• Sitemap
  • Advance Search
Social Welfare

మహిళల ఆర్థిక పురోభివృద్ధికి కీలక చర్యలు

Posted On: 06 MAR 2026 11:26AM

మహిళల ఆర్థిక సాధికారత దిశగా భారతదేశ ప్రయాణం
మహిళలను సాధికారత వైపు నడిపించడం వల్ల దృఢమైన కుటుంబాలు, వర్ధిల్లే సమాజాలు, సంపన్నమైన దేశం నిర్మితమవుతాయి. దీనిని గుర్తించిన భారతదేశం.. గత 10 ఏళ్లలో మహిళల ఆర్థిక స్వతంత్రత కోసం అద్భుతమైన మార్పులను చేపట్టింది. మహిళా-కేంద్రీకృత దృక్పథంతో నడుస్తూ, నైపుణ్యాలు, రుణాలు, మార్కెట్లు, జీవనోపాధి అవకాశాలను విస్తరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన మహిళలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాకారం చేయడమే లక్ష్యం, ఇక్కడ ప్రతి మహిళా ప్రగతికి సమాన రూపశిల్పిగా నిలుస్తుంది.

ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు, భారత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ), లక్షిత రుణాలు, డ్రోన్ సాంకేతికత, వ్యవస్థాపక వేదికల వంటి సమగ్ర పథకాల ద్వారా పని చేస్తోంది. ఆర్థిక స‌మ్మిళితం, సహకార వ్య‌వ‌స్థ‌ల‌ల కోసం డిజిటల్ సాధనాల్లో కూడా పెట్టుబడి పెట్టింది. ఈ పురోగతులు మహిళల ఆర్థిక నాయకత్వానికి భారతదేశాన్ని ప్రపంచ నమూనాగా నిలుపుతున్నాయి.
"నారీ శక్తి" - మహిళా శక్తి - ఈ ప్రయాణంలో మార్గదర్శక శక్తిగా ఉంది. ఏ మహిళా వెనుకబడకుండా కలుపుకొని పోయే వృద్ధిని ఇది నిర్ధారిస్తుంది.

బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించడం
బాలికలకు ఆర్థిక భద్రత కల్పించడం అంటే వారి విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలలో సరైన పెట్టుబడి పెట్టడం, తద్వారా వారు స్వతంత్ర, గౌరవప్రదమైన జీవితాలను నిర్మించుకోగలరు. ఇది కేవలం వారి వ్యక్తిగత భవిష్యత్తునే కాకుండా కుటుంబాలు, సమాజాలు, మొత్తం దేశాన్ని బలోపేతం చేస్తుంది.
సుకున్య సమృద్ధి యోజన సరిగ్గా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తుంది: అధిక రాబడి, పన్ను ప్రయోజనాలు, తమ కుమార్తె ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టే ప్రతి కుటుంబానికి అచంచలమైన మద్దతును అందిస్తుంది.

సుకున్య సమృద్ధి యోజన
బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 22 జనవరి 2015న ప్రారంభించిన సుకున్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై).. ఆడపిల్లకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఇది ప్రభుత్వ పొదుపు పథకం. ఇది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ ఆడపిల్లల భవిష్యత్తు అవసరాల కోసం, ప్రధానంగా విద్య, వివాహం కోసం డబ్బు ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం అధిక వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, భద్రతను అందిస్తుంది, తద్వారా కుటుంబాలు ముందుగానే పెట్టుబడి పెట్టేలా, ఆడ‌పిల్ల వృద్ధికి, స్వ‌తంత్ర‌త‌కు స‌హాయంగా నిలిచేలా ప్రోత్సహిస్తుంది.

