• Sitemap
  • Advance Search
Economy

భారత స్థూల దేశీయోత్పత్తి పనితీరు

प्रविष्टि तिथि: 01 SEP 2026 14:53 PM

వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధితో 2026–27కు బలమైన ప్రారంభం

 

తయారీసేవల రంగాల ఊతంతో 2026–27 తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.8 శాతానికి చేరడంతో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రారంభం గొప్ప‌గా మొద‌లైంది. వాస్తవ జీవీఏ 8.2 శాతం పెరిగింది. పెట్టుబడులు 11.9 శాతంకుటుంబాల వినియోగం 7.1 శాతంఎగుమతులు 12 శాతం వృద్ధి చెందాయి. జూలైలోనూ ఇదే వేగం కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి 6.7 శాతం పెరగగాఏప్రిల్‌–జూలై మధ్య వస్తుసేవల సంచిత ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.16 శాతం వృద్ధి చెందాయి. జూలైలో పరిశ్రమలకు రుణాలు 20 శాతంసేవల రంగానికి రుణాలు 22.9 శాతం పెరిగాయి.

 

భారత స్థూల ఆర్థిక స్థితి

నిరంతర భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలుప్రపంచ వాణిజ్య అనిశ్చితి మధ్య భారత్ 2026–27లోకి అడుగుపెట్టింది. బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ 2026–27 తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. 2023–24 నుంచి 2026–27 వరకు నాలుగేళ్ల కాలంలో తొలి త్రైమాసికానికి నమోదైన అత్యధిక వాస్తవ జీడీపీ వృద్ధి ఇదే. బలమైన దేశీయ గిరాకీతయారీసేవల రంగాల పురోగతి ఈ వృద్ధికి మద్దతు ఇచ్చాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత పాత్రను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. 2026 జూలైలో భారత్‌ను ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగాప్రపంచ వృద్ధికి కీలక చోదకశక్తిగా అభివర్ణించింది.

భారత సార్వభౌమ రుణ అంచనా కూడా ఈ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. 2026 ఆగస్టులో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్‌... స్థిరమైన దృక్పథంతో భారత ‘బీబీబీ/ఏ–2’ సార్వభౌమ రేటింగ్‌లను ధ్రువీకరించింది. 18 ఏళ్ల విరామం తర్వాత 2025లో దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘బీబీబీ’కి పెంచిన నేపథ్యంలో తాజా ధ్రువీకరణ వెలువడింది.

 

2026–27కు మరింత బలమైన ప్రారంభం

తొలి త్రైమాసికంలో వేగవంతమైన వృద్ధి

 

2026–27 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి బలపడింది. ఈ ఫలితం త్రైమాసికానికి భారతీయ రిజర్వు బ్యాంకు అంచనా వేసిన 7 శాతం వృద్ధిని అధిగమించింది.

•             స్థిర ధరల వద్ద జీడీపీగా పిలిచే వాస్తవ జీడీపీ 2026–27 తొలి త్రైమాసికంలో ₹81.36 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. 2025–26 తొలి త్రైమాసికంలో నమోదైన 6.9 శాతంతో పోలిస్తే ఇది 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

•             ప్రస్తుత ధరల వద్ద జీడీపీగా పిలిచే నామమాత్రపు జీడీపీ ₹88.27 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గత ఏడాది నమోదైన 8.1 శాతంతో పోలిస్తే ఇది 10.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంటే నిర్దిష్ట గణన వ్యవధిలో దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన తుది వస్తువులుసేవల విలువ.

 

•             వాస్తవ జీవీఏ ₹73.82 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గత ఏడాది 7 శాతం వృద్ధితో పోలిస్తే ఇది 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

•             నామమాత్రపు జీవీఏ ₹80.53 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గత ఏడాది 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది 11.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

స్థూల విలువ జోడింపు(జీవీఏ) ఆర్థిక వ్యవస్థకు ఉత్పత్తిదారులుపరిశ్రమలు లేదా రంగాలు అందించే వ్యక్తిగత వాటాను కొలుస్తుంది.

 

సవరించిన అంచనాలతో మరింత బలపడిన వృద్ధి చిత్రం

గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వాస్తవ జీడీపీని ఎగువకు సవరించారు. తొలి త్రైమాసిక పనితీరు గతంలో అంచనా వేసిన దానికంటే బలమైన వృద్ధి పథాన్ని అనుసరించినట్లు ఈ సవరణలు వెల్లడిస్తున్నాయి.

