Economy
ప్రపంచ దేశాలకు పెరుగుతున్న భారత ఎగుమతులు
प्रविष्टि तिथि:
21 NOV 2026 12:43 PM
ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతుల్లో భారీ వృద్ధి
2026-27 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ప్రపంచంలోని ప్రధాన ప్రాంతాలకు భారత వస్తు ఎగుమతులు విస్తృత వృద్ధిని నమోదు చేశాయి. ఆఫ్రికాకు ఎగుమతులు అత్యధికంగా 44% వృద్ధిని సాధించగా, ఆసియా 21% వృద్ధితో తర్వాతి స్థానంలో నిలిచింది. అమెరికా ఖండాలకు ఎగుమతులు 13% పెరిగాయి. యూరప్, సీఐఎస్ & బాల్టిక్ దేశాలకు ఎగుమతులు వరుసగా 8%, 7% పెరిగాయి. ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు ప్రధాన ఎగుమతి వర్గాలుగా కొనసాగాయి. విభిన్న మార్కెట్లు, ఉత్పత్తుల వర్గాల్లో మెరుగైన పనితీరు, ప్రపంచ ప్రాంతాల్లో భారత వస్తు ఎగుమతుల విస్తరణను ప్రతిబింబిస్తోంది.
ప్రపంచ ప్రాంతాల్లో బలపడుతున్న భారత ఎగుమతులు
2026-27 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ప్రపంచంలోని ప్రధాన ప్రాంతాల్లో భారత ఎగుమతులు విస్తృత వృద్ధిని నమోదు చేశాయి. ఆఫ్రికా, ఆసియా అత్యంత వేగంగా వృద్ధి సాధించిన ప్రాంతాలుగా నిలిచాయి.
ఆసియాకు ఎగుమతులు 21% పెరిగి 85.84 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 103.84 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఆఫ్రికాకు ఎగుమతులు 44% పెరిగి 21.87 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 31.42 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. అమెరికా ఖండాలకు ఎగుమతులు 13% వృద్ధితో 66.82 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. యూరప్‌కు ఎగుమతులు 8% పెరిగి 51.04 బిలియన్ అమెరికన్ డాలర్లకు, సీఐఎస్ & బాల్టిక్ దేశాలకు ఎగుమతులు 7% పెరిగి 3.36 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.

విభిన్న మార్కెట్లు, ఎగుమతి ఉత్పత్తుల వర్గాల్లో డిమాండ్ ఈ ప్రాంతీయ విస్తరణకు తోడ్పడింది. ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేసిన ఉత్పత్తుల్లో ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు ప్రధానంగా ఉన్నాయి.
ప్రాంతాలవారీ ఎగుమతుల పనితీరు
ఆసియా: చైనా, సింగపూర్ ముందంజతో 100 బిలియన్ అమెరికన్ డాలర్లు దాటిన ఎగుమతులు
ఆసియాకు భారత ఎగుమతులు 21% పెరిగి, 85.84 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 103.84 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో:
- చైనా, సింగపూర్ అతిపెద్ద మార్కెట్లుగా నిలిచాయి. ఈ దేశాలకు ఎగుమతులు వరుసగా 11.39 బిలియన్ అమెరికన్ డాలర్లు, 11.07 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. చైనాకు ఎగుమతులు 36% పెరగగా, సింగపూర్‌కు ఎగుమతులు 103% వృద్ధితో రెట్టింపునకు పైగా పెరిగాయి.
- మలేసియా, హాంకాంగ్ కూడా ముఖ్యమైన మార్కెట్లుగా నిలిచాయి. ఈ మార్కెట్లకు ఎగుమతులు వరుసగా 5.58 బిలియన్ అమెరికన్ డాలర్లు, 5.12 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. మలేసియా 83% వృద్ధిని, హాంకాంగ్ 37% వృద్ధిని నమోదు చేశాయి.
- ఇతర మార్కెట్లలో బంగ్లాదేశ్‌కు ఎగుమతులు 5.66 బిలియన్ అమెరికన్ డాలర్లు, నేపాల్‌కు 4.37 బిలియన్ అమెరికన్ డాలర్లు, జపాన్, ఆస్ట్రేలియాలకు ఒక్కో దేశానికి సుమారు 4.10 బిలియన్ అమెరికన్ డాలర్లు, శ్రీలంకకు 3.94 బిలియన్ అమెరికన్ డాలర్లు, దక్షిణ కొరియాకు 3.91 బిలియన్ అమెరికన్ డాలర్లు, వియత్నాంకు 3.83 బిలియన్ అమెరికన్ డాలర్లు, ఒమన్‌కు 3.29 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి.