 



ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలు:
- ఏడాదికి 8.2% వడ్డీ రేటు(వార్షికంగా చక్రవడ్డీ రూపంలో).
- డిపాజిట్లు రూ.250(కనీసం) నుంచి ప్రారంభమై, ఏడాదికి రూ.1.5 లక్షల వరకు(రూ.50 గుణిజాల్లో) చేయవచ్చు.
- 15 ఏళ్ల పాటు డిపాజిట్లకు అనుమతి; ఖాతా ప్రారంభించిన 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది.
- సెక్షన్ 80సీ కింద వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు.
- 18 ఏళ్ల వయస్సు తర్వాత(లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత) ఉన్నత విద్య లేదా వివాహం కోసం పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌(50% వరకు) అనుమతి.

పథకం ప్రారంభమైనప్పటి నుంచి డిసెంబర్ 2025 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.3.33 లక్షల కోట్లు దాటాయి.

సాంకేతికతతో గ్రామీణ జీవనోపాధిలో విప్లవం
గ్రామీణ భారతదేశం అద్భుతమైన పరివర్తనకు సాక్ష్యమిస్తోంది. ఇక్కడ సామాజిక బలం, నైపుణ్యాల పెంపు, వనరుల లభ్యత లక్షలాది కుటుంబాలకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. దూరదృష్టితో కూడిన, సాంకేతిక ఆధారిత, ప్రజా-కేంద్రీకృత కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వం గ్రామీణ గృహాలను - ముఖ్యంగా మహిళలను ఆత్మవిశ్వాసం గల వ్యవస్థాపకులుగా, నైపుణ్యం కలిగిన ఉత్పత్తిదారులుగా, ఆర్థిక వృద్ధికి చురుకైన తోడ్పాటుదారులుగా మారుస్తోంది.

 



దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం)
ఇది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ పథకం గ్రామీణ మహిళలను స్వయం సహాయక బృందాలుగా(ఎస్‌హెచ్‌జీ) ఏకం చేసి, పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ బృందాల ద్వారా మహిళలు నైపుణ్య శిక్షణ, సరసమైన రుణాలు, చిన్న పరిశ్రమలను ప్రారంభించడానికి లేదా వారి ప్రస్తుత జీవనోపాధిని పెంచుకోవడానికి మద్దతు పొందుతారు.

కాలక్రమేణా ఈ మద్దతు వారి ఆదాయాన్ని పెంచడానికి, పిల్లలను బడికి పంపడానికి, భద్రమైన జీవితాలను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా మ‌హిళ‌లు ఆర్థిక స‌మ్మిళిత్వం, నైపుణ్య శిక్ష‌ణ ద్వారా సుస్థిర జీవ‌నోపాది పొందేందుకు ఇది సాయ‌ప‌డుతుంది. ఆర్థిక స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా విశ్వాసంగా న‌డిచేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

 



ఈ ప‌థ‌కం ముఖ్య లక్షణాలు కొన్ని:
- ఈ పథకం 'బ్యాంక్ సఖీలు' అని పిలిచే శిక్షణ పొందిన మహిళలను బ్యాంకు శాఖలలో నియమిస్తారు. వీరు స్వయం సహాయక బృందాలకు పొదుపు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ లావాదేవీలు, రుణాలు, ఇతర బ్యాంకింగ్ సౌకర్యాల వంటి ఆర్థిక సేవలతో సహాయం చేస్తారు.
- కృషి సఖీ(పంటల కోసం), పశు సఖీ(ప‌శువుల కోసం) వంటి శిక్షణ పొందిన సహాయకులు ఏడాది పొడవునా సలహాలు, మద్దతు ఇవ్వడానికి నియమితుల‌య్యారు.
- ఆరోగ్యం, పోషణ, విద్య, గృహ హింసను అంతం చేయడం, పారిశుధ్యం వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ఈ మిషన్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ప్రధాన విజయాలు:
- ఈ పథకం 10.05 కోట్లకు పైగా గ్రామీణ మహిళా గృహాలను 90.90 లక్షల కంటే ఎక్కువ స్వయం సహాయక బృందాలుగా(ఎస్‌హెచ్‌జీ) విజయవంతంగా సమీకరించింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మహిళా నేతృత్వంలోని సామాజిక సంస్థల వ్య‌వ‌స్థ‌లలో ఒకటిగా నిలిచింది.
- రుణాల తిరిగి చెల్లింపు రేటు 98% పైగా ఉంది. ఇది ఈ సమూహాలు డబ్బును ఎంత బాగా నిర్వహిస్తున్నాయో చూపిస్తుంది.
- డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం మెరుగైన వ్యవసాయ పద్ధతులతో మహిళా రైతులను(మహిళా కిసాన్లు) ప్రోత్సహిస్తుంది – అక్టోబర్ 2025 నాటికి 4.6 కోట్లకు పైగా మహిళలు దీని ద్వారా ప్రయోజనం పొందారు.
- స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌వీఈపీ) వంటి కార్య‌క్ర‌మాల ద్వారా చాలామంది మహిళలు హస్తకళలు, ఆహార ప్రాసెసింగ్, ఇతర రంగాలలో చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 5.88 లక్షల యూనిట్లకు మద్దతు లభించింది.

