• Skip to Content
  • Sitemap
  • Advance Search
Economy

8.2 శాతం జీడీపీ: భారత్‌ వృద్ధి అంచనాలకు బలం

జీడీపీ వృద్ధి వేగం.. ద్రవ్యోల్బణంలో నిలకడ.. బలమైన తయారీ రంగం.. పెరిగే ఎగుమతుల మద్దతుతో ప్రగతి పథంలో భారత్‌ పరుగు

Posted On: 28 NOV 2025 6:07PM
  • వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం పెరుగుతుందన్న అంచనా నేపథ్యంలో అర్థసంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 8 శాతంగా నమోదైంది.
  • వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) 2024 అక్టోబరుతో పోలిస్తే 2025 అక్టోబరులో 0.25 శాతం తగ్గిన నేపథ్యంలో ప్రస్తుత ‘సీపీఐ’ పరంపరలో ఇది అత్యల్ప వార్షిక ద్రవ్యోల్బణం.
  • తయారీ రంగంలో 4.8 శాతం వృద్ధి ఫలితంగా మునుపటేడాదితో పోలిస్తే 2025 సెప్టెంబరులో పారిశ్రామిక ఉత్పాదన వృధ్ధి సూచీ (ఐఐపీ) 4.0 శాతం వృద్ధిని నమోదు చేసింది.
  • శ్రామిక శక్తి భాగస్వామ్యం ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరి, 2025 అక్టోబరులో 55.4 శాతానికి పెరిగింది.
  • భారత మొత్తం (వస్తుసేవల) ఎగుమతులు 2024 ఏప్రిల్-అక్టోబరు కాలంతో పోలిస్తే 2025 ఏప్రిల్-అక్టోబరులో 4.84 శాతం పెరిగాయి.

ఉపోద్ఘాతం

దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమన వేగం ప్రపంచ దృష్టిని నిరంతరం ఆకర్షిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్‌, 2030కల్లా 3వ స్థానానికి చేరేందుకు నిలకడగా ముందడుగు వేస్తోంది. ఆనాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. నిర్ణయాత్మక విధాన రూపకల్పన, సమూల సంస్కరణలు, ప్రపంచంతో భారత్‌ సంబంధాలు విస్తరించడం వంటివి బలమైన ప్రస్తుత వృద్ధి దశను ప్రతిబింబిస్తున్నాయి.

   వృద్ధి వేగం పెరుగుతున్నందున ప్రపంచంలోని వర్ధమాన దేశాలను మరోసారి అధిగమించిన భారత్‌, శరవేగంగా పురోగమిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. దేశీయ డిమాండ్‌లో నిలకడ, ద్రవ్యోల్బణం తగ్గింపు, కార్మికశక్తి భాగస్వామ్యం ఇనుమడించడం వంటివి ఈ పెరుగుదలకు మద్దతిస్తున్నాయి. దేశీయ పెట్టుబడిలో పునరుజ్జీవనంతోపాటు పెట్టుబడిదారుల భావనలో స్థిరత్వం వంటివి విస్తృత పునాదిగల ఆర్థిక వ్యవస్థను సూచిస్తున్నాయి. సంస్కరణలు వేగం పుంజుకుంటూ, వినియోగం ఆశాజనకంగా ఉన్నందున, భారత ఆర్థిక దృక్పథంలో ఉత్సాహం పెరిగి, వివిధ రంగాల్లో స్థిరమైన ఉత్తేజం, వృద్ధిని సూచిస్తోంది.

కీలక ఆర్థిక సూచీలు: భారత్‌ సుస్థిర వృద్ధి

వేగంగా జీడీపీ వృద్ధి

దేశ పురోగమన విస్తృతిని తెలిపే ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబించే ప్రాథమిక సూచీలలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఒకటి. తాజా గణాంకాల ప్రకారం- ద్రవ్యోల్బణ అనుగుణ సర్దుబాటు చేసిన వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.6 శాతం. దీనితో పోలిస్తే 2025-26 రెండో త్రైమాసికంలో 8.2 శాతానికి చేరుతుందని అంచనా. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి 6.5 శాతం కాగా, దానితో పోలిస్తే 2025-26 తొలి త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. అయితే, 2025-26 రెండో త్రైమాసికంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి 8.7 శాతంగా నమోదైంది. ఈ వృద్ధిలో ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానిదీ కీలక పాత్రే. ఆ మేరకు 2025-26 రెండో త్రైమాసికంలో ప్రాథమిక రంగం వాస్తవ స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వార్షికంగా 3.1 శాతం  వృద్ధిని నమోదు చేసింది. అలాగే, 2025-26 రెండో త్రైమాసికంలో ద్వితీయ (8.1 శాతం), తృతీయ రంగాల్లో (9.2 శాతం) వాస్తవ జీడీపీ వృద్ధి నమోదైంది.