 

పట్టిక–1: సవరించిన వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలు

ఆర్థిక సంవత్సరం

గత అంచనా

సవరించిన అంచనా

2023–24

7.2%

7.3%

2024–25

7.1%

7.2%

2025–26

7.7%

7.8%

మూలం: కేంద్ర గణాంకాలుకార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

సవరించిన అంచనాలకు ప్రాతిపదిక

2022–23 ఆధార సంవత్సరంతో రూపొందించిన కొత్త ధరలుఉత్పత్తి సూచీలను వార్షిక సవరించిన అంచనాల్లో ఉపయోగించారు. వీటిలో ఉత్పత్తి ఉత్పాదక ధరల సూచీబ్యాంకింగ్ సేవల ధరల సూచీ ఉన్నాయి. వివిధ వనరుల నుంచి సేకరించిన తాజా పరిపాలనా సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.

 

జాతీయ ఖాతాల గణాంకాల సవరణలపై మరింత సమాచారం కోసం చూడండి: గణనలో కీలక అంశాలకు ప్రాధాన్యం: భారత జాతీయ ఖాతాలుప్రధాన ఆర్థిక గణాంకాల బలోపేతం

 

వృద్ధి చోదకాల కూర్పు

ప్రధాన వ్యయ విభాగాల్లో ధోరణులు

పెట్టుబడుల్లో భారీ పెరుగుదలస్థిరమైన కుటుంబ వినియోగంబలమైన ఎగుమతులు తొలి త్రైమాసిక ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చాయి.

 

పట్టిక–2: వాస్తవ జీడీపీలో ప్రధాన వ్యయ విభాగాలు

విభాగం

వివరణ

2025–26 తొలి త్రైమాసికం

2026–27 తొలి త్రైమాసికం

స్థూల స్థిర మూలధన నిర్మాణం

పెట్టుబడులకు దేశీయ నిధులు

5.8%

11.9%

ప్రైవేటు తుది వినియోగ వ్యయం

వస్తువులుసేవలపై కుటుంబాల వ్యయం

6.8%

7.1%

ఎగుమతులు

ఇతర దేశాలకు సరఫరా చేసిన వస్తువులుసేవలు

6.0%

12.0%

మూలం: కేంద్ర గణాంకాలుకార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

 

ప్రధాన రంగాలన్నింటికీ విస్తరించిన వృద్ధి

వ్యయాల్లో కనిపించిన బలం ఉత్పత్తి రంగంలోనూ ప్రతిబింబించింది. తృతీయద్వితీయ రంగాలు మరింత వేగంగా విస్తరించాయి.

•             వాస్తవ జీవీఏ ప్రకారం 2026–27 తొలి త్రైమాసికంలో తృతీయ రంగం 10 శాతం వృద్ధి నమోదు చేసింది. 2025–26 తొలి త్రైమాసికంలో ఇది 8 శాతంగా ఉంది. ఈ రంగంలో ఆర్థిక సేవలుస్థిరాస్తిసమాచార సాంకేతికతవృత్తిపరమైన సేవలు 12.1 శాతం వృద్ధి చెందాయి.

•             ద్వితీయ రంగం 2026–27 తొలి త్రైమాసికంలో 8.6 శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 6.1 శాతంగా ఉంది.

• కీలక విభాగాల్లో బలమైన ఉత్పత్తి మద్దతుతో తయారీ రంగం 9.2 శాతం వృద్ధి చెందింది. త్రైమాసికంలో అనేక తయారీ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి:

 

పట్టిక–3: ప్రధాన తయారీ విభాగాల్లో గణనీయ వృద్ధి(గత ఏడాదితో పోల్చితే ఐఐపీ వృద్ధి(%))

తయారీ విభాగం

2025–26 తొలి త్రైమాసికం

2026–27 తొలి త్రైమాసికం

విద్యుత్ పరికరాలు

9.7

27.0

ఇతర రవాణా పరికరాలు

3.8

19.5

కంప్యూటర్‌ఎలక్ట్రానిక్‌ఆప్టికల్ ఉత్పత్తులు

8.8

12.4

యంత్రాలుపరికరాలు

6.6

9.1

మూలం: కేంద్ర గణాంకాలుకార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) ప్రకారం 2026–27 తొలి త్రైమాసికంలో మూలధన వస్తువుల ఉత్పత్తి కూడా 15.2 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇది 8.8 శాతంగా ఉంది. మౌలిక వసతులు/నిర్మాణ వస్తువుల వృద్ధి 6.1 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగింది.