నమో డ్రోన్ దీదీ యోజన
నమో డ్రోన్ దీదీ పథకం ఒక పరివర్తనాత్మక కేంద్ర రంగ కార్యక్రమం. ఇది ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక బృందాలకు(ఎస్‌హెచ్‌జీ) వ్యవసాయంలో డ్రోన్ సేవలను అందించడానికి శిక్షణ ఇస్తుంది. ప్రధానంగా ద్రవ ఎరువులు, పురుగుమందుల పిచికారీ కోసం ఈ డ్రోన్లను అద్దెకు ఇవ్వడం ద్వారా వ్యవసాయంలో అధునాతన సాంకేతికతను ప్రవేశపెట్టడమే కాకుండా మహిళలకు స్థిరమైన ఆదాయ అవకాశాలను సృష్టిస్తుంది.

A person smiling at cameraAI-generated content may be incorrect.



ముఖ్య ప్రయోజనాలు:
- వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా, క‌చ్చితంగా చేయడానికి ఆధునిక డ్రోన్ సాంకేతికతను ప్రవేశపెట్టడం;
- పంట దిగుబడిని పెంచడం, రైతులకు పెట్టుబడి ఖర్చులు, నిర్వహణ ఖర్చులను తగ్గించడం;
- డ్రోన్ అద్దె సేవల ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు గణనీయమైన అదనపు ఆదాయాన్ని సృష్టించడం, ఆర్థిక స్వతంత్రతను, విభిన్న జీవనోపాధిని పెంపొందించడం.

ఎంపిక చేసిన ఎస్‌హెచ్‌జీలు డ్రోన్ ప్యాకేజీ కోసం 80% కేంద్ర ఆర్థిక సహాయాన్ని(గరిష్టంగా రూ.8 లక్షల వరకు) పొందుతాయి. ఈ ప్యాకేజీలో శిక్షణ కూడా ఉంటుంది: ఒక సభ్యురాలు సర్టిఫైడ్ డ్రోన్ పైలట్‌గా మారడానికి 15 రోజుల శిక్షణ, మరొకరు డ్రోన్ అసిస్టెంట్‌గా(రిపేర్లు, నిర్వహణపై దృష్టి సారించి) 5 రోజుల శిక్షణ పొందుతారు.
గ్రామీణ మహిళల చేతికి డ్రోన్లను అందించడం ద్వారా ఈ పథకం వ్యవసాయంలో సాంకేతికతను వేగవంతం చేయడమే కాకుండా కొత్త ఆర్థిక మార్గాలను తెరుస్తుంది. ఇది పనిని వేగవంతం చేస్తుంది. మహిళలకు, వారి సమాజాలకు మెరుగైన అవకాశాలను సృష్టిస్తుంది.

 

 


మహిళలను విజయవంతమైన వ్యవస్థాపకులుగా మార్చడం
మహిళలు వ్యవస్థాపకులుగా ఎదిగినప్పుడు, మొత్తం కుటుంబం స్థిరత్వాన్ని మరియు అవకాశాలను పొందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది.