ఉత్పత్తులవారీగా చూస్తే, ఇంజినీరింగ్ వస్తువులు వృద్ధి నమోదైన అతిపెద్ద వర్గంగా కొనసాగాయి. వీటి ఎగుమతులు 22% పెరిగి 27.47 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 28% వృద్ధితో 17.05 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు దాదాపు రెట్టింపై, 91% వృద్ధితో 10.54 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 9.59 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరగా, సేంద్రియ, అసేంద్రియ రసాయనాల ఎగుమతులు 6.17 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి.

అమెరికా ఖండాలు: యూఎస్, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తుల ఊతంతో 66.82 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగుమతులు
అమెరికా ఖండాలకు భారత ఎగుమతులు 13% పెరిగి, 59.30 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 66.82 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో:
- అమెరికా: ఎగుమతులు 11% వృద్ధితో 50.80 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఈ ప్రాంతంలో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగింది.
- బ్రెజిల్, మెక్సికో, కెనడా: ఎగుమతులు వరుసగా 4.33 బిలియన్ అమెరికన్ డాలర్లు, 3.45 బిలియన్ అమెరికన్ డాలర్లు, 2.67 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. బ్రెజిల్ 14%, మెక్సికో 26%, కెనడా 18% వృద్ధిని నమోదు చేశాయి.
- ఇతర మార్కెట్లు: కొలంబియా, చిలీ కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
ఈ ప్రాంత వృద్ధికి 21% పెరిగి 19.19 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిన ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు, 23% పెరిగి 15.35 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిన ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు ప్రధాన ఆధారంగా నిలిచాయి. ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 6.59 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత సేంద్రియ, అసేంద్రియ రసాయనాలు 4.17 బిలియన్ అమెరికన్ డాలర్లు, రత్నాలు, ఆభరణాలు 3.35 బిలియన్ అమెరికన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 3.16 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి.

యూరప్: ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల ముందంజతో 51 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగుమతులు
యూరప్‌కు భారత ఎగుమతులు 8% పెరిగి, 47.06 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 51.04 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో:
- యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ: 7.32 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతులతో యూకే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. జర్మనీ 6.34 బిలియన్ అమెరికన్ డాలర్లతో తర్వాతి స్థానంలో ఉంది. జర్మనీకి ఎగుమతులు 12% పెరిగాయి.
- స్పెయిన్, ఇటలీ: స్పెయిన్‌కు ఎగుమతులు 45% పెరిగి 4.68 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఇటలీకి ఎగుమతులు 25% వృద్ధితో 4.55 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
- ఫ్రాన్స్, టర్కీ: ఫ్రాన్స్‌కు ఎగుమతులు 3.73 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరగా, టర్కీకి ఎగుమతులు 72% పెరిగి 3.63 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
వృద్ధి నమోదైన ఉత్పత్తుల వర్గాల్లో ఇంజినీరింగ్ వస్తువులు అతిపెద్ద వర్గంగా కొనసాగాయి. వీటి ఎగుమతులు 12% పెరిగి 15.88 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 52% పెరిగి 5.44 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. సేంద్రియ, అసేంద్రియ రసాయనాల ఎగుమతులు 4.06 బిలియన్ అమెరికన్ డాలర్లకు, ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 3.29 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు కూడా 19% పెరిగి 2.20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ఆఫ్రికా: పెట్రోలియం, ఇంజినీరింగ్ వస్తువుల ఊతంతో 31.42 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగుమతులు
ఆఫ్రికాకు భారత ఎగుమతులు గణనీయంగా 44% పెరిగి, 21.87 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 31.42 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో:
- దక్షిణాఫ్రికా: 52% వృద్ధితో 5.69 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతులతో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగింది.