2026 ఆర్థిక సంవత్సరంలో అర్థవార్షిక వృద్ధి

2025 ఆర్థిక సంవత్సరం జీడీపీ తొలి అర్థ వార్షిక వృద్ధి 6.1 శాతం కాగా, దానితో పోలిస్తే (2025-26 ఏప్రిల్-సెప్టెంబర్) అర్ధవార్షిక వాస్తవ జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదైంది.

ప్రాథమిక రంగంలో (2.9 శాతం) ఒక మోస్తరు వృద్ధి నమోదు కాగా, ద్వితీయ (7.6 శాతం), తృతీయ (9.3 శాతం) రంగాల్లో సుస్థిర విస్తరణ నమోదైంది.

స్థిరంగా ద్రవ్యోల్బణం

భారత్‌లో ద్రవ్యోల్బణం 2025 అక్టోబరు నాటికి గణనీయ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఆర్థిక వ్యవస్థలోని బలమైన ప్రాథమిక రంగాలు, ప్రభావశీల ధరల నిర్వహణ చర్యలను ఇది సూచిస్తుంది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ప్రధాన ద్రవ్యోల్బణం మునుపటి ఏడాదితో పోలిస్తే 0.25 శాతానికి తగ్గి, ప్రస్తుత ‘సీపీఐ’ పరంపరలో అత్యల్ప స్థాయి నమోదును ప్రతిబింబిస్తోంది. మొత్తంమీద రిజర్వు బ్యాంకు నిర్దేశిత పరిమితికి లోబడే ఉంది. రెపో రేటును 5.50 శాతంగా కొనసాగించాలన్న రిజర్వు బ్యాంకు నిర్ణయానికి అనుగుణంగా ధరల స్థిరత్వం, వృద్ధి అవకాశాలపై విశ్వాసాన్ని ద్రవ్యోల్బణంపై నియంత్రణ ప్రతిబింబిస్తుంది.

సూచీలు

సెప్టెంబరు 2025 (శాతాల్లో)

అక్టోబరు 2025(శాతాల్లో)

వినియోగదారు ధరల సూచీ

1.44

0.25

వినియోగదారు ఆహార ధరల సూచీ (సీపీఎఫ్‌ఐ)

(-) 2.33

(-) 5.02

గ్రామీణ ద్రవ్యోల్బణం

1.07

(-)0.25

పట్టణ ద్రవ్యోల్బణం

1.83

0.88

 

ఆహార ద్రవ్యోల్బణం (సీఎఫ్‌పీఐ)పై నిశిత నియంత్రణే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. ఇది 2024 అక్టోబరుతో పోలిస్తే (-)5.02గా నమోదైంది. నూనెలు, కొవ్వులు, పండ్లు-కూరగాయలు, గుడ్లు, తృణధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు తగ్గడం కూడా ఇందుకు తోడ్పడింది. అంతేగాక ఇటీవలి వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గుదల సానుకూల ప్రభావం దీనికి తోడైంది.

   గ్రామీణ ద్రవ్యోల్బణం (–)0.25శాతానికి తగ్గితే, పట్టణ ద్రవ్యోల్బణం 0.88 శాతంగా నమోదైంది. ప్రాంతాల పరంగా బహుళ కోణీయ నియంత్రణను ఇది సూచిస్తుంది. ద్రవ్యోల్బణంపై స్థిరమైన నియంత్రణతో కొనుగోలు శక్తి బలోపేతమైన వాస్తవ వినియోగ వృద్ధికి తోడ్పడటమేగాక పెట్టుబడి, ఉత్పాదన విస్తరణకు తగిన ద్రవ్య విధాన వెసులుబాటుకు దోహదం చేస్తుంది. మొత్తంమీద ద్రవ్యోల్బణ వాతావరణం తగ్గుదల రాబోయే త్రైమాసికాల్లో సుస్థిర, సార్వజనీన, నిలకడగల ఆర్థిక వృద్ధి పునాదిని బలోపేతం చేస్తుంది.