 

వృద్ధి వేగం కొనసాగుతున్నట్లు సూచిస్తున్న తాజా గణాంకాలు

 

పారిశ్రామిక కార్యకలాపాల్లో స్థిరమైన పురోగతి

•             2026 జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి 6.7 శాతం పెరిగింది. గత ఏడాది ఇది 5.4 శాతంగా ఉంది. 2026–27 ఏప్రిల్‌–జూలై మధ్య పారిశ్రామిక ఉత్పత్తి 6.3 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 4 శాతంగా ఉంది.

•             2025 జూలైతో పోలిస్తే 2026 జూలైలో మూలధన వస్తువుల ఉత్పత్తి 16.1 శాతం పెరిగింది. మధ్యంతర వస్తువుల ఉత్పత్తి 10 శాతంమౌలిక వసతులునిర్మాణ వస్తువుల ఉత్పత్తి 6.9 శాతం వృద్ధి చెందాయి.

•             2025 జూలైతో పోలిస్తే 2026 జూలైలో కీలక పరిశ్రమల సూచీ(ఐసీఐ) 5.4 శాతం వృద్ధి నమోదు చేసింది. 2026–27 ఏప్రిల్‌–జూలై మధ్య ఈ సూచీ 4.3 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 1.5 శాతంతో పోలిస్తే ఇది అధికం.

 

బలమైన ఎగుమతి పనితీరు

•             2026 జూలైలో భారత వస్తుసేవల ఉమ్మడి ఎగుమతులు 80.14 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరినట్లు అంచనా. 2025 జూలైతో పోలిస్తే ఇది 13.31 శాతం వృద్ధి. 2026–27 ఏప్రిల్‌–జూలై మధ్య సంచిత ఎగుమతులు 316.42 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. 2025–26 ఏప్రిల్‌–జూలై మధ్య నమోదైన 279.63 బిలియన్ అమెరికన్ డాలర్లతో పోలిస్తే ఇది 13.16 శాతం అధికం.

 

ప్రధాన రంగాలకు విస్తరించిన రుణాలు

2026 జూలైలో ప్రధాన రంగాలకు బ్యాంకు రుణాల వృద్ధి బలపడింది.

•             వ్యవసాయంఅనుబంధ కార్యకలాపాలకు రుణాలు గత ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2025 జూలైలో ఈ వృద్ధి 7.3 శాతంగా ఉంది.

•             పరిశ్రమలకు రుణాలు 20 శాతం పెరిగాయి. 2025 జూలైలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే ఇది అధికం.

•             సేవల రంగానికి రుణాలు 22.9 శాతం పెరిగాయి. 2025 జూలైలో ఈ వృద్ధి 10.2 శాతంగా ఉంది.

 

వృద్ధికి మద్దతు ఇస్తున్న తాజా విధాన చర్యలు

2026లో ప్రవేశపెట్టిన విధాన చర్యలు తయారీఇంధన భద్రతవాణిజ్యంపెట్టుబడులువ్యవసాయం వంటి రంగాలకు విస్తరించి ఆర్థిక ధోరణులకు అనుబంధ బలాన్ని అందించాయి.

 

తయారీపారిశ్రామిక రంగం

•             2026 జూలైలో ప్రవేశపెట్టిన మొబైల్ ఫోన్ తయారీ పథకానికి 2030–31 వరకు ₹62,500 కోట్ల వ్యయ ప్రణాళిక ఉంది. ఉత్పత్తిని మరింత విస్తరించడంవిలువ జోడింపును పెంచడంప్రపంచ పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.

•             2026 జూలైలో ఆమోదం పొందిన సెమికాన్‌ 2.0కు ₹1,27,500 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. చిప్ రూపకల్పనతయారీఅధునాతన ప్యాకేజింగ్‌పరిశోధనముడి పదార్థాలుపరికరాలునైపుణ్యాభివృద్ధికి ఇది మద్దతు ఇస్తుంది.

•             2026 జూలైలో ఆమోదం పొందిన భవ్య రసాయన్ పథకానికి 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్లకు ₹3,030 కోట్ల వ్యయ ప్రణాళిక ఉంది. దేశవ్యాప్తంగా మూడు ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటుకు ఇది మద్దతు ఇస్తుంది.

