• Sitemap
  • Advance Search
Economy

దేశ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో యూపీఐతో కొత్త శ‌కం

प्रविष्टि तिथि: 24 AUG 2026 14:13 PM

ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ దిశగా



గత దశాబ్ద కాలంలో భారత డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ విశేష పరివర్తన సాధించింది. ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండే సరళమైన, సురక్షితమైన చెల్లింపు వ్యవస్థను రూపొందించాలన్న దార్శనికత ఈ మార్పున‌కు చోదకశక్తిగా నిలిచింది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ అభివృద్ధి చేసిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ(యూపీఐ) దేశ డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి కీలక స్తంభంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐని అంగీకరిస్తున్నారు. భారత తక్షణ చెల్లింపుల వేదికను తాజాగా స్వీకరించిన దేశాల్లో గ్రీస్‌, మాల్దీవులు ఉన్నాయి.

యూపీఐ పరిణామ క్రమం
వివిధ వ్యవస్థల మధ్య పనిచేసే నిర్మాణం, సులభమైన వినియోగంతో వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు లావాదేవీలు నిర్వహించే విధానాన్ని యూపీఐ మౌలికంగా మార్చింది.
* భాగస్వామ్య బ్యాంకు లేదా చెల్లింపు సేవా సంస్థకు చెందిన ఒకే మొబైల్‌ యాప్‌ ద్వారా పలు బ్యాంకు ఖాతాలను నిర్వహించే తక్షణ చెల్లింపు వ్యవస్థ.
* పలు బ్యాంకింగ్‌ సేవలు, నగదు బదిలీలు, వ్యాపార చెల్లింపులను ఒకే వేదికపై సమీకరిస్తుంది.
* రోజంతా డిజిటల్‌ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.
* లావాదేవీల భద్రతను మెరుగుపరచేందుకు రెండంచెల ధ్రువీకరణ, పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది

గత దశాబ్ద కాలంలో యూపీఐ భారత డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా పరిణామం చెందింది. యూపీఐ పరిణామ క్రమంలోని కొన్ని కీలక మైలురాళ్లు:

2016
* 21 సభ్య బ్యాంకులతో 2016 ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా యూపీఐని ప్రారంభించారు.
* భాగస్వామ్య బ్యాంకులు యూపీఐ ఆధారిత మొబైల్‌ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకురావడంతో 2016 ఆగస్టులో ప్రజల వినియోగానికి ప్రవేశపెట్టారు.
* యూపీఐ ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు వీలు కల్పించేందుకు 2016 డిసెంబరులో భీమ్‌ యాప్‌ను ప్రారంభించారు. మొబైల్‌ పరికరాల ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నేరుగా లావాదేవీలు నిర్వహించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

2017
* మారుతూ ఉండే క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులకు వీలు కల్పించే రిటైల్‌ వ్యాపార వేదిక ‘డైనమిక్‌ క్యూఆర్‌’ను ప్రారంభించారు. చెల్లింపు స్వీకర్త సమాచారం, కచ్చితమైన మొత్తం వంటి లావాదేవీ వివరాలు క్యూఆర్‌ కోడ్‌లో స్వయంచాలకంగా చేరడంతో మొత్తాన్ని చేతితో నమోదు చేయాల్సిన అవసరం తొలగింది.

2018
* డిజిటల్‌ చెల్లింపులను మరింత సరళంగా, సురక్షితంగా, నిరంతరాయంగా మార్చే మెరుగైన సదుపాయాలతో యూపీఐ 2.0ను ప్రవేశపెట్టారు.
* ఇన్‌వాయిస్‌ ఇన్‌ ది ఇన్‌బాక్స్‌ సదుపాయం ద్వారా చెల్లింపునకు అనుమతి ఇచ్చే ముందు బిల్లులు లేదా ఇన్‌వాయిస్‌లను వినియోగదారులు చూడవచ్చు.
* సైన్డ్‌ ఇంటెంట్‌, క్యూఆర్‌ భద్రతను కొనసాగిస్తూనే చెల్లింపుల ధ్రువీకరణను సరళీకరిస్తుంది.
* యూపీఐ మ్యాండేట్స్‌ ముందస్తుగా ఇచ్చిన ఆదేశాల ద్వారా పునరావృత చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.
* ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతా అనుసంధానం ద్వారా ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలను ఉపయోగించి యూపీఐ లావాదేవీలు నిర్వహించవచ్చు.

2019
* నిర్దేశిత మధ్యవర్తుల ద్వారా ఐపీఓలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు రిటైల్‌ వ్యక్తిగత పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానంగా యూపీఐని ఉపయోగించేందుకు సెబీ అనుమతించింది.
* దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా 2019 అక్టోబరులో యూపీఐ ఒకే నెలలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది.