ఇక 2024 అక్టోబరుతో పోలిస్తే 2025 అక్టోబరులో భారత టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (-) 1.21 శాతానికి దిగివచ్చింది. ఆహార వస్తువులు, ముడిచమురు, సహజ వాయువు, విద్యుత్తు, ఖనిజ నూనెలు, ప్రాథమిక లోహ తయారీ తదితర కీలక వస్తు ధరల తగ్గుదలను ఇది  ప్రతిబింబిస్తుంది. అలాగే డబ్ల్యూపీఐ ఆధారిత ఆహార సూచీ వార్షిక ద్రవ్యోల్బణం 2025 సెప్టెంబరులో 1.99 శాతం కాగా, అక్టోబరులో మరింత తగ్గి (-) 5.04 శాతానికి తగ్గింది. వ్యాపారాల కొనుగోలు శక్తి  బలోపేతం కావడంతోపాటు మార్కెట్ ధోరణి మెరుగుదలను టోకు ద్రవ్యోల్బణం నిరంతర తగ్గుదల సూచిస్తుంది.

పారిశ్రామిక ఉత్పాదన వృధ్ధి సూచీ (ఐఐపీ)

పారిశ్రామిక కార్యకలాపాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ తయారీ, మైనింగ్, విద్యుత్తు రంగాల్లో వృద్ధిని పారిశ్రామిక ఉత్పాదన వృద్ధి సూచీ అంచనా వేస్తుంది. ఈ మేరకు మునుపటి సంవత్సర కాలంతో పోలిస్తే 2025 సెప్టెంబరులో భారత ‘ఐఐపీ’ 4.0 శాతం మేర బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో 4.8 శాతం విస్తరణతో ఇది సాధ్యమైంది. బలమైన ఉత్పత్తి, అధిక ఉపాధి, పెట్టుబడులలో ఉత్తేజాన్ని ఐఐపీ వృద్ధి సూచిస్తుంది. ఇది మొత్తంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన్ని బలోపేతం చేస్తుంది.

బలమైన పనితీరుకు కారణమైన తొలి మూడు సానుకూలాంశాలు తయారీ రంగం సంబంధితమైనవే. ఈ పనితీరు భారత పారిశ్రామిక పునాది పటిష్ఠతను, విస్తృత వృద్ధి కార్యాచరణకు అర్థవంతంగా దోహదం చేయగల దాని సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది.

·         ప్రాథమిక లోహాల తయారీ (వృద్ధి 12.3 శాతం)

·         విద్యుత్ పరికరాల తయారీ (వృద్ధి 28.7 శాతం)

  • మోటారు వాహనాలు, ట్రైలర్లు, సెమీ-ట్రైలర్ల తయారీ (14.6 శాతం)

వినియోగాధారిత వర్గీకరణ దృక్కోణంలో- అనేక కేటగిరీల కింద ప్రశంసనీయ వృద్ధి నమోదైంది. ఈ మేరకు 2025 సెప్టెంబరులో మూడు అగ్రశ్రేణి రంగాలు: మౌలిక సదుపాయాలు-నిర్మాణ సామగ్రి 10.5 శాతం, వినియోగ వస్తువులు 10.2 శాతం, మధ్యంతర వినియోగ సరంజామా 5.3 శాతం వంతున విస్తరణను నమోదు చేశాయి. బలమైన పెట్టుబడి కార్యకలాపాలు, సుస్థిర వినియోగ డిమాండ్ రెండింటినీ ప్రాథమిక-మూలధన-మధ్యంతర, వినియోగ వస్తు విభాగాల్లోని ఈ వైవిధ్యభరిత వృద్ధి సూచిస్తుంది. తయారీ రంగ ప్రగతికి ఈ ధోరణులు తోడుకావడం సమతుల పారిశ్రామిక పురోగమనాన్ని ప్రతిబింబిస్తుంది. సుస్థిర, సార్వజనీన ఆర్థిక విస్తరణ పునాదిని ఈ పరిణామం పటిష్ఠం చేస్తుంది.

ప్రభుత్వ కార్యక్రమాలతో తయారీ రంగానికి ప్రోత్సాహం

దేశం అనుసరిస్తున్న వృద్ధి విధానాలకు తయారీ రంగం మూలస్తంభంగా రూపొందుతోంది. ఇది దేశీయ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ప్రపంచ విలువ వ్యవస్థలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేస్తోంది. ఈ ఈ రంగంలో వృధ్ధికి దోహదం చేసిన ప్రధాన కార్యక్రమాలివే:

దేశంలోని 14 వ్యూహాత్మక రంగాలకు సంబంధించి ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం 2020లో అమలులోకి వచ్చింది. విక్రయాల పెరుగుదలతో ముడిపడిన ప్రోత్సాహకాల ద్వారా దేశీయ తయారీ రంగానికి ఇది ఉత్తేజమిస్తుంది. అలాగే 2030 నాటికి స్వయంసమృద్ధ భారత్ లక్ష్య సాధనతోపాటు దేశం 7.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న జాతీయ స్వప్న సాకారానికి  అనుగుణంగానూ ఉంటుంది.