- టాంజానియా, కెన్యా: ఎగుమతులు వరుసగా 4.77 బిలియన్ అమెరికన్ డాలర్లు, 3.63 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. టాంజానియా 121% వృద్ధిని నమోదు చేయగా, కెన్యాకు ఎగుమతులు 101% పెరిగి రెట్టింపునకు పైగా చేరాయి.
- ఈజిప్ట్: ఎగుమతులు 73% పెరిగి 3.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
- నైజీరియా, మొజాంబిక్: ఈ దేశాలకు ఎగుమతులు కూడా సానుకూల వృద్ధిని నమోదు చేసి, వరుసగా 1.78 బిలియన్ అమెరికన్ డాలర్లు, 1.31 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ఉత్పత్తులవారీగా చూస్తే, పెట్రోలియం ఉత్పత్తులు అత్యధిక వాటాతో 11.85 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నిలిచాయి. 137% వృద్ధితో వీటి ఎగుమతులు రెట్టింపునకు పైగా పెరిగాయి. ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు 29% పెరిగి 7.48 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 2.58 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. సేంద్రియ, అసేంద్రియ రసాయనాల ఎగుమతులు 1.41 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి. ప్లాస్టిక్, లినోలియం ఉత్పత్తులు, మాంసం, పాల, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు కూడా గణనీయమైన సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
సీఐఎస్ & బాల్టిక్ దేశాలు: 3.36 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగిన ఎగుమతులు
సీఐఎస్ & బాల్టిక్ దేశాలకు భారత ఎగుమతులు 7% పెరిగి, 3.14 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 3.36 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో:
- రష్యా: వృద్ధి నమోదైన మార్కెట్లలో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగింది. ఎగుమతులు 7% పెరిగి 2.39 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
- జార్జియా: ఎగుమతులు 0.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి.
- ఆర్మేనియా, కజకిస్థాన్: ఈ దేశాలకు ఎగుమతులు కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
వృద్ధి నమోదైన ఉత్పత్తుల వర్గాల్లో సేంద్రియ, అసేంద్రియ రసాయనాల ఎగుమతులు 33% పెరిగి 0.37 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత మాంసం, పాల, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 36% వృద్ధితో 0.36 బిలియన్ అమెరికన్ డాలర్లుగా, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 0.24 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. మైకా, బొగ్గు, ఇతర ఖనిజ ముడిపదార్థాలు, ఖనిజాల ఎగుమతులు 0.17 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరగా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 0.14 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి.

మార్కెట్లు, ఉత్పత్తుల్లో వైవిధ్యం
ప్రాంతాలవారీ ధోరణులు ప్రపంచ మార్కెట్లలో భారత ఎగుమతుల పరిమాణాన్ని, పెరుగుతున్న వైవిధ్యాన్ని చాటిచెబుతున్నాయి. 103 బిలియన్ అమెరికన్ డాలర్లకుపైగా ఎగుమతులతో ఆసియా ప్రధాన ఆధారంగా కొనసాగింది. దీనికి 66.82 బిలియన్ అమెరికన్ డాలర్ల అమెరికా ఖండాల మార్కెట్, 51.04 బిలియన్ అమెరికన్ డాలర్ల యూరప్ మార్కెట్ తోడయ్యాయి. ఆఫ్రికాకు ఎగుమతులు ముఖ్యంగా గణనీయంగా విస్తరించి 31 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటాయి.
ముఖ్యంగా అమెరికా, చైనా, సింగపూర్, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి పెద్ద, వాణిజ్యపరంగా ముఖ్యమైన మార్కెట్లు ఈ వృద్ధికి తోడ్పడ్డాయి. వీటితోపాటు మలేసియా, స్పెయిన్, ఇటలీ, టాంజానియా, కెన్యాల్లోనూ ఎగుమతులు గణనీయంగా విస్తరించాయి.
ఉత్పత్తులవారీగా చూస్తే, వృద్ధి నమోదైన ఎగుమతుల్లో ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు విలువపరంగా ముందున్నాయి. ప్రపంచ మార్కెట్లలో భారత వస్తు ఎగుమతుల విస్తరణ భౌగోళికంగా, ఉత్పత్తులపరంగా వైవిధ్యంతో సాగుతోందని ఇది సూచిస్తోంది.
***
(तथ्य सामग्री आईडी: 151227)
आगंतुक पटल : 18
Provide suggestions / comments