2020–2022
* చందాలు, వినియోగ సేవల బిల్లులు, బీమా ప్రీమియంలు, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు, నెలవారీ వాయిదాల పునరావృత ఈ–మ్యాండేట్ల కోసం యూపీఐ ఆటోపేను ప్రారంభించారు.
* యూపీఐ 123పే ద్వారా సాధారణ ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులను డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకొచ్చారు. ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌(ఐవీఆర్‌) నంబరు, యాప్‌ ఆధారిత సదుపాయం, మిస్డ్‌ కాల్‌ విధానం, సమీప ధ్వని ఆధారిత చెల్లింపుల ద్వారా లావాదేవీలకు ఇది వీలు కల్పిస్తుంది.
* తక్కువ విలువ కలిగిన లావాదేవీలను వేగంగా, పిన్‌ అవసరం లేకుండా నిర్వహించేందుకు యూపీఐ లైట్‌ను ప్రవేశపెట్టారు.
* యూపీఐతో క్రెడిట్‌ కార్డుల అనుసంధానం వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపు ప్రత్యామ్నాయాలను మరింత విస్తరించింది.
* 2021–22 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా ఒక ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పైగా విలువైన లావాదేవీలు జరిగాయి. 2022 మార్చిలో నెలకు 500 కోట్ల లావాదేవీలను దాటింది.
* భూటాన్‌లో యూపీఐ ప్రారంభం ద్వారా తొలి అంతర్జాతీయ విస్తరణ జరిగింది.

2023
* ముందుగా మంజూరైన బ్యాంకు రుణ పరిమితులను చెల్లింపుల ఖాతాగా అనుసంధానించేందుకు యూపీఐపై క్రెడిట్‌ లైన్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.
* 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత డిజిటల్‌ చెల్లింపు లావాదేవీల్లో దాదాపు 70 శాతం వాటాను యూపీఐ కలిగి ఉంది.

2024
* ప్రాథమిక వినియోగదారుడి బ్యాంకు ఖాతాపై ముందుగా నిర్దేశించిన లావాదేవీ పరిమితులతో ద్వితీయ వినియోగదారులకు అనుమతి ఇచ్చే యూపీఐ సర్కిల్‌ను ప్రవేశపెట్టారు.
* పన్ను చెల్లింపుల కోసం ఒక్కో యూపీఐ లావాదేవీ పరిమితిని భారతీయ రిజర్వు బ్యాంకు ₹లక్ష నుంచి ₹5 లక్షలకు పెంచింది. మూలధన మార్కెట్లు, ఐపీఓ చందాలు, రుణ వసూళ్లు, బీమా, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ఎంపిక చేసిన విభాగాలకు కూడా అధిక పరిమితులు వర్తిస్తాయి.
* యూపీఐ 123పే ఒక్కో లావాదేవీ పరిమితిని ₹10 వేలకు పెంచడంతో వినియోగ అవకాశాలు విస్తరించాయి.
* యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితిని ₹5 వేలకు, ఒక్కో లావాదేవీ పరిమితిని ₹వెయ్యికి పెంచారు.

2025
* స్మార్ట్‌ఫోన్‌ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపుతో చెల్లింపులకు వీలు కల్పించే యూపీఐ ఆన్‌–డివైస్‌ ధ్రువీకరణను ప్రవేశపెట్టారు.
* ముఖ్యంగా తొలిసారి వినియోగించేవారు, వృద్ధులు, కార్డులను సులభంగా వినియోగించలేని వారికి యూపీఐ పిన్‌ నమోదు ప్రక్రియను ఆధార్‌ ఆధారిత ముఖ ధ్రువీకరణ సరళీకరించింది.

ప్రస్తుతం యూపీఐ
వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఆర్థిక సంస్థల్లో విస్తృత ఆదరణను ప్రతిబింబిస్తూ లావాదేవీల పరిమాణం, విలువలో యూపీఐ మునుపెన్నడూ లేని వృద్ధిని నమోదు చేసింది.

2016–17 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు:
* వార్షిక లావాదేవీల పరిమాణం 2 కోట్ల నుంచి 24,162 కోట్లకు పైగా పెరిగింది. ఇది దాదాపు 12 వేల రెట్ల వృద్ధి.
* వార్షిక లావాదేవీల విలువ ₹0.07 లక్షల కోట్ల నుంచి దాదాపు ₹314 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 4 వేల రెట్లకు పైగా వృద్ధి.

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం, పరిధిని యూపీఐ పూర్తిగా మార్చింది. 2026 జూలైలో:
* భారత బ్యాంకింగ్‌ రంగంలో విస్తృత ఆదరణకు నిదర్శనంగా యూపీఐ వ్యవస్థలో 741 క్రియాశీల బ్యాంకులు ఉన్నాయి.
* యూపీఐ ద్వారా 2,365.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.
* మొత్తం లావాదేవీల విలువ ₹29.87 లక్షల కోట్లుగా నమోదైంది.

 

A person pointing at a graphAI-generated content may be incorrect.