•             పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర రుణ హామీ పథకం 5.0(ఈసీఎల్‌జీఎస్ 5.0) అదనంగా ₹2.55 లక్షల కోట్ల రుణ ప్రవాహాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సూక్ష్మచిన్నమధ్య తరహా సంస్థలకు 100 శాతంఇతర సంస్థలకు 90 శాతం హామీ రక్షణ అందిస్తుంది.

•             2026 ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన సూక్ష్మచిన్నమధ్య తరహా సంస్థల అభివృద్ధి(సవరణ) బిల్లు–2026 నిబంధనల అమలును సులభతరం చేసిఈ సంస్థల అభివృద్ధిపోటీ సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది.

 

ఇంధన భద్రత

•             జాతీయ సముద్ర తీర‌ అన్వేషణ పథకమైన సముద్ర మంథన్‌కు 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ₹84,084 కోట్ల వ్యయ ప్రణాళిక ఉంది. భారత తీరాంతర ఇంధన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు అన్వేషణకు ఈ పథకం మద్దతు ఇస్తుంది.

•             ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి 2026 మేలో ₹37,500 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యానికి ఇది మద్దతు ఇస్తూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

•             జాతీయ వృత్తాకార జీవ ఇంధన పథకమైన గోబర్‌ధన్‌కు 2026 ఆగస్టులో ₹23,731 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. 2026–27 నుంచి 2035–36 వరకు పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయపశుపట్టణ సేంద్రియ వ్యర్థాల నుంచి సంపీడిత జీవవాయువు ఉత్పత్తిని పెంచడం దీని లక్ష్యం.

•             2026 జూలైలో ఆమోదం పొందిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం-ఎస్ఎస్‌వై)కు ₹5,070 కోట్ల వ్యయ ప్రణాళిక ఉంది. ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించిన 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఇది మద్దతు ఇస్తుంది. 2026–27 నుంచి 2030–31 వరకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారు.

 

వాణిజ్యంపెట్టుబడులు

•             భారత్‌–యునైటెడ్ కింగ్‌డమ్ సమగ్ర ఆర్థికవాణిజ్య ఒప్పందంసామాజిక భద్రతా ఒప్పందం 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లే భారత ఎగుమతుల్లో దాదాపు 99 శాతానికి సుంకం లేని మార్కెట్ సదుపాయాన్ని ఇవి కల్పిస్తాయి.

•             భారత్‌–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం(బీఐఏ) 2026 జూలై 4 నుంచి అమల్లోకి వచ్చింది. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపెట్టుబడులకు మరింత సురక్షితమైనముందుగా అంచనా వేయగల వ్యవస్థను అందించడం దీని లక్ష్యం.

•             ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల(ఎఫ్‌పీఐ) భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు 2026 జూన్‌లో సంస్కరణలను ప్రకటించారు. పన్ను మినహాయింపులుపూర్తిగా అందుబాటులో ఉండే మార్గం కింద విస్తృత పరిధిసరళీకృత పెట్టుబడి నిబంధనలు ప్రధాన చర్యల్లో ఉన్నాయి. దీర్ఘకాలిక విదేశీ మూలధనాన్ని ఆకర్షించడంభారత రుణ మార్కెట్‌ను మరింత విస్తరించడం ఈ సంస్కరణల ఉద్దేశం.

•             2026 మేలో ప్రారంభించిన భారత్ సముద్ర బీమా సమూహానికి(బీఎంఐపీ) ₹12,980 కోట్ల సార్వభౌమ హామీ ఉంది. ప్రపంచ ఒడుదొడుకుల మధ్య విదేశీ బీమా సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ సముద్ర సంబంధిత ముప్పులకు బీమా రక్షణ అందిస్తుంది.

 

వ్యవసాయం: రైతుల ఆదాయంఉత్పత్తికి మద్దతు

•             ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్‌)ని 2026–27 నుంచి 2030–31 వరకు కొనసాగించేందుకు ₹3.15 లక్షల కోట్ల వ్యయంతో ఆమోదం ఇచ్చారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం ఆదాయ సహాయం అందిస్తుంది.