మొత్తం ₹1.97 లక్షల కోట్ల ఆమోదిత వ్యయం, 800కుపైగా దరఖాస్తుదారులతో ₹1.76 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఈ పథకం ఆకర్షించింది. అదే సమయంలో ఉత్పత్తి, ఎగుమతులు సహా ఉద్యోగాల్లో వృద్ధిని నమోదు చేసింది. పరిశ్రమలు ఒకవైపు దీన్ని వేగంగా స్వీకరిస్తే, మరోవైపు ఆ రంగంలో బలమైన విశ్వాసాన్ని ఇది పాదుకొల్పింది.

ఇతరత్రా కీలక కార్యక్రమాల్లో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్, జీఎస్‌టీ సంస్కరణలు వంటివి సామర్థ్య వికాసాన్ని వేగిరపరచాయి. అంతేగాక భారత తయారీ రంగ వ్యవస్థ బలోపేతానికి లక్ష్యనిర్దేశం చేసుకున్నాయి.

ఉపాధిలో విశేష వృద్ధి

దేశ ఆర్థిక వృద్ధికి వివిధ రంగాలలో ఉత్పత్తి, ఆవిష్కరణ, వినియోగానికి సారథ్యం వహించే బలమైన శ్రామికశక్తి అత్యంత కీలకం. ఆర్థిక వ్యవస్థకు ఇంధనం వంటి కార్మిక మార్కెట్ 2025 అక్టోబరులో ప్రోత్సాహకర పునరుత్థాన సంకేతాలిచ్చింది. ఈ మేరకు 15 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వ్యక్తులకు సంబంధించి ప్రస్తుత వారపు స్థాయి (సీడబ్ల్యూఎస్‌)లో మొత్తం శ్రామిక శక్తి భాగస్వామ్యం (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) 2025 జూన్‌లో 54.2 శాతం కాగా, 2025 అక్టోబరులో 55.4 శాతానికి చేరి 6 నెలల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇందులో భాగంగా మహిళా భాగస్వామ్యం (34.2 శాతం, 2025 మే నెల నుంచి అత్యధికం) సహా నిరుద్యోగం (5.2 శాతం 2025 సెప్టెంబరు నుంచి మార్పులేదు) వంటి ఇతర సూచీలు కూడా మెరుగుపడ్డాయి. ఇక ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) 2025 జూలై నెలలో 21.04 లక్షల నికర సభ్యత్వ నమోదు చేసింది. అలాగే 2024 జూలైతో పోలిస్తే నికర జీతాల జోడింపులో 5.55 శాతం వృద్ధి నమోదైంది. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగిత ప్రయోజనాలపై అవగాహన పెరుగుదల, ‘ఈపీఎఫ్‌ఓ’ విస్తరణ కార్యక్రమాల విజయం తదితరాలను చందాదారుల సంఖ్యలో వృద్ధి ప్రస్ఫుటం చేస్తోంది.

సూచీలు

సెప్టెంబరు 2025 (శాతాల్లో)

అక్టోబరు 2025 (శాతాల్లో)

కార్మికశక్తి శాతం (డబ్ల్యుపీఆర్‌)

52.4

52.5

నిరుద్యోగిత శాతం

5. 2

5.2

మహిళా కార్మిక భాగస్వామ్యం

34.1

34.2

గ్రామీణ కార్మిక భాగస్వామ్యం

57.4

57.8

పట్టణ కార్మిక భాగస్వామ్యం

50.9

50.5

నౌక్రీ జాబ్‌స్పీక్ సూచీ

దేశంలో ఉద్యోగ నియామాలకు సంబంధించి ‘నౌక్రీ జాబ్‌స్పీక్ సూచీ’ కీలకమైనది. దీనికింద 2025 సెప్టెంబరులో 10.1 శాతం వార్షిక పెరుగుదల నమోదు కాగా, ఉద్యోగ నియామకాల్లో ఊపును ఇది ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్‌) ఉద్యోగ పాత్రలలో 61 శాతం పెరుగుదల ఈ వృద్ధికి దోహదం చేసింది.