లఖ్‌పతీ దీదీ పథకం
లఖ్‌పతీ దీదీ అనేది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) ప్రధాన ఫలితం. ఇది గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తుంది.

మహిళల నేతృత్వంలోని గ్రామీణ శ్రేయస్సు అనే విజన్‌తో రూపుదిద్దుకున్న లఖ్‌పతీ దీదీ అంటే.. స్థిరమైన జీవనోపాధి కార్యకలాపాలు, మెరుగైన నైపుణ్యాల ద్వారా ఏడాదికి రూ.1 లక్షకు పైగా ఆదాయం సంపాదించే స్వయం సహాయక బృంద సభ్యురాలు.

దీని లక్ష్యం కేవలం ఆదాయ సృష్టి మాత్రమే కాదు, వ్యవస్థాపకతను పెంపొందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, మహిళలను గ్రామీణ ఆర్థిక మార్పులకు చోదక శక్తులుగా నిలబెట్టడం.

6 కోట్ల మంది లఖ్‌పతీ దీదీలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని వేగవంతం చేసేందుకు, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2026 జనవరిలో జాతీయ వ్యవస్థాపక ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 50,000 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా 50 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సాంకేతికంగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఎల్ఓకేఓఎస్‌ యాప్, డిజిటల్ ఆజీవిక రిజిస్టర్, రికార్డులను డిజిటలైజ్ చేస్తాయి. లఖ్‌పతీ దీదీల ఆదాయ డేటాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి.

షీ-మార్ట్
కేంద్ర బడ్జెట్ 2026-2027లో షీ-మార్ట్‌ ద్వారా స్వయం సహాయక వ్యవస్థాపకుల కోసం నిబంధనలు ప్రవేశపెట్టారు. ఈ కొత్త కార్య‌క్ర‌మం ప్రతి జిల్లాలో కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తుంది. ఇవి స్వయం సహాయక బృందాల మహిళలు, గ్రామీణ ప్రాంతాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి అంకితమైన వేదిక‌లుగా పనిచేస్తాయి. తద్వారా కొత్త మార్కెట్ అవకాశాలను తెరుస్తాయి.

 


ఈ కార్య‌క్ర‌మంతో పశుసంవర్ధకం, వ్యవసాయం, అనుబంధ వృత్తులలో నిమగ్నమైన మహిళలు కేవలం జీవనాధార కార్యకలాపాల నుంచి పూర్తి స్థాయి వ్యవస్థాపకులుగా మారుతారు - ఇది ఈ పథకం ప్రధాన లక్ష్యం.

ఉమెనియా కార్య‌క్ర‌మం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్(జీఈఎం) ప్రధాన కార్యక్రమం 'ఉమెనియా'. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌లో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలు(ఎంఎస్ఈ), స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ) భాగస్వామ్యాన్ని పెంచడానికి 14 జనవరి 2019న ప్రారంభ‌మైంది.

దీనికి మద్దతుగా జీఈఎం కీలకమైన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది:
- ప్రభుత్వ మార్కెట్‌లను యాక్సెస్ చేయడంలో మహిళా నేతృత్వంలోని ఎంఎస్ఈ, వ్యవస్థాపకులకు శిక్షణ ఇవ్వడానికి సెల్ఫ్-ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్(సేవా) భారత్‌తో(జనవరి 2023లో సంతకం జ‌రిగింది).
- మహిళా కుట్టుపని చేసేవారిని జీఈఎంలో సేవా ప్రదాతలుగా తీర్చిదిద్దడానికి ఉషా సిలై స్కూల్‌తో(2023) ఒప్పందం.
- మ‌హిళా అనుకూల‌ సేకరణను ముందుకు తీసుకెళ్లడానికి, మహిళా వ్యవస్థాపకుల కోసం స్థానిక మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేయడానికి యూఎన్ వుమెన్‌తో(నవంబర్ 2025లో సంతకం జ‌రిగింది).

ఇటీవల 14–15 జనవరి 2026న ప్రభుత్వ వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడానికి జీఈఎం, ఉమెన్స్ కలెక్టివ్ ఫోరమ్(డ‌బ్ల్యూసీఎఫ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సహకారాలు ఉమెనియాను ఒక బలమైన వ్యవస్థగా మార్చడంలో సహాయపడ్డాయి. దీనిలో రెండు లక్షల కంటే ఎక్కువ మహిళా నేతృత్వంలోని ఎంఎస్ఈలు నమోదయ్యాయి. జనవరి 2026 నాటికి రూ.80,000 కోట్లకు పైగా విలువైన ఆర్డర్‌లను పొందాయి - ఇది నిర్దేశించిన 3% లక్ష్యాన్ని అధిగమించి 4.7 శాతానికి చేరుకుంది.

ప్రభుత్వ కొనుగోలుదారులతో నేరుగా, పార‌ద‌ర్శ‌క‌మైన‌, పూర్తి డిజిటల్ ఇంటర్‌ఫేస్ అందించడం ద్వారా ఉమెనియా కార్య‌క్ర‌మం మధ్యవర్తులను తొలగిస్తుంది. చాలాక‌లంగా ఉన్న ప్రవేశ  అడ్డంకుల‌ను త‌గ్గిస్తుంది. ఇది మహిళా వ్యవస్థాపకులను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌లు, విభాగాలు, ప్ర‌జారంగ సంస్థ‌లు, స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ‌ల‌కు అనుసంధానం చేయ‌డం ద్వారా వారు ఎదుర్కొంటున్న "మార్కెట్ యాక్సెస్," "ఫైనాన్స్ యాక్సెస్," "వాల్యూ-అడిషన్ యాక్సెస్" అనే మూడు సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేస్తుంది.

ఆర్థిక స్వతంత్రత కోసం ఇతర కీలక చర్యలు
మహిళలు ఎప్పటి నుంచో కుటుంబాలలో, సమాజాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు, ప్రభుత్వ పథకాలు వారి నైపుణ్యాలను, శ్రమను బలమైన ఆర్థిక అవకాశాలుగా మార్చడంలో సహాయపడుతున్నాయి.

శిక్షణ, ఫైనాన్స్, మార్కెట్‌లకు మెరుగైన ప్రాప్తి ద్వారా ఈ కార్యక్రమాలు లక్షలాది మందికి ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్ధిని సాధించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.

ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై)
ఏప్రిల్ 8, 2015న ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై) సూక్ష్మ సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తుంది. ఇది వ్యవస్థాపకులు పూచీకత్తు భారం లేకుండా వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి సహాయపడుతుంది. గతంలో రూ.10 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని ఇప్పుడు మునుపటి రుణాలను విజయవంతంగా తిరిగి చెల్లించిన వారి కోసం "తరుణ్ ప్లస్" విభాగం కింద రూ.20 లక్షలకు పెంచారు.

 



ముద్రా(మైక్రో యూనిట్స్ డెవెల‌ప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్‌) అనేది 2015-16 కేంద్ర బ‌డ్జెట్‌లో భారత ప్రభుత్వ ఆర్థిక సంస్థ. ఇది బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌(ఎన్‌బీఎఫ్‌సీలు), మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా చిన్న/సూక్ష్మ సంస్థలకు నిధులను అందిస్తుంది.

 



పీఎంఎంవై మహిళా సాధికారతకు బలమైన ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలో మెజారిటీ రుణ ఖాతాలు మహిళా వ్యవస్థాపకులవే. ఈ దృష్టి లక్షలాది మంది మహిళలు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా వృద్ధి చేయడానికి, ఆర్థిక చేరికను, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి వీలు కల్పించింది.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
ఆగస్టు 28, 2014న కేంద్ర ప్ర‌భుత్వం నేష‌న‌ల్ మిష‌న్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కార్య‌క్ర‌మంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన(పీఎంజేడీవై) దేశంలోని బ్యాంకింగ్ సేవలు లేని జనాభాకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రాథమిక పొదుపు ఖాతాలు, బీమా, పెన్షన్ల వంటి ఆర్థిక సేవలకు అందరికీ ప్రాప్తిని కల్పిస్తుంది.

 


పీఎంజేడీవై మహిళలకు విశేషంగా ప్రయోజనం చేకూర్చింది. గతంలో, మహిళలకు బ్యాంకింగ్‌లో పరిమిత ప్రవేశం ఉండేది. కానీ ఇప్పుడు పీఎంజేడీవై మిలియన్ల మంది మహిళలకు వారి స్వంత బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా పొందడానికి, ఆర్థిక నియంత్రణకు వీలు కల్పిస్తుంది.

పీఎంజేడీవైలోని కొన్ని ముఖ్య లక్షణాలు:
- డిపాజిట్లపై వడ్డీతో కూడిన జీరో-బ్యాలెన్స్ ఖాతాలు.
- రూపే డెబిట్ కార్డ్ జారీ, రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ.
- అర్హులైన ఖాతాదారులకు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం.
- డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్‌(డీబీటీ), ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్‌జ్యోతి బీమా యోజ‌న‌(పీఎంజేజేబీవై), ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న‌(పీఎంఎస్‌బీవై), అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌(ఏపీవై), మైక్రో యూనిట్స్ డెవెల‌ప్‌మెంట్ & రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్‌(ముద్రా) పథకాలతో అనుసంధానం.

ఏదైనా బ్యాంకు బ్రాంచ్‌లో బిజినెస్ క‌ర‌స్పాండెంట్ల ద్వారా బ్యాంకు ఖాతా తెరిచే స‌దుపాయం క‌ల్పించ‌డం ద్వారా బ్యాంకింగ్ సంబంధాలు లేకుండానే బ్యాంకింగ్ సేవ‌లు పొందే వీలు క‌లిగింది.

ప్రధానమంత్రి స్వనిధి పథకం
జూన్ 2020లో కేంద్ర గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ‌నిర్భ‌ర్ నిధి(పీఎం స్వ‌నిధి) పథకం కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రభావితమైన వీధి వ్యాపారులకు, ముఖ్యంగా మహిళలకు పూచీకత్తు లేని పని మూలధన రుణాలను అందిస్తుంది.
- ఇది ప్రారంభంలో రూ.15,000 వరకు రుణాలు అందిస్తుంది. ఆ తర్వాత రూ.25,000, రూ.50,000 వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించే వారికి 7 శాతం వడ్డీ సబ్సిడీ, డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు లభిస్తాయి.
- ఇటీవ‌ల ఈ ప‌థ‌కాన్ని 2030 మార్చి వ‌ర‌కు పొడిగిస్తూ రూ.7,332 కోట్ల బ‌డ్జెట్‌తో పున‌ర్మించారు. 50 ల‌క్ష‌ల మంది కొత్త వారు స‌హా 1.15 కోట్ల మంది వీధి వ్యాపారుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యం.
- డిసెంబర్ 2025 నాటికి 1.46 కోట్లకు పైగా రుణాలు మంజూరు అయ్యాయి. ఇది పట్టణ వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసింది.

 



స్టాండ్-అప్ ఇండియా పథకం
స్టాండ్-అప్ ఇండియా పథకం భారతదేశం అంతటా వ్యవస్థాపకతకు కొత్త ఒరవడిని సృష్టించింది. ఇది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు(ఎస్టీ) చెందిన వ్యక్తులు తమ సాహసోపేతమైన ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ చొరవ ద్వారా తయారీ, సేవలు, వాణిజ్యం లేదా వ్యవసాయ అనుబంధ రంగాలలో కొత్త సంస్థలను స్థాపించడానికి బ్యాంకు రుణాలను పొందడం సులభతరం చేసింది. ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడం, రుణ సదుపాయాలకు మార్గాలను సుగమం చేయడం ద్వారా స్టాండ్-అప్ ఇండియా కేవలం స్టార్టప్‌లకు నిధులు ఇవ్వడమే కాకుండా క‌లలకు ఊపిరి పోస్తూ, ఉపాధిని సృష్టిస్తూ, ఆర్థిక స్వతంత్రతను పెంపొందిస్తూ, అట్టడుగు స్థాయి నుంచి సమగ్ర వృద్ధిని నడిపిస్తోంది. దీనిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:
- మ‌హిళలు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలను పొందవచ్చు. వీటిని తిరిగి చెల్లించడానికి 7 ఏళ్ల వరకు సమయం (మొరటోరియం కాలంతో సహా) ఉంటుంది, దీనివల్ల స్వతంత్రంగా వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం సులభం అవుతుంది. - ప్రతి బ్యాంకు శాఖ కనీసం ఒక మహిళా రుణగ్రహీతకు రుణ కేటాయింపును రిజర్వ్ చేస్తుంది.
- స్టాండ్-అప్ ఇండియా పోర్టల్ ద్వారా మహిళలు దరఖాస్తుల విషయంలో మార్గదర్శకత్వం, శిక్షణ అనుసంధానాలు, మెంటార్‌షిప్ పొందుతారు. ఇది వారు ఉద్యోగ సృష్టికర్తలుగా మారడానికి, ఆర్థిక స్వతంత్రతను సాధించడానికి, వ్యవస్థాపకతలో లింగ వివక్షను తగ్గించడానికి సహాయపడుతుంది.

ముగింపు: అందరికీ ముందడుగు మార్గం
భారతదేశ మహిళా నేతృత్వ అభివృద్ధి గాథ పొదుపు నుంచి పరిశ్రమల వరకు, పొలాల నుంచి మార్కెట్ల వరకు, లబ్ధిదారుల నుంచి నాయకుల వరకు ఎదిగింది. సుకన్య సమృద్ధి యోజన, నమో డ్రోన్ దీదీ, డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, ఉమెనియా వంటి పథకాలు సమిష్టిగా మహిళల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఇవి మహిళలు గౌరవప్రదంగా, సులభంగా రుణాలు, సాంకేతికత, నైపుణ్యాలు, మార్కెట్లను పొందేలా చేశాయి.

నేడు కోట్లాది మంది మహిళలు కేవలం సంపాదకులు మాత్రమే కాదు, పొలాలు, పరిశ్రమలు, వారి స్వంత భవిష్యత్తుకు యజమానులుగా ఉన్నారు. వారు డ్రోన్‌లను నడుపుతున్నారు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సరఫరా చేస్తున్నారు, సమాజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు, ఆత్మవిశ్వాసంతో తమ కుటుంబాల శ్రేయస్సును నిర్మిస్తున్నారు.

వికసిత్ భారత్ ఈ బలమైన పునాది పైనే ఆధారపడి ఉంది- ఇక్కడ ప్రతి మహిళ తన సొంత శ్రేయస్సుకు తానే రూపశిల్పి, ఆమె విజయం ఇక్కడ ఒక మినహాయింపు లేదా ఆశయం మాత్రమే కాదు, అది ఒక అంచనా.

మహిళల ఆర్థిక స్వతంత్రతను పెంపొందించడం అంటే భారతదేశ భవిష్యత్తును పెంపొందించడమే.

References:
Press Information Bureau
:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2149728https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2227542&reg=1&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2214504&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2070029&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2100642&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2040878&reg=3&lang=2

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1703147&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2215001&reg=3&lang=2

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1891303&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2186643&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201284&reg=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2160547&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2119781&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2069170&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206995&reg=3&lang=1

 

Ministry of Rural Development:

https://lakhpatididi.gov.in/bn/how-do-i-become-a-lakhpati-didi/

https://lakhpatididi.gov.in/about-lakhpati-didi/

 

Ministry of Finance:

https://www.myscheme.gov.in/schemes/sui

https://www.standupmitra.in/Home/SUISchemes

https://www.pmjdy.gov.in/account

https://www.mudra.org.in/

Click here to see pdf 

 

***

(Explainer ID: 157697) आगंतुक पटल : 22
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Kannada
Prime Minister mygov.in Content Link
National Portal Of India
STQC Certificate