటగిరీ వారీ పత్రాలు: దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులు ధ్రువీకరణ కోసం ఆధారంగా తగిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా సమ్మిళిత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం
పీఎంబీజేకే కింద కేంద్ర నిర్వాహకులకు ఆర్థిక, నిర్వహణ స్థిరత్వం కోసం నిర్మాణాత్మక ప్రోత్సాహక విధానం మద్దతు ఇస్తుంది. నిర్వాహకులు ప్రతి ఔషధం ఎంఆర్‌పీపై(పన్నులు మినహాయించి) 20% ట్రేడ్ మార్జిన్ పొందుతారు. వారు నిర్దేశిత పరిమితి వరకు పనితీరు ఆధారిత నెలవారీ ప్రోత్సాహకాలకు కూడా అర్హులు. అదనంగా, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎల్టీ పారిశ్రామికవేత్తలు, వెనుకబడిన ప్రాంతాలలో కేంద్రాలను ప్రారంభించే వారికి ఒకసారి ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహకం కూడా ఉంటుంది.

ప్రత్యేక ప్రోత్సాహకాలు
మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలతో పాటు నీతి ఆయోగ్ గుర్తించిన ఆకాంక్షిత జిల్లాల్లో(వెనుకబడిన జిల్లాలు) లేదా హిమాలయ, ద్వీప భూభాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లో జన్ఔషధి కేంద్రాన్ని ప్రారంభించే వారికి రూ. 2.00 లక్షల అదనపు ప్రోత్సాహకం అందుతుంది:
- ఫర్నిచర్, ఫిక్చర్‌ల రీయింబర్స్‌మెంట్ కోసం 1.50 లక్షలు.
- కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటర్, స్కానర్ మొదలైన వాటి కోసం 0.50 లక్షలు.
ఇది కొత్త పీఎంబీజేకే ప్రారంభానికి ఒకసారి ఇచ్చే గ్రాంట్. ఇది అసలు బిల్లుల సమర్పణకు లోబడి ఉంటుంది.
సాధారణ ప్రోత్సాహకం
ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ)తో అనుసంధానమైన పారిశ్రామికవేత్తలు, ఫార్మసిస్టులు, ఎన్‌జీఓలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పీఎంబీజేకేలు రూ.5.00 లక్షల వరకు ప్రోత్సాహకాలకు అర్హులు. నెలవారీ కొనుగోళ్లపై 20% చొప్పున, నెలకు గరిష్టంగా రూ.20,000కు లోబడి, మొత్తం రూ.5 లక్షల పరిమితి ముగిసే వరకు ఈ ప్రోత్సాహకం అందుతుంది.
సరఫరా గొలుసు బలోపేతం, లాజిస్టిక్స్ నిర్వహణ
సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, జేఏకేలలో మందుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) అనేక చర్యలు చేపట్టింది:
- సమర్థవంతమైన పంపిణీ కోసం దేశవ్యాప్తంగా ఐదు కేంద్ర గిడ్డంగులు, 41 డిస్ట్రిబ్యూటర్లతో కూడిన ఐటీ ఆధారిత సరఫరా గొలుసు నిర్వహణ వ్యవస్థ పనిచేస్తోంది. ఇది రవాణా సామర్థ్యాన్ని, సమయానికి ఔషధాలు సరఫరా అయ్యేందుకు దోహదపడుతోంది.
- సెప్టెంబర్ 2024 నుంచి జేఏకేలలో 200 అత్యధిక డిమాండ్ ఉన్న మందుల నిల్వను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో ఎక్కువగా అమ్ముడయ్యే 100 ఔషధాలతో పాటు విస్తృత మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే 100 ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఉంటాయి.
పీఎంబీఐ నిరంతరం 400 వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. సరఫరా స్థిరత్వాన్ని నిర్వహించడానికి క్రమబద్ధమైన డిమాండ్ అంచనాను నిర్వహిస్తుంది. ఈ అంచనా యంత్రాంగాన్ని పూర్తిగా డిజిలీకరణ చేయడం ద్వారా సేకరణ ప్రణాళిక బలోపేతం అవడంతో పాటు ఆటోమేషన్ పెరిగి నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగయ్యింది.
ముగింపు
ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) గణనీయంగా తక్కువ ధరలకు నాణ్యమైన జెనరిక్ మందుల లభ్యతను నిర్ధారించడం ద్వారా భారతదేశంలో సరసమైన, సమానమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో కీలకమైన స్తంభంగా మారింది. నిరంతరం విస్తరిస్తున్న కేంద్రాల నెట్‌వర్క్, కఠినమైన నాణ్యత భరోసా, పారదర్శకతను పెంచే డిజిటల్ సాధనాల ద్వారా, ఈ పథకం దేశవ్యాప్తంగా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడింది.
సమ్మిళిత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, సరసమైన శానిటరీ ఉత్పత్తులు వంటి పౌర-కేంద్రీకృత కార్యక్రమాల ద్వారా పీఎంబీజేపీ కేవలం ఖర్చు తగ్గించడమే కాకుండా విశ్వసనీయత, సాధికారతను పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమం మరింత విస్తరిస్తున్న కొద్దీ, అందరికీ నమ్మదగిన, సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.
References
Ministry of Chemicals and Fertilizers
https://pharma-dept.gov.in/sites/default/files/Website%20updation%202022%20PMBJP-1.pdf
https://janaushadhi.gov.in/pmbjb-scheme
https://janaushadhi.gov.in:10443/jasprodobt/Reports/2a61804b7f5e77bf.pdf
https://janaushadhi.gov.in/pdf/Guidelines_for_PMBJK_Opening.pdf
https://pharma-dept.gov.in/sites/default/files/Final%20English%202024-25%20AR%20%281%29.pdf
https://docs.google.com/document/d/1TZPY6zew0R-AeqKLHDrWQV1ZIchhj9VN/edit
https://pharma-dept.gov.in/schemes/pradhan-mantri-bhartiya-janaushadhi-pariyojana-pmbjp
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222524®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2067441
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=153880&ModuleId=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2151306®=3&lang=2
Ministry of Cooperation
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2115196®=3&lang=2
Lok Sabha
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU4695_9qRCcY.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU718_3HBGam.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU1135_zwHF0O.pdf?source=pqals
https://sansad.in/getFile/annex/268/AU176_9hqb7T.pdf?source=pqars
https://sansad.in/getFile/annex/268/AU176_9hqb7T.pdf?source=pqars
https://sansad.in/getFile/annex/268/AU982_1cjye3.pdf?source=pqars
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU3399_rd2kkX.pdf?source=pqals https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU1014_Bneo3x.pdf?source=pqals
https://sansad.in/getFile/annex/270/AU418_OipWQZ.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2234273®=20&lang=1
PIB
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/jan/doc202516481901.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2108862®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/dec/doc2021123031.pdf
https://www.pib.gov.in/FeaturesDeatils.aspx?NoteId=157637&ModuleId=2®=3&lang=1
Click here to see PDF
***
(Explainer ID: 157742)
आगंतुक पटल : 86
Provide suggestions / comments