దేశంలో కొత్త ఉద్యోగ నియామకాలు 15 శాతం పెరిగాయి. ఉద్యోగ మార్కెట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుదల, ఉద్యోగారంభ దశలోనే విస్తృత అవకాశాల లభ్యతను ఇది సూచిస్తోంది.

బీమా, ఆతిథ్య, స్థిరాస్తి వంటి సమాచార సాంకేతికేతర రంగాల్లోనూ డిమాండ్ పెరిగింది.

పెరుగుతున్న ఆదాయాలు, బలమైన ఉద్యోగ భద్రత, మెరుగైన ఉద్యోగ నాణ్యత తదితరాలను ఈ ఉపాధి కల్పన ధోరణి పెరుగుదల సూచిస్తోంది. అంతిమంగా ఇది ఆర్థిక వృద్ధి, విధానపరమైన చర్యల సానుకూల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది. మొత్తం మీద ఉత్పాదకను పెంచే, సుస్థిర ఆర్థిక వృద్ధికి తోడ్పడే సార్వజనీన ఉపాధి ప్రయోజనాలను ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

ప్రభుత్వ కార్యక్రమాలతో మార్కెట్ ఫలితాల మెరుగుదల

దేశవ్యాప్తంగా (2025 నవంబరు 17నాటికి) 27 లక్షల మందికిపైగా అభ్యర్థులు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) కింద శిక్షణ పొందారు. మరోవైపు యువతులకు కొత్త రంగాల్లో ఉపాధి అవకాశాల పెంపు దిశగా “తరుణ కౌమార బాలికల ఆకాంక్షలు నెరవేర్చే వృత్తి శిక్షణ” (నవ్య) కార్యక్రమం కింద పరిశ్రమానుగుణ నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఇక ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద 2025 మార్చి వరకు ₹4,91,406 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. అలాగే స్టాండప్‌ ఇండియా కింద 2025 జూన్ వరకు ₹62,790 కోట్లు మంజూరయ్యాయి. స్టార్టప్‌ ఇండియా కింద (2025 నవంబరు 18నాటికి) ‘డీపీఐఐటీ’ గుర్తింపు పొందిన 2,00,235 అంకుర సంస్థలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తున్నాయి. తద్వారా అంకురావరణ వ్యవస్థ విస్తరించి, కార్మిక శక్తికి తగినన్ని ఉద్యోగ అవకాశాల సృష్టిస్తుంది. బహుళ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను స్కిల్‌ ఇండియా మిషన్‌ నిబద్ధతతో ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు సమాచార సాంకేతికత నుంచి వ్యక్తిత్వ వికాసం దాకా దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణకు చేయూతనిస్తోంది. దేశవ్యాప్తంగా 40 ప్రదేశాలలో 2025 అక్టోబరు 24న నిర్వహించిన 17వ ఉపాధి కల్పన సమ్మేళనంలో  కొత్తగా ఎంపికైన 51,000 మందికిపైగా యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల ద్వారా యువతరం నైపుణ్యాలు బలపడి, వ్యవస్థాపన వేగం పెంచుతాయి. దీంతోపాటు సార్వజనీన ఆర్థిక వృద్ధికి సారథ్యం వహించగల సమర్థ-పునరుత్థాన శ్రామిక శక్తిని రూపొందిస్తాయి.

వాణిజ్య రంగం పనితీరు మెరుగుదల

దేశ వాణిజ్య రంగం 2025 ఏప్రిల్-అక్టోబరు మధ్య కాలంలో బలమైన పనితీరు కనబరచింది. ప్రపంచ డిమాండ్ బలపడటంతోపాటు కీలక ఎగుమతి కేటగిరీలలో సుస్థిర మెరుగుదలకు ఇది నిదర్శనం. ఆ మేరకు వస్తుసేవల ఎగుమతులు రెండింటా ఆరోగ్యకర వృద్ధి నమోదై, ప్రపంచ అనిశ్చితి పరిస్థితుల నడుమ మన ఆర్థిక వ్యవస్థ పునరుత్థాన సామర్థ్యాన్ని బలోపేతం చేసింది.

అలాగే 2025 ఏప్రిల్-అక్టోబరు మధ్య కాలంలో భారత విదేశీ రంగం కూడా తన సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేసింది. ఈ మేరకు వస్తుసేవల మొత్తం ఎగుమతులు గత సంవత్సరం నాటి 469.11 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4.84 శాతం పెరిగి 491.80 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి.