యూపీఐ ప్రపంచ విస్తరణ
ప్రపంచంలోని ప్రముఖ తక్షణ చెల్లింపు వ్యవస్థగా యూపీఐ ఆవిర్భవించింది. 2024 నాటికి ప్రపంచ తక్షణ చెల్లింపు లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2025 జూన్‌లో ప్రచురించిన ‘రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల వృద్ధి: పరస్పర అనుసంధాన విలువ’ నివేదికలో ఈ విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

A diagram of a companyAI-generated content may be incorrect.



కొనసాగుతున్న యూపీఐ ప్రపంచ విస్తరణ
* భూటాన్‌, నేపాల్‌, సింగపూర్‌, యూఏఈ, ఫ్రాన్స్‌, శ్రీలంక, మారిషస్‌, ఖతార్‌లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. నిరంతరాయ సరిహద్దు డిజిటల్‌ చెల్లింపులకు ఇవి వీలు కల్పిస్తున్నాయి.
* కంబోడియాలో యూపీఐ చెల్లింపులను ప్రారంభించేందుకు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ 2026 జూన్‌లో ఏసీఎల్‌ఈడీఏ బ్యాంక్‌ పీఎల్‌సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత సరిహద్దు డిజిటల్‌ చెల్లింపుల
అనుసంధానాన్ని ఇది మరింత బలోపేతం చేసింది.
*గ్రీస్‌–భారత్‌ మధ్య అర్హత కలిగిన వినియోగదారులు యూరోబ్యాంక్‌ ద్వారా తక్షణం, సురక్షితంగా, నిరంతరాయంగా నగదు బదిలీ చేసేందుకు వీలు కల్పిస్తూ 2026 జూన్‌లో గ్రీస్‌లో సరిహద్దు నగదు బదిలీల కోసం యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి.
*మాల్దీవుల తక్షణ చెల్లింపు వ్యవస్థ ‘ఫవారా’, భారత యూపీఐ మధ్య సరిహద్దు నగదు బదిలీలు 2026 జూలై 30న ప్రారంభమయ్యాయి. మాల్దీవులు–భారత్‌ మధ్య సరిహద్దు డిజిటల్‌ ఆర్థిక అనుసంధానం, ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో ఇది పరివర్తనాత్మక మైలురాయి.
* ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల స్వీకరణ లేదా సరిహద్దు నగదు బదిలీల కోసం 11 విదేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్‌ పరివర్తనకు దశాబ్దం
డిజిటల్‌ చెల్లింపులను సరళంగా, సురక్షితంగా, వివిధ వ్యవస్థల మధ్య పనిచేసేలా మార్చడం ద్వారా భారత్‌లో లావాదేవీల విధానాన్ని యూపీఐ పరివర్తనం చేసింది. వేగవంతమైన ఆదరణ, నిరంతర ఆవిష్కరణలు, విస్తరిస్తున్న ప్రపంచ ఉనికి కారణంగా భారత డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాల్లో యూపీఐ కీలక భాగంగా మారింది.

 

References    

 

Ministry of Electronics & Information Technology

https://www.digitalindia.gov.in/initiative/unified-payment-interface-upi/

https://www.digitalindia.gov.in/growth-story/

https://www.digitalindia.gov.in/initiative/upi-123pay/

 

Ministry of Finance

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1735075&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1810601&lang=2&reg=48

http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110407&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2088182&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257087&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200569&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268591&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2279646&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292288&reg=48&lang=2

 

National Payments Corporation of India (NPCI)

https://www.bhimupi.org.in/about-bhim.html

https://www.bhimupi.org.in/upi2.html

https://www.bhimupi.org.in/upiautopay.html

https://www.npci.org.in/product/upi/product-statistics

https://www.npci.org.in/product/upi/upi-lite

https://www.npci.org.in/product/upi-circle

https://www.npci.org.in/uploads/DFS_Secretary_Launches_Initiatives_to_Simplify_Digital_Payment_Experience_at_GFF_2025_c74afc4dd6.pdf

 

Ministry of Drinking Water & Sanitation

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1479881&reg=48&lang=2

 

RBI

https://rbi.org.in/scripts/BS_SpeechesView.aspx?Id=1034

https://rbi.org.in/scripts/BS_SpeechesView.aspx?Id=1327

https://www.rbi.org.in/Scripts/NotificationUser.aspx?Id=12532&Mode=0

https://rbi.org.in/scripts/BS_PressReleaseDisplay.aspx?prid=58449

https://rbidocs.rbi.org.in/rdocs/Speeches/PDFs/UPI170820182C164878486345FFBEC7D7A55B7B7892.PDF

 

Others

https://www.kotak.bank.in/en/stories-in-focus/accounts-deposits/current-account/what-is-upi-and-upi-full-form.html

https://www.bseindia.com/static/publicissues/unified-interface

https://razorpay.com/blog/what-is-upi-autopay-recurring-payments-razorpay-subscriptions/

https://bankingfrontiers.com/npci-launches-upi-platform-based-qr-codes/

Click here to see PDF

 

***

(तथ्य सामग्री आईडी: 150965) आगंतुक पटल : 24


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Urdu , Bengali , Kannada , हिन्दी , Telugu_Vw , Malayalam