•             2026–27 మార్కెటింగ్ సీజన్‌కు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచింది. పొద్దుతిరుగుడు విత్తనాలుపత్తివలిశలునువ్వులకు నగదు పరంగా అత్యధిక పెంపు లభించింది.

•             2026 మేలో ఆమోదం పొందిన పత్తి ఉత్పాదకత మిషన్‌(కపాస్ కాంతి)కి 2026–27 నుంచి 2030–31 వరకు ₹5,659.22 కోట్ల వ్యయ ప్రణాళిక ఉంది. పత్తి రైతులను ఆధునిక పరిశోధనసాంకేతికతలతో అనుసంధానించడంచీడపీడల ముప్పులను తగ్గించడంఉత్పత్తి వ్యవస్థలువ్యవసాయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.

•             యూరియా జాతీయ పెట్టుబడి విధానం–2026(ఎన్ఐపీయూ-2026) గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్లలో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడంతోపాటు యూరియాలో స్వావలంబన సాధించాలన్న భారత లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.

మేక్ ఇన్ ఇండియాఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాలుపీఎం–కిసాన్‌ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ సహా గత దశాబ్దంలో అమలు చేసిన విధాన కార్యక్రమాలకు ఈ చర్యలు కొనసాగింపుగా నిలుస్తున్నాయి.

 

ముగింపు

2026–27 ప్రారంభంలో భారత ఆర్థిక పనితీరు ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలన్నింటిలో విస్తృత వృద్ధి వేగాన్ని ప్రతిబింబిస్తోంది. పెట్టుబడులు వేగంగా పెరిగాయి. కుటుంబాల వినియోగం స్థిరంగా కొనసాగగా తయారీసేవలుఎగుమతులు అదనపు మద్దతు అందించాయి.

తొలి త్రైమాసికం తర్వాత కూడా ఈ బలం కొనసాగినట్లు తాజా సూచీలు వెల్లడిస్తున్నాయి. వివిధ విధాన చర్యల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారం ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని కొనసాగించేందుకు తోడ్పడింది.

References

Ministry of Statistics & Programme Implementation:

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2304949&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2304948&reg=48&lang=1

https://www.mospi.gov.in/uploads/announcements/announcements_1772117257791_84ae898f-7be2-4b7d-a135-565e1a809513_FAQ_GDP_26022026_1902.pdf

https://www.mospi.gov.in/sites/default/files/publication_reports/national_accounta_0.pdf

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2304222&reg=48&lang=1

https://www.pib.gov.in/FaqDetails.aspx?ModuleId=4&NoteId=157582&lang=1&reg=48

Ministry of Finance:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2280989&lang=1&reg=48

Ministry of Commerce & Industry:

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2301558&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298878&lang=1&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285085&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294775&lang=1&reg=6

Ministry of Electronics & IT:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284796&lang=2&reg=48

Ministry of Chemicals and Fertilizers:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288866&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288824&lang=1&reg=48

Ministry of Petroleum & Natural Gas:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2295494&lang=1&reg=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2301012&reg=48&lang=1

Ministry of New and Renewable Energy:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292465&lang=1&reg=1

Ministry of Agriculture & Farmers Welfare:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292460&lang=1&reg=6

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260618&lang=3&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258187&reg=48&lang=2

Union Cabinet:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284789&lang=1&reg=20

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258114&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292445&lang=1&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260621&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253242&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250032&lang=1&reg=20

Cabinet Committee on Economic Affairs (CCEA):

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284800&lang=1&reg=3

Reserve Bank of India (RBI):

https://rbidocs.rbi.org.in/rdocs/Bulletin/PDFs/0BULL25082026F2C1FCCDD5CBB4F6EAE15BCBB541FC331.PDF

https://www.rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=63287

https://www.rbi.org.in/scripts/BS_PressReleaseDisplay.aspx?prid=63478

International Monetary Fund (IMF):

https://www.imf.org/en/news/articles/2026/07/09/tr-07092026-imf-press-briefing-transcript-july-09-2026

United Nations (UN):

https://unstats.un.org/unsd/nationalaccount/glossresults.asp?gID=232&

PIB Archives:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297792&lang=1&reg=3

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150624&lang=1&reg=48

Others:

https://www.spglobal.com/ratings/en/regulatory/article/-/view/type/HTML/id/3618793

India’s GDP Performance

 

***

(तथ्य सामग्री आईडी: 150999) आगंतुक पटल : 4


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Kannada , Bengali , Urdu , Assamese