వాణిజ్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని అవరోధాలు ఉన్నప్పటికీ, భారత వస్తు ఎగుమతులు 0.63 శాతం పెరుగుదలతో 254.25 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి. స్పెయిన్ (40.74 శాతం), చైనా (24.77 శాతం), హాంకాంగ్ (20.7 శాతం), అమెరికా (10.15 శాతం) యూఏఈ (5.88 శాతం) వంటి కీలక మార్కెట్ల నుంచి బలమైన డిమాండ్‌తో ఇది సాధ్యమైంది. ఇందుకు ప్రధానంగా కింద పేర్కొన్న రంగాల బలమైన పనితీరు తోడ్పడింది:

·         సముద్ర ఉత్పత్తులు (16.18 శాతం)

·         మాంసం, పాల & పౌల్ట్రీ ఉత్పత్తులు (23.97 శాతం)

·         ఇతర తృణధాన్యాలు (25.52 శాతం),

·         జీడిపప్పు (28.32 శాతం),

·         ఎలక్ట్రానిక్ వస్తువులు (37.82 శాతం)

ఈ పునరుత్థానంలో సేవల ఎగుమతులు మూలస్తంభంగా నిలిచాయి. ఈ మేరకు 2024 ఏప్రిల్-అక్టోబరు మధ్య 216.45 బిలియన్‌ డాలర్లుగా నమోదు కాగా, 2025 ఏప్రిల్-అక్టోబరు మధ్య 9.75 శాతం పెరుగుదలతో 237.55 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి. ప్రపంచ స్థాయిలో కంప్యూటర్, వ్యాపార సేవల పరంగా ఇనుమడిస్తున్న భారత పోటీతత్వానికి ఇది నిదర్శనం. మొత్తం మీద, ఎగుమతి రంగం భారత ఆర్థిక స్థిరత్వంతోపాటు వృద్ధి ధోరణిని బలోపేతం చేస్తూనే ఉంది.

వాణిజ్య విస్తరణకు ప్రభుత్వ చేయూత

భారత వాణిజ్యావరణ వ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సంయుక్తంగా అనేక పథకాలను ప్రకటించడంతోపాటు ఉపశమన చర్యలు చేపట్టాయి. ప్రధానంగా భారత్‌ నుంచి ఎగుమతి చేసే వస్తువులు/సాఫ్ట్‌వేర్/సేవల సంపూర్ణ విలువను రాబట్టి, తిరిగి పంపే వ్యవధిని 9 నెలల నుంచి 15 నెలలకు ప్రభుత్వం పొడిగించింది. అలాగే, అడ్వాన్స్‌ చెల్లింపు తేదీ నుంచి మూడేళ్లకు లేదా ఒప్పందం మేరకు- ఏది తాజా అయితే, దాని ప్రకారం వస్తు ఎగుమతి వ్యవధిని పెంచింది.

నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీజీటీసీ) ద్వారా సభ్య రుణ సంస్థలకు (ఎంఎల్‌ఐ) 100 శాతం రుణ హామీ విస్తరణలో భాగంగా ఎగుమతిదారుల కోసం రుణ హామీ పథకాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనికింద ‘ఎంఎస్‌ఎంఈ’లు సహా అర్హతగల ఎగుమతిదారులకు రూ.20,000 కోట్లదాకా అదనపు రుణ సదుపాయం లభిస్తుంది. ప్రపంచ స్థాయిలో పోటీతత్వం పెంపు, కొత్త, వర్ధమాన మార్కెట్లలో వైవిధ్యీకరణకు మద్దతివ్వడం ఈ పథకం లక్ష్యాలు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కింద సమగ్ర, సౌలభ్య, డిజిటల్ ఆధారిత చట్రం రూపొందింది. ఇందుకోసం 2025-26 నుంచి 2030-31 వరకు ₹25,060 కోట్లు కేటాయించింది.

ఇక ‘ఆర్‌ఒడీటీఈపీ’ వాపసులు, ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు-ఎగుమతి పథకం కోసం వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలకు విదేశీ వాణిజ్య విధానం-2023 వంటివి తోడ్పడతాయి. అలాగే మార్కెట్ వైవిధ్యీకరణ, నిబంధనల అనుసరణలో మెరుగుదల, సజావుగా రవాణా తదితరాలకూ వీలు కల్పిస్తుంది. ప్రత్యేక ఆర్థిక మండలాలు కూడా ఉద్యోగాలు, పెట్టుబడులు, ఎగుమతులను పెంచడం ద్వారా వాణిజ్య రంగానికి మద్దతిస్తున్నాయి. ఎగుమతిదారులు దేశ వాణిజ్య సామర్థ్యాన్ని విస్తరిస్తూ, ప్రపంచ అనిశ్చితిని నిభాయించడంలో ఈ చర్యలన్నీ చేయూతనిస్తాయి.

జీఎస్‌టీ 2.0 విజయం

వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)లో సమగ్ర సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పన్ను విధింపును హేతుబద్ధీకరించి 5 శాతం, 18 శాతంతో రెండంచెలుగా సరళం చేసింది. ఈ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థకు కీలక చోదకాలైన సామాన్యుల వినియోగ వస్తువులు, శ్రామిక ప్రాధాన్య పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తూ తెచ్చిన ఈ సంస్కరణలతో కీలక రంగాలలో పన్నులు విస్తృతంగా తగ్గాయి.

దీనివల్ల 2024 అక్టోబరు నెల స్థూల జీఎస్‌టీ వసూళ్లు ₹1.87 లక్షల కోట్లతో పోలిస్తే 2025 అక్టోబరులో 4.6 శాతం పెరిగి, ₹1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పన్ను శాతాల హేతుబద్ధీకరణ అమలుతో సమాంతరంగా పండుగ సీజన్‌లో పుంజుకున్న వినియోగ ధోరణి ఆదాయంలో పెరుగుదలను ప్రస్ఫుటం చేస్తోంది.

జీఎస్‌టీ తగ్గుదలతో వస్తుసేవల ధరలు దిగివచ్చి, కుటుంబాల్లో వినియోగంతోపాటు పొదుపు పెరగడం వల్ల పన్ను వ్యవస్థ పునాది మరింత విస్తరించింది. ఈ విస్తృత పునాది స్థిరమైన రాబడి ధోరణికి తోడ్పడుతూ మరింత సమతుల, సుస్థిర వృద్ధి వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.

భారత్‌ వృద్ధి అంచనాలు

భారత్‌ వృద్ధిపై అంచనాలు బలపడుతూనే ఉన్నాయి... ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి  ప్రధాన రేటింగ్‌ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్థాన సామర్థ్యాన్ని దేశీయ డిమాండ్‌ విస్తరణను గుర్తించి, తమ అంచనాలను ఉన్నతీకరించాయి. ఇందులో భాగంగా 2025-26 జీడీపీపై రిజర్వు బ్యాంకు తన అంచనాను సవరించి 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. దేశంలోని అన్ని రంగాల్లోనూ బలమైన వేగాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మరోవైపు అంతర్జాతీయ సంస్థలు కూడా కింది విధంగా ఆశాభావం ప్రకటిస్తున్నాయి.

·         జీఎస్‌టీ సంస్కరణల సానుకూల ప్రభావంతోపాటు వినియోగం పుంజుకోవడాన్నిఉటంకిస్తూ- 2026లో జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

·         అలాగే భారత్‌ వృద్ధి 2026 వరకు 6.4 శాతంగా, 2027లో 6.5 శాతంగా నమోదై, వర్ధమాన జి20 ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని మూడీస్ సంస్థ తన అంచనాను ప్రకటించింది.

·         అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా భారత్‌ వృద్ధిని 2025లో 6.6 శాతం, 2026లో 6.2 శాతంగా ప్రకటించింది.

·         ఇక ‘ఓఈసీడీ’ 2025లో 6.7 శాతం, 2026లో 6.2 శాతంగా భారత్‌ వృద్ధి అంచనాలను పెంచింది.

·         భారత జీడీపీ వృధ్ధి 2026లో 6.5 శాతంగా, 2027లో 6.7 శాతంగా నమోదు కాగలదని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది.

మొత్తం మీద భారత ఆర్థిక మూలాలపై విస్తృత అంతర్జాతీయ విశ్వాసాన్ని, అంతర్జాతీయ సవాళ్ల ముప్పు ఉన్నప్పటికీ బలమైన, దేశీయ వృద్ధిని కొనసాగించగల సామర్థ్యాన్ని ఈ సవరణలు స్పష్టం చేస్తున్నాయి.

ముగింపు

సమూల సంస్కరణలు, డిజిటల్ రూపాంతరీకరణ, సార్వజనీన ప్రగతిపై నిశిత దృష్టితో భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిర, పునరుత్థాన వృద్ధి పథంలో పరుగు తీస్తోంది. దీనిపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసంతోపాటు సుస్థిర స్థూల ఆర్థిక సూచీల నిలకడ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఇదే వేగాన్ని కొనసాగించగల పటిష్ఠ స్థితిలో ఉంది. ద్రవ్యోల్బణంపై నిరంతర పర్యవేక్షణ, ఇటీవలి విధానపరమైన  చర్యలు, హేతుబద్ధీకృత పన్ను స్వరూపం, కార్మిక ప్రాధాన్య సంస్కరణలు, వాణిజ్య-ప్రోత్సాహక కార్యక్రమాలు, పాలనపరంగా ప్రభుత్వ కృషి వంటివి నిబంధనల అనుసరణను సరళం చేశాయి. దీంతోపాటు వ్యయాల తగ్గుతూ, అన్ని రంగాలలో విస్తృత భాగస్వామ్యానికి మద్దతు లభిస్తోంది. దీర్ఘకాలిక సుస్థిర వృద్ధికి తగిన మరింత ఉత్పాదక, పోటీతత్వ, ప్రజా ప్రాధాన్యంగల ఆర్థిక వ్యవస్థ వైపు భారత్‌ నిలకడగా పురోగమించడాన్ని ఈ పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి.

 

World Bank 

https://databank.worldbank.org/metadataglossary/world-development-indicators/series/NY.GDP.MKTP.KD.ZG

https://openknowledge.worldbank.org/server/api/core/bitstreams/71109bfe-cb0e-47d6-b2c5-722341e42b99/content

 

Ministry of Statistics & Programme Implementation

https://www.mospi.gov.in/sites/default/files/press_release/GDP_PR_Q1_2025-26_29082025.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189186

https://mospi.gov.in/54-index-industrial-production

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2183312

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2188343

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190790

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190829

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178447

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2195851&reg=3&lang=1  

 

RBI

https://rbidocs.rbi.org.in/rdocs/Publications/PDFs/MPR011020257F52BDBF1F184AE0A627BD9CEB1580FB.PDF

https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/FEMA23(R)(7)13112025.pdf

http://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=61626

 

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189914  

https://www.startupindia.gov.in/

 

Ministry of Road Transport & Highways

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2176932&reg=1&lang=42

 

Department of Economic Affairs

https://dea.gov.in/files/monthly_economic_report_documents/Final-MER%20September%202025.pdf

 

Department of Financial Services

https://dfs.dashboard.nic.in/DashboardF.aspx

 

Skill India Mission

https://skillindiamission.in/

https://www.skillindiadigital.gov.in/pmkvy-dashboard

 

Cabinet

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189389

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189381

 

Ministry of Finance

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2163555

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf

 

Moodys

https://www.moodys.com/web/en/us/insights/credit-risk/outlooks/macroeconomics-2026.html

 

IMF

https://www.imf.org/external/datamapper/NGDP_RPCH@WEO/IND?zoom=IND&highlight=IND

 

OECD

https://www.oecd.org/en/publications/2025/09/oecd-economic-outlook-interim-report-september-2025_ae3d418b.html 

 

PIB Backgrounder

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155121&ModuleId=3#:~:text=Notably%2C%20India%20is%20projected%20to,projected%20GDP%20of%20%247.3%20trillion

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155082&ModuleId=3&reg=1&lang=42

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154880&ModuleId=3

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150446

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150328

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2172356

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2168711

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2175702

 

News On Air

https://www.newsonair.gov.in/india-will-become-the-worlds-third-largest-economy-soon-rbi-governor/

https://www.newsonair.gov.in/india-remains-fastest-growing-economy-for-4-years-aims-for-20-more-piyush-goyal/

 

Ministry of Labour & Employment

https://www.epfindia.gov.in/site_docs/PDFs/EPFO_PRESS_RELEASES/22062025_EPFOAdds19.14LakhNetMembers_April2025.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2169975

 

Prime Minister’s Office

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2182117

 

Ministry of Electronics and Information Technology

https://www.meity.gov.in/offerings/schemes-and-services/details/production-linked-incentive-scheme-pli-for-large-scale-electronics-manufacturing-gNyMDOtQWa

 

S&P

https://www.spglobal.com/en/research-insights/special-reports/india-forward/shifting-horizons/how-indian-economic-growth-realigns-with-shifting-global-trends 

Click here to see pdf 

 

****

(Explainer ID: 156269) आगंतुक पटल : 68
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Marathi , हिन्दी , Kannada , Malayalam , Assamese , Bengali
Link mygov.in
National Portal Of India
STQC Certificate