• Skip to Content
  • Sitemap
  • Advance Search
Technology

ఇండియా-ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026 అందరి సంక్షేమం, అందరి సంతోషం

Posted On: 16 FEB 2026 7:23PM

కీల‌కాంశాలు
- న్యూఢిల్లీలో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026'కు 20 మందికి పైగా దేశాధినేతలు, 60 మంది మంత్రులు, 500 మంది అంతర్జాతీయ ఏఐ ప్ర‌ముఖులు హాజరయ్యారు.

- ఈ సదస్సు ప్రజలు, గ్రహం, ప్రగతి అనే మూడు పునాది సూత్రాల ఆధారంగా జ‌రుగుతోంది.

- 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో'లో 30 దేశాల నుంచి 300 మందికి పైగా ప్రదర్శనకారులు, 10కి పైగా ప్రత్యేక విభాగాలలో పాల్గొంటారని అంచనా.
*ఈ గణాంకాలు తాత్కాలికమైనవి, మార్పులకు లోబడి ఉంటాయి.

పరిచయం


భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కృత్రిమ మేధ‌(ఏఐ) ఒక కీలకశక్తిగా ఉంది. ఇది పరిపాలనను బలోపేతం చేస్తూ, 'వికసిత్ భారత్ @ 2047' లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ సేవలను మెరుగుపరుస్తోంది. బాధ్యతాయుతమైన, అందరికీ ఉపయోగపడే ఏఐ పట్ల భారతదేశ నిబద్ధతను చాటుతూ 2026 ఫిబ్ర‌వ‌రి 16న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 'ఇండియా–ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు 2026'ను ప్రారంభించారు.

గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇది. ఇందులో 20 మంది దేశాధినేతలు, 60 మంది మంత్రులు, 500 మంది అంత‌ర్జాతీయ‌ ఏఐ అగ్ర ప్ర‌తినిధులు పాల్గొనడం ఒక అపూర్వ ఘట్టం. విధానకర్తలు, సాంకేతిక సంస్థలు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలను ఒకచోట చేర్చడం ద్వారా 'ఇండియా ఏఐ మిషన్‌', 'డిజిటల్ ఇండియా' చొరవ కింద ఏఐ చర్చలను ఆచరణాత్మక అభివృద్ధి ఫలితాలుగా మార్చడం ఈ సదస్సు లక్ష్యం. ఫిబ్రవరి 19న ప్రధాన మంత్రి గారి ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఇది అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి, అందరికీ అందుబాటులో ఉండే, నమ్మకమైన ఏఐ పట్ల భారతదేశ దార్శనికతను చాటిచెప్పడానికి వేదిక కానుంది.

భారతదేశానికి ఏఐ ప్రాముఖ్యత
ప్రజలు, గ్రహం, ప్రగతి(పీపుల్‌, ప్లానెట్‌, ప్రోగ్రెస్‌) అనే సూత్రాల ఆధారంగా భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, పరిపాలనను బలోపేతం చేయడానికి, పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏఐ ఒక శక్తిమంతమైన సాధనంగా మారింది. ప్రజల కోణంలో చూస్తే.. టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు, వ్యక్తిగత విద్య, ఆర్థిక భద్రత వంటి వాటిలో ఏఐ పౌరులకు అండగా ఉంటోంది. గ్రహం కోణంలో చూస్తే.. పంటల అంచనా, డ్రోన్ల వినియోగం ద్వారా వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులను తీసుకువస్తోంది. ప్రగతి కోణంలో.. కోర్టు తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించడం, సేవల‌ను మెరుగ్గా అందించ‌డం, ఆహార స‌ర‌ఫ‌రా, ర‌వాణా, వ్య‌క్తిగ‌త డిజిట‌ల్ సేవ‌లు వంటి వాటితో రోజువారీ పనులను సులభతరం చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ భారతాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తోంది.

1. ఆరోగ్య రంగంలో ఏఐ: గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య సేవలను ఏఐ మెరుగుపరుస్తోంది. వైద్యులు అందుబాటులో లేని చోట రోగ నిర్ధారణ చేయడంలోనూ, రక్త, మూత్ర పరీక్షలను వేగవంతం చేయడంలోనూ ఏఐ పనిముట్లు తోడ్పడుతున్నాయి. ఏఐ ఆధారిత టెలిమెడిసిన్, చాట్‌బాట్‌లు రోగులను నేరుగా డాక్టర్లతో అనుసంధానిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, వేచి ఉండే సమయం తగ్గుతున్నాయి. క్యాన్సర్, టీబీ వంటి వ్యాధులను త్వరగా గుర్తించడానికి ఏఐ మెడికల్ ఇమేజింగ్ సహాయపడుతోంది. వ్యాధి వ్యాప్తిని ముందుగానే అంచనా వేయడానికి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తోడ్పడతాయి. అదే సమయంలో ఏఐ ఆధారిత ఔషధ పరిశోధనలు, వ్యక్తిగత చికిత్సలు దీర్ఘకాలిక వ్యాధుల ఖర్చును తగ్గించి, చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తాయి.

2. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయ ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏఐ డేటా ఆధారిత పద్ధతులను అందిస్తోంది. వాతావరణం, తెగుళ్లు, సాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి రైతులకు మొబైల్ ద్వారా సూచనలు ఇస్తుంది. డ్రోన్లు, శాటిలైట్ చిత్రాల ద్వారా పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. 'మౌసమ్ జీపీటీ', 'కిసాన్ ఇ-మిత్ర' వంటి సాధనాలు స్థానిక భాషల్లో రైతులకు సమాచారాన్ని అందిస్తున్నాయి.

3. విద్య, అభ్యాసం: ఏఐ విద్యను మరింత వ్యక్తిగతంగా, సులభంగా మార్చుతోంది. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చడం, భాషా అడ్డంకులను తొలగించి ప్రాంతీయ భాషల్లో విద్యను అందించడం వంటివి చేస్తోంది. ఏఐ-ఆధారిత బోధ‌నా వ్య‌వ‌స్థ‌లు విద్యార్థుల‌కు 24 గంట‌ల అభ్యాస స‌హాయం, త‌క్ష‌ణ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి.  'దీక్ష' వంటి వేదిక‌లు అందరికీ ఉపయోగపడే విద్యా సమాచారాన్ని అందించడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి.

4. ఆర్థికం, వాణిజ్యంలో ఏఐ: ఆర్థిక భద్రత, స‌మ్మిళిత్వం, సేవల సామర్థ్యాన్ని ఏఐ పెంచుతోంది. డిజిటల్ లావాదేవీల్లో మోసాలను త‌క్ష‌ణ‌మే గుర్తించడం, సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీల‌కు ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని వారికి కూడా క్రెడిట్ స్కోరింగ్ ఆధారంగా రుణాలు అందేలా చేయడం వంటివి ఏఐ ద్వారా సాధ్యమవుతున్నాయి. బ్యాంకింగ్ చాట్‌బాట్‌లు న‌గ‌దు నిల్వ తెలుసుకోవ‌డం, న‌గ‌దు బ‌దిలీ, వంటి సాధార‌ణ సేవ‌ల‌ను 24 గంటలూ సేవలను అందిస్తున్నాయి. ఏఐ-ఆధారిత‌ వ్య‌క్తిగ‌తీక‌రణ స‌రైన వాణిజ్య ఉత్ప‌త్తులు, సూచ‌న‌లను అందించేందుకు దోహ‌ద‌ప‌డుతోంది.

5. పరిపాలన, ప్రజా సేవల్లో ఏఐ: ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను, వేగాన్ని ఏఐ పెంచుతోంది. కోర్టు తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించడం వల్ల సామాన్యులకు న్యాయం చేరువవుతోంది. ట్రాఫిక్, వ్యర్థాల నిర్వహణ, ప్రజల భద్రతను పర్యవేక్షించ‌డం ద్వారా స్మార్ట్ సిటీల నిర్వహణకు ఏఐ స‌హాయ‌ప‌డుతోంది. ప్రభుత్వ పథకాల దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయాన్ని ఇది తగ్గిస్తోంది. న్యాయ వ్య‌వ‌స్థ‌లో కేసుల నిర్వ‌హ‌ణ‌, న్యాయ‌సేవ‌ల‌ను అందుబాటులో ఉంచడాన్ని ఏఐ మెరుగుప‌రిచింది.

ఏఐ వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం బలమైన, స‌మ్మిళిత‌ ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. 'ఇండియా ఏఐ మిషన్', స్వదేశీ ఏఐ మోడళ్ల తయారీ, భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలు దేశంలో బాధ్యతాయుతమైన, విశ్వ‌స‌నీయ‌మైన‌ ఏఐ వాడకానికి బ‌ల‌మైన పునాది వేస్తున్నాయి.

దీంతోపాటు ఈ 'ఇండియా–ఏఐ ఇంపాక్ట్ స‌దస్సు-2026' అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుంది. డిజిటల్ పరంగా సాధికారత పొందిన భారతదేశాన్ని అంత‌ర్జాతీయ ఏఐ ఆవిష్క‌ర‌ణ‌, విస్త‌ర‌ణ‌ కేంద్రంగా మార్చడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషించనుంది. డిజిట‌ల్ సాధికార‌త, టెక్నాల‌జీ ఆధారిత భార‌త‌దేశ నిర్మాణం ఈ స‌ద‌స్సు సంక‌ల్పం.

పునాది: ఏఐ ప్రభావంపై అంత‌ర్జాతీయ స‌హ‌కారానికి మూడు సూత్రాలు, ఏడు చక్రాలు
ఇండియా–ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026 అనేది కృత్రిమ మేధ‌ పట్ల ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కొలవదగిన సామాజిక, ఆర్థిక ఫలితాలను అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ సదస్సు మూడు పునాది స్తంభాలపై ఆధారపడి ఉంది, వీటిని 'సూత్రాలు' అని పిలుస్తారు. 'సూత్రం' అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం మార్గదర్శక సూత్రాలు లేదా జ్ఞానాన్ని, కార్యాచరణను కలిపి ఉంచే ముఖ్యమైన దారాలు. బహుపాక్షిక సహకారం ద్వారా ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏఐని ఎలా ఉపయోగించవచ్చో ఈ సూత్రాలు వివరిస్తాయి.



ఈ మూడు పునాది సూత్రాల ఆధారంగా ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు చర్చలు 7 చక్రాల చుట్టూ రూపొందాయి. ఈ చక్రాలు బహుపాక్షిక సహకారానికి సంబంధించిన కీలక రంగాలను సూచిస్తాయి. ఇవి సమ్మిళిత, స్థిరమైన సామాజిక ఫలితాల కోసం ఉమ్మడి ప్రయత్నాలను నడిపిస్తాయి.

 



1. మానవ వనరులు: ఈ చక్రం లక్ష్యిత నైపుణ్యాభివృద్ధి ద్వారా సమగ్రమైన 'ఏఐ రీస్కిల్లింగ్'(మళ్లీ నైపుణ్యం పెంచుకోవడం) వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. భారతదేశం కోసం ఇది జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ ఆర్థిక వ్యవస్థకు సిద్ధంగా ఉండేలా శ్రామిక శక్తిని బలోపేతం చేస్తుంది.

2. సామాజిక సాధికారత కోసం సమ్మిళితం: పంచుకోదగిన ఏఐ పరిష్కారాలు, విస్తరించదగిన నమూనాల ద్వారా అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఈ చక్రం దృష్టి పెడుతుంది. ఇది పౌర-కేంద్రీకృత ఏఐ పరిష్కారాలను అందించడంలో, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు సేవలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.

3. సురక్షితమైన, విశ్వ‌స‌నీయ‌మైన ఏఐ: ఈ చక్రం బాధ్యతాయుతమైన ఏఐ కోసం ప్రపంచవ్యాప్త సూత్రాలను ఆచరణాత్మకమైన, సురక్షితమైన, పరిపాలనాపరమైన చట్రాలుగా మార్చడంపై దృష్టి పెడుతుంది. భారతదేశం కోసం ఇది దేశీయ ఏఐ పరిపాలనను బలోపేతం చేస్తుంది. ప్రభుత్వ వేదికలపై ఏఐని సురక్షితంగా ఉపయోగించేలా చేస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే ప్రజలలో నమ్మకాన్ని పెంచుతుంది.

4. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సామర్థ్యం: పెద్ద స్థాయి ఏఐ వ్యవస్థల వల్ల ఏర్పడే పర్యావరణ, వనరుల సవాళ్లను పరిష్కరించడంపై ఈ చక్రం దృష్టి పెడుతుంది. ఇది భారతదేశంలో స్థిరమైన ఏఐ వినియోగానికి మద్దతు ఇస్తుంది. ఏఐ వృద్ధి పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా, సామాజికంగా సమానంగా ఉండేలా చూస్తుంది.

5. విజ్ఞాన శాస్త్రం: డేటా, కంప్యూట్, పరిశోధనా సామర్థ్యాల అందుబాటులో ఉన్న అసమానతలను తొలగిస్తూ, కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఏఐని ఉపయోగించడంపై ఈ చక్రం దృష్టి పెడుతుంది. ఇది భారతదేశ పరిశోధనా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణ రంగాలలో పరిష్కారాలను వేగవంతం చేస్తుంది.

6. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ: ఏఐ అభివృద్ధికి అవసరమైన వనరులు అందరికీ సమానంగా, సరసమైన ధరకే అందుబాటులో ఉండేలా ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం. భారతదేశంలోని అంకుర సంస్థ‌లు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలకు అవకాశాలను విస్తరిస్తూనే, అంతర్జాతీయ ఏఐ విలువ గొలుసులో సమాన భాగస్వామ్యాన్ని ఇది నిర్ధారిస్తుంది.

7. ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రయోజనం కోసం ఏఐ: నిజమైన సమ్మిళిత వృద్ధి కోసం ఏఐ సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ చక్రం అన్వేషిస్తుంది. ఆర్థిక వృద్ధికి, సామాజిక ప్రయోజనానికి ఆదర్శంగా నిలిచే అత్యుత్తమ ఏఐ వినియోగ సందర్భాలను ఇది గుర్తించి, ప్రోత్సహిస్తుంది.

మొత్తంగా ఈ చక్రాలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇతర వాటాదారులు తమ ఏఐ వ్యూహాలను ఏకం చేయడానికి, పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి, ఉమ్మడి సవాళ్లను పరిష్కరిస్తూ అందరికీ ప్రయోజనం చేకూర్చే ఏఐ పరిష్కారాలను అమలు చేయడానికి ఒక సమగ్రమైన మార్గదర్శకాన్ని అందిస్తాయి.

సదస్సులో ఏఐ ఇంపాక్ట్ కార్య‌క్ర‌మాలు

 


'ఇండియా–ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026' లక్ష్యాలను నెరవేర్చడానికి 'ఏఐ ఇంపాక్ట్ కార్య‌క్ర‌మాలు' దోహదపడతాయి. ఈ కార్య‌క్ర‌మాలులు భారతీయ ఏఐ చొర‌వ‌లు, వివిధ రంగాల్లో వాటి వినియోగం, సంస్థాగత చట్రాలను ప్రదర్శించడానికి ఒక వేదికగా నిలుస్తాయి. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో నేర్చుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఇవి తోడ్పడతాయి.

సదస్సుకు ముందు జరిగిన కార్యక్రమాలు
ప్రధాన సదస్సుకు సన్నాహకంగా ముందస్తు సంప్రదింపులు, చర్చల కోసం ఈ కార్య‌క్ర‌మాలను నిర్వహించారు. భారతదేశంలో, విదేశాలలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వాలు, విద్య, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, సామాజిక సంస్థలు పాల్గొన్నాయి.

ప్రాంతీయ ఏఐ స‌ద‌స్సులు
జాతీయ ఏఐ ప్రాధాన్యతలను ప్రాంతీయ అవసరాలతో అనుసంధానించడానికి ఈ కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య మేఘాలయ, గుజరాత్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తెలంగాణతో ఎనిమిది సదస్సులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగిన ఈ చర్చలు, ఆయా ప్రాంతాల ప్రత్యేక అవసరాలను గుర్తించి, ప్రధాన సదస్సు ఎజెండాను రూపొందించడంలో సహాయపడ్డాయి.

ప్రధాన సదస్సు
ఈ ప్రధాన సదస్సు పైన పేర్కొన్న 'ఏడు చక్రాల' ఆధారంగా జ‌రుగుతోంది. పరిశ్రమలు, విద్యావేత్తలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి ఏఐ వినియోగం, విధానపరమైన అనుభవాలు, అభివృద్ధికి అవసరమైన మార్గాలను ఈ సెషన్లలో చర్చిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా ప్రతిపాదనలు రావడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది.

ఏఐ కాంపెండియమ్
ఏఐ కాంపెండియమ్ అనేది సదస్సు కీలక జ్ఞాన సంపద. దీనిని 17 ఫిబ్రవరి 2026న విడుదల చేయనున్నారు. ఇందులో వివిధ రంగాలలో కృత్రిమ మేధ‌ను వాస్తవంగా ఎలా ఉపయోగిస్తున్నారో వివరించే కేస్ స్టడీలు ఉంటాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలను అమలు చేయడానికి ఇది ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.

ప్రతిష్టాత్మక కార్యక్రమాలు
ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణ మూడు గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లు ఉంటాయి- ఏఐ ఫ‌ర్ ఆల్‌, ఏఐ బై హ‌ర్‌, యువఏఐ. ఇవి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన ఏఐ పరిష్కారాలను గుర్తించడానికి రూపొందించిన‌వి. ఈ మూడింటికి కలిపి 60కి పైగా దేశాల నుంచి 4,650 దరఖాస్తులు వచ్చాయి. నిపుణుల బృందం వడపోత తర్వాత 70 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. వీరు గ్రాండ్ ఫినాలేలో తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.

ఏఐ ఫ‌ర్ ఆల్‌: ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపే ఏఐ పరిష్కారాలను గుర్తించడానికి ఉద్దేశించిన అంత‌ర్జాతీయ ప్ర‌భావ పోటీ. కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ శాఖ ప‌రిధిలోని డిపార్ట్‌మెంట్ ఫ‌ర్ ప్ర‌మోష‌న్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అండ్ ఇంట‌ర్నెల్ ట్రేడ్ కింద‌ స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా భాషణి విభాగం భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, అంకుర సంస్థ‌లు ఇందులో పాల్గొనవచ్చు. ప‌ట్ట‌ణ మౌలిక స‌దుపాయాలు, ర‌వాణా వంటి రంగాల్లో విస్తృతంగా ఉప‌యోగించ‌గ‌ల ఏఐ ప‌రిష్కారాల‌పై ఇది ప్ర‌ధానంగా దృష్టి సారిస్తుంది. ఎంపికైన వారికి రూ.2.50 కోట్ల వరకు బహుమతులు అందించ‌డంతో పాటు వారి ప‌రిష్కారాల‌ను స‌ద‌స్సులో ప్ర‌ద‌ర్శిస్తారు.

ఏఐ బై హ‌ర్‌: మహిళల నేతృత్వంలోని ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూపొందించిన అంత‌ర్జాతీయ ప్ర‌భావ పోటీ. నీతి ఆయోగ్ 'మహిళా వ్యవస్థాపక వేదిక' భాగస్వామ్యంతో మహిళా సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొంటున్నారు. ఎంపికైన ప‌రిష్కారాల‌ను స‌ద‌స్సులో ప్ర‌ద‌ర్శిస్తారు. దీనికి కూడా రూ. 2.50 కోట్ల వరకు బహుమతులు ఉన్నాయి.

యువఏఐ: 13–21 సంవత్సరాల మధ్య ఉన్న యువ ఆవిష్కర్తలు ప్ర‌స్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న స‌వాళ్లకు ఏఐ ప‌రిష్కారాల‌ను అభివృద్ధి చేసేలా ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో చేప‌ట్టిన అంత‌ర్జాతీయ యువ పోటీ. మైభారత్, నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ భాగస్వామ్యంతో యువత తమ వినూత్న ఆలోచనలతో వాస్తవ సమస్యలకు పరిష్కారాలను చూపుతున్నారు. విజేతలకు రూ. 85 లక్షల విలువైన బహుమతులు అందజేస్తారు.

రీసెర్చ్ సింపోజియం: ఏఐ, దాని ప్రభావంపై పరిశోధనా సదస్సు 18 ఫిబ్రవరి 2026న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. దీనికి ఐఐఐటీ హైదరాబాద్ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నుంచి 250 పరిశోధనా పత్రాలు అందాయి. ఇది గ్లోబ‌ల్ సౌత్ బ‌ల‌మైన ప్రాతినిథ్యాన్ని ప్ర‌తిబింబిస్తోంది. ఇందులో హెచ్‌.ఈ. అల‌ర్ కారిస్‌, కేంద్ర మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ జితిన్ ప్రసాద, ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ కార్య‌క్ర‌మం ప్లీన‌రీ చ‌ర్చ‌లు, అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న స‌మ‌ర్ప‌న‌లు, గ్లోబ‌ల్ సౌత్ పోస్ట‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయి. ఏఐ రంగంలో అగ్ర‌గాములు, సంస్థ‌లను ఒకే వేదిక‌పైకి తీసుకువ‌చ్చి, ఏ-ఆధారిత శాస్త్రీయ శాస్త్రీయ ఆవిష్క‌ర‌ణ‌, భ‌ద్ర‌త‌, సాంకేతిక‌త‌ అందరికీ సమానంగా అందడంపై, గ్లోబ‌ల్ సౌత్‌లో సంయుక్త ప‌రిశోధ‌న‌పై చర్చిస్తారు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026: దీనిని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఎంఈఐటీవై నిర్వహిస్తోంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎక్స్‌పోలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడు ప్రత్యేక పెవిలియన్లు ఉన్నాయి. పరిశోధన స్థాయి నుండి వాణిజ్య స్థాయికి కృత్రిమ మేధ‌ ఎలా ఎదిగిందో ఇది చూపుతుంది. ప్ర‌పంచ స‌వాళ్లు, స‌మ‌స్య‌లకు ఏఐ ప‌రిష్కారాల‌పై దృష్టి సారించేలా ఇది ఆవిష్క‌ర్త‌లు, పెట్టుబ‌డిదారుల‌కు ఒకే చోట‌కు చేరుస్తుంది.

ఇండియా ఏఐ టింకర్ ప్రెన్యూర్: ఇది 6 నుంచి 12వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే వేస‌వి శిబిరం. విద్యార్థుల్లో ఏఐ పట్ల అవగాహన, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించడం దీని లక్ష్యం. ఏఐ సాధ‌నాలు, సాంకేతిక‌త‌లు యువ అభ్యాస‌కుల‌కు అందుబాటులోకి తెచ్చి, సామాజిక ప్ర‌భావ స‌వాళ్ల‌కు ప‌రిష్కారంగా ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, ప‌రిష్కారాల‌ను అభివృద్ధి చేసేలా ప్రోత్స‌హిస్తుంది. నిపుణుల పర్యవేక్షణలో ఆన్‌లైన్ సెషన్ల ద్వారా విద్యార్థులు సామాజిక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను తయారు చేయడం నేర్చుకుంటారు. ఈ కార్య‌క్ర‌మం ఆవిష్క‌ర‌ణ‌ను, స‌మ‌స్య-ప‌రిష్కారాన్ని, వ్య‌వ‌స్థాప‌క ఆలోచ‌న‌ల‌ను త్వ‌ర‌గా నేర్చుకునేలా విద్యార్థుల‌ను ప్రోత్స‌హిస్తుంది.

ఈ కార్యక్రమాలన్నీ కలిసి మాటల నుంచి చేతలకు ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. కొల‌వ‌గ‌ల‌, స‌మ్మిళి ఏఐ ఆవిష్క‌ర‌ణ‌ను ప్రోత్స‌హిస్తాయి. అంకుర సంస్థ‌లు, మహిళలు, యువత, పరిశోధకులను అనుసంధానించడం ద్వారా బాధ్యతాయుతమైన ఏఐ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడానికి ఈ సదస్సు కృషి చేస్తోంది.

సదస్సులోని కార్యక్రమాల ఎజెండా, ప్రముఖ అతిథులు
ఇండియా ఇన్నోవేషన్ ఫెస్టివల్‌తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం పాలసీ ప్యానెల్‌లు, నాలెడ్జ్ లాంచ్‌లు, పరిశోధన, పరిశ్రమల సెషన్ల ద్వారా పుంజుకుంటుంది. ఇది దేశాధినేతల స్థాయి సమావేశాలు, 'గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఏఐ'(జీపీఏఐ) కౌన్సిల్ సమావేశాలతో ముగుస్తుంది.

తేదీ

కార్య‌క్ర‌మం

వేదిక‌

16-20 ఫిబ్ర‌వ‌రి 2026

ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో

భార‌త్ మండ‌పం, న్యూఢిల్లీ

16 ఫిబ్ర‌వరి 2026

ప్ర‌సంగాలు, ప్యానెల్ చ‌ర్చ‌లు, రౌండ్ టేబుల్ చ‌ర్చ‌లు

భార‌త్ మండ‌పం/ సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌/ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌, న్యూఢిల్లీ

17 ఫిబ్ర‌వ‌రి 2026

వైద్య‌, ఇంధ‌నం, విద్య‌, వ్య‌వ‌సాయం, మ‌హిళా సాధికార‌త‌లో ఏఐపై నాలెడ్జ్ కాంపెన్‌డియంల విడుద‌ల‌

భార‌త్ మండ‌పం, న్యూఢిల్లీ

అప్లైడ్ ఏఐపై స‌ద‌స్సు

ఏఐ బై హ‌ర్‌: గ్లోబ‌ల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌

సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌, న్యూఢిల్లీ

ప్ర‌సంగాలు, ప్యానెల్, రౌండ్ టేబుల్ చ‌ర్చ‌ల

భార‌త్ మండ‌పం/ సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌/ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌, న్యూఢిల్లీ

18 ఫిబ్ర‌వ‌రి 2026

రీసెర్చ్ సింపోసియం

భార‌త్ మండ‌పం, న్యూఢిల్లీ

ఇండ‌స్ట్రీ సెష‌న్‌

ఏఐ బై హ‌ర్‌:  గ్లోబ‌ల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌

సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌, న్యూఢిల్లీ

ప్ర‌సంగాలు, ప్యానెల్, రౌండ్ టేబుల్ చ‌ర్చ‌లు

భార‌త్ మండ‌పం/ సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌/ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌, న్యూఢిల్లీ

స‌ద‌స్సు వింద

క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, న్యూఢిల్లీ

19 ఫిబ్ర‌వ‌రి 2026

ప్రారంభ కార్య‌క్ర‌మం

భార‌త్ మండ‌పం, న్యూఢిల్లీ

 

లీడ‌ర్స్ ప్లీన‌రీ

సీఈవో రౌండ్‌టేబుల్‌

ప్ర‌సంగాలు, ప్యానెల్, రౌండ్ టేబుల్ చ‌ర్చ‌లు

భార‌త్ మండ‌పం/ సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌/ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌, న్యూఢిల్లీ

20 ఫిబ్ర‌వ‌రి 2026

జీపీఏఐ కౌన్సిల్ స‌మావేశం

భార‌త్ మండ‌పం, న్యూఢిల్లీ

ప్ర‌సంగాలు, ప్యానెల్, రౌండ్ టేబుల్ చ‌ర్చ‌లు

భార‌త్ మండ‌పం/ సుష్మా స్వ‌రాజ్ భ‌వ‌న్‌/ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌, న్యూఢిల్ల



*(16 ఫిబ్ర‌వ‌రి, 2026 నాటి వ‌ర‌కు ఉన్న ఎజెండా)- ఈ ఎజెండా, అతిథుల జాబితా తాత్కాలికమైనవి, మార్పులకు లోబడి ఉంటాయి.


సదస్సులో భాగస్వామ్యమైన కీలక ప్రభుత్వ సంస్థలు
ఇండియా–ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026కు విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు, డిజిటల్ మౌలిక సదుపాయాలకు బాధ్యత వహించే ప్రధాన ప్రభుత్వ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. వీటి భాగస్వామ్యం పాల‌నాప‌ర‌మైన నాయ‌క‌త్వం, సాంకేతిక‌త స‌హ‌కారం, సంస్థాగ‌త కొన‌సాగింపును అందిస్తుంది. త‌ద్వారా సదస్సులోని చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆచరణాత్మక ఫలితాలను ఇచ్చేలా చూస్తాయి.


ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీవై)
భారతదేశంలో ఏఐ, డిజిటల్ సాంకేతికతలకు సంబంధించి ఈ మంత్రిత్వ శాఖ మొత్తం విధానపరమైన దిశానిర్దేశం చేస్తుంది. కృత్రిమ మేధ‌, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ గవర్నెన్స్, నమ్మకమైన సాంకేతికతపై జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ సదస్సును మంత్రిత్వ శాఖ‌ నిర్వహిస్తుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం, రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. స‌ద‌స్సులో ఫ‌లితాల‌ను ప్ర‌స్తుతం జాతీయ ప్రాథ‌మ్యాలు, విధాన‌ప‌ర‌మైన చ‌ట్రాల‌తో అనుసంధానం చేస్తుంది.

ఇండియా ఏఐ మిషన్
ఇది భారతదేశంలో ఏఐ అభివృద్ధికి మద్దతు ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పథకం. ఏఐ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటాసెట్‌లు, స్వదేశీ ఏఐ మోడళ్లు, నైపుణ్యాభివృద్ధి, అంకుర సంస్థ‌ల‌కు మద్దతు వంటి ప్రధాన అంశాలను ఈ మిషన్ రూపొందిస్తుంది. కృత్రిమ మేధ‌ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇది చాటిచెబుతుంది.

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ)
సదస్సులో స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆవిష్కర్తల భాగస్వామ్యానికి ఎస్‌టీపీఐ మద్దతు ఇస్తుంది. ఇది వారికి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో సంబంధాలను, ఇంక్యుబేష‌న్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న దీని కేంద్రాల ద్వారా ప్రాంతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించ‌డంతో పాటు ఏఐ ఆధారిత సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ఎదిగేలా ఇది తోడ్పడుతుంది. ఏఐ ఆవిష్క‌ర్త‌ల‌ను ప‌రిశ్ర‌మ‌, అంత‌ర్జాతీయ మార్కెట్లు, ఎగుమ‌తి అవ‌కాశాల‌తో అనుసంధానించి ప్ర‌పంచ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త‌దేశ స్థానాన్ని బ‌లోపేతం చేస్తుంది.

డిజిటల్ ఇండియా చొరవ
భారతదేశంలో పెద్ద ఎత్తున ఏఐ వినియోగానికి డిజిటల్ ఇండియా పునాది వేస్తుంది. డిజిటల్ పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లు, అందరికీ ప్రాధాన్యత, పౌర-కేంద్రీకృత పాలనపై ఇది ఇచ్చే ప్రాముఖ్యత సదస్సు ఇతివృత్తాల్లో కనిపిస్తుంది. సదస్సులో ప్రదర్శించే ఏఐ పరిష్కారాలు పారదర్శకతతో, ప్రజా విశ్వాసంతో జాతీయ స్థాయిలో అమలు అయ్యేలా ఇది చూస్తుంది.

సదస్సు ద్వారా ఆశిస్తున్న‌ ఫలితాలు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026 జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్పష్టమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. ఈ సదస్సు ఏఐని ఆచరణలో ఉపయోగించడం, ప్రభుత్వ విధానాల సమన్వయం, పరిశ్రమల మధ్య సహకారంపై దృష్టి పెడుతుంది. ఇది పరిపాలనా, నియంత్రణ చట్రాలను బలోపేతం చేయడంతో పాటు ఏఐ ఆధారిత పారిశ్రామిక వృద్ధికి వివిధ ప్రాంతాల సన్నద్ధతను అంచనా వేస్తుంది. అలాగే, శ్రామిక శక్తికి నైపుణ్యాభివృద్ధిని అందిస్తూ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వారిని సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం, విద్యాసంస్థలు, అంకుర సంస్థ‌లు, పరిశ్రమల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ఇది దారి తీస్తుంది.



ముగింపు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు-2026 దేశ ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన ఫలితాలను అందిస్తోంది. ప్రభుత్వ, పరిశ్రమల స్థాయిలో ఏఐని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సమన్వయాన్ని ఈ సదస్సు మెరుగుపరుస్తోంది. పాలనాపరమైన నియమాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ అభివృద్ధిని అంచనా వేయడం, ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడం వంటి అంశాలపై ఇది వేగంగా పనిచేస్తోంది. ఏఐ అప్లికేషన్లపై అవగాహన పెంచడం ద్వారా విభిన్న రంగాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారతదేశంలో ఆవిష్కరణలతో కూడిన, అందరికీ ప్రయోజనం చేకూర్చే బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థను నిర్మించడంలో ఈ సదస్సు విజయవంతమవుతోంది.

Click here to see pdf 

 

****

(Explainer ID: 157441) आगंतुक पटल : 22
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam
Link mygov.in
National Portal Of India
STQC